అసూయ


అసూయ అనగా ఇతరులకు దొరకినది తనకు దక్కలేదని ఈర్శ్య చెందుతూ ఇతరులకు కూడా అది దక్కకూడదని భావించడం. ఇతరులకు జరిగిన మంచిని తట్టుకోలేకపోవడం.

 

ఇస్లామీయ పరిభాషలో అసూయ అనగా తన శత్రువుకు అల్లాహ్ కృప వల్ల దక్కింది అతని వద్ద ఉండరాదని ఆశించడం. ఇతరులకు మంచి జరిగినప్పుడు బాధపడడం, చెడు జరిగినప్పుడు సంతోషపడడం. 

 

విషయసూచిక

 

ఖుర్ఆన్

అసూయ ఎంత చెడ్డదంటే దాని నుండి కాపాడు కోవటం కోసం అల్లాహ్ ఆయతులను అవతరింపజేశాడు, “చెప్పు : నేను ప్రాతఃకాలపు ప్రభువు శరణు కోరుతున్నాను”. ఖుర్ఆన్ సూరా అల్ ఫలఖ్ 113:1      

 

హదీస్

దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు : అసూయ మరియు ఈర్శ్య లాంటి రోగాలు మీలో వస్తాయి. ఇవి మిమ్మల్ని నాశనం చేస్తాయి. ఇవి మీ విశ్వాసాన్నే దెబ్బతీస్తాయి. జామి తిర్మిజి 2434

 

అసూయ చెందటానికి గల కారణాలు

కోపం మరియు ఈర్శ్య

ఎవరివల్ల నైనా ఏదైనా నష్టం జరిగితే మనిషిలో అతని పట్ల కోపం, ద్వేషం ఏర్పడుతుంది. అతనికి చెడు జరిగినప్పుడు తనకు చేసిన ద్రోహానికి ఫలం లభించిందని ఆనందపడుతాడు.

 

ఎదుటివానికి మంచి జరిగినప్పుడు అసూయ చెందుతాడు. ఇది ఇతరులకు కాదు స్వయాన అతన్నే కాల్చివేస్తుంది.దీన్నుండి మముల్ని కాపాడుకోవడానికి ఇస్లాం సహనాన్ని, క్షమించే గుణాన్ని అవలంబించమంటుంది. అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సెలవిచ్చాడు : “వారు కలిమిలోనూ, లేమిలోనూ (దైవమార్గంలో) ఖర్చు చేస్తారు. కోపాన్ని దిగమ్రింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. అల్లాహ్ ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు”. ఖుర్ఆన్, సూరా ఇమ్రాన్ 3:134     

 

కీర్తి మరియు ప్రతిష్టను ఆశించడం        

ఒక మనిషికి ఉన్నతమైన హోదా, డబ్బు, పరపతి లభించనప్పుడు అతడు తన ముందు ఇతరుల ప్రశంసలను జీర్నించుకోలేకపోతాడు. కావున అతడు ఎదుటి వాడిపై అసూయ చెందసాగుతాడు.  

 

దీనికి ఉదాహరణగా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై యూదుల అసూయను పరిగణలోకి తీసుకోవచ్చు. వారి అసూయ దైవవాణిని సైతం తిరస్కరించేలా చేసింది. వారి అసూయ వారిని ఇలా అనేలా చేసింది, “మా అందరిలోకీ అల్లాహ్ అనుగ్రహించినది వీళ్ళనేనా!”ఖుర్ఆన్, సూరా అన్ఆమ్ 6:53.

 

ఇంకా వారు ఇలా అన్నారు: “అవునూ, ఈ ఖుర్ఆను ఈ రెండు (ప్రసిద్ధ) నగరాలలో ఉండే ఎవరో ఒక ప్రముఖునిపై ఎందుకు అవతరింపచేయబడలేదు?” ఖుర్ఆన్, సూరా జుఖ్ రుఫ్ 43:31, ఇంకా మరో చోట ఇలా అనబడింది : “మీరు గనక మీలాంటి ఒక మానవమాత్రుణ్ణి అనుసరించారంటే తప్పక నష్టపోతారు”. ఖుర్ఆన్, సూరా మోమినూన్ 23:34

 

దీని వల్ల తెలిసింది ఏమిటంటే అసూయ మానవుణ్ణి సత్యమును తిరస్కరించేల చేస్తుంది. ఇక్కడ సత్య తిరస్కారుల ఉదాహరణ చాలా కీలకం.   

   

మనిషిలోని చెడు గుణాలు

కొందరు స్వయంగా ఎదగరు, అయితే ఇతరుల ఎదుగుదలనూ చూడలేరు. ఇది వారిలోని చెడు గుణాల వల్ల సంభవించే లక్షణం.

 

పశ్చాత్తాపం చెందడం

ముందుగా ఓ విశ్వాసి నిజాయితిగా అసూయ నుండి అల్లాహ్ శరణు కోరాలి. దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “విశ్వాసి మూడు విషయాల్లో చాలా నిజాయితిగా మెలగాలి, తమ నాయకులకు సలహా ఇవ్వడంలో, విశ్వసులను ఏకతాటిపై నడిపించడంలో, వారి ప్రార్ధనల్లో విశ్వాసులందరినీ చేర్చుకోవడం”.

 

(అహ్మద్, ఇబ్న్ మాజా )   

 

రెండో విషయం ఏమిటనగా అసూయకు గల కారణాలు కోపం, ద్వేషం, ప్రాపంచిక సుఖాలు, అసంతృప్తి లాంటి వాటిని త్యజించడం. అసంతృప్తికి కారణం తన ప్రభువును మరచిపోవడం. తన ప్రభువును ఆయన యొక్క పూర్తి లక్షణాలతో  సరిగా అర్ధం చేసుకున్నప్పుడే మానవుడు అసంతృప్తికి లోనుకాడు. దీని వల్ల అతనిలో అసూయ కూడా పెరుగదు.

 

ఇమాం ఇబ్న్ ఖయ్యిం (రహ్మలై) ఇలా అన్నారు : “సంతృప్తి వలన మనిషిలో శాంతి, సహనం ఉత్పన్నమవుతాయి.” అతని మనసు అసూయ, ద్వేషం లాంటి చెడు లక్షణాలను వీడి శుభ్రమవుతుంది. మానవుడు తన ఎదుగుదల కోసం పాటుపడడంలో తప్పులేదు, కాని ఇతరులపై అల్లాహ్ కారుణ్యాన్ని చూసి అసూయ చెందకూడదు. ప్రతి విషయంలో అల్లాహ్ నిర్ణయాలపై సంతృప్తి చెందాలి.        

 

మూడో విషయం: అన్ని హృదయ రోగాలకు ఖుర్ఆన్ వైపు మరలాలి. ఎందుకంటే ఖుర్ఆన్ హృదయ రోగాలకు మంచి నివారణ కలిగిస్తుంది. అల్లాహ్ సెలవిచ్చాడు : ”ప్రజలారా! మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు హితోపదేశం వచ్చింది. అది హృదయాలలో ఉన్న వ్యాధుల నుంచి స్వస్థత నొసగేది, విశ్వసించేవారి కోసం మార్గదర్శకం, కారుణ్యం. ఖుర్ఆన్, సూరా యూనుస్ 10:57

 

అల్లాహ్ శరణు కోరడం

అల్లాహ్ ఖుర్ఆన్ లో ఇలా సెలవిచ్చాడు : “వారి తరువాత వచ్చిన వారు (వారికీ ఈ సొమ్ము వర్తిస్తుంది), వారిలా వేడుకుంటారు : “మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మా కన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేష భావాన్నీ కలిగించకు. మా ప్రభూ! నిశ్చయంగా నీవు మృదు స్వభావం కలిగిన వాడవు, కనికరించేవాడవు.” ఖుర్ఆన్, సూరా హషర్ 59:10 

 

దాన ధర్మాలు చేయండి. వీటి వల్ల మనసుకు శాంతి, సంతృప్తి లభిస్తాయి. ఇందుకొరకు అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నారు : “ (ఓ ప్రవక్తా!) నువ్వు వారిని పరిశుద్ధ పరచటానికీ, వారిని తీర్చిదిద్దటానికీ వారి సంపదల నుంచి దానాలను తీసుకో, వారి బాగోగుల కోసం ప్రార్ధించు.” ఖుర్ఆన్, సూరా తౌబా 9:103   

 

ఆధారాలు

http://www.ahya.org/amm/modules.php?name=Sections&op=viewarticle&artid=181

1125 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్