aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

84. సూరా అల్ ఇన్ షి ఖాక్

84:1  إِذَا السَّمَاءُ انشَقَّتْ
ఆకాశం బ్రద్దలైపోయినప్పుడు,
84:2  وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ
అది తన ప్రభువు ఆజ్ఞను వింటుంది. దానికదే తగినది మరి!
84:3  وَإِذَا الْأَرْضُ مُدَّتْ
మరి భూమి (సాగదీయబడి) విస్తృత పరచబడినప్పుడు,
84:4  وَأَلْقَتْ مَا فِيهَا وَتَخَلَّتْ
అది తన లోపల ఉన్నదంతా బయట పడేసి, ఖాళీ అయిపోతుంది.
84:5  وَأَذِنَتْ لِرَبِّهَا وَحُقَّتْ
అది తన ప్రభువు ఆదేశాన్ని (ఖచ్చితంగా) వింటుంది. దానికదే శోభాయమానం మరి!
84:6  يَا أَيُّهَا الْإِنسَانُ إِنَّكَ كَادِحٌ إِلَىٰ رَبِّكَ كَدْحًا فَمُلَاقِيهِ
ఓ మానవుడా! నువ్వు నీ ప్రభువును చేరుకునేవరకు ఈ సాధనలో, (ఈ కఠోర పరిశ్రమలోనే) నిమగ్నుడవై ఉండి, తుదకు ఆయన్ని చేరుకుంటావు.
84:7  فَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ
(ఆ సమయంలో) ఎవరి కర్మల పత్రం అతని కుడిచేతికి ఇవ్వబడుతుందో -
84:8  فَسَوْفَ يُحَاسَبُ حِسَابًا يَسِيرًا
అతని నుండి తేలికపాటి లెక్క తీసుకోబడుతుంది.
84:9  وَيَنقَلِبُ إِلَىٰ أَهْلِهِ مَسْرُورًا
అతను తనవారి వైపు సంబరపడుతూ వెళతాడు.
84:10  وَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ وَرَاءَ ظَهْرِهِ
మరెవరి కర్మల పత్రం అతని వీపు వెనుక నుండి ఇవ్వబడుతుందో
84:11  فَسَوْفَ يَدْعُو ثُبُورًا
అతను చావు కోసం కేకలు వేస్తాడు.
84:12  وَيَصْلَىٰ سَعِيرًا
మరి (అతను) మండే నరకాగ్నిలోకి ప్రవేశిస్తాడు.
84:13  إِنَّهُ كَانَ فِي أَهْلِهِ مَسْرُورًا
ఈ వ్యక్తి (ఇహలోకంలో) తన వారి మధ్య తెగ సంబరపడేవాడు.
84:14  إِنَّهُ ظَنَّ أَن لَّن يَحُورَ
తానెన్నటికీ (అల్లాహ్ వద్దకు) తిరిగి పోనని తలపోసేవాడు.
84:15  بَلَىٰ إِنَّ رَبَّهُ كَانَ بِهِ بَصِيرًا
ఎందుకు పోడు?! నిజానికి అతని ప్రభువు అతన్ని బాగా గమనిస్తూనే ఉండేవాడు.
84:16  فَلَا أُقْسِمُ بِالشَّفَقِ
సాయంకాలపు ఎర్రని కాంతి తోడు!
84:17  وَاللَّيْلِ وَمَا وَسَقَ
రాత్రి తోడు! అది తనలో లీనం చేసుకునే వస్తువుల తోడు!
84:18  وَالْقَمَرِ إِذَا اتَّسَقَ
పూర్ణచంద్రుని తోడు! (గా చెబుతున్నాను)
84:19  لَتَرْكَبُنَّ طَبَقًا عَن طَبَقٍ
నిశ్చయంగా మీరు క్రమేణా ఒక స్థితి నుండి మరో స్థితికి సాగిపోతుంటారు.
84:20  فَمَا لَهُمْ لَا يُؤْمِنُونَ
అసలు వారికేమైపోయింది, వారు ఎందుకని విశ్వసించరు?
84:21  وَإِذَا قُرِئَ عَلَيْهِمُ الْقُرْآنُ لَا يَسْجُدُونَ ۩
వారి ముందు ఖుర్ఆన్ ను పఠించినప్పుడు వారెందుకని సాష్టాంగపడరు?
84:22  بَلِ الَّذِينَ كَفَرُوا يُكَذِّبُونَ
పైగా విశ్వసించని ఈ జనులు (దీనిని) ధిక్కరిస్తున్నారు?
84:23  وَاللَّهُ أَعْلَمُ بِمَا يُوعُونَ
వారు తమ లోపల దాచి పెట్టుకునే లోగుట్టును గురించి అల్లాహ్ కు బాగా తెలుసు.
84:24  فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ
కాబట్టి వారికి బాధాకరమైన యాతనకు సంబంధించిన ‘శుభవార్త’ను వినిపించు.
84:25  إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُمْ أَجْرٌ غَيْرُ مَمْنُونٍ
అయితే, విశ్వసించి సత్కార్యాలు చేసిన వారికి మాత్రం ఎన్నటికీ తరగని పుణ్యఫలం ఉంది.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.