aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

79. సూరా అన్ నాజి ఆత్

79:1  وَالنَّازِعَاتِ غَرْقًا
మునిగి నిర్దాక్షిణ్యంగా (ప్రాణాలు) లాక్కుపోయేవారి సాక్షిగా!
79:2  وَالنَّاشِطَاتِ نَشْطًا
ముడిని విప్పి విడిపించేవారి సాక్షిగా!
79:3  وَالسَّابِحَاتِ سَبْحًا
తేలియాడుతూపోయే వారి సాక్షిగా!
79:4  فَالسَّابِقَاتِ سَبْقًا
వేగంగా దూసుకుపోతూ, ఒండొకరిని మించిపోయేవారి సాక్షిగా!
79:5  فَالْمُدَبِّرَاتِ أَمْرًا
(తమ ప్రభువు అప్పగించిన) పనులను పకడ్బందీగా అమలుపరిచే వారి సాక్షిగా!
79:6  يَوْمَ تَرْجُفُ الرَّاجِفَةُ
ఆ రోజు దద్దరిల్లేది దద్దరిల్లుతుంది.
79:7  تَتْبَعُهَا الرَّادِفَةُ
మరి దాని వెనుక వచ్చేది (వెంబడిస్తూనే) వస్తుంది.
79:8  قُلُوبٌ يَوْمَئِذٍ وَاجِفَةٌ
(ఎన్నో) గుండెలు ఆ రోజు భయంతో దడదడలాడుతాయి.
79:9  أَبْصَارُهَا خَاشِعَةٌ
వారి చూపులు క్రిందికి వంగి ఉంటాయి.
79:10  يَقُولُونَ أَإِنَّا لَمَرْدُودُونَ فِي الْحَافِرَةِ
“ఏమిటి, మేము మొదటి అవస్థలోనికే మళ్ళించబడతామా?” (అని వారు అడుగుతున్నారు.)
79:11  أَإِذَا كُنَّا عِظَامًا نَّخِرَةً
“మేము కృశించిన ఎముకలుగా మారిన తరువాత కూడానా?!” (అని వారు అంటున్నారు కదూ!)
79:12  قَالُوا تِلْكَ إِذًا كَرَّةٌ خَاسِرَةٌ
“మరైతే ఈ మళ్లింపు (మా పాలిట) నష్టకరమే” అని కూడా వారంటున్నారు.
79:13  فَإِنَّمَا هِيَ زَجْرَةٌ وَاحِدَةٌ
అదొక (భయంకరమైన) గద్దింపు (అని మరువకండి).
79:14  فَإِذَا هُم بِالسَّاهِرَةِ
(అది సంభవించగానే) వారంతా ఒక్కసారిగా మైదానంలో సమీకరించబడతారు.
79:15  هَلْ أَتَاكَ حَدِيثُ مُوسَىٰ
(ఓ ప్రవక్తా!) మూసా సంగతిగాని నీ వరకు చేరిందా?
79:16  إِذْ نَادَاهُ رَبُّهُ بِالْوَادِ الْمُقَدَّسِ طُوًى
అప్పుడు అతని ప్రభువు అతణ్ణి ‘తువా’ అనే పవిత్ర లోయలోకి పిలిచాడు.
79:17  اذْهَبْ إِلَىٰ فِرْعَوْنَ إِنَّهُ طَغَىٰ
“నువ్వు ఫిరౌను వద్దకు వెళ్ళు. వాడు మరీ చెలరేగిపోయాడు.”
79:18  فَقُلْ هَل لَّكَ إِلَىٰ أَن تَزَكَّىٰ
“నీ స్వీయ సంస్కరణకు నువ్వు సిద్ధంగా ఉన్నావా?” అని వాణ్ణి అడుగు.
79:19  وَأَهْدِيَكَ إِلَىٰ رَبِّكَ فَتَخْشَىٰ
“నువ్వు భయభక్తులతో మసలుకునేందుకుగాను, నేను నీకు నీ ప్రభువు మార్గం చూపించనా!?” (అని చెప్పమని అల్లాహ్ మూసాకు ఉపదేశించాడు).
79:20  فَأَرَاهُ الْآيَةَ الْكُبْرَىٰ
మరి (మూసా) అతనికి గొప్ప సూచన (మహిమ)ను చూపాడు.
79:21  فَكَذَّبَ وَعَصَىٰ
కాని వాడు మాత్రం ధిక్కరించాడు, అవిధేయతకు పాల్పడ్డాడు.
79:22  ثُمَّ أَدْبَرَ يَسْعَىٰ
ఆ తర్వాత తిరిగి వెళ్లి, తన సన్నాహాలు మొదలెట్టాడు.
79:23  فَحَشَرَ فَنَادَىٰ
మరి అందరినీ సమావేశపరచి, ప్రకటించాడు.
79:24  فَقَالَ أَنَا رَبُّكُمُ الْأَعْلَىٰ
“నేనే మీ సర్వోన్నత ప్రభువును” అన్నాడు.
79:25  فَأَخَذَهُ اللَّهُ نَكَالَ الْآخِرَةِ وَالْأُولَىٰ
అందువల్ల అల్లాహ్ అతన్ని ఇహపర లోకాల శిక్షగా పట్టుకున్నాడు.
79:26  إِنَّ فِي ذَٰلِكَ لَعِبْرَةً لِّمَن يَخْشَىٰ
నిశ్చయంగా ఇందులో దైవభీతిగల ప్రతి ఒక్కరికీ గొప్ప గుణపాఠం ఉంది.
79:27  أَأَنتُمْ أَشَدُّ خَلْقًا أَمِ السَّمَاءُ ۚ بَنَاهَا
ఏమిటి, మిమ్మల్ని సృష్టించటం కష్టంతో కూడుకున్న పనా? లేక ఆకాశాన్నా? ఆయనే (అల్లాహ్ యే) దానిని నిర్మించాడు.
79:28  رَفَعَ سَمْكَهَا فَسَوَّاهَا
ఆయనే దాని కప్పును బాగా ఎత్తుగా చేశాడు. మరి దానిని తీర్చిదిద్దాడు.
79:29  وَأَغْطَشَ لَيْلَهَا وَأَخْرَجَ ضُحَاهَا
దాని రాత్రిని చీకటిమయంగా చేశాడు, దాని పగటిని (వెలుతురుగా) బయల్పరిచాడు.
79:30  وَالْأَرْضَ بَعْدَ ذَٰلِكَ دَحَاهَا
తరువాత భూమిని సుగమం చేశాడు.
79:31  أَخْرَجَ مِنْهَا مَاءَهَا وَمَرْعَاهَا
అందులో నుంచి దాని నీళ్ళను, దాని పచ్చికను వెలికి తీశాడు.
79:32  وَالْجِبَالَ أَرْسَاهَا
ఇంకా, పర్వతాలను (స్థిరంగా) పాతి పెట్టాడు.
79:33  مَتَاعًا لَّكُمْ وَلِأَنْعَامِكُمْ
ఇదంతా మీ కోసమూను, మీ పశువుల ప్రయోజనం కోసమే.
79:34  فَإِذَا جَاءَتِ الطَّامَّةُ الْكُبْرَىٰ
మరెప్పుడైతే ఆ మహా విపత్తు (ప్రళయం) వచ్చిపడుతుందో...
79:35  يَوْمَ يَتَذَكَّرُ الْإِنسَانُ مَا سَعَىٰ
ఆ రోజు మనిషి తాను చేసిన దాన్ని నెమరు వేసుకుంటాడు.
79:36  وَبُرِّزَتِ الْجَحِيمُ لِمَن يَرَىٰ
ప్రతి చూపరి ముందూ నరకం బహిర్గతం చేయబడుతుంది.
79:37  فَأَمَّا مَن طَغَىٰ
కాబట్టి ఎవడు తలబిరుసుగా వ్యవహరించాడో,
79:38  وَآثَرَ الْحَيَاةَ الدُّنْيَا
మరి ప్రాపంచిక జీవితానికే ప్రాధాన్యం ఇచ్చాడో,
79:39  فَإِنَّ الْجَحِيمَ هِيَ الْمَأْوَىٰ
అతని నివాసం నరకమే అవుతుంది.
79:40  وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِ وَنَهَى النَّفْسَ عَنِ الْهَوَىٰ
మరెవడు తన ప్రభువు ఎదుట నిలబడే విషయమై భయపడ్డాడో, ఇంకా తన మనసును చెడు వాంఛల నుండి ఆపుకున్నాడో,
79:41  فَإِنَّ الْجَنَّةَ هِيَ الْمَأْوَىٰ
అతని నివాసం స్వర్గమవుతుంది.
79:42  يَسْأَلُونَكَ عَنِ السَّاعَةِ أَيَّانَ مُرْسَاهَا
వారు ప్రళయం గురించి, ‘ఇంతకీ అదెప్పుడు సంభవిస్తుంది?’ అని నిన్ను అడుగుతున్నారు కదూ!
79:43  فِيمَ أَنتَ مِن ذِكْرَاهَا
ఆ వివరణతో అసలు నీకేం సంబంధం (ఉందనీ?)
79:44  إِلَىٰ رَبِّكَ مُنتَهَاهَا
ఆ సంగతి (దాని పరిజ్ఞానం) పూర్తిగా నీ ప్రభువు వైపే మరలుతుంది (కదా!)
79:45  إِنَّمَا أَنتَ مُنذِرُ مَن يَخْشَاهَا
నువ్వు మాత్రం దానికి భయపడేవారిని హెచ్చరించే వాడివి మాత్రమే.
79:46  كَأَنَّهُمْ يَوْمَ يَرَوْنَهَا لَمْ يَلْبَثُوا إِلَّا عَشِيَّةً أَوْ ضُحَاهَا
వారు దానిని ప్రత్యక్షంగా చూసిన నాడు, తాము (ప్రపంచంలో) కేవలం ఒక దినములో అంత్య భాగమో లేక దాని ఆరంభ భాగమో ఉండి ఉంటామని వారికి అనిపిస్తుంది.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.