ఇస్లాంలో ఇఫ్తార్


ఉపవాసం అంటే సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకుఅన్నపానియాలనుండి ఆగి ఉండడం. ఒక ముస్లిం సూర్యోదయానికి ముందు భోజనం చేసి ఉపవాసాన్ని ప్రారంభిస్తాడు మరియు సూర్యుడు అస్తమించిన తరువాత ఉపవాసాన్ని విరమిస్తాడు. ఉపవాసం విరమించడాన్ని ఇఫ్తార్ అంటారు. [1]

 

విషయసూచిక

 

భావం

రమజాన్ లో ఉపవాసం విరమించే సమయంలో చేసే భోజనాన్ని ఇఫ్తార్ అంటారు. [2]

 

హదీస్

అనస్(రజి) ఉల్లేఖించారు: “దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఉపవాసాన్ని మఘ్రిబ్ నమాజ్ కు ముందు విరమించేవారు. ఉపవాస విరమణకు దైవప్రవక్తసల్లల్లాహుఅలైహివసల్లం తాజా ఖర్జూర పండ్లు తీసుకునేవారు, అవి దొరకనిచో, ఎండు ఖర్జూర పండ్లు తీసుకునేవారు, అవి కూడా లభ్యం కాని పక్షంలో నీళ్ళతో ఉపవాసాన్ని విరమించేవారు.” (సునన్ అబూ దావూద్ 2348, 2349& తిర్మిజి 3:79& రియాజుస్ సాలిహీన్ 1238, 1239)

 

తొందరగా ఇఫ్తార్ చేయడం

ఇఫ్తార్ లో తొందర చేయడం దైవప్రవక్తసల్లల్లాహుఅలైహివసల్లం (సున్నత్) ఆచరణ. తొందర చేయడం అంటే, సూర్యుడు అస్తమించాక ఆలస్యం చేయకుండా వెంటనే ఇఫ్తార్ చేయాలి. కొందరు సూర్యుడు అస్తమించాక కూడా కాసేపు ఆగుతారు. ఇది యూదులు మరియు క్రైస్తవుల ఆచరణ. అందువల్లేదైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం యూదులు మరియు క్రైస్తవులకు విరుద్ధంగా సూర్యుడు అస్తమించగానే ఆలస్యం చేయకుండా ఇఫ్తార్ చేయాలి అని ఆదేశించారు.

 

సహల్ ఇబ్న్ సాద్ (రజి)ఉల్లేఖించారు:దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం ఇలా అన్నారు: “ఉపవాసాన్ని విరమించడంలో తొందర చేసినంత వరకు ప్రజలు మంచిగా ఉంటారు.” (సహీహ్ బుఖారీ vol 3:178, సహీహ్ ముస్లిం 2417)

 

ఇఫ్తార్ తరువాత చదివే దుఆ

కొందరు విద్వాంసుల ప్రకారం, షేక్ ఇబ్న్ ఉసైమిన్ రహిమహుల్లా మొదలైన వారి లాంటి అభిప్రాయ ప్రకారం ఇఫ్తార్ తరువాత ఈ దుఆ చదవవచ్చు. (ఫతావా అర్కానుల్ ఇస్లాం, దారుస్సలాం, vol 2, p 670)


ذَهَبَالظَّمَأُوَابْتَلَّتِالْعُرُوقُوَثَبَتَالأَجْرُإِنْشَاءَاللَّهُ


“జహబజ్ జమవు వబ్ తల్లతిల్ ఉరూఖు వ సబతిల్ అజ్రు ఇన్ షా అల్లాహ్”


అర్ధం: దాహం తీరిపోయింది. నరాలు తడిసి పోయాయి. అల్లాహ్ తలిస్తే ప్రతిఫలం దొరుకుతుంది. (సునన్ అబీ దావూద్ 2357) [3]

 

ఆధారాలు

[1] http://www.islambasics.com/view.php?bkID=137&chapter=1(ఇంగ్లీష్)
[2] http://islam.about.com/library/glossary/bldef-iftar.htm (ఇంగ్లీష్)
[3] http://www.islambasics.com/view.php?bkID=137&chapter=1(ఇంగ్లీష్)
 

 

334 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్