ఇబాదహ్ ఇబాదహ్ పారిభాషిక అర్ధం దాసుడు తన యజమానికి సమర్పించుకోవటం మరియు సంపూర్ణ విధేయత చూపటం. ఇబాదహ్ పారిభాషిక అర్ధం ఇబాదహ్ పారిభాషిక అర్ధం దాసుడు తన యజమానికి సమర్పించుకోవటం మరియు సంపూర్ణ విధేయత చూపటం. ఇబాదహ్ (ఆరాధన) అనే పదం యజమానికి ప్రదర్శించే వినమ్రత, వినయం మరియు సంపూర్ణ సమర్పణ. ఇస్లాంలో ఆరాధన అంటే అల్లాహ్కు విధేయుడు అగుట. ఇబాదహ్ నిర్వచనం “బహిర్గతమైనదైనా లేక అంతర్గతమైనదైనా అల్లాహ్ కు ప్రీతి ప్రదమైనట్టి ప్రతి పలుకూ మరియు పని ఆరాధన అనబడును” ఇబాదహ్ వివరణ ఏ ఆజ్ఞలనైతే అల్లాహ్ ప్రవక్త ద్వారా మనకు తెలియజేసెనో, వాటిని తు.చ. తప్పకుండా పాటించుటయే విధేయత చూపుట. అల్లాహ్కు ఇష్టమైన ప్రతి పని, అది ఏదైనా సరే, కనపడేది, కనపడనది, మనసులో ఆలోచన, నోటితో పలికే పలుకులు, చేతులతో చేసే పనులు ఆరాధన (ఇబాదత్) అనబడును. అంటే ప్రతి ముస్లిం బాధ్యత ఏమిటంటే, అల్లాహ్ ఆరాధనలో కాస్త చిన్నపాటి భాగస్వామ్యం కూడా లేకుండా చేయాలి. ప్రతి కార్యమును మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపిన విధంగానే అమలు చేయాలి మరియు స్వకల్పిత కార్యములు చేయరాదు. ఇబాదహ్ రకాలు నమాజు, కాబా తవాఫు, హజ్, ఉపవాసములు, దుఆ, సజ్దా(సాష్టాంగం), రుకూ, అల్లాహ్ భయం, అల్లాహ్ పైనే నమ్మకం, అల్లాహ్ నే సహాయం కోరుట, యాచించుట, ఆశించుట, అల్లాహ్ స్వీకరణ కోసం ఎతేకాఫ్ పాటించుట, ప్రార్ధన, ఆరాధన, విధేయత, శరణు వేడుట, దైవభీతి, ప్రేమ, అభిమానం, మనసులోని ఏకాగ్రత, అల్లాహ్ వైపు మనస్సు లగ్నమై ఉండుట, బలి, దానం, వేడుకొనే సకల విధానములు – కేవలం అల్లాహ్ కొరకే ప్రత్యేకించుట, ఇంకా ఏవైతే ఖుర్ఆన్ మరియు హదీసులలో చేయమని ఆదేశింపబడినాయో వాటిని చేయుట మరియు నిషేధింపబడినాయో వాటి నుండి దూరంగా ఉండుట. మరి ఎవరైనా వీటిని అల్లాహ్ కొరకు కాకుండా వేరే వారి కొరకు చేసిన ఎడల అతడు ముష్రిక్ (బహుదైవారాధకుడు) అగును. సూరా మూమినూన్ 23:117 లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు “ఎవరైతే అల్లాహ్తో పాటు వేరే ఆధారం లేని వారిని వేడుకొనే వారి లెక్క వారి ప్రభువు వద్ద ఉన్నది. నిశ్చయంగా అవిశ్వాసులు ఎప్పటికీ సాఫల్యం (ముక్తి) పొందలేరు.” సూరా జిన్న్ 72:18 లో అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు“మస్జిద్ లు ఒక్క అల్లాహ్కే పరిమితం, మరి అల్లాహ్తో పాటు మరెవరినీ యాచించకండి (ప్రార్ధించకండి), వేడుకోకండి” అంటే ఆరాధనలన్నీ ఒక్క అల్లాహ్ కొరకే ప్రత్యేకించి అంకితం చేయుట. వీటినే స్వీకారిక ఇబాదత్ లు కూడా అంటారు. ఇబాదహ్ ప్రాముఖ్యత మానసిక వికాసం, సంసిద్ధతలేర్పడిన వ్యక్తికి ఆచరణాత్మకమైన శిక్షణ లభిస్తే ఆవ్యక్తి మానవత్వపు శిఖరాగ్ర స్థాయికి చేరుకుంటాడు . అది సాధనద్వారా అలవడుతుంది. పరిపూర్ణ విధేయత, అనునిత్య ఆజ్ఞాపాలనలో వ్యక్తిని పటిష్టపరచే శిక్షణా సాధనే ఆరాధన. అందుకే ఇస్లాంలో ఆరాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఆధారాలు http://www.islamhouse.com/p/38608 (ఇంగ్లీష్) http://teluguislam.net/five-pillars/ (ఇంగ్లీష్) |