aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

80. సూరా అబస

80:1  عَبَسَ وَتَوَلَّىٰ
(ప్రవక్త!) నుదురు చిట్లించాడు, ముఖం త్రిప్పుకున్నాడు -
80:2  أَن جَاءَهُ الْأَعْمَىٰ
తన వద్దకు ఒక అంధుడు వచ్చినంత మాత్రానికే.
80:3  وَمَا يُدْرِيكَ لَعَلَّهُ يَزَّكَّىٰ
(ఓ ప్రవక్తా!) నీకేం తెలుసు, బహుశా అతను తనను సంస్కరించుకుంటాడేమో!!
80:4  أَوْ يَذَّكَّرُ فَتَنفَعَهُ الذِّكْرَىٰ
లేదా ఉపదేశం వింటాడేమో! ఉపదేశం అతనికి ప్రయోజనకరం అవుతుందేమో!!
80:5  أَمَّا مَنِ اسْتَغْنَىٰ
ఎవడైతే నిర్లక్ష్యం చేస్తున్నాడో,
80:6  فَأَنتَ لَهُ تَصَدَّىٰ
అతనిపై నువ్వు ఎంతో శ్రద్ధ చూపుతున్నావు.
80:7  وَمَا عَلَيْكَ أَلَّا يَزَّكَّىٰ
వాడు గనక దిద్దుబాటు చేసుకోకపోతే, ఆ నింద నీపై లేదు కదా!
80:8  وَأَمَّا مَن جَاءَكَ يَسْعَىٰ
మరెవరైతే నీ దగ్గరకు (శ్రద్ధగా) పరుగెత్తుకుంటూ వస్తున్నాడో,
80:9  وَهُوَ يَخْشَىٰ
దైవభీతి (కూడా) కలిగి ఉన్నాడో,
80:10  فَأَنتَ عَنْهُ تَلَهَّىٰ
అతని పట్లేమో నువ్వు అశ్రద్ధ వహిస్తున్నావు.
80:11  كَلَّا إِنَّهَا تَذْكِرَةٌ
ఇది సరైనది కాదు. ఈ ఖుర్ఆను మాత్రం హితబోధ నిమిత్తమే ఉన్నది.
80:12  فَمَن شَاءَ ذَكَرَهُ
కాబట్టి, కోరినవారు దీని ద్వారా హితబోధను గ్రహించవచ్చు.
80:13  فِي صُحُفٍ مُّكَرَّمَةٍ
అది గౌరవప్రదమైన సహీఫాల్లో (లిఖితమై) ఉన్నది.
80:14  مَّرْفُوعَةٍ مُّطَهَّرَةٍ
అవి మహోన్నతమైనవి, పవిత్రమైనవీను.
80:15  بِأَيْدِي سَفَرَةٍ
అది లేఖకుల (దైవదూతల ) చేతుల్లో ఉంది.
80:16  كِرَامٍ بَرَرَةٍ
(వారు) మహిమాన్వితులు, మంచి వారు కూడాను.
80:17  قُتِلَ الْإِنسَانُ مَا أَكْفَرَهُ
మనిషి నాశనం గాను! ఎటువంటి కృతఘ్నుడు వాడు?!
80:18  مِنْ أَيِّ شَيْءٍ خَلَقَهُ
(అల్లాహ్) వాణ్ణి దేంతో పుట్టించాడు?
80:19  مِن نُّطْفَةٍ خَلَقَهُ فَقَدَّرَهُ
ఒక్క వీర్య బిందువుతో (నే కదా!) పుట్టించాడు. మరి అతనికి (కావలసినవి) తగు రీతిలో ఉండేలా నిర్ధారించాడు.
80:20  ثُمَّ السَّبِيلَ يَسَّرَهُ
ఆపైన అతని కొరకు మార్గాన్ని సులభతరం చేశాడు.
80:21  ثُمَّ أَمَاتَهُ فَأَقْبَرَهُ
అటుపిమ్మట అతనికి చావునిచ్చాడు. ఆ తరువాత అతణ్ణి సమాధిలోనికి చేర్చాడు.
80:22  ثُمَّ إِذَا شَاءَ أَنشَرَهُ
మరి తాను కోరినప్పుడు అతణ్ణి బ్రతికించి లేపుతాడు.
80:23  كَلَّا لَمَّا يَقْضِ مَا أَمَرَهُ
ఎంతమాత్రం కాదు. అసలతను ఇంతవరకూ దైవాజ్ఞలను నెరవేర్చనే లేదు.
80:24  فَلْيَنظُرِ الْإِنسَانُ إِلَىٰ طَعَامِهِ
అయితే ఈ మనిషి తాను తినే ఆహారాన్ని కూడా కాస్త చూడాలి.
80:25  أَنَّا صَبَبْنَا الْمَاءَ صَبًّا
మేము పుష్కలంగా నీటిని కురిపించాము.
80:26  ثُمَّ شَقَقْنَا الْأَرْضَ شَقًّا
మరి నేలను అద్భుతమైన రీతిలో చీల్చాము.
80:27  فَأَنبَتْنَا فِيهَا حَبًّا
మరి అందులో ఆహార ధాన్యాన్ని ఉత్పన్నం చేశాము.
80:28  وَعِنَبًا وَقَضْبًا
ద్రాక్షపండ్లను, కూరగాయలను,
80:29  وَزَيْتُونًا وَنَخْلًا
జైతూను (ఆలివ్), ఖర్జూర పండ్లను (పండించాము).
80:30  وَحَدَائِقَ غُلْبًا
దట్టమైన తోటలను,
80:31  وَفَاكِهَةً وَأَبًّا
పండ్లు ఫలాలను, పచ్చిక బయళ్ళను (కూడా పండించాము).
80:32  مَّتَاعًا لَّكُمْ وَلِأَنْعَامِكُمْ
ఇదంతా మీ కోసం, మీ పశువుల ప్రయోజనార్ధం (చేశాము).
80:33  فَإِذَا جَاءَتِ الصَّاخَّةُ
(గూబ గుయ్యిమనిపించే) గావుకేక (అంటే ప్రళయం) వచ్చినప్పుడు....
80:34  يَوْمَ يَفِرُّ الْمَرْءُ مِنْ أَخِيهِ
ఆ రోజు మనిషి తన (స్వంత) సోదరుని నుండి పారిపోతాడు.
80:35  وَأُمِّهِ وَأَبِيهِ
తన తల్లి నుండి, తండ్రి నుండి,
80:36  وَصَاحِبَتِهِ وَبَنِيهِ
తన భార్య నుండి, తన పిల్లల నుండి (పారిపోతాడు).
80:37  لِكُلِّ امْرِئٍ مِّنْهُمْ يَوْمَئِذٍ شَأْنٌ يُغْنِيهِ
ఆ రోజు ప్రతి ఒక్కరికీ తన సంగతి చూసుకోవటంతోనే సరిపోతుంది.
80:38  وُجُوهٌ يَوْمَئِذٍ مُّسْفِرَةٌ
ఆ రోజు ఎన్నో ముఖాలు వెలిగిపోతుంటాయి.
80:39  ضَاحِكَةٌ مُّسْتَبْشِرَةٌ
(తమకు వినిపించబడిన శుభవార్తపై) నవ్వులు చిందిస్తూ, ఆనందంలో తేలియాడుతూ ఉంటాయి.
80:40  وَوُجُوهٌ يَوْمَئِذٍ عَلَيْهَا غَبَرَةٌ
మరెన్నో ముఖాలు ఆనాడు దుమ్ము కొట్టుకుని ఉంటాయి.
80:41  تَرْهَقُهَا قَتَرَةٌ
వాటిపై నలుపు ఆవరించి ఉంటుంది.
80:42  أُولَٰئِكَ هُمُ الْكَفَرَةُ الْفَجَرَةُ
వారే అవిశ్వాసులు, దుర్జనులు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.