అల్లాహ్ దయతోనే స్వర్గం


దేవుడు నన్ను తన కారుణ్య ఛాయలోకి తీసుకోవాలి. కనుక మీరు సరయిన రుజుమార్గంలో నడవండి (ముక్తి విషయాన్ని దైవానుగ్రహం పై వదలి పెట్టండి)” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).

 

విషయసూచిక

 

కర్మల బలం

1793. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం :- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఉద్బోధిస్తూ ” మీలో ఏ ఒక్కడూ కేవలం తన కర్మల బలంతో మోక్షం పొందలేడు” అని అన్నారు. అనుచరులు ఈ మాట విని “ధైవప్రవక్తా! మీరు కూడానా?” అని అడిగారు.

 

మోక్షం

“ఔను, నేను కూడా కర్మల బలంతో మోక్షం పొందలేను. మోక్షం పొందడానికి ఒకే ఒక మార్గం ఉంది.

 

రుజుమార్గం

అది, దేవుడు నన్ను తన కారుణ్య ఛాయలోకి తీసుకోవాలి. కనుక మీరు సరయిన రుజుమార్గంలో నడవండి (ముక్తి విషయాన్ని దైవానుగ్రహం పై వదలి పెట్టండి)” అన్నారు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం).


[సహీహ్ బుఖారీ - 81 వ ప్రకరణం - అర్రిఖాఖ్, 18 వ అధ్యాయం - అల్ ఖస్ది వల్ ముదావమతి అలల్ అమల్]  కపట విశ్వాసుల ప్రకరణం – 17 వ అధ్యాయం – కేవలం ఆచరణ వల్ల ఎవరూ స్వర్గానికి పోలేరు, దైవానుగ్రహం ఉండాలి మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు  (Al-Loolu Wal Marjan ) Vol. 2  సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ


ఆధారాలు

http://telugudailyhadith.wordpress.com/2012/05/
 

 

311 Views
మమ్మల్ని సరిచేయండి లేదా మిమ్మల్ని సరిచేసుకోండి
.
వ్యాఖ్యలు
పేజీ యొక్క టాప్