ఇస్లాంలో స్నేహం


మర్యాదపూర్వక సంభాషణ & స్నేహపూర్వక కలయిక

طيب الكلام وطلاقة الوجه


عَنْ اَبِىْ ذَرٍّ قَالَ لِى النَّبِىُّ ^ لَا تَحْقِرَنَّ مِنَ الْـمَعْرُوْفِ شَيْـﺌـاً وَلَوْ أَنْ تَلْقَى أَخَاكَ بِوَجْهٍ طَلْقٍ (رواه مسلم)


అన్ అబిదరిన్  రదియల్లాహు అన్హు ఖాల – ఖాలలిన్నబియ్యు సల్లల్లాహు అలైహి వసల్లం “లా తహ్ ఖిరన్న మినల్ మఅరూఫి షైఅన్ – వలౌ అన్ తల్ ఖా అఖాక బి వజ్ హిన్ తల్ ఖ్”


అబిదర్  రజిఅల్లాహుఅన్హు ఇలా ఉల్లేఖించారు – ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహుఅలైహివసల్లం ఇలా అన్నారు“(ఓ అబూదర్ !) ఏ మంచి పనినైనా ఎప్పుడూ అల్పమైనదిగా భావించకు, అది నీతోటి ముస్లిం సోదరుణ్ణి చిరునవ్వు ముఖంతో కలవడం, ఆహ్లాదకరంగా పలుకరించడమైనాసరే.” ముస్లిం

 

విషయసూచిక

 

వివరణ  

ఈ హదీస్  – ఇస్లాం మనకు బోధించే మరియు చేయమని ప్రోత్సహించే మంచి పనులలో అవి ఎంతచిన్నవైనా  వాటిని ఎప్పుడూ అల్పమైనవిగా భావించరాదని తెలియజేస్తున్నది. ఒక ముస్లిం తన తోటి ముస్లిం సోదరుణ్ణి ఎప్పుడు కలిసినా, పలకరించినా మనస్పూర్తిగా, పూర్తి సంతోషంగా, నవ్వు ముఖంతో పలుకరించాలి – ఇది చాలా అల్పమైన విషయంగా కనిపించినప్పటికీ. ఎందుకంటే రూపం ఎప్పుడూ అంతరంగాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది. సంతోషపూర్వకంగా, నవ్వుముఖంతో మన తోటిసోదరులను కలవడం, వారిలో కూడా సంతోషాన్ని, తన తోటి సోదరులపట్ల – అల్లాహ్ కోరకు - ప్రేమాభిమానములును, గౌరవాన్ని పెంపొందిస్తాయి. ఇస్లాం నైతికవిలువలకు, సంస్కారానికి విలువనిచ్చే మతమని ఈహదీథ్ తెలియజేస్తున్నది.


ఈ హదీస్  అమలు చేయడం వలన కలిగే లాభాలు

  1. (షరియత్ కు లోబడిచేయదగిన) మంచి పని ఎంత చిన్నదైనాసరే అల్పమైనదిగా ఎప్పుడూ తలంచరాదు.
     
  2. తోటి ముస్లిం సోదరులతో, స్నేహితులతో ఎప్పుడూ ఆహ్లాదకరంగా, సంతోషంగా కలవాలి.
     
  3. తోటి ముస్లిం సోదరులతో సోదరభావాన్ని బలంగా నాటే, మరియు పెంపొందించే ఇలాంటి విషయములను ఫ్రోత్సహించాలి.
     
  4. మన తోటి ముస్లిం సహోదరుని ముఖం సంతోషంతో వికసించేలా చేయడం, చిరునవ్వుతో వెలిగేలా చేయడం కూడా పుణ్యకార్యములలో ఒకటి అని మర్చిపోరాదు.

 

హదీస్   ఉల్లేఖించినవారిపరిచయం

అబిదర్  రజిఅల్లాహుఅన్హు ఇస్లాం ధర్మవిషయముల అమలులో ఎటువంటి రాజీ పడనివారుగా ప్రసిద్ధిచెందారు. ప్రారంభకాలంలోనే ఇస్లాంస్వీకరించారు. మక్కా నుండి వలస పోయినవారిలో ఒకరు (ముహాజిర్). 32హి సంవత్సరం, ఖలీఫా ఉస్మాన్ (రజిఅల్లాహుఅన్హు) కాలంలో మరణించారు.

 

ఆధారాలు

http://teluguislam.net/2010/10/09/greeting-muslim-with-smile-and-warmth/

1348 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్