aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

85. సూరా అల్ బురూజ్

85:1  وَالسَّمَاءِ ذَاتِ الْبُرُوجِ
బురుజులు గల ఆకాశం సాక్షిగా!
85:2  وَالْيَوْمِ الْمَوْعُودِ
వాగ్దానం చేయబడివున్న రోజు సాక్షిగా!
85:3  وَشَاهِدٍ وَمَشْهُودٍ
సాక్ష్య దినం (సమావేశమైనవారి ) సాక్షిగా! సమావేశమైన చోటు సాక్షిగా!
85:4  قُتِلَ أَصْحَابُ الْأُخْدُودِ
కందకం వాళ్ళు సర్వనాశనమయ్యారు.
85:5  النَّارِ ذَاتِ الْوَقُودِ
అది ఇంధనంతో బాగా మండించబడిన అగ్ని.
85:6  إِذْ هُمْ عَلَيْهَا قُعُودٌ
ఆ సమయంలో వాళ్ళు (కందకం వాళ్ళు) దాని చుట్టూ కూర్చున్నారు.
85:7  وَهُمْ عَلَىٰ مَا يَفْعَلُونَ بِالْمُؤْمِنِينَ شُهُودٌ
తాము విశ్వాసుల (ముస్లింల) పట్ల చేస్తున్న దాన్ని (తమాషాగా) తిలకిస్తూ ఉన్నారు.
85:8  وَمَا نَقَمُوا مِنْهُمْ إِلَّا أَن يُؤْمِنُوا بِاللَّهِ الْعَزِيزِ الْحَمِيدِ
ఇంతకీ ఆ విశ్వాసులు చేసిన తప్పు – వారు సర్వశక్తుడు, స్తోత్రనీయుడైన అల్లాహ్ ను విశ్వసించటం తప్ప మరొకటి కాదు. దానికే వారు ప్రతీకారం తీర్చుకున్నారు.
85:9  الَّذِي لَهُ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ شَهِيدٌ
మరి వాస్తవానికి భూమ్యాకాశాల సామ్రాజ్యానికి అధిపతి (కూడా) ఆయనే. మరి అల్లాహ్ అన్నింటికీ సాక్షిగా ఉన్నాడు.
85:10  إِنَّ الَّذِينَ فَتَنُوا الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ ثُمَّ لَمْ يَتُوبُوا فَلَهُمْ عَذَابُ جَهَنَّمَ وَلَهُمْ عَذَابُ الْحَرِيقِ
ఎవరైతే విశ్వసించిన పురుషులను, విశ్వసించిన స్త్రీలను వేధించి (కనీసం) పశ్చాత్తాపం (కూడా) చెందలేదో వారి కొరకు నరక యాతన సిద్ధంగా ఉంది, దహించి వేసే యాతన కూడా ఉంది.
85:11  إِنَّ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۚ ذَٰلِكَ الْفَوْزُ الْكَبِيرُ
అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసేవారి కోసం క్రింద కాలువలు ప్రవహించే తోటలు ఉన్నాయి. ఇదే గొప్ప విజయం.
85:12  إِنَّ بَطْشَ رَبِّكَ لَشَدِيدٌ
నిశ్చయంగా నీ ప్రభువు పట్టు చాలా కఠినమైనది.
85:13  إِنَّهُ هُوَ يُبْدِئُ وَيُعِيدُ
ఆయనే తొలిసారి పుట్టిస్తున్నాడు. మలిసారి ప్రభవింపజేసేవాడు కూడా ఆయనే.
85:14  وَهُوَ الْغَفُورُ الْوَدُودُ
ఆయనే అపారంగా క్షమించేవాడు, అమితంగా ప్రేమించేవాడు.
85:15  ذُو الْعَرْشِ الْمَجِيدُ
పీఠాధిపతి ఘనత గలవాడు.
85:16  فَعَّالٌ لِّمَا يُرِيدُ
తలచుకున్న దాన్ని చేసి తీరేవాడు.
85:17  هَلْ أَتَاكَ حَدِيثُ الْجُنُودِ
సైనిక దళాల సంగతి గానీ నీకు చేరిందా?
85:18  فِرْعَوْنَ وَثَمُودَ
(అనగా) ఫిరౌను మరియు సమూదు (దళాలు).
85:19  بَلِ الَّذِينَ كَفَرُوا فِي تَكْذِيبٍ
కాని (ఈ) తిరస్కారులు మాత్రం ధిక్కార వైఖరిలోనే పడి ఉన్నారు.
85:20  وَاللَّهُ مِن وَرَائِهِم مُّحِيطٌ
అల్లాహ్ కూడా వాళ్ళను అన్ని వైపుల నుండీ చుట్టుముట్టాడు.
85:21  بَلْ هُوَ قُرْآنٌ مَّجِيدٌ
కాదు...అసలు ఈ ఖుర్ఆన్ మహిమాన్వితమైనది.
85:22  فِي لَوْحٍ مَّحْفُوظٍ
సురక్షిత ఫలకంలో (లిఖితమై ఉంది).


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.