ఇబ్రహీం అలైహిస్సలాం గురించి జగడం


శుద్ధ అవివేకి మాత్రమే ఇబ్రాహీం ధర్మం (విధానం) పట్ల విరక్తి చెందుతాడు. మేము అతన్ని ప్రపంచంలోనూ ఎన్నుకున్నాము, పరలోకంలో కూడా అతడు సజ్జనుల సరసన ఉంటాడు. సూరా బఖర 2:130

 

విషయసూచిక

 

ఇబ్రాహీము ధర్మం

మీరు యూదులుగానో, క్రైస్తవులుగానో మారిపోతే సన్మార్గం పొందగలరని వారు అంటారు. (ఓ ముహమ్మద్‌!) మీరు వారికి స్పష్టంగా చెప్పండి: ''కాదు, ఇబ్రాహీము ధర్మాన్ని అనుసరించేవారే సన్మార్గంపై ఉన్నారు. ఇబ్రాహీం స్వచ్ఛమైన ఏకదైవారాధకుడు, అతను బహుదైవోపాసకుడు కాదు.'' సూరా బఖర 2:135

 

సజ్జనుల సరసన

శుద్ధ అవివేకి మాత్రమే ఇబ్రాహీం ధర్మం (విధానం) పట్ల విరక్తి చెందుతాడు. మేము అతన్ని ప్రపంచంలోనూ ఎన్నుకున్నాము, పరలోకంలో కూడా అతడు సజ్జనుల సరసన ఉంటాడు. సూరా బఖర 2:130

 

ఆచరణలు

వారితో చెప్పు : ''ఏమిటీ, మాకూ ప్రభువు, మీకూ ప్రభువు అయిన అల్లాహ్‌ విషయంలో మీరు మాతో వాదులాడుతారా? మా ఆచరణలు మాకు, మీ ఆచరణలు మీకు. మేము ఆయనకే అంకితం అయ్యాము.సూరా బఖర 2:139

 

తౌరాతు, ఇన్జీలు గ్రంథాలు

ఓ గ్రంథవహులారా! మీరు ఇబ్రాహీం విషయంలో ఎందుకు గొడవపడుతున్నారు. తౌరాతు, ఇన్జీలు గ్రంథాలైతే ఆయన తరువాతనే అవతరించాయి కదా! అయినా మీరు అర్థం చేసుకోరే?! సూరా ఆలి ఇమ్రాన్ 3:65

 

తెలియని విషయాల గురించి ఎందుకు వాదించడం

చూడండి, మీకు తెలిసిన విషయం గురించి మీరెలాగూ వాదించారు. కాని మీకు తెలియని విషయాల గురించి ఎందుకు వాదిస్తున్నారు? (యదార్థం) అల్లాహ్‌కు తెలుసుగాని మీకు తెలియదు. సూరా ఆలి ఇమ్రాన్ 3:66

 

ఒకే దేవుని వైపు అభిముఖుడైన ముస్లిం

ఇబ్రాహీం యూదుడూ కాదు, క్రైస్తవుడూ కాదు. ఆయన ఒకే దేవుని వైపు అభిముఖుడైన ముస్లిం. ఆయన ముష్రిక్కులలోని వాడు ఎంత మాత్రం కాదు. సూరా ఆలి ఇమ్రాన్ 3:67

 

అల్లాహ్‌ విశ్వాసులకు మాత్రమే నేస్తం

అందరికన్నా ఎక్కువగా ఇబ్రాహీంకు దగ్గరివారమని చెప్పుకునే హక్కు ఎవరికయినా ఉందీ అంటే, అది ఆయన్ని అనుసరించిన వారికీ, ఈ ప్రవక్తకూ, విశ్వాసులకూ మాత్రమే ఉంది. అల్లాహ్‌ విశ్వాసులకు మాత్రమే నేస్తం. సూరా ఆలి ఇమ్రాన్ 3:68.

 

ఆధారాలు

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/2#130

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/2#135

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/2#139

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/3#65

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/3#66

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/3#67

http://www.askislampedia.com/te/quran/-/view/Surah/3#68

 

292 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్