aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

71. సూరా నూహ్

71:1  إِنَّا أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِ أَنْ أَنذِرْ قَوْمَكَ مِن قَبْلِ أَن يَأْتِيَهُمْ عَذَابٌ أَلِيمٌ
మేము నూహ్ అలైహిస్సలాం ను అతని జాతివైపు పంపించి, “నీ జాతి వారిపై బాధాకరమైన శిక్ష వచ్చిపడక ముందే నీవు వారిని భయపెట్టు” (అప్రమత్తుల్ని చేయి అని చెప్పాము).
71:2  قَالَ يَا قَوْمِ إِنِّي لَكُمْ نَذِيرٌ مُّبِينٌ
(నూహ్) ఇలా అన్నాడు : “ఓ నా జాతివారలారా! నేను మిమ్మల్ని స్పష్టంగా హెచ్చరిస్తున్నాను.”
71:3  أَنِ اعْبُدُوا اللَّهَ وَاتَّقُوهُ وَأَطِيعُونِ
“మీరు అల్లాహ్ ను ఆరాధించండి. ఆయనకు మాత్రమే భయపడండి. నా మాట వినండి. (నన్ను అనుసరించండి).
71:4  يَغْفِرْ لَكُم مِّن ذُنُوبِكُمْ وَيُؤَخِّرْكُمْ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى ۚ إِنَّ أَجَلَ اللَّهِ إِذَا جَاءَ لَا يُؤَخَّرُ ۖ لَوْ كُنتُمْ تَعْلَمُونَ
“(అప్పుడు) అల్లాహ్ మీ పాపాలను క్షమిస్తాడు. ఒక నిర్ణీత గడువు వరకు మీకు అవకాశం ఇస్తాడు. నిశ్చయంగా అల్లాహ్ నిర్ణయించిన గడువు వచ్చేసిందంటే ఇక అది వాయిదా పడటమంటూ ఉండదు. ఈ సంగతిని మీరు తెలుసుకోగలిగితే ఎంత బావుండు?”
71:5  قَالَ رَبِّ إِنِّي دَعَوْتُ قَوْمِي لَيْلًا وَنَهَارًا
(నూహ్) ఇలా విన్నవించుకున్నాడు : “నా ప్రభూ! నేను నా జాతివారిని రేయింబవళ్లూ నీ వైపు పిలిచాను.”
71:6  فَلَمْ يَزِدْهُمْ دُعَائِي إِلَّا فِرَارًا
“కాని నా పిలుపు వారి పలాయనాన్ని మరింత పెంచింది.”
71:7  وَإِنِّي كُلَّمَا دَعَوْتُهُمْ لِتَغْفِرَ لَهُمْ جَعَلُوا أَصَابِعَهُمْ فِي آذَانِهِمْ وَاسْتَغْشَوْا ثِيَابَهُمْ وَأَصَرُّوا وَاسْتَكْبَرُوا اسْتِكْبَارًا
“నీ క్షమాబిక్షకై నేను వారిని పిలిచినప్పుడల్లా వారు తమ వ్రేళ్ళను తమ చెవులలో పెట్టుకున్నారు. తమ వస్త్రాలను తమపైన కప్పుకున్నారు. మరీ మొండి ఘటాలుగా మారిపోయారు. మహా గర్విష్టుల్లా ప్రవర్తించారు.”
71:8  ثُمَّ إِنِّي دَعَوْتُهُمْ جِهَارًا
“మరి నేను వారిని బహిరంగంగా (లేక బిగ్గరగా) పిలిచాను.”
71:9  ثُمَّ إِنِّي أَعْلَنتُ لَهُمْ وَأَسْرَرْتُ لَهُمْ إِسْرَارًا
“ఆపైన నేను వారికి బాహాటంగా కూడా బోధపరిచాను. రహస్యంగా (ఏకాంతంలో) కూడా విడమరచి చెప్పాను.”
71:10  فَقُلْتُ اسْتَغْفِرُوا رَبَّكُمْ إِنَّهُ كَانَ غَفَّارًا
“నేనిలా అన్నాను – క్షమాపణకై మీ ప్రభువును వేడుకోండి. నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు.”
71:11  يُرْسِلِ السَّمَاءَ عَلَيْكُم مِّدْرَارًا
“ఆయన ఆకాశం నుంచి మీపై ధారాపాతంగా వర్షం కురిపిస్తాడు.”
71:12  وَيُمْدِدْكُم بِأَمْوَالٍ وَبَنِينَ وَيَجْعَل لَّكُمْ جَنَّاتٍ وَيَجْعَل لَّكُمْ أَنْهَارًا
“మీ సిరిసంపదల్లోనూ, పుత్ర సంతతిలోనూ పురోభివృద్ధిని వొసగుతాడు. మీ కొరకు తోటల్ని ఉత్పన్నం చేస్తాడు. ఇంకా మీ కోసం కాలువలను ప్రవహింపజేస్తాడు.”
71:13  مَّا لَكُمْ لَا تَرْجُونَ لِلَّهِ وَقَارًا
“అసలేమైంది మీకు, అల్లాహ్ ఔన్నత్యం (ఘనత) పట్ల మీకు బొత్తిగా భయం లేదేమిటి?”
71:14  وَقَدْ خَلَقَكُمْ أَطْوَارًا
“వాస్తవానికి ఆయన మిమ్మల్ని సృష్టి ప్రక్రియలోని అనేక దశల గుండా తీర్చిదిద్దాడు.”
71:15  أَلَمْ تَرَوْا كَيْفَ خَلَقَ اللَّهُ سَبْعَ سَمَاوَاتٍ طِبَاقًا
“ఏమిటి, అల్లాహ్ సప్తాకాశాలను ఎలా ఒకదానిపై ఒకటిగా సృష్టించాడో మీరు చూడటం లేదా?”
71:16  وَجَعَلَ الْقَمَرَ فِيهِنَّ نُورًا وَجَعَلَ الشَّمْسَ سِرَاجًا
“మరి వాటిలో చంద్రుణ్ణి కాంతిమంతంగా చేశాడు. సూర్యుణ్ణి దేదీప్యమానంగా చేశాడు.”
71:17  وَاللَّهُ أَنبَتَكُم مِّنَ الْأَرْضِ نَبَاتًا
“ఇంకా అల్లాహ్ మిమ్మల్ని నేల నుండి (ఒక ప్రత్యేక రీతిలో) మొలిపించాడు.”
71:18  ثُمَّ يُعِيدُكُمْ فِيهَا وَيُخْرِجُكُمْ إِخْرَاجًا
“మరి మిమ్మల్ని అందులోనికే తిరిగి తీసుకుపోతాడు. మరి ఆ నేలలో నుంచే మిమ్మల్ని (విచిత్రంగా) వెలికితిస్తాడు.”
71:19  وَاللَّهُ جَعَلَ لَكُمُ الْأَرْضَ بِسَاطًا
“ఇంకా – అల్లాహ్ భూమిని మీ కోసం పాన్పు మాదిరిగా చేశాడు.
71:20  لِّتَسْلُكُوا مِنْهَا سُبُلًا فِجَاجًا
“మీరు దాని సువిశాల మార్గాల్లో నడవటానికి” (అని చెప్పాను).
71:21  قَالَ نُوحٌ رَّبِّ إِنَّهُمْ عَصَوْنِي وَاتَّبَعُوا مَن لَّمْ يَزِدْهُ مَالُهُ وَوَلَدُهُ إِلَّا خَسَارًا
(ఆఖరికి) నూహ్ ఇలా మొరపెట్టుకున్నాడు : “నా ప్రభూ! వీళ్ళు నా మాటల్ని లక్ష్యపెట్టలేదు. ఎవరికి సిరిసంపదలు, సంతానం నష్టకరంగా పరిణమించాయో వారి మాటల్ని మాత్రమే వీళ్ళు విన్నారు.”
71:22  وَمَكَرُوا مَكْرًا كُبَّارًا
“ఇంకా – వీళ్ళు పెద్ద పెద్ద కుట్రలు పన్నారు.”
71:23  وَقَالُوا لَا تَذَرُنَّ آلِهَتَكُمْ وَلَا تَذَرُنَّ وَدًّا وَلَا سُوَاعًا وَلَا يَغُوثَ وَيَعُوقَ وَنَسْرًا
“ఇంకా వారిలా అన్నారు – ఎట్టి పరిస్థితిలోనూ మీ పూజ్య దైవాలను వదలకండి. వద్ద్ద్ ను గానీ, సువాను గానీ, యగూస్, యవూఖ్, నస్ర్ లను గానీ వదలి పెట్టకండి.”
71:24  وَقَدْ أَضَلُّوا كَثِيرًا ۖ وَلَا تَزِدِ الظَّالِمِينَ إِلَّا ضَلَالًا
“(ప్రభూ!) వీళ్ళు చాలామందిని అపమార్గం పట్టించారు. (కాబట్టి) నీవు ఈ దుర్మార్గుల అపమార్గాన్ని మరింతగా పెంచు.”
71:25  مِّمَّا خَطِيئَاتِهِمْ أُغْرِقُوا فَأُدْخِلُوا نَارًا فَلَمْ يَجِدُوا لَهُم مِّن دُونِ اللَّهِ أَنصَارًا
(ఎట్టకేలకు) వారు తమ పాపాల కారణంగానే ముంచి వేయబడ్డారు. మరి వారు నరకానికి చేర్చబడ్డారు. మరి వారు అల్లాహ్ ను తప్ప వేరెవరినీ సహాయకులుగా పొందలేకపోయారు.
71:26  وَقَالَ نُوحٌ رَّبِّ لَا تَذَرْ عَلَى الْأَرْضِ مِنَ الْكَافِرِينَ دَيَّارًا
నూహ్ ఇలా ప్రార్ధించాడు: “నా ప్రభూ! నీవు భూమండలంపై ఏ ఒక్క అవిశ్వాసినీ సజీవంగా వదలిపెట్టకు.”
71:27  إِنَّكَ إِن تَذَرْهُمْ يُضِلُّوا عِبَادَكَ وَلَا يَلِدُوا إِلَّا فَاجِرًا كَفَّارًا
“ఒకవేళ నీవు గనక వీళ్ళను వదలి పెడితే, వీళ్ళు నీ దాసులను మార్గం తప్పిస్తారు. వీళ్ళకు పుట్టబోయే బిడ్డలు కూడా అవిధేయులు, కరడుగట్టిన అవిశ్వాసులై ఉంటారు.”
71:28  رَّبِّ اغْفِرْ لِي وَلِوَالِدَيَّ وَلِمَن دَخَلَ بَيْتِيَ مُؤْمِنًا وَلِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ وَلَا تَزِدِ الظَّالِمِينَ إِلَّا تَبَارًا
“నా ప్రభూ! నన్నూ, నా తల్లిదండ్రులను, విశ్వసించి నా ఇంట్లో ప్రవేశించిన వారందరినీ, విశ్వాసులైన సమస్త పురుషులను, స్త్రీలను క్షమించు. దుర్మార్గులకు వినాశంలో తప్ప మరెందులోనూ వృద్ధినొసగకు.”


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.