aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

70. సూరా అల్ ముఆరిజ్

70:1  سَأَلَ سَائِلٌ بِعَذَابٍ وَاقِعٍ
అడిగేవాడొకడు తప్పకుండా రానున్న శిక్షను గురించి అడిగాడు.
70:2  لِّلْكَافِرِينَ لَيْسَ لَهُ دَافِعٌ
అది అవిశ్వాసులపై (రానున్నది). దానిని తప్పించే వాడెవ్వడూ లేడు.
70:3  مِّنَ اللَّهِ ذِي الْمَعَارِجِ
అది (ఆ శిక్ష) సోపానాలకు యజమాని అయిన అల్లాహ్ తరఫున సంభవిస్తుంది.
70:4  تَعْرُجُ الْمَلَائِكَةُ وَالرُّوحُ إِلَيْهِ فِي يَوْمٍ كَانَ مِقْدَارُهُ خَمْسِينَ أَلْفَ سَنَةٍ
యాభై వేల సంవత్సరాల పరిమాణం గల రోజున దైవదూతలు మరియు ఆత్మ (జిబ్రయీల్) ఆయన వైపునకు అధిరోహిస్తారు.
70:5  فَاصْبِرْ صَبْرًا جَمِيلًا
కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు అత్యుత్తమ రీతిలో సహనం వహించు.
70:6  إِنَّهُمْ يَرَوْنَهُ بَعِيدًا
అది (ఆ శిక్ష) చాలా దూరాన ఉందని వారు భావిస్తున్నారు.
70:7  وَنَرَاهُ قَرِيبًا
కాని అది మాకు చాలా దగ్గరే కనిపిస్తున్నది.
70:8  يَوْمَ تَكُونُ السَّمَاءُ كَالْمُهْلِ
ఆ రోజు ఆకాశం నూనె గసిలా అయిపోతుంది.
70:9  وَتَكُونُ الْجِبَالُ كَالْعِهْنِ
పర్వతాలు రంగురంగుల ఉన్నిలాగా అయిపోతాయి.
70:10  وَلَا يَسْأَلُ حَمِيمٌ حَمِيمًا
ఏ స్నేహితుడూ మరొక స్నేహితుని (మంచి చెడులను గురించి) అడిగి చూడడు.
70:11  يُبَصَّرُونَهُمْ ۚ يَوَدُّ الْمُجْرِمُ لَوْ يَفْتَدِي مِنْ عَذَابِ يَوْمِئِذٍ بِبَنِيهِ
వారు ఒండొకరికి చూపించబడతారు. కాని నేరస్థుడు ఆ రోజు (తనకు పడే) శిక్ష నుంచి తప్పించుకోవటానికి పరిహారంగా తన కుమారులను,
70:12  وَصَاحِبَتِهِ وَأَخِيهِ
తన ఇల్లాలినీ, తన సోదరుణ్ణి,
70:13  وَفَصِيلَتِهِ الَّتِي تُؤْوِيهِ
తనకు ఆశ్రయమిచ్చిన తన కుటుంబాన్నీ,
70:14  وَمَن فِي الْأَرْضِ جَمِيعًا ثُمَّ يُنجِيهِ
భూమండలంలోని సమస్త జనులనూ ఇచ్చేసి, తాను మాత్రం బయటపడాలని కోరుకుంటాడు.
70:15  كَلَّا ۖ إِنَّهَا لَظَىٰ
(కాని ఇది) అసంభవం. నిశ్చయంగా అది జ్వలించే అగ్ని.
70:16  نَزَّاعَةً لِّلشَّوَىٰ
అది తలలోని చర్మాన్ని, మాంసాన్ని సయితం దహించి వేస్తుంది.
70:17  تَدْعُو مَنْ أَدْبَرَ وَتَوَلَّىٰ
అది వీపు త్రిప్పుకునిపోయే, విముఖత చూపే ప్రతి ఒక్కరినీ కేకేసి పిలుస్తుంది.
70:18  وَجَمَعَ فَأَوْعَىٰ
అలాగే ధనాన్ని పోగుచేసి, భద్రంగా దాచిపెట్టేవాణ్ణి కూడా.
70:19  إِنَّ الْإِنسَانَ خُلِقَ هَلُوعًا
నిశ్చయంగా మానవుడు మహా దూకుడు స్వభావిగా పుట్టించబడ్డాడు.
70:20  إِذَا مَسَّهُ الشَّرُّ جَزُوعًا
(కాస్తంత) కీడు కలగగానే కలవరం చెందుతాడు.
70:21  وَإِذَا مَسَّهُ الْخَيْرُ مَنُوعًا
మరి మేలు కలిగినప్పుడు మాత్రం పిసినారిగా ప్రవర్తిస్తాడు.
70:22  إِلَّا الْمُصَلِّينَ
కాని నమాజు చేసేవారు మాత్రం అలాంటివారు కారు.
70:23  الَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ دَائِمُونَ
వారు తమ నమాజుల (వ్యవస్థ)పై నిత్యం కొనసాగుతారు.
70:24  وَالَّذِينَ فِي أَمْوَالِهِمْ حَقٌّ مَّعْلُومٌ
వారి సంపదలో నిర్ణీత హక్కు ఉంటుంది.
70:25  لِّلسَّائِلِ وَالْمَحْرُومِ
అడిగేవారికి, అడగని వారికి కూడా.
70:26  وَالَّذِينَ يُصَدِّقُونَ بِيَوْمِ الدِّينِ
వారు ప్రతిఫల దినాన్ని దృఢంగా నమ్మే వారై ఉంటారు.
70:27  وَالَّذِينَ هُم مِّنْ عَذَابِ رَبِّهِم مُّشْفِقُونَ
వారు తమ ప్రభువు శిక్షకు భయపడుతూ ఉంటారు.
70:28  إِنَّ عَذَابَ رَبِّهِمْ غَيْرُ مَأْمُونٍ
నిశ్చయంగా వారి ప్రభువు శిక్ష నిర్భయంగా ఉండదగినది కాదు.
70:29  وَالَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَافِظُونَ
వారు తమ మర్మాంగాలను (అక్రమ సంబంధాల నుండి) కాపాడుకుంటారు.
70:30  إِلَّا عَلَىٰ أَزْوَاجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ
అయితే తమ భార్యల విషయంలో, (ధర్మబద్ధంగా) తమ స్వాధీనంలో ఉన్న బానిస స్త్రీల విషయంలో మాత్రం వారు నిందార్హులు కారు.
70:31  فَمَنِ ابْتَغَىٰ وَرَاءَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْعَادُونَ
ఇక ఎవరైనా ఇది గాక ఇంకా ఏవైనా (ఇతరత్రా అడ్డదారులు అవలంబించ) కోరితే, వారు హద్దుమీరిన వారవుతారు.
70:32  وَالَّذِينَ هُمْ لِأَمَانَاتِهِمْ وَعَهْدِهِمْ رَاعُونَ
వారు తమ అప్పగింతలకు, వాగ్దానాలకు కట్టుబడి ఉండే వారై ఉంటారు.
70:33  وَالَّذِينَ هُم بِشَهَادَاتِهِمْ قَائِمُونَ
వారు తమ సాక్ష్యాలపై నిలకడ కలిగి ఉంటారు.
70:34  وَالَّذِينَ هُمْ عَلَىٰ صَلَاتِهِمْ يُحَافِظُونَ
ఇంకా – వారు తమ నమాజులను కాపాడుతారు.
70:35  أُولَٰئِكَ فِي جَنَّاتٍ مُّكْرَمُونَ
ఇలాంటి వారే స్వర్గ వనాలలో సగౌరవంగా ఉండేవారు.
70:36  فَمَالِ الَّذِينَ كَفَرُوا قِبَلَكَ مُهْطِعِينَ
(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం) ఇంతకీ ఈ తిరస్కారులకు ఏమైపోయిందీ? వారు నీ వైపు (పిచ్చిగా) ఎగబడి వస్తున్నారు!?
70:37  عَنِ الْيَمِينِ وَعَنِ الشِّمَالِ عِزِينَ
కుడివైపు నుంచి, ఎడమ వైపు నుంచి గుంపులు గుంపులుగా!
70:38  أَيَطْمَعُ كُلُّ امْرِئٍ مِّنْهُمْ أَن يُدْخَلَ جَنَّةَ نَعِيمٍ
ఏమిటి, వారిలోని ప్రతి ఒక్కడూ సుఖ సౌఖ్యాలతో నిండిన స్వర్గంలో తాను కూడా ప్రవేశింపజేయబడాలని ఆశపడుతున్నాడా?
70:39  كَلَّا ۖ إِنَّا خَلَقْنَاهُم مِّمَّا يَعْلَمُونَ
అసంభవం, మేము వారిని దేంతో పుట్టించామో స్వయంగా వారికీ తెలుసు.
70:40  فَلَا أُقْسِمُ بِرَبِّ الْمَشَارِقِ وَالْمَغَارِبِ إِنَّا لَقَادِرُونَ
అది కాదు. నేను తూర్పుల, పడమరల ప్రభువుపై ప్రమాణం చేసి చెబుతున్నాను....నిశ్చయంగా మేము శక్తిమంతులం.
70:41  عَلَىٰ أَن نُّبَدِّلَ خَيْرًا مِّنْهُمْ وَمَا نَحْنُ بِمَسْبُوقِينَ
....వీరికి బదులుగా, వీరికన్నా మెరుగైనవారిని తీసుకురాగల (శక్తిగల వార)ము. ఈ విషయంలో మేము అశక్తులం ఎంత మాత్రం కాము.
70:42  فَذَرْهُمْ يَخُوضُوا وَيَلْعَبُوا حَتَّىٰ يُلَاقُوا يَوْمَهُمُ الَّذِي يُوعَدُونَ
కనుక (ఓ ప్రవక్తా!) నీవు వారిని ఆషామాషీ విషయాలలో, అటపాటలలోనే పడి ఉండనివ్వు. చివరకు వారు తమకు వాగ్దానం చేయబడుతున్న దినాన్ని ఎలాగూ చేరుకుంటారు.
70:43  يَوْمَ يَخْرُجُونَ مِنَ الْأَجْدَاثِ سِرَاعًا كَأَنَّهُمْ إِلَىٰ نُصُبٍ يُوفِضُونَ
ఆ రోజు వారు సమాధుల నుంచి లేచి, ఒక నిర్ణీత లక్ష్యం వైపు ఉరకలు వేసినట్లే పరుగెడుతూ ఉంటారు.
70:44  خَاشِعَةً أَبْصَارُهُمْ تَرْهَقُهُمْ ذِلَّةٌ ۚ ذَٰلِكَ الْيَوْمُ الَّذِي كَانُوا يُوعَدُونَ
వారి చూపులు క్రిందికి వంగి ఉంటాయి. పరాభవం వారిని ఆవరిస్తూ ఉంటుంది. ఇదే వారికి వాగ్దానం చేయబడుతూ ఉన్న రోజు!


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.