aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

6. సూరా అల్ అన్ ఆమ్

6:1  الْحَمْدُ لِلَّهِ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَجَعَلَ الظُّلُمَاتِ وَالنُّورَ ۖ ثُمَّ الَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ يَعْدِلُونَ
ప్రశంసలు, పొగడ్తలన్నీ భూమ్యాకాశాలను పుట్టించిన అల్లాహ్‌కు మాత్రమే శోభిస్తాయి. మరి ఆయనే చీకట్లనూ, వెలుగునూ తయారు చేశాడు. అయినప్పటికీ అవిశ్వాసులు (ఇతరులను) తమ ప్రభువుకు సమానులుగా నిలబెడుతున్నారు.
6:2  هُوَ الَّذِي خَلَقَكُم مِّن طِينٍ ثُمَّ قَضَىٰ أَجَلًا ۖ وَأَجَلٌ مُّسَمًّى عِندَهُ ۖ ثُمَّ أَنتُمْ تَمْتَرُونَ
ఆయనే మిమ్మల్ని మట్టితో చేశాడు. ఆపైన ఒక గడువును నిర్థారించాడు. మరో నిర్ణీత గడువు మాత్రం అల్లాహ్‌ వద్దనే ఉంది. అయినా మీరు సంశయానికి లోనై ఉన్నారు!
6:3  وَهُوَ اللَّهُ فِي السَّمَاوَاتِ وَفِي الْأَرْضِ ۖ يَعْلَمُ سِرَّكُمْ وَجَهْرَكُمْ وَيَعْلَمُ مَا تَكْسِبُونَ
ఆకాశాలలోనూ, భూమిలోనూ నిజదైవం ఆయనే. మీరు దాచిపెట్టేదీ, పైకి వ్యక్తపరచేదీ - అంతా ఆయనకు తెలుసు. మీరు చేసే పనులన్నీ ఆయనకు ఎరుకే.
6:4  وَمَا تَأْتِيهِم مِّنْ آيَةٍ مِّنْ آيَاتِ رَبِّهِمْ إِلَّا كَانُوا عَنْهَا مُعْرِضِينَ
వారి వద్దకు వారి ప్రభువు సూచనలలో నుంచి ఏ సూచన వచ్చినా దానిపట్ల వారు విముఖతే చూపుతున్నారు.
6:5  فَقَدْ كَذَّبُوا بِالْحَقِّ لَمَّا جَاءَهُمْ ۖ فَسَوْفَ يَأْتِيهِمْ أَنبَاءُ مَا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
తమ వద్దకు వచ్చిన ఈ సత్య గ్రంథాన్ని కూడా వారు అసత్యమని త్రోసిపుచ్చారు. కాబట్టి దేనిపట్ల వారు పరిహాసమాడేవారో దానికి సంబంధించిన వార్తలు వారికి త్వరలోనే అందుతాయి.
6:6  أَلَمْ يَرَوْا كَمْ أَهْلَكْنَا مِن قَبْلِهِم مِّن قَرْنٍ مَّكَّنَّاهُمْ فِي الْأَرْضِ مَا لَمْ نُمَكِّن لَّكُمْ وَأَرْسَلْنَا السَّمَاءَ عَلَيْهِم مِّدْرَارًا وَجَعَلْنَا الْأَنْهَارَ تَجْرِي مِن تَحْتِهِمْ فَأَهْلَكْنَاهُم بِذُنُوبِهِمْ وَأَنشَأْنَا مِن بَعْدِهِمْ قَرْنًا آخَرِينَ
ఏమిటీ, మేము వీళ్ళకు పూర్వం ఎన్ని సముదాయాలను నాశనం చేశామో వీరు చూడలేదా? ప్రపంచంలో మీకు ప్రసాదించని బలిమిని మేము ఆ సముదాయాల వారికి ప్రసాదించాము. వారి కోసం మేము ధారాపాతంగా వర్షాన్ని కురిపించాము. వారి కోసం క్రింది నుంచి కాలువల్ని ప్రవహింపజేశాము. కాని వారి పాపాల మూలంగా మేము వారిని తుద ముట్టించాము. వారి తరువాత ఇతర సముదాయాలను ప్రభవింపజేశాము.
6:7  وَلَوْ نَزَّلْنَا عَلَيْكَ كِتَابًا فِي قِرْطَاسٍ فَلَمَسُوهُ بِأَيْدِيهِمْ لَقَالَ الَّذِينَ كَفَرُوا إِنْ هَٰذَا إِلَّا سِحْرٌ مُّبِينٌ
(ఓ ప్రవక్తా!) ఒకవేళ కాగితంపై లిఖించబడివున్న సందేశాన్నే మేము నీపై అవతరింపజేసినా, మరి వీళ్లు తమ స్వహస్తాలతో దానిని తాకినా, “ఇది స్పష్టమైన మాయాజాలం తప్ప మరేమీ కాదు” అనే అంటారు అవిశ్వాసులు.
6:8  وَقَالُوا لَوْلَا أُنزِلَ عَلَيْهِ مَلَكٌ ۖ وَلَوْ أَنزَلْنَا مَلَكًا لَّقُضِيَ الْأَمْرُ ثُمَّ لَا يُنظَرُونَ
“ఈయన వద్దకు ఒక దైవదూత ఎందుకు అవతరింపజేయబడలేదు?” అని వారు అంటున్నారు. మేమే గనక దూతను పంపి ఉంటే ఈ పాటికి వ్యవహారం ముగిసి ఉండేది. తర్వాత వీళ్ళకు కొద్దిపాటి గడువు కూడా ఇవ్వబడేది కాదు.
6:9  وَلَوْ جَعَلْنَاهُ مَلَكًا لَّجَعَلْنَاهُ رَجُلًا وَلَلَبَسْنَا عَلَيْهِم مَّا يَلْبِسُونَ
ఒకవేళ మేము దూతను పంపినా, అతన్ని మనిషిగానే చేసి ఉండేవారము. అప్పుడు మేము గైకొన్న ఈ చర్యవల్ల వారు ప్రస్తుతం ఏ సందేహానికి లోనై ఉన్నారో మళ్లీ అదే సందేహానికి లోనయ్యేవారు.
6:10  وَلَقَدِ اسْتُهْزِئَ بِرُسُلٍ مِّن قَبْلِكَ فَحَاقَ بِالَّذِينَ سَخِرُوا مِنْهُم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
(ఓ ప్రవక్తా!) నీకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలు పరిహసించబడ్డారు. మరి ఆ పరిహాసమాడేవారిని, వారు పరిహసిస్తూ వచ్చిన ఆపదే చుట్టుముట్టింది.
6:11  قُلْ سِيرُوا فِي الْأَرْضِ ثُمَّ انظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِينَ
'కాస్త భూమిలో సంచరించి, (సత్యాన్ని) ధిక్కరించేవారికి ఏ గతి పట్టిందో చూడండి' అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
6:12  قُل لِّمَن مَّا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ قُل لِّلَّهِ ۚ كَتَبَ عَلَىٰ نَفْسِهِ الرَّحْمَةَ ۚ لَيَجْمَعَنَّكُمْ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ لَا رَيْبَ فِيهِ ۚ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُمْ فَهُمْ لَا يُؤْمِنُونَ
“ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్నదంతా ఎవరిది?” అని వారిని అడుగు. వారికి చెప్పు: “సమస్తమూ అల్లాహ్‌దే.” కనికరించటాన్ని అల్లాహ్‌ తన కోసం అవశ్యం చేసుకున్నాడు. అల్లాహ్‌ ప్రళయదినాన మిమ్మల్నందరినీ సమీకరిస్తాడు. ఇందులో ఎలాంటి సందేహానికీ తావులేదు. కాని తమను తాము నష్టంలో పడవేసుకున్నవారు మాత్రం విశ్వసించరు.
6:13  وَلَهُ مَا سَكَنَ فِي اللَّيْلِ وَالنَّهَارِ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ
రాత్రిపూట, పగటివేళ విశ్రమిస్తూ ఉండేదంతా అల్లాహ్‌దే. ఆయన సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు.
6:14  قُلْ أَغَيْرَ اللَّهِ أَتَّخِذُ وَلِيًّا فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَهُوَ يُطْعِمُ وَلَا يُطْعَمُ ۗ قُلْ إِنِّي أُمِرْتُ أَنْ أَكُونَ أَوَّلَ مَنْ أَسْلَمَ ۖ وَلَا تَكُونَنَّ مِنَ الْمُشْرِكِينَ
“ఆకాశాలను, భూమినీ సృష్టించినవాడు, అందరికీ తినిపించేవాడూ, ఎవరి నుండి కూడా ఆహారం పుచ్చుకోనివాడూ అయిన అల్లాహ్‌ను వదలి నేను వేరొకరిని ఆరాధ్యునిగా చేసుకోవాలా?” అని ఓ ప్రవక్తా! వారిని అడుగు. ”అందరికంటే ముందు నేను ఇస్లాం స్వీకరించాలని నాకు ఆదేశించబడింది” అని నీవు వారికి తెలియజెయ్యి. “ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు బహుదైవారాధకులలో చేరిపోకూడదు” (అని కూడా నాకు ఆదేశించబడిందని చెప్పు).
6:15  قُلْ إِنِّي أَخَافُ إِنْ عَصَيْتُ رَبِّي عَذَابَ يَوْمٍ عَظِيمٍ
“నేనే గనక నా ప్రభువు ఆజ్ఞను శిరసావహించకపోతే ఒకానొక మహాదినాన నాకు శిక్ష పడుతుందని నేను భయపడుతున్నాను” అని (కూడా) వారికి చెప్పు.
6:16  مَّن يُصْرَفْ عَنْهُ يَوْمَئِذٍ فَقَدْ رَحِمَهُ ۚ وَذَٰلِكَ الْفَوْزُ الْمُبِينُ
ఆ రోజు ఎవరిపై నుంచి ఆ శిక్ష తొలగించబడుతుందో ఆ వ్యక్తిని అల్లాహ్‌ అపారంగా కరుణించినట్లే. అదే స్పష్టమైన విజయం.
6:17  وَإِن يَمْسَسْكَ اللَّهُ بِضُرٍّ فَلَا كَاشِفَ لَهُ إِلَّا هُوَ ۖ وَإِن يَمْسَسْكَ بِخَيْرٍ فَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఒకవేళ అల్లాహ్‌ నిన్ను ఏదన్నా బాధకు గురిచేస్తే, ఆయన తప్ప మరెవరూ దాన్ని దూరం చేయలేరు. ఒకవేళ ఆయన నీకు ఏదన్నా మేలు చేస్తే, ఆయన అన్నింటిపై అధికారం కలవాడు.
6:18  وَهُوَ الْقَاهِرُ فَوْقَ عِبَادِهِ ۚ وَهُوَ الْحَكِيمُ الْخَبِيرُ
తన దాసులపై తిరుగులేని ఆధిపత్యం, అధికారం గలవాడు ఆయనే. ఆయన అత్యంత వివేచనాపరుడు, అన్నీ తెలిసినవాడు.
6:19  قُلْ أَيُّ شَيْءٍ أَكْبَرُ شَهَادَةً ۖ قُلِ اللَّهُ ۖ شَهِيدٌ بَيْنِي وَبَيْنَكُمْ ۚ وَأُوحِيَ إِلَيَّ هَٰذَا الْقُرْآنُ لِأُنذِرَكُم بِهِ وَمَن بَلَغَ ۚ أَئِنَّكُمْ لَتَشْهَدُونَ أَنَّ مَعَ اللَّهِ آلِهَةً أُخْرَىٰ ۚ قُل لَّا أَشْهَدُ ۚ قُلْ إِنَّمَا هُوَ إِلَٰهٌ وَاحِدٌ وَإِنَّنِي بَرِيءٌ مِّمَّا تُشْرِكُونَ
“అందరికన్నా గొప్ప సాక్ష్యం ఎవరిది?” అని వారిని అడుగు. “నాకూ- మీకూ మధ్య సాక్షిగా అల్లాహ్‌ ఉన్నాడు. ఈ ఖుర్‌ఆను ద్వారా నేను మిమ్మల్నీ, ఇది ఎవరెవరి వరకు చేరుతుందో వారందరినీ హెచ్చరించటానికి గాను ఈ ఖుర్‌ఆన్‌ నా వద్దకు వహీ ద్వారా పంపబడింది” అని (ఓ ప్రవక్తా!) వారికి తెలియపరచు. అల్లాహ్‌తోపాటు మరి కొంతమంది దేవుళ్లు కూడా ఉన్నారని మీరు నిజంగా సాక్ష్యం ఇవ్వగలరా? “నేను మాత్రం అలాంటి సాక్ష్యం (ఇవ్వనుగాక) ఇవ్వను” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. “ఆయనే ఒకే ఒక్కడైన ఆరాధ్య దేవుడు. మీరు దైవానికి కల్పించే షిర్క్‌ (భాగస్వామ్యం)తో నాకెలాంటి సంబంధం లేదు” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పెయ్యి.
6:20  الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَعْرِفُونَهُ كَمَا يَعْرِفُونَ أَبْنَاءَهُمُ ۘ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُمْ فَهُمْ لَا يُؤْمِنُونَ
ఎవరికయితే మేము గ్రంథాన్ని వొసగి ఉన్నామో వారు తమ కన్న కొడుకులను గుర్తుపట్టినట్లే ప్రవక్తను గుర్తుపడతారు. అయితే తమను తాము నష్టంలో పడవేసుకున్నవారు మాత్రం విశ్వసించరు.
6:21  وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا أَوْ كَذَّبَ بِآيَاتِهِ ۗ إِنَّهُ لَا يُفْلِحُ الظَّالِمُونَ
అల్లాహ్‌పై అబద్ధపు నిందలు మోపే వాడికంటే లేదా అల్లాహ్‌ ఆయతులను అసత్యాలని త్రోసిపుచ్చే వాడికంటే ఎక్కువ దుర్మార్గుడెవడుంటాడు? ఇలాంటి దుర్మార్గులకు ఎన్నటికీ సాఫల్యం ప్రాప్తించదు.
6:22  وَيَوْمَ نَحْشُرُهُمْ جَمِيعًا ثُمَّ نَقُولُ لِلَّذِينَ أَشْرَكُوا أَيْنَ شُرَكَاؤُكُمُ الَّذِينَ كُنتُمْ تَزْعُمُونَ
మేము వారందరినీ సమీకరించే రోజున, “మీరు ఆరాధ్య దైవాలుగా చేసుకున్న మీ భాగస్వాములు ఏరి?” అని ముష్రిక్కులను మేము అడిగే సందర్భం కూడా జ్ఞాపకం చేసుకోదగినదే.
6:23  ثُمَّ لَمْ تَكُن فِتْنَتُهُمْ إِلَّا أَن قَالُوا وَاللَّهِ رَبِّنَا مَا كُنَّا مُشْرِكِينَ
అప్పుడు వారు, “మా ప్రభువైన అల్లాహ్‌ సాక్షి! మేము ముష్రిక్కులము కానేకాము” అని పలకటం తప్ప వారి షిర్కుకు మరే ఫలితమూ ఉండదు.
6:24  انظُرْ كَيْفَ كَذَبُوا عَلَىٰ أَنفُسِهِمْ ۚ وَضَلَّ عَنْهُم مَّا كَانُوا يَفْتَرُونَ
చూడు! వారు తమ గురించి తాము ఎలా అబద్ధం చెప్పుకుంటారో. వారు కల్పించుకుంటూ ఉండినవన్నీ వారినుండి మటుమాయమై పోతాయి.
6:25  وَمِنْهُم مَّن يَسْتَمِعُ إِلَيْكَ ۖ وَجَعَلْنَا عَلَىٰ قُلُوبِهِمْ أَكِنَّةً أَن يَفْقَهُوهُ وَفِي آذَانِهِمْ وَقْرًا ۚ وَإِن يَرَوْا كُلَّ آيَةٍ لَّا يُؤْمِنُوا بِهَا ۚ حَتَّىٰ إِذَا جَاءُوكَ يُجَادِلُونَكَ يَقُولُ الَّذِينَ كَفَرُوا إِنْ هَٰذَا إِلَّا أَسَاطِيرُ الْأَوَّلِينَ
వారిలో కొంతమంది నీ వైపు చెవి యొగ్గి ఉంటారు. మేము వారి హృదయాలపై తెరవేసి ఉంచాము. అందువల్ల వారు దానిని అర్థం చేసుకోలేరు. వారి చెవులలో చెవుడును ఉంచాము. (ఈ కారణంగా) వారు నిదర్శనాలన్నింటినీ చూసినప్పటికీ వాటిని విశ్వసించరు. ఆఖరికి వారు నీ వద్దకు వచ్చినపుడు అనవసరంగా నీతో వాదనకు దిగుతారు. అవిశ్వాసులు “ఇవి పూర్వీకుల నుంచీ చెలామణీలో ఉన్న కట్టుకథలు తప్ప మరేమీ కావు” అని అంటారు.
6:26  وَهُمْ يَنْهَوْنَ عَنْهُ وَيَنْأَوْنَ عَنْهُ ۖ وَإِن يُهْلِكُونَ إِلَّا أَنفُسَهُمْ وَمَا يَشْعُرُونَ
వాళ్లు దాన్నుంచి ఇతరులను ఆపటమే గాకుండా, స్వయంగా వాళ్లు కూడా దానికి దూరంగా ఉంటున్నారు. వాస్తవానికి వారు తమను మాత్రమే నాశనం చేసుకుంటున్నారు. కాని వారికి ఆ స్పృహే లేదు.
6:27  وَلَوْ تَرَىٰ إِذْ وُقِفُوا عَلَى النَّارِ فَقَالُوا يَا لَيْتَنَا نُرَدُّ وَلَا نُكَذِّبَ بِآيَاتِ رَبِّنَا وَنَكُونَ مِنَ الْمُؤْمِنِينَ
నరకం దగ్గర వారు నిలబెట్టబడినప్పుడు నీవు వారిని చూస్తే (ఎంత బావుండు!) - “అయ్యో! మేము మళ్లీ తిరిగి పంపబడితే బావుండునే! అదే గనక జరిగితే మేము మా ప్రభువు సూచనలను తిరస్కరించము. ఇంకా మేము విశ్వాసులలో చేరిపోతాము!” అని (ఆ సమయంలో) వారు పలుకుతారు.
6:28  بَلْ بَدَا لَهُم مَّا كَانُوا يُخْفُونَ مِن قَبْلُ ۖ وَلَوْ رُدُّوا لَعَادُوا لِمَا نُهُوا عَنْهُ وَإِنَّهُمْ لَكَاذِبُونَ
అసలు విషయం అది కాదు. వారు అంతకుముందు దేన్నయితే కప్పిపుచ్చేవారో అది వారి ముందు బహిర్గతం అయింది. ఒకవేళ వారు తిరిగి పంపబడినప్పటికీ, తమకు వారించబడిన పనులన్నీ మళ్లీ చేస్తారు. ముమ్మాటికీ వాళ్లు అబద్ధాలకోరులు.
6:29  وَقَالُوا إِنْ هِيَ إِلَّا حَيَاتُنَا الدُّنْيَا وَمَا نَحْنُ بِمَبْعُوثِينَ
“ఈ ప్రాపంచిక జీవితమే అసలు జీవితం. మళ్లీ మనం బ్రతికించబడటం అనేది కల్ల” అని వారు చెబుతున్నారు.
6:30  وَلَوْ تَرَىٰ إِذْ وُقِفُوا عَلَىٰ رَبِّهِمْ ۚ قَالَ أَلَيْسَ هَٰذَا بِالْحَقِّ ۚ قَالُوا بَلَىٰ وَرَبِّنَا ۚ قَالَ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ
వారు తమ ప్రభువు ఎదుట నిలబెట్టబడిన దృశ్యాన్ని నీవు చూస్తే (బావుండేది). “ఇది నిజం కాదా?!” అని అల్లాహ్‌ అడుగుతాడు. దానికి వారు “ఎందుకు నిజం కాదు? మా ప్రభువు సాక్షిగా (ఇది నిజమే)!” అని అంటారు. “మరయితే మీ తిరస్కారానికి బదులుగా శిక్షను చవిచూడండి” అని అల్లాహ్‌ సెలవిస్తాడు.
6:31  قَدْ خَسِرَ الَّذِينَ كَذَّبُوا بِلِقَاءِ اللَّهِ ۖ حَتَّىٰ إِذَا جَاءَتْهُمُ السَّاعَةُ بَغْتَةً قَالُوا يَا حَسْرَتَنَا عَلَىٰ مَا فَرَّطْنَا فِيهَا وَهُمْ يَحْمِلُونَ أَوْزَارَهُمْ عَلَىٰ ظُهُورِهِمْ ۚ أَلَا سَاءَ مَا يَزِرُونَ
అల్లాహ్‌ను కలుసుకోవలసి ఉందనే విషయాన్ని ధిక్కరించినవారు నిశ్చయంగా నష్టానికి గురయ్యారు. ఆఖరికి ఆ నిర్థారిత సమయం అకస్మాత్తుగా వచ్చిపడినప్పుడు, “అయ్యో! ఈ విషయాన్ని మేము ఎంత నిర్లక్ష్యం చేశాం!” అని బాధపడతారు. వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే, వారు తమ బరువులను తమ వీపులపై మోస్తూ ఉంటారు. తెలుసుకోండి! వారు మోసే బరువు చాలా చెడ్డది.
6:32  وَمَا الْحَيَاةُ الدُّنْيَا إِلَّا لَعِبٌ وَلَهْوٌ ۖ وَلَلدَّارُ الْآخِرَةُ خَيْرٌ لِّلَّذِينَ يَتَّقُونَ ۗ أَفَلَا تَعْقِلُونَ
ప్రాపంచిక జీవితం ఆట, తమాషా తప్ప మరేమీ కాదు. అయితే భయభక్తులు కలవారి కోసం పరలోక నిలయం ఎంతో మేలైనది. ఏమిటీ, మీరు బొత్తిగా బుద్ధిని ఉపయోగించరా?
6:33  قَدْ نَعْلَمُ إِنَّهُ لَيَحْزُنُكَ الَّذِي يَقُولُونَ ۖ فَإِنَّهُمْ لَا يُكَذِّبُونَكَ وَلَٰكِنَّ الظَّالِمِينَ بِآيَاتِ اللَّهِ يَجْحَدُونَ
(ఓ ప్రవక్తా!) వాళ్లు అనే మాటలు నిన్ను దుఃఖానికి గురి చేస్తున్నాయన్న సంగతి మాకు బాగా తెలుసు. వారు ధిక్కరిస్తున్నది నిన్ను కాదు, నిజానికి ఈ దుర్మార్గులు అల్లాహ్‌ ఆయతులను తిరస్కరిస్తున్నారు.
6:34  وَلَقَدْ كُذِّبَتْ رُسُلٌ مِّن قَبْلِكَ فَصَبَرُوا عَلَىٰ مَا كُذِّبُوا وَأُوذُوا حَتَّىٰ أَتَاهُمْ نَصْرُنَا ۚ وَلَا مُبَدِّلَ لِكَلِمَاتِ اللَّهِ ۚ وَلَقَدْ جَاءَكَ مِن نَّبَإِ الْمُرْسَلِينَ
నీకు పూర్వం కూడా చాలామంది ప్రవక్తలు ధిక్కరించబడ్డారు. అయితే వారు (ప్రజల) ధిక్కారవైఖరికి, తమకు పెట్టబడిన బాధలకు సహనం వహించారు. కడకు వారికి మా సహాయం అందింది. అల్లాహ్‌ వాక్కులను మార్చేవాడు ఎవడూ లేడు. కొంతమంది ప్రవక్తలకు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పటికే నీ వద్దకు చేరాయి.
6:35  وَإِن كَانَ كَبُرَ عَلَيْكَ إِعْرَاضُهُمْ فَإِنِ اسْتَطَعْتَ أَن تَبْتَغِيَ نَفَقًا فِي الْأَرْضِ أَوْ سُلَّمًا فِي السَّمَاءِ فَتَأْتِيَهُم بِآيَةٍ ۚ وَلَوْ شَاءَ اللَّهُ لَجَمَعَهُمْ عَلَى الْهُدَىٰ ۚ فَلَا تَكُونَنَّ مِنَ الْجَاهِلِينَ
ఒకవేళ వారి వైముఖ్యం (ఓ ముహమ్మద్‌! (స) నీకు సహించరానిదిగా ఉంటే (నీవే దానికి ఏదైనా ఉపాయం ఆలోచించు). నీకే గనక శక్తి ఉంటే భూమిలో ఏదైనా సొరంగం లేదా ఆకాశంలో ఏదైనా నిచ్చెనను వెతికి వారి కోసం ఏదైనా మహిమ తేగలిగితే తెచ్చుకో. అల్లాహ్‌యే గనక తలచుకుంటే వారందరినీ సన్మార్గంపై సమీకరించి ఉండేవాడే. కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు అవివేకుల్లో చేరిపోకు.
6:36  إِنَّمَا يَسْتَجِيبُ الَّذِينَ يَسْمَعُونَ ۘ وَالْمَوْتَىٰ يَبْعَثُهُمُ اللَّهُ ثُمَّ إِلَيْهِ يُرْجَعُونَ
వినేవారు మాత్రమే (సత్యాన్ని) స్వీకరిస్తారు. ఇకపోతే మృతుల విషయం - అల్లాహ్‌ వారిని బ్రతికించిలేపుతాడు. తర్వాత వారంతా ఆయన వద్దకే మరలించబడతారు.
6:37  وَقَالُوا لَوْلَا نُزِّلَ عَلَيْهِ آيَةٌ مِّن رَّبِّهِ ۚ قُلْ إِنَّ اللَّهَ قَادِرٌ عَلَىٰ أَن يُنَزِّلَ آيَةً وَلَٰكِنَّ أَكْثَرَهُمْ لَا يَعْلَمُونَ
ఈయన ప్రభువు తరఫు నుంచి ఈయనపై ఏదైనా మహిమ ఎందుకు అవతరింపజేయబడలేదు? అని వారు అడుగుతున్నారు. “అల్లాహ్‌ (ముమ్మాటికీ) మహిమను అవతరింపజేసే శక్తి కలిగి ఉన్నాడు” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. అయితే వారిలో అధికులకు తెలియదు.
6:38  وَمَا مِن دَابَّةٍ فِي الْأَرْضِ وَلَا طَائِرٍ يَطِيرُ بِجَنَاحَيْهِ إِلَّا أُمَمٌ أَمْثَالُكُم ۚ مَّا فَرَّطْنَا فِي الْكِتَابِ مِن شَيْءٍ ۚ ثُمَّ إِلَىٰ رَبِّهِمْ يُحْشَرُونَ
భూమిలో సంచరించే ఎన్ని రకాల జంతువులైనా, తమ రెండు రెక్కల సహాయంతో ఎగిరే పక్షులైనా - అన్నీ మీలాంటి సముదాయాలే. మేము గ్రంథంలో నమోదు చేయకుండా దేన్నీ వదలిపెట్టలేదు. ఆపైన అందరూ తమ ప్రభువు వైపుకు సమీకరించబడేవారే.
6:39  وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا صُمٌّ وَبُكْمٌ فِي الظُّلُمَاتِ ۗ مَن يَشَإِ اللَّهُ يُضْلِلْهُ وَمَن يَشَأْ يَجْعَلْهُ عَلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
ఎవరయితే మా ఆయతులను ధిక్కరిస్తున్నారో వారు చీకట్లలో తచ్చాడుతున్న చెవిటివారు, మూగవారు. అల్లాహ్‌ తాను కోరిన వారిని పెడదారి పట్టిస్తాడు. అలాగే ఆయన తాను కోరిన వారిని రుజుమార్గంపై నడిపిస్తాడు.
6:40  قُلْ أَرَأَيْتَكُمْ إِنْ أَتَاكُمْ عَذَابُ اللَّهِ أَوْ أَتَتْكُمُ السَّاعَةُ أَغَيْرَ اللَّهِ تَدْعُونَ إِن كُنتُمْ صَادِقِينَ
(ఓ ప్రవక్తా!) వాళ్ళను అడుగు : “చూడండి! అల్లాహ్‌ తరఫునుంచి మీపై ఏదయినా ఆపద వచ్చిపడితే లేక మీపైన ప్రళయమే వస్తే అప్పుడు మీరు అల్లాహ్‌ను తప్ప వేరొకరెవరినయినా మొరపెట్టుకుంటారా? మీరు సత్యవంతులే అయితే (నిజం) చెప్పండి.”
6:41  بَلْ إِيَّاهُ تَدْعُونَ فَيَكْشِفُ مَا تَدْعُونَ إِلَيْهِ إِن شَاءَ وَتَنسَوْنَ مَا تُشْرِكُونَ
“లేదు. (ఆ క్షణంలో) మీరు కేవలం ఆయన్నే వేడుకుంటారు. దేనికోసం మీరు వేడుకున్నారో ఆ ఆపదను ఆయన మీ నుండి తొలగించదలచుకుంటే తొలగిస్తాడు. అలాంటి సమయాలలో మీరు మాత్రం (అల్లాహ్‌కు) సహవర్తులుగా నిలబెట్టిన వారందరినీ మరచిపోతారు.”
6:42  وَلَقَدْ أَرْسَلْنَا إِلَىٰ أُمَمٍ مِّن قَبْلِكَ فَأَخَذْنَاهُم بِالْبَأْسَاءِ وَالضَّرَّاءِ لَعَلَّهُمْ يَتَضَرَّعُونَ
నీకు పూర్వం ఎన్నో సమాజాల వద్దకు కూడా మేము ప్రవక్తలను పంపాము. ఆయా సమాజాలవారు అణకువను వ్యక్తపరచాలన్న ఉద్దేశంతో మేము వాళ్ళను దారిద్య్రానికి, అనారోగ్య బాధలకు గురిచేసి పట్టుకున్నాము.
6:43  فَلَوْلَا إِذْ جَاءَهُم بَأْسُنَا تَضَرَّعُوا وَلَٰكِن قَسَتْ قُلُوبُهُمْ وَزَيَّنَ لَهُمُ الشَّيْطَانُ مَا كَانُوا يَعْمَلُونَ
మా తరఫున వారిపైకి శిక్ష వచ్చినప్పటికీ వారు అణకువను ఎందుకు ప్రదర్శించలేదు? పైగా వారి హృదయాలు కఠినమై పోయాయి. షైతాన్‌ వారి దృష్టిలో వారు చేసే పనులన్నీ మంచివే అని భ్రమపడేలా చేశాడు.
6:44  فَلَمَّا نَسُوا مَا ذُكِّرُوا بِهِ فَتَحْنَا عَلَيْهِمْ أَبْوَابَ كُلِّ شَيْءٍ حَتَّىٰ إِذَا فَرِحُوا بِمَا أُوتُوا أَخَذْنَاهُم بَغْتَةً فَإِذَا هُم مُّبْلِسُونَ
తరువాత వారికి బోధించిన విషయాలను వారు విస్మరించినప్పుడు, మేము వారి కోసం అన్ని వస్తువుల ద్వారాలూ తెరిచాము. తమకు ప్రాప్తించిన వస్తువులపై వారు మిడిసిపడుతుండగా, అకస్మాత్తుగా మేము వారిని పట్టుకున్నాము. అప్పుడు, వారు పూర్తిగా నిరాశ చెందారు.
6:45  فَقُطِعَ دَابِرُ الْقَوْمِ الَّذِينَ ظَلَمُوا ۚ وَالْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
ఈ విధంగా, దుర్మార్గాలకు పాల్పడినవారి వేరు త్రెంపబడింది. సమస్త లోకాల ప్రభువైన అల్లాహ్‌కే కృతజ్ఞతలు.
6:46  قُلْ أَرَأَيْتُمْ إِنْ أَخَذَ اللَّهُ سَمْعَكُمْ وَأَبْصَارَكُمْ وَخَتَمَ عَلَىٰ قُلُوبِكُم مَّنْ إِلَٰهٌ غَيْرُ اللَّهِ يَأْتِيكُم بِهِ ۗ انظُرْ كَيْفَ نُصَرِّفُ الْآيَاتِ ثُمَّ هُمْ يَصْدِفُونَ
(ఓ ప్రవక్తా!) వారిని అడుగు: “అల్లాహ్‌యే గనక మీ వినికిడిని, మీ చూపును పూర్తిగా తీసేసుకుని, మీ హృదయాలకు ముద్రవేస్తే, అల్లాహ్‌ తప్ప వాటిని మీకు తిరిగి ప్రసాదించగల మరో ఆరాధ్యుడు ఎవడున్నాడు చెప్పండి?!” మేమెన్ని విధాలుగా మా సూచనలను వారికి విశదీకరిస్తున్నామో చూడు! అయినా వారు ముఖం త్రిప్పుకుంటున్నారు.
6:47  قُلْ أَرَأَيْتَكُمْ إِنْ أَتَاكُمْ عَذَابُ اللَّهِ بَغْتَةً أَوْ جَهْرَةً هَلْ يُهْلَكُ إِلَّا الْقَوْمُ الظَّالِمُونَ
“చూడండి! ఒకవేళ మీపై అకస్మాత్తుగా గానీ, బహిరంగంగా గానీ అల్లాహ్‌ యొక్క శిక్ష వచ్చిపడితే దుర్మార్గులు తప్ప ఎవరు నాశనం చేయబడతారు?” అని వారిని అడుగు.
6:48  وَمَا نُرْسِلُ الْمُرْسَلِينَ إِلَّا مُبَشِّرِينَ وَمُنذِرِينَ ۖ فَمَنْ آمَنَ وَأَصْلَحَ فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
మేము ప్రవక్తలను పంపేది, వారు శుభవార్త అందజేయటానికి, హెచ్చరించటానికి మాత్రమే. కాబట్టి ఎవరు విశ్వసించి, తమ ప్రవర్తనను సరిదిద్దుకుంటారో వారికెలాంటి భయంగానీ, దుఃఖంగానీ ఉండదు.
6:49  وَالَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا يَمَسُّهُمُ الْعَذَابُ بِمَا كَانُوا يَفْسُقُونَ
అయితే మా ఆయతులను అబద్ధాలని కొట్టిపారేసేవారికి, వారి అవిధేయత కారణంగా శిక్ష అంటుకుంటుంది.
6:50  قُل لَّا أَقُولُ لَكُمْ عِندِي خَزَائِنُ اللَّهِ وَلَا أَعْلَمُ الْغَيْبَ وَلَا أَقُولُ لَكُمْ إِنِّي مَلَكٌ ۖ إِنْ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰ إِلَيَّ ۚ قُلْ هَلْ يَسْتَوِي الْأَعْمَىٰ وَالْبَصِيرُ ۚ أَفَلَا تَتَفَكَّرُونَ
ఓ ప్రవక్తా! వారికి చెప్పేయి: “నా వద్ద అల్లాహ్‌ ఖజానాలున్నాయని నేను మీతో అనటం లేదు. నా వద్ద అగోచర జ్ఞానం కూడా లేదు. నేను దైవదూతనని కూడా మీతో అనటం లేదు. నాపై అవతరింపజేయబడే 'వహీ'ని మాత్రమే నేను అనుసరిస్తున్నాను.” (ఓ ప్రవక్తా!) వారిని అడుగు: ”గ్రుడ్డివాడు, కళ్ళున్నవాడూ - ఇద్దరూ సమానులేనా? మీరు ఈ మాత్రం ఆలోచించరా?”
6:51  وَأَنذِرْ بِهِ الَّذِينَ يَخَافُونَ أَن يُحْشَرُوا إِلَىٰ رَبِّهِمْ ۙ لَيْسَ لَهُم مِّن دُونِهِ وَلِيٌّ وَلَا شَفِيعٌ لَّعَلَّهُمْ يَتَّقُونَ
స్వయంగా తమ ప్రభువు తప్ప, తమను ఆదుకునేవారుగానీ, తమకోసం సిఫారసు చేసేవారుగాని ఉండని స్థితిలో తమ ప్రభువు దగ్గరికి హాజరు కావలసి ఉంటుందని భయపడేవారికి (ఓ ప్రవక్తా!) ఇందుమూలంగా హెచ్చరించు, దీనిద్వారా వారు భయభక్తుల వైఖరిని అవలంబించవచ్చు.
6:52  وَلَا تَطْرُدِ الَّذِينَ يَدْعُونَ رَبَّهُم بِالْغَدَاةِ وَالْعَشِيِّ يُرِيدُونَ وَجْهَهُ ۖ مَا عَلَيْكَ مِنْ حِسَابِهِم مِّن شَيْءٍ وَمَا مِنْ حِسَابِكَ عَلَيْهِم مِّن شَيْءٍ فَتَطْرُدَهُمْ فَتَكُونَ مِنَ الظَّالِمِينَ
ఉదయం, సాయంత్రం తమ ప్రభువును ప్రార్థిస్తూ, కేవలం ఆయన ప్రసన్నతను పొందాలనుకునేవారిని నీ దగ్గరి నుండి తొలగి పొమ్మనకు. (నువ్వు వారిని తొలగి పొమ్మనటానికి) నీపై వారి లెక్క ఏ మాత్రం లేదు. అలాగే నీ లెక్క కూడా వారిపై ఎంతమాత్రం లేదు. అయినప్పటికీ ఒకవేళ నువ్వు వాళ్లను తొలగిపొమ్మన్నావంటే దౌర్జన్యపరులలో చేరిపోతావు.
6:53  وَكَذَٰلِكَ فَتَنَّا بَعْضَهُم بِبَعْضٍ لِّيَقُولُوا أَهَٰؤُلَاءِ مَنَّ اللَّهُ عَلَيْهِم مِّن بَيْنِنَا ۗ أَلَيْسَ اللَّهُ بِأَعْلَمَ بِالشَّاكِرِينَ
“మా అందరిలోకీ అల్లాహ్‌ అనుగ్రహించినది వీళ్లనేనా!” అని వారు పలికేందుకుగాను మేము వారిలో కొందరిని మరి కొందరి ద్వారా పరీక్షించాము. కృతజ్ఞతా భావంతో మెలిగే వారిని అల్లాహ్‌ ఎరుగడా ఏమిటీ?!
6:54  وَإِذَا جَاءَكَ الَّذِينَ يُؤْمِنُونَ بِآيَاتِنَا فَقُلْ سَلَامٌ عَلَيْكُمْ ۖ كَتَبَ رَبُّكُمْ عَلَىٰ نَفْسِهِ الرَّحْمَةَ ۖ أَنَّهُ مَنْ عَمِلَ مِنكُمْ سُوءًا بِجَهَالَةٍ ثُمَّ تَابَ مِن بَعْدِهِ وَأَصْلَحَ فَأَنَّهُ غَفُورٌ رَّحِيمٌ
(ఓ ప్రవక్తా!) మా ఆయతులను విశ్వసించేవారు నీ వద్దకు వచ్చినప్పుడు, “మీపై సలామ్‌! (శాంతి కలుగుగాక!) దయ చూపటాన్ని మీ ప్రభువు తన కోసం విధిగా లిఖించుకున్నాడు. మీలో ఎవరయినా అజ్ఞానం వల్ల ఏదన్నా చెడు పని చేసి, తరువాత పశ్చాత్తాపం చెంది, దిద్దుబాటుకు ప్రయత్నిస్తే అల్లాహ్‌ అపారంగా క్షమించేవాడు, అమితంగా దయజూపేవాడు” అని చెప్పు.
6:55  وَكَذَٰلِكَ نُفَصِّلُ الْآيَاتِ وَلِتَسْتَبِينَ سَبِيلُ الْمُجْرِمِينَ
ఈ విధంగా మేము, అపరాధులు ఎంచుకున్న మార్గం ఎలాంటిదో విదితమయ్యేందుకుగాను ఆయతులను విడమరచి చెబుతుంటాము.
6:56  قُلْ إِنِّي نُهِيتُ أَنْ أَعْبُدَ الَّذِينَ تَدْعُونَ مِن دُونِ اللَّهِ ۚ قُل لَّا أَتَّبِعُ أَهْوَاءَكُمْ ۙ قَدْ ضَلَلْتُ إِذًا وَمَا أَنَا مِنَ الْمُهْتَدِينَ
(ఓ ప్రవక్తా!) “అల్లాహ్‌ను వదలి మీరు పిలిచే ఇతరులకు దాస్యం చేయటం నాకు నిషేధించబడింది” అని వారికి చెప్పేయి. “నేను మీ కోర్కెలను అనుసరించను. ఒకవేళ నేనలా చేసినట్లయితే మార్గ విహీనతకు లోనైపోతాను. సన్మార్గాన నడిచే వారిలో ఉండను” అని (కూడా) వారికి చెప్పు.
6:57  قُلْ إِنِّي عَلَىٰ بَيِّنَةٍ مِّن رَّبِّي وَكَذَّبْتُم بِهِ ۚ مَا عِندِي مَا تَسْتَعْجِلُونَ بِهِ ۚ إِنِ الْحُكْمُ إِلَّا لِلَّهِ ۖ يَقُصُّ الْحَقَّ ۖ وَهُوَ خَيْرُ الْفَاصِلِينَ
ఇంకా ఇలా చెప్పు: “నా వద్ద నా ప్రభువు తరఫున ఒక ప్రమాణం ఉంది. మీరేమో దాన్ని అసత్యమని త్రోసిపుచ్చుతున్నారు. దేనికోసం మీరు తొందర పెడుతున్నారో అది నా దగ్గరలేదు. నిర్ణయాధికారం అల్లాహ్‌కు తప్ప మరెవరికీ లేదు. ఆయన సత్యాన్ని తెలియపరుస్తాడు. అందరికన్నా ఉత్తమమైన తీర్పరి ఆయనే.”
6:58  قُل لَّوْ أَنَّ عِندِي مَا تَسْتَعْجِلُونَ بِهِ لَقُضِيَ الْأَمْرُ بَيْنِي وَبَيْنَكُمْ ۗ وَاللَّهُ أَعْلَمُ بِالظَّالِمِينَ
“మీరు తొందరపెట్టే ఆ వస్తువే గనక నా దగ్గర ఉండి ఉంటే మీకూ - నాకూ మధ్య ఈపాటికి వ్యవహారం తేలిపోయి ఉండేది. దుర్మార్గుల గురించి అల్లాహ్‌కు బాగా తెలుసు” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
6:59  وَعِندَهُ مَفَاتِحُ الْغَيْبِ لَا يَعْلَمُهَا إِلَّا هُوَ ۚ وَيَعْلَمُ مَا فِي الْبَرِّ وَالْبَحْرِ ۚ وَمَا تَسْقُطُ مِن وَرَقَةٍ إِلَّا يَعْلَمُهَا وَلَا حَبَّةٍ فِي ظُلُمَاتِ الْأَرْضِ وَلَا رَطْبٍ وَلَا يَابِسٍ إِلَّا فِي كِتَابٍ مُّبِينٍ
అగోచరాల తాళం చెవులు, (ఖజానాలు) అల్లాహ్‌ వద్దనే ఉన్నాయి. అల్లాహ్‌కు తప్ప ఇతరులెవరికీ వాటి గురించి తెలీదు. భూమిలోనూ, సముద్రాలలోనూ ఉన్న వస్తువులన్నింటి గురించి ఆయనకు తెలుసు. రాలే ఆకు కూడా ఆయనకు తెలీకుండా ఉండదు. నేలలోని చీకటి పొరలలో పడే ఏ గింజ అయినా - పచ్చిది, ఎండినది ఏది పడినా - స్పష్టమైన గ్రంథంలో నమోదై ఉంది.
6:60  وَهُوَ الَّذِي يَتَوَفَّاكُم بِاللَّيْلِ وَيَعْلَمُ مَا جَرَحْتُم بِالنَّهَارِ ثُمَّ يَبْعَثُكُمْ فِيهِ لِيُقْضَىٰ أَجَلٌ مُّسَمًّى ۖ ثُمَّ إِلَيْهِ مَرْجِعُكُمْ ثُمَّ يُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ
ఆయనే రాత్రిపూట (ఒకింత) మీ ఆత్మలను స్వాధీనం చేసుకుంటాడు. పగటిపూట మీరు చేసేదంతా ఆయనకు తెలుసు. మళ్లీ ఆయన నిర్థారిత సమయాన్ని పూర్తిచేయడానికి మిమ్మల్ని అందులో మేల్కొలుపుతున్నాడు. ఆ తర్వాత మీరంతా ఆయన వైపుకే మరలిపోవలసి ఉన్నది. ఆ తరువాత మీరు చేస్తూ ఉండిన కర్మలన్నింటినీ ఆయన మీకు తెలుపుతాడు.
6:61  وَهُوَ الْقَاهِرُ فَوْقَ عِبَادِهِ ۖ وَيُرْسِلُ عَلَيْكُمْ حَفَظَةً حَتَّىٰ إِذَا جَاءَ أَحَدَكُمُ الْمَوْتُ تَوَفَّتْهُ رُسُلُنَا وَهُمْ لَا يُفَرِّطُونَ
ఆయన తన దాసులపై తిరుగులేని ఆధిపత్యం గలవాడు. ఆయన మీపై కావలివాళ్ళను పంపుతాడు. చివరకు మీలో ఎవరికయినా మరణ ఘడియ సమీపిస్తే, మేము పంపిన దూతలు అతని ఆత్మను స్వాధీనం చేసుకుంటారు. (ఈ విధి నిర్వహణలో) వారెలాంటి నిర్లక్ష్యం చేయరు.
6:62  ثُمَّ رُدُّوا إِلَى اللَّهِ مَوْلَاهُمُ الْحَقِّ ۚ أَلَا لَهُ الْحُكْمُ وَهُوَ أَسْرَعُ الْحَاسِبِينَ
ఆపైన అందరూ తమ అసలు యజమాని అయిన అల్లాహ్‌ సన్నిధికి తీసుకురాబడతారు. బాగా వినండి! నిర్ణయాధికారం అల్లాహ్‌దే. ఆయన బహువేగంగా లెక్క తీసుకుంటాడు.
6:63  قُلْ مَن يُنَجِّيكُم مِّن ظُلُمَاتِ الْبَرِّ وَالْبَحْرِ تَدْعُونَهُ تَضَرُّعًا وَخُفْيَةً لَّئِنْ أَنجَانَا مِنْ هَٰذِهِ لَنَكُونَنَّ مِنَ الشَّاكِرِينَ
(ఓ ప్రవక్తా!) వారిని అడుగు: “నేలపై, సముద్రాలపై అలుముకున్న చీకట్లలో నుండి మిమ్మల్ని రక్షించేవాడెవడు? 'ఆయన గనక మమ్మల్ని ఈ ఆపద నుంచి రక్షిస్తే మేము తప్పకుండా కృతజ్ఞులమై ఉంటామ'ని కడు దీనంగా, లోలోపలే మీరు ఎవరిని వేడుకుంటారు?”
6:64  قُلِ اللَّهُ يُنَجِّيكُم مِّنْهَا وَمِن كُلِّ كَرْبٍ ثُمَّ أَنتُمْ تُشْرِكُونَ
“ఈ విపత్తు నుండీ, అన్ని రకాల దుఃఖాల నుండీ మీకు విముక్తి నొసగేవాడు అల్లాహ్‌యే. అయినాసరే మీరు (మేలును మరిచిపోయి) షిర్కుకు ఒడిగడతారు!” అని చెప్పు.
6:65  قُلْ هُوَ الْقَادِرُ عَلَىٰ أَن يَبْعَثَ عَلَيْكُمْ عَذَابًا مِّن فَوْقِكُمْ أَوْ مِن تَحْتِ أَرْجُلِكُمْ أَوْ يَلْبِسَكُمْ شِيَعًا وَيُذِيقَ بَعْضَكُم بَأْسَ بَعْضٍ ۗ انظُرْ كَيْفَ نُصَرِّفُ الْآيَاتِ لَعَلَّهُمْ يَفْقَهُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “మీ పై నుండి గానీ, మీ పాదాల క్రింది నుంచి గానీ మీపైకి శిక్షను తెచ్చే, లేదా మిమ్మల్ని వర్గాలుగా విడగొట్టి ఒకరి తడాఖాను ఇంకొకరికి చూపించే శక్తి కూడా ఆయనే కలిగి ఉన్నాడు.” వారు వాస్తవాన్ని గ్రహించగలందులకు ఏ విధంగా మేము సూచనలను పలు రీతులుగా వివరిస్తున్నామో చూడు!
6:66  وَكَذَّبَ بِهِ قَوْمُكَ وَهُوَ الْحَقُّ ۚ قُل لَّسْتُ عَلَيْكُم بِوَكِيلٍ
వాస్తవానికి అది సత్యమైనా, నీ జాతి దాన్ని అసత్యమని తిరస్కరిస్తోంది. “మీపై నేను కాపరిగా నియమించబడలేదు” అని (ప్రవక్తా!) వారికి చెప్పు.
6:67  لِّكُلِّ نَبَإٍ مُّسْتَقَرٌّ ۚ وَسَوْفَ تَعْلَمُونَ
ప్రతి ఒక్క వార్తకు (అనగా అది జరగటానికి) ఒక సమయం నిర్థారితమై ఉంది. త్వరలోనే మీకు తెలిసిపోతుంది.
6:68  وَإِذَا رَأَيْتَ الَّذِينَ يَخُوضُونَ فِي آيَاتِنَا فَأَعْرِضْ عَنْهُمْ حَتَّىٰ يَخُوضُوا فِي حَدِيثٍ غَيْرِهِ ۚ وَإِمَّا يُنسِيَنَّكَ الشَّيْطَانُ فَلَا تَقْعُدْ بَعْدَ الذِّكْرَىٰ مَعَ الْقَوْمِ الظَّالِمِينَ
(ఓ ప్రవక్తా!) మా ఆయతులలో లోపాలు వెతికేవారిని నీవు చూసినప్పుడు, వారు (దీనిని వదలి) ఇతర విషయాలపై మాట్లాడనంత వరకూ వారి మధ్య ఉండకు. ఒకవేళ షైతాను నిన్ను మరుపుకు గురిచేస్తే, జ్ఞాపకం వచ్చిన మీదట ఆ దుర్మార్గుల మధ్యన కూర్చోకు.
6:69  وَمَا عَلَى الَّذِينَ يَتَّقُونَ مِنْ حِسَابِهِم مِّن شَيْءٍ وَلَٰكِن ذِكْرَىٰ لَعَلَّهُمْ يَتَّقُونَ
వారి లెక్కల బాధ్యత ఏదీ దైవభీతిపరులపై లేదు. అయితే వారికి హితబోధ చేయటం మాత్రం మానుకోరాదు. ఎందుకంటే బహుశా వారు కూడా దైవభీతిపరులు కావచ్చు.
6:70  وَذَرِ الَّذِينَ اتَّخَذُوا دِينَهُمْ لَعِبًا وَلَهْوًا وَغَرَّتْهُمُ الْحَيَاةُ الدُّنْيَا ۚ وَذَكِّرْ بِهِ أَن تُبْسَلَ نَفْسٌ بِمَا كَسَبَتْ لَيْسَ لَهَا مِن دُونِ اللَّهِ وَلِيٌّ وَلَا شَفِيعٌ وَإِن تَعْدِلْ كُلَّ عَدْلٍ لَّا يُؤْخَذْ مِنْهَا ۗ أُولَٰئِكَ الَّذِينَ أُبْسِلُوا بِمَا كَسَبُوا ۖ لَهُمْ شَرَابٌ مِّنْ حَمِيمٍ وَعَذَابٌ أَلِيمٌ بِمَا كَانُوا يَكْفُرُونَ
(ప్రవక్తా!) ఎవరు తమ ధర్మాన్ని ఆటగా, వినోదంగా చేసుకున్నారో, ఎవరినయితే ప్రాపంచిక జీవితం మోసపుచ్చిందో వారికి దూరంగా ఉండు. అయితే ఈ ఖుర్‌ఆను ద్వారా వారికి ఉపదేశం మాత్రం చేస్తూ ఉండు. ఏ వ్యక్తీ తన చేష్టల మూలంగా ఇరుక్కుపోయే పరిస్థితి రాకుండా ఉండటానికి, అల్లాహ్‌ తప్ప వేరెవరూ సహాయం చేయని, సిఫారసు చేసేవాడెవడూ ఉండని దురవస్థ దాపురించకుండా ఉండటానికి, ప్రపంచ మంతటినీ పరిహారంగా ఇచ్చి బయటపడాలని తహతహలాడినా అది అతన్నుంచి స్వీకరించబడని (గడ్డు) స్థితి ఏర్పడకుండా ఉండటానికి గాను (నీవు వారికి బోధపరుస్తూ ఉండాలి సుమా!). తమ చేష్టల మూలంగా (అటువంటి పరిస్థితిలో) చిక్కుకునేవారు వీరే. తమ తిరస్కార వైఖరి కారణంగా వారికి సలసలా కాగే నీరు త్రాగేందుకు ఇవ్వబడుతుంది. ఇంకా వారికి బాధాకరమైన శిక్ష ఉంటుంది.
6:71  قُلْ أَنَدْعُو مِن دُونِ اللَّهِ مَا لَا يَنفَعُنَا وَلَا يَضُرُّنَا وَنُرَدُّ عَلَىٰ أَعْقَابِنَا بَعْدَ إِذْ هَدَانَا اللَّهُ كَالَّذِي اسْتَهْوَتْهُ الشَّيَاطِينُ فِي الْأَرْضِ حَيْرَانَ لَهُ أَصْحَابٌ يَدْعُونَهُ إِلَى الْهُدَى ائْتِنَا ۗ قُلْ إِنَّ هُدَى اللَّهِ هُوَ الْهُدَىٰ ۖ وَأُمِرْنَا لِنُسْلِمَ لِرَبِّ الْعَالَمِينَ
(ఓ ప్రవక్తా!) వారిని అడుగు : ఏమిటీ, మేము అల్లాహ్‌ను వదలి మాకు లాభంగానీ, నష్టంగానీ చేకూర్చలేని వారిని మొరపెట్టుకోవాలా? అల్లాహ్‌ మాకు సన్మార్గం చూపిన తరువాత షైతానులు ఒక వ్యక్తిని అడవిలో మార్గవిహీనుణ్ణి చేయగా, అతని సహవాసులు కొందరు ఉండి, “మా వద్దకు రా!” అని అతన్ని సన్మార్గం వైపుకు పిలుస్తున్నప్పటికీ, దిక్కులు చూస్తూ ఉండిపోయేవాని మాదిరిగా - మేము సన్మార్గం నుండి వెనుతిరిగి పోవాలా? వారితో ఇలా అను: “యదార్థానికి అల్లాహ్‌ చూపిన మార్గమే సన్మార్గం. మేము సర్వలోక ప్రభువుకు పూర్తిగా విధేయులు కావాలని మాకు ఆజ్ఞాపించబడింది.”
6:72  وَأَنْ أَقِيمُوا الصَّلَاةَ وَاتَّقُوهُ ۚ وَهُوَ الَّذِي إِلَيْهِ تُحْشَرُونَ
(ఇంకా ఇలా ఆదేశించబడింది:) “నమాజును నెలకొల్పండి, ఆయనకు భయపడండి, ఆఖరికి మీరంతా ఆయన వద్దకే సమీకరించబడతారు.”
6:73  وَهُوَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۖ وَيَوْمَ يَقُولُ كُن فَيَكُونُ ۚ قَوْلُهُ الْحَقُّ ۚ وَلَهُ الْمُلْكُ يَوْمَ يُنفَخُ فِي الصُّورِ ۚ عَالِمُ الْغَيْبِ وَالشَّهَادَةِ ۚ وَهُوَ الْحَكِيمُ الْخَبِيرُ
ఆయనే ఆకాశాలనూ, భూమినీ సత్యబద్ధంగా సృష్టించాడు. ఏ రోజున ఆయన “అయిపో” అని ఆజ్ఞాపిస్తాడో అప్పుడు అది అయిపోతుంది. ఆయన మాట సత్యమైనది, ప్రభావపూరితమైనది. శంఖం ఊదబడే రోజున, అధికారమంతా ఆయనదే అవుతుంది. ఆయన నిగూఢమైన విషయాలను, బహిర్గతమై వున్న విషయాలనూ ఎరిగినవాడు. ఆయనే వివేక సంపన్నుడు, సర్వమూ తెలిసినవాడు.
6:74  وَإِذْ قَالَ إِبْرَاهِيمُ لِأَبِيهِ آزَرَ أَتَتَّخِذُ أَصْنَامًا آلِهَةً ۖ إِنِّي أَرَاكَ وَقَوْمَكَ فِي ضَلَالٍ مُّبِينٍ
ఇబ్రాహీము తన తండ్రి ఆజరుతో, “ఏమిటీ, నీవు విగ్రహాలను ఆరాధ్య దైవాలుగా చేసుకుంటున్నావా? నువ్వూ, నీ జాతి వారూ నిస్సందేహంగా స్పష్టమైన అపమార్గానికి గురై ఉన్నారని నాకనిపిస్తోంది” అని పలికిన సందర్భం కూడా స్మరించుకోదగినదే.
6:75  وَكَذَٰلِكَ نُرِي إِبْرَاهِيمَ مَلَكُوتَ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَلِيَكُونَ مِنَ الْمُوقِنِينَ
ఈ విధంగానే మేము ఇబ్రాహీముకు భూమ్యాకాశాలలోని సృష్టితాలను చూపించాము. అతనికి దృఢ నమ్మకం కలగాలన్న ఉద్దేశంతోనే అలా చేశాము.
6:76  فَلَمَّا جَنَّ عَلَيْهِ اللَّيْلُ رَأَىٰ كَوْكَبًا ۖ قَالَ هَٰذَا رَبِّي ۖ فَلَمَّا أَفَلَ قَالَ لَا أُحِبُّ الْآفِلِينَ
అతనిపై రాత్రి చీకటి అలుముకున్నప్పుడు, అతను ఒక నక్షత్రాన్ని చూసి, “ఇతనే నా ప్రభువు” అన్నాడు. కాని అది అస్తమించగానే, “అస్తమించే వాటిని నేను అభిమానించను” అని చెప్పాడు.
6:77  فَلَمَّا رَأَى الْقَمَرَ بَازِغًا قَالَ هَٰذَا رَبِّي ۖ فَلَمَّا أَفَلَ قَالَ لَئِن لَّمْ يَهْدِنِي رَبِّي لَأَكُونَنَّ مِنَ الْقَوْمِ الضَّالِّينَ
మరి అతను ప్రకాశిస్తున్న చంద్రుణ్ణి చూసి, “ఇతను నా ప్రభువు” అన్నాడు. కాని అది కూడా అస్తమించటంతో “ఒకవేళ నా ప్రభువు గనక నాకు మార్గదర్శకత్వం వహించకపోతే నేను మార్గవిహీన జనుల్లో చేరిపోతాను” అని పలికాడు.
6:78  فَلَمَّا رَأَى الشَّمْسَ بَازِغَةً قَالَ هَٰذَا رَبِّي هَٰذَا أَكْبَرُ ۖ فَلَمَّا أَفَلَتْ قَالَ يَا قَوْمِ إِنِّي بَرِيءٌ مِّمَّا تُشْرِكُونَ
ఆ తరువాత సూర్యుణ్ణి ప్రకాశిస్తుండగా చూసి, “ఇతనే నా ప్రభువు. ఇతను అందరికన్నా పెద్దవాడు” అని పలికాడు. కాని అది కూడా అస్తమించేసరికి అతనిలా అన్నాడు: “ఓ నా జాతి వారలారా! మీరు (దైవానికి) కల్పించే భాగస్వామ్యాలతో నాకు ఎలాంటి సంబంధం లేదు.
6:79  إِنِّي وَجَّهْتُ وَجْهِيَ لِلَّذِي فَطَرَ السَّمَاوَاتِ وَالْأَرْضَ حَنِيفًا ۖ وَمَا أَنَا مِنَ الْمُشْرِكِينَ
నేను ఆకాశాలను, భూమిని సృష్టించినవాని వైపుకు ఏకాగ్రతతో నా ముఖాన్ని త్రిప్పుకుంటున్నాను. నేను షిర్క్‌ చేసేవారిలోని వాణ్ణి కాను.”
6:80  وَحَاجَّهُ قَوْمُهُ ۚ قَالَ أَتُحَاجُّونِّي فِي اللَّهِ وَقَدْ هَدَانِ ۚ وَلَا أَخَافُ مَا تُشْرِكُونَ بِهِ إِلَّا أَن يَشَاءَ رَبِّي شَيْئًا ۗ وَسِعَ رَبِّي كُلَّ شَيْءٍ عِلْمًا ۗ أَفَلَا تَتَذَكَّرُونَ
అతని జాతి వారు అతనితో పిడివాదానికి దిగినప్పుడు, అతనిలా అన్నాడు: “ఏమిటీ, మీరు అల్లాహ్‌ విషయంలో నాతో వాదులాడుతున్నారా? వాస్తవానికి ఆయన నాకు సన్మార్గం చూపించాడు. మీరు కల్పించే సహవర్తులకు నేను ఏమాత్రం భయపడను. అయితే నా ప్రభువు గనక తలిస్తే ఏమైనా జరగవచ్చు. నా ప్రభువు జ్ఞానం అన్నింటినీ ఆవరించి ఉంది. అయినా మీరు గ్రహించరా?”
6:81  وَكَيْفَ أَخَافُ مَا أَشْرَكْتُمْ وَلَا تَخَافُونَ أَنَّكُمْ أَشْرَكْتُم بِاللَّهِ مَا لَمْ يُنَزِّلْ بِهِ عَلَيْكُمْ سُلْطَانًا ۚ فَأَيُّ الْفَرِيقَيْنِ أَحَقُّ بِالْأَمْنِ ۖ إِن كُنتُمْ تَعْلَمُونَ
“అల్లాహ్‌ మీ వద్దకు ఏ నిదర్శనాన్నీ అవతరింపజేయనప్పటికీ మీరు అల్లాహ్‌కు భాగస్వాములను కల్పించే విషయానికి భయపడటం లేదు. మరి అటువంటప్పుడు అల్లాహ్‌కు సహవర్తులుగా మీరు నిలబెట్టే వాటికి నేనెలా భయపడతాను? కాబట్టి ఈ రెండు పక్షాలలో సురక్షిత స్థితికి అర్హులెవరో మీకు తెలిస్తే కాస్త చెప్పండి.”
6:82  الَّذِينَ آمَنُوا وَلَمْ يَلْبِسُوا إِيمَانَهُم بِظُلْمٍ أُولَٰئِكَ لَهُمُ الْأَمْنُ وَهُم مُّهْتَدُونَ
విశ్వసించి, తమ విశ్వాసాన్ని దుర్మార్గం (షిర్కు)తో కలగా పులగం చేయకుండా ఉండేవారే సురక్షితంగా ఉన్నవారు. సన్మార్గంపై ఉన్నవారు కూడా వారే.
6:83  وَتِلْكَ حُجَّتُنَا آتَيْنَاهَا إِبْرَاهِيمَ عَلَىٰ قَوْمِهِ ۚ نَرْفَعُ دَرَجَاتٍ مَّن نَّشَاءُ ۗ إِنَّ رَبَّكَ حَكِيمٌ عَلِيمٌ
ఇబ్రాహీము (అలైహిస్సలాం) తన జాతి వారిని ఎదుర్కొనటానికిగాను మేము అతనికి ఇచ్చిన మా 'నిదర్శనం' ఇది! మేము తలచుకున్నవారి అంతస్తుల్ని పెంచుతాము. నిశ్చయంగా నీ ప్రభువు వివేకవంతుడు, గొప్ప పరిజ్ఞానం కలవాడు.
6:84  وَوَهَبْنَا لَهُ إِسْحَاقَ وَيَعْقُوبَ ۚ كُلًّا هَدَيْنَا ۚ وَنُوحًا هَدَيْنَا مِن قَبْلُ ۖ وَمِن ذُرِّيَّتِهِ دَاوُودَ وَسُلَيْمَانَ وَأَيُّوبَ وَيُوسُفَ وَمُوسَىٰ وَهَارُونَ ۚ وَكَذَٰلِكَ نَجْزِي الْمُحْسِنِينَ
ఇంకా మేము అతనికి ఇస్‌హాఖును, యాఖూబ్‌ను ప్రసాదించాము. వారిలో ప్రతి ఒక్కరికీ మేము సన్మార్గం చూపించాము. అంతకు మునుపు మేము నూహ్‌కు సన్మార్గం చూపించి ఉన్నాము. ఇంకా అతని సంతతి వారిలోనుంచి దావూదు సులైమానులకు, అయ్యూబు యూసుఫులకు, మూసా హారూనులకు మేము సన్మార్గం చూపాము. సత్కార్యాలు చేసేవారికి మేము ఇలాగే ప్రతిఫలం ఇస్తూ ఉంటాము.
6:85  وَزَكَرِيَّا وَيَحْيَىٰ وَعِيسَىٰ وَإِلْيَاسَ ۖ كُلٌّ مِّنَ الصَّالِحِينَ
ఇంకా జకరియ్యా, యహ్యా, ఈసా, ఇల్యాస్‌లకు కూడా (మేము సన్మార్గం చూపించాము.) వారంతా సద్వర్తనుల కోవకు చెందినవారే.
6:86  وَإِسْمَاعِيلَ وَالْيَسَعَ وَيُونُسَ وَلُوطًا ۚ وَكُلًّا فَضَّلْنَا عَلَى الْعَالَمِينَ
ఇంకా - ఇస్మాయీలుకు, యసఆకు, యూనుసు లూతులకు కూడా (మేము మార్గదర్శకత్వం వహించాము). వారిలో ప్రతి ఒక్కరికీ మేము లోకవాసులందరిపై శ్రేష్ఠతను అనుగ్రహించాము.
6:87  وَمِنْ آبَائِهِمْ وَذُرِّيَّاتِهِمْ وَإِخْوَانِهِمْ ۖ وَاجْتَبَيْنَاهُمْ وَهَدَيْنَاهُمْ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
అంతేకాదు, వారి పితామహులలో (తాత ముత్తాతలలో), వారి సంతానంలో, వారి సహోదరులలో కూడా కొందరిని (మేము కటాక్షించాము.) వారిని (మా సేవకోసం) ఎన్నుకున్నాము. వారిని రుజుమార్గం వైపుకు నడిపించాము.
6:88  ذَٰلِكَ هُدَى اللَّهِ يَهْدِي بِهِ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۚ وَلَوْ أَشْرَكُوا لَحَبِطَ عَنْهُم مَّا كَانُوا يَعْمَلُونَ
ఇదీ అల్లాహ్‌ మార్గదర్శకత్వం. ఆయన తన దాసులలో తాను కోరిన వారిని ఈ మార్గంపై నడిపింపజేస్తాడు. ఒకవేళ వీరు సైతం, దైవత్వంలో భాగస్వామ్యానికి (షిర్కుకు) ఒడిగట్టి ఉంటే, వారు చేసుకున్న కర్మలన్నీ కూడా వృధా అయిపోయేవి.
6:89  أُولَٰئِكَ الَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ وَالْحُكْمَ وَالنُّبُوَّةَ ۚ فَإِن يَكْفُرْ بِهَا هَٰؤُلَاءِ فَقَدْ وَكَّلْنَا بِهَا قَوْمًا لَّيْسُوا بِهَا بِكَافِرِينَ
మేము గ్రంథాన్నీ, వివేకాన్నీ, ప్రవక్త పదవినీ ప్రసాదించినది వీరికే. ఒకవేళ వారు గనక దానిని తిరస్కరించే పక్షంలో, దానిని తిరస్కరించకుండా ఉండే చాలా మందిని మేము దానికోసం నియమించి ఉన్నాము.
6:90  أُولَٰئِكَ الَّذِينَ هَدَى اللَّهُ ۖ فَبِهُدَاهُمُ اقْتَدِهْ ۗ قُل لَّا أَسْأَلُكُمْ عَلَيْهِ أَجْرًا ۖ إِنْ هُوَ إِلَّا ذِكْرَىٰ لِلْعَالَمِينَ
అల్లాహ్‌ సన్మార్గం చూపించినటువంటివారు వీరే. కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు కూడా వారి మార్గాన్నే అనుసరించు. “దీనికిగాను నేను మీనుండి ఎలాంటి ప్రతిఫలాన్నీ అడగటం లేదు. ఇది సమస్త లోకవాసుల కోసం హితోపదేశం” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
6:91  وَمَا قَدَرُوا اللَّهَ حَقَّ قَدْرِهِ إِذْ قَالُوا مَا أَنزَلَ اللَّهُ عَلَىٰ بَشَرٍ مِّن شَيْءٍ ۗ قُلْ مَنْ أَنزَلَ الْكِتَابَ الَّذِي جَاءَ بِهِ مُوسَىٰ نُورًا وَهُدًى لِّلنَّاسِ ۖ تَجْعَلُونَهُ قَرَاطِيسَ تُبْدُونَهَا وَتُخْفُونَ كَثِيرًا ۖ وَعُلِّمْتُم مَّا لَمْ تَعْلَمُوا أَنتُمْ وَلَا آبَاؤُكُمْ ۖ قُلِ اللَّهُ ۖ ثُمَّ ذَرْهُمْ فِي خَوْضِهِمْ يَلْعَبُونَ
“అల్లాహ్‌ ఏ మానవమాత్రునిపైనా ఎలాంటి విషయాన్నీ అవతరింపజేయలేదు” అని పలికినప్పుడు ఈ (అవిశ్వాస) జనులు అల్లాహ్‌ను అర్థం చేసుకోవలసిన విధంగా అర్థం చేసుకోలేదు. వారిని అడుగు: “మరి మూసా తెచ్చిన ఆ గ్రంథాన్ని ఎవరు అవతరింపజేసినట్టు? ఆ గ్రంథం ఒక జ్యోతి. మానవుల కొరకు మార్గదర్శకత్వం. మీరు దాన్ని వేర్వేరు కాగితాలుగా విభజించి చూపుతున్నారు. ఎన్నో విషయాలను దాచేస్తున్నారు. మీకుగానీ, మీ పెద్దలకుగానీ తెలియని ఎన్నో విషయాలు (ఇందు మూలంగా) మీకు నేర్పబడ్డాయి.” దాన్ని అవతరింపజేసిన వాడు అల్లాహ్‌యే అని చెప్పు. ఆ తర్వాత వాళ్లను వారి వ్యర్థ విషయాలలోనే ఆడుకోనివ్వు.
6:92  وَهَٰذَا كِتَابٌ أَنزَلْنَاهُ مُبَارَكٌ مُّصَدِّقُ الَّذِي بَيْنَ يَدَيْهِ وَلِتُنذِرَ أُمَّ الْقُرَىٰ وَمَنْ حَوْلَهَا ۚ وَالَّذِينَ يُؤْمِنُونَ بِالْآخِرَةِ يُؤْمِنُونَ بِهِ ۖ وَهُمْ عَلَىٰ صَلَاتِهِمْ يُحَافِظُونَ
ఇది కూడా మేము అవతరింపజేసిన గ్రంథమే. ఎంతో శుభప్రదమైనది, తనకంటే ముందున్న గ్రంథాలను ధృవీకరించేది. నీవు మక్కా (ఉమ్ముల్‌ ఖురా) వారినీ, దాని పరిసరాల వారిని హెచ్చరించటానికిగాను (దీనిని అవతరింపజేశాము). పరలోకంపై దృఢ విశ్వాసం ఉన్నవారు దీనిని విశ్వసిస్తారు; వారు తమ నమాజులను జాగ్రత్తగా కాపాడుకునేవారై ఉంటారు.
6:93  وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا أَوْ قَالَ أُوحِيَ إِلَيَّ وَلَمْ يُوحَ إِلَيْهِ شَيْءٌ وَمَن قَالَ سَأُنزِلُ مِثْلَ مَا أَنزَلَ اللَّهُ ۗ وَلَوْ تَرَىٰ إِذِ الظَّالِمُونَ فِي غَمَرَاتِ الْمَوْتِ وَالْمَلَائِكَةُ بَاسِطُو أَيْدِيهِمْ أَخْرِجُوا أَنفُسَكُمُ ۖ الْيَوْمَ تُجْزَوْنَ عَذَابَ الْهُونِ بِمَا كُنتُمْ تَقُولُونَ عَلَى اللَّهِ غَيْرَ الْحَقِّ وَكُنتُمْ عَنْ آيَاتِهِ تَسْتَكْبِرُونَ
అల్లాహ్‌పై అబద్ధాన్ని కల్పించేవాడికంటే, లేదా తనపై ఎలాంటి వహీ అవతరించకపోయినప్పటికీ 'నాపై వహీ అవతరించింది' అని చెప్పే వానికంటే లేదా అల్లాహ్‌ అవతరింపజేసినటువంటిదే 'నేను కూడా అవతరింపజేస్తాను' అని అనేవాడి కంటే పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఈ దుర్మార్గులు మరణ యాతనలో ఉన్నప్పుడు, దైవదూతలు తమ చేతులు చాచి, “సరే! ఇక మీ ప్రాణాలు (బయటికి) తీయండి. మీరు అల్లాహ్‌కు అబద్ధాలను ఆపాదించినందుకూ, అల్లాహ్‌ ఆయతుల పట్ల గర్వాతిశయంతో విర్రవీగినందుకుగాను ఈ రోజు మీకు పరాభవంతో కూడిన శిక్ష విధించబడుతుంది” అని చెబుతుండగా (ఆ దృశ్యాన్ని) నీవు చూడగలిగితే ఎంత బావుండు!
6:94  وَلَقَدْ جِئْتُمُونَا فُرَادَىٰ كَمَا خَلَقْنَاكُمْ أَوَّلَ مَرَّةٍ وَتَرَكْتُم مَّا خَوَّلْنَاكُمْ وَرَاءَ ظُهُورِكُمْ ۖ وَمَا نَرَىٰ مَعَكُمْ شُفَعَاءَكُمُ الَّذِينَ زَعَمْتُمْ أَنَّهُمْ فِيكُمْ شُرَكَاءُ ۚ لَقَد تَّقَطَّعَ بَيْنَكُمْ وَضَلَّ عَنكُم مَّا كُنتُمْ تَزْعُمُونَ
మేము మిమ్మల్ని మొదటిసారి పుట్టించినట్లుగానే, మీరు మా సన్నిధికి ఒంటరిగా వచ్చారు. మేము మీకు ప్రసాదించిన దాన్నంతా మీ వెనుకే వదిలేసి వచ్చారు. మీ వ్యవహారాలలో మాకు భాగస్వాములని మీరు భావించిన మీ సిఫారసుదారులను కూడా ఇప్పుడు మేము మీవెంట చూడటం లేదు! నిజంగానే వారికీ - మీకూ మధ్య గల సంబంధాలన్నీ తెగిపోయాయి. మీరు నమ్ముతూ ఉన్నదంతా మీకు కనిపించకుండా పోయింది.
6:95  إِنَّ اللَّهَ فَالِقُ الْحَبِّ وَالنَّوَىٰ ۖ يُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَمُخْرِجُ الْمَيِّتِ مِنَ الْحَيِّ ۚ ذَٰلِكُمُ اللَّهُ ۖ فَأَنَّىٰ تُؤْفَكُونَ
నిస్సందేహంగా విత్తనాన్ని, టెంకను చీల్చేవాడు అల్లాహ్‌యే. ఆయన జీవమున్న దానిని జీవములేని దానిలో నుంచి తీస్తాడు. జీవములేని దానిని జీవమున్న దానిలో నుంచి తీసేవాడూ ఆయనే. ఆయనే అల్లాహ్‌. మరలాంటప్పుడు మీరు (సత్యం నుండి) ఎటు మరలిపోతున్నారు?
6:96  فَالِقُ الْإِصْبَاحِ وَجَعَلَ اللَّيْلَ سَكَنًا وَالشَّمْسَ وَالْقَمَرَ حُسْبَانًا ۚ ذَٰلِكَ تَقْدِيرُ الْعَزِيزِ الْعَلِيمِ
ఉదయాన్ని వెలికి తీసేవాడు ఆయనే. ఇంకా ఆయన రాత్రిని విశ్రాంతి సమయంగా చేశాడు. సూర్యచంద్రుల లెక్కను నిర్థారించాడు. ఇదంతా సర్వాధిక్యుడు, మహాజ్ఞాని (అయిన అల్లాహ్‌) చేసిన నిర్థారణ.
6:97  وَهُوَ الَّذِي جَعَلَ لَكُمُ النُّجُومَ لِتَهْتَدُوا بِهَا فِي ظُلُمَاتِ الْبَرِّ وَالْبَحْرِ ۗ قَدْ فَصَّلْنَا الْآيَاتِ لِقَوْمٍ يَعْلَمُونَ
చీకట్లలోనూ, భూమిలోనూ, సముద్రంలోనూ మీరు మార్గం తెలుసుకునేందుకుగాను ఆయనే మీ కోసం నక్షత్రాలను సృష్టించాడు. మేము జ్ఞానం కలవారి కోసం మా సూచనలను బాగా విడమరచి చెప్పాము.
6:98  وَهُوَ الَّذِي أَنشَأَكُم مِّن نَّفْسٍ وَاحِدَةٍ فَمُسْتَقَرٌّ وَمُسْتَوْدَعٌ ۗ قَدْ فَصَّلْنَا الْآيَاتِ لِقَوْمٍ يَفْقَهُونَ
ఇంకా, మిమ్మల్ని ఒకే ప్రాణి నుండి పుట్టించినవాడు ఆయనే. మరి ఒక స్థలం ఎక్కువ కాలం ఉండేదీ, ఇంకొక స్థలం తక్కువ కాలం ఉండేదిగా నిర్థారించబడింది. అర్థం చేసుకోగలిగే వారి కోసం మేము మా సూచనలను స్పష్టంగా వివరించాము.
6:99  وَهُوَ الَّذِي أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجْنَا بِهِ نَبَاتَ كُلِّ شَيْءٍ فَأَخْرَجْنَا مِنْهُ خَضِرًا نُّخْرِجُ مِنْهُ حَبًّا مُّتَرَاكِبًا وَمِنَ النَّخْلِ مِن طَلْعِهَا قِنْوَانٌ دَانِيَةٌ وَجَنَّاتٍ مِّنْ أَعْنَابٍ وَالزَّيْتُونَ وَالرُّمَّانَ مُشْتَبِهًا وَغَيْرَ مُتَشَابِهٍ ۗ انظُرُوا إِلَىٰ ثَمَرِهِ إِذَا أَثْمَرَ وَيَنْعِهِ ۚ إِنَّ فِي ذَٰلِكُمْ لَآيَاتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ
ఇంకా - ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించినవాడు ఆయనే. ఆ తరువాత దాని ద్వారా మేము అన్నిరకాల మొక్కల్ని వెలికి తీశాము. ఆపైన మేము పచ్చని కొమ్మను సృజించాము. దాని ద్వారా మేము ఒకదానిపై ఒకటి పేరుకుని ఉన్న గింజలు గల పంటల్ని పండిస్తాము. ఖర్జూర చెట్ల నుంచి, అంటే వాటి పాళి నుండి క్రిందికి వ్రేలాడే పండ్ల గెలలను, ద్రాక్ష తోటలను, జైతూనును (ఆలివ్‌ పండ్లను), దానిమ్మ కాయలను ఉత్పన్నం చేశాము. వాటిలో కొన్ని ఒక దానిని ఇంకొకటి పోలి ఉంటాయి. మరికొన్ని పోలి ఉండవు. ప్రతి చెట్టుకు కాసినకాయ పెరిగి పెద్దదవుతున్నప్పుడు, అది పండుతున్నప్పుడు కాస్త నిశిత దృష్టితో చూడండి! నమ్మేవారి కోసం వీటిలో నిదర్శనాలున్నాయి.
6:100  وَجَعَلُوا لِلَّهِ شُرَكَاءَ الْجِنَّ وَخَلَقَهُمْ ۖ وَخَرَقُوا لَهُ بَنِينَ وَبَنَاتٍ بِغَيْرِ عِلْمٍ ۚ سُبْحَانَهُ وَتَعَالَىٰ عَمَّا يَصِفُونَ
ప్రజలు జిన్నాతులను అల్లాహ్‌కు భాగస్వాములుగా ఖరారు చేసుకున్నారు. మరి చూడబోతే వాళ్లను సృష్టించింది కూడా ఆయనే. అంతేకాదు, వీళ్లు ఎటువంటి జ్ఞానం లేకుండానే ఆయనకు కుమారులను, కుమార్తెలను కూడా కల్పించారు. వాస్తవానికి వీళ్లు చెప్పే ఈ మాటలకు ఆయన పవిత్రుడు, ఉన్నతుడు.
6:101  بَدِيعُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ أَنَّىٰ يَكُونُ لَهُ وَلَدٌ وَلَمْ تَكُن لَّهُ صَاحِبَةٌ ۖ وَخَلَقَ كُلَّ شَيْءٍ ۖ وَهُوَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
ఆకాశాలను, భూమినీ ఆవిష్కరించినవాడు ఆయనే. అల్లాహ్‌కు భార్యయే లేనపుడు ఆయనకు సంతానం ఎలా కలుగుతుంది? ఆయన ప్రతి వస్తువునూ సృష్టించాడు. ఆయనకు ప్రతిదీ బాగా తెలుసు.
6:102  ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ خَالِقُ كُلِّ شَيْءٍ فَاعْبُدُوهُ ۚ وَهُوَ عَلَىٰ كُلِّ شَيْءٍ وَكِيلٌ
ఆయనే అల్లాహ్‌. మీ ప్రభువు. ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధ్యులు కారు. సమస్త వస్తువులను సృష్టించినవాడు ఆయనే. కాబట్టి మీరు ఆయన్నే ఆరాధించండి. అన్ని విషయాల కార్యసాధకుడు ఆయనే.
6:103  لَّا تُدْرِكُهُ الْأَبْصَارُ وَهُوَ يُدْرِكُ الْأَبْصَارَ ۖ وَهُوَ اللَّطِيفُ الْخَبِيرُ
ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు. ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. ఆయన సూక్ష్మదృష్టి కలవాడు. సర్వమూ తెలిసినవాడు.
6:104  قَدْ جَاءَكُم بَصَائِرُ مِن رَّبِّكُمْ ۖ فَمَنْ أَبْصَرَ فَلِنَفْسِهِ ۖ وَمَنْ عَمِيَ فَعَلَيْهَا ۚ وَمَا أَنَا عَلَيْكُم بِحَفِيظٍ
“నిస్సందేహంగా మీ వద్దకు మీ ప్రభువు తరఫునుంచి సత్యాన్ని దర్శించే సూచనలు వచ్చేశాయి. కనుక దాన్ని చూసిన వాడు తనకు లాభం చేకూర్చుకుంటాడు. గ్రుడ్డిగా వ్యవహరిస్తే తనకే నష్టం. నేను మాత్రం మీపై రక్షకుణ్ణి కాను” (అని ఓ ప్రవక్తా! చెప్పు).
6:105  وَكَذَٰلِكَ نُصَرِّفُ الْآيَاتِ وَلِيَقُولُوا دَرَسْتَ وَلِنُبَيِّنَهُ لِقَوْمٍ يَعْلَمُونَ
ఈ విధంగా మేము సూచనలను విభిన్న కోణాల నుంచి విశదీకరిస్తూ ఉంటాము- “నీవు ఎవరి వద్దనో పాఠాలు నేర్చుకున్నావు” అని వారు చెప్పేటందుకు, దాన్ని విజ్ఞులకు బాగా స్పష్టపరచేటందుకుగాను (మేమిలా చేస్తాము).
6:106  اتَّبِعْ مَا أُوحِيَ إِلَيْكَ مِن رَّبِّكَ ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ وَأَعْرِضْ عَنِ الْمُشْرِكِينَ
ఓ ప్రవక్తా! నీవు మాత్రం నీ ప్రభువు తరఫు నుంచి నీ వద్దకు వహీ ద్వారా పంపబడుతున్న విధానాన్ని అనుసరిస్తూ ఉండు. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ముష్రిక్కులను పట్టించుకోకు.
6:107  وَلَوْ شَاءَ اللَّهُ مَا أَشْرَكُوا ۗ وَمَا جَعَلْنَاكَ عَلَيْهِمْ حَفِيظًا ۖ وَمَا أَنتَ عَلَيْهِم بِوَكِيلٍ
అల్లాహ్‌ గనక తలచుకుని ఉంటే వారు షిర్క్‌కు ఒడిగట్టే వారే కారు. మేము నిన్ను వాళ్ళపై కావలివానిగా నియమించలేదు. నువ్వు వారి వ్యవహారాలకు బాధ్యుడవూ కావు.
6:108  وَلَا تَسُبُّوا الَّذِينَ يَدْعُونَ مِن دُونِ اللَّهِ فَيَسُبُّوا اللَّهَ عَدْوًا بِغَيْرِ عِلْمٍ ۗ كَذَٰلِكَ زَيَّنَّا لِكُلِّ أُمَّةٍ عَمَلَهُمْ ثُمَّ إِلَىٰ رَبِّهِم مَّرْجِعُهُمْ فَيُنَبِّئُهُم بِمَا كَانُوا يَعْمَلُونَ
వారు అల్లాహ్‌ను వదలి వేడుకునే వారిని మీరు దూషించకండి. ఎందుకంటే దీనికి బదులుగా వారు కూడా తమ అజ్ఞానం చేత మితిమీరిపోయి అల్లాహ్‌ను దూషిస్తారు. ఈ విధంగానే మేము అన్ని సమాజాలవారికీ వారి పనులు అందమైనవిగా చేశాము. తర్వాత వారంతా తమ ప్రభువు వద్దకే మరలి వెళతారు. అప్పుడు ఆయన, వారు చేస్తూ ఉన్నదేమిటో వారికి ఎరుక పరుస్తాడు.
6:109  وَأَقْسَمُوا بِاللَّهِ جَهْدَ أَيْمَانِهِمْ لَئِن جَاءَتْهُمْ آيَةٌ لَّيُؤْمِنُنَّ بِهَا ۚ قُلْ إِنَّمَا الْآيَاتُ عِندَ اللَّهِ ۖ وَمَا يُشْعِرُكُمْ أَنَّهَا إِذَا جَاءَتْ لَا يُؤْمِنُونَ
వీళ్లు అల్లాహ్‌పై అతి గట్టిగా ప్రమాణం చేస్తూ, తమ వద్దకు ఏదైనా సూచన గనక వస్తే తప్పకుండా విశ్వసిస్తామని అన్నారు. (ఓ ప్రవక్తా!) “సూచనలన్నీ అల్లాహ్‌ అధీనంలో ఉన్నాయి” అని వారికి చెప్పు. నీకేం తెలుసు? ఒకవేళ ఆ సూచనలు వచ్చినప్పటికీ వీళ్లు మాత్రం విశ్వసించేవారు కారు.
6:110  وَنُقَلِّبُ أَفْئِدَتَهُمْ وَأَبْصَارَهُمْ كَمَا لَمْ يُؤْمِنُوا بِهِ أَوَّلَ مَرَّةٍ وَنَذَرُهُمْ فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ
తొలిసారి ఏ విధంగానయితే వీళ్లు దీనిని విశ్వసించలేదో అదే విధంగా మేము కూడా వీళ్ల హృదయాలను, వీళ్ల చూపులను తిప్పివేస్తాము. వారిని వారి తలబిరుసుతనంలోనే, దారితప్పి తిరిగేలా వదలిపెడతాము.
6:111  وَلَوْ أَنَّنَا نَزَّلْنَا إِلَيْهِمُ الْمَلَائِكَةَ وَكَلَّمَهُمُ الْمَوْتَىٰ وَحَشَرْنَا عَلَيْهِمْ كُلَّ شَيْءٍ قُبُلًا مَّا كَانُوا لِيُؤْمِنُوا إِلَّا أَن يَشَاءَ اللَّهُ وَلَٰكِنَّ أَكْثَرَهُمْ يَجْهَلُونَ
మేము వాళ్ళ దగ్గరికి దూతలను పంపించినా, మృతులు వారితో మాట్లాడినా, సమస్త వస్తువులను మేము వారి కళ్ళ ఎదుటే తెచ్చిపెట్టినా వాళ్ళు విశ్వసించటమనేది కల్ల. ఒకవేళ అల్లాహ్‌ తలిస్తే అది వేరే విషయం. అయితే వీళ్ళలో చాలామంది అజ్ఞానపు మాటలు మాట్లాడేవారే.
6:112  وَكَذَٰلِكَ جَعَلْنَا لِكُلِّ نَبِيٍّ عَدُوًّا شَيَاطِينَ الْإِنسِ وَالْجِنِّ يُوحِي بَعْضُهُمْ إِلَىٰ بَعْضٍ زُخْرُفَ الْقَوْلِ غُرُورًا ۚ وَلَوْ شَاءَ رَبُّكَ مَا فَعَلُوهُ ۖ فَذَرْهُمْ وَمَا يَفْتَرُونَ
ఇదే విధంగా మేము ప్రతి ప్రవక్తకూ జిన్నులలోని షైతానులను, మనుషులలోని షైతానులను శత్రువులుగా చేశాము. వారిలోని కొందరు మరి కొందరిని మోసపుచ్చటానికి ముచ్చట గొలిపే మాటలతో ప్రేరేపిస్తుంటారు. నీ ప్రభువే గనక తలచుకుంటే వారెన్నటికీ అలా చేయలేరు. కాబట్టి వాళ్ళను, వారి కల్పనలను వదలివెయ్యి.
6:113  وَلِتَصْغَىٰ إِلَيْهِ أَفْئِدَةُ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ وَلِيَرْضَوْهُ وَلِيَقْتَرِفُوا مَا هُم مُّقْتَرِفُونَ
పరలోకాన్ని విశ్వసించని వారి మనసులు దానివైపుకు మొగ్గాలనీ, దానిని ఇష్టపడాలనీ, తాము ఒడిగట్టిన పాపాలకు వారు కూడా ఒడిగట్టాలని (వారీ మాయోపాయాలు చేస్తున్నారు).
6:114  أَفَغَيْرَ اللَّهِ أَبْتَغِي حَكَمًا وَهُوَ الَّذِي أَنزَلَ إِلَيْكُمُ الْكِتَابَ مُفَصَّلًا ۚ وَالَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يَعْلَمُونَ أَنَّهُ مُنَزَّلٌ مِّن رَّبِّكَ بِالْحَقِّ ۖ فَلَا تَكُونَنَّ مِنَ الْمُمْتَرِينَ
ఏమిటీ, నేను అల్లాహ్‌ను కాకుండా ఇంకొక న్యాయనిర్ణేతను వెతకాలా? యదార్థానికి ఆయన ఒక సంపూర్ణ గ్రంథాన్ని మీ వద్దకు పంపి ఉన్నాడు. అందలి విషయాలు స్పష్టంగా విపులీకరించబడ్డాయి. మేము ఎవరికి గ్రంథం వొసగామో వారికి, ఈ గ్రంథం నీ ప్రభువు తరఫు నుంచి సత్యసమేతంగా వచ్చిందన్న విషయం బాగా తెలుసు. కాబట్టి (ఓ ప్రవక్తా!) నువ్వు శంకించేవారిలో చేరిపోకు.
6:115  وَتَمَّتْ كَلِمَتُ رَبِّكَ صِدْقًا وَعَدْلًا ۚ لَّا مُبَدِّلَ لِكَلِمَاتِهِ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ
సత్యం రీత్యా, న్యాయం రీత్యా నీ ప్రభువు వాక్కు సంపూర్ణమైనది. ఆయన వాక్కులను మార్చగలవాడెవడూ లేడు. ఆయన ప్రతిదీ వినేవాడు, ప్రతిదీ తెలిసినవాడు.
6:116  وَإِن تُطِعْ أَكْثَرَ مَن فِي الْأَرْضِ يُضِلُّوكَ عَن سَبِيلِ اللَّهِ ۚ إِن يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَإِنْ هُمْ إِلَّا يَخْرُصُونَ
(ఓ ప్రవక్తా!) భూమిపై నివసించే అధిక సంఖ్యాకులు చెప్పినట్లుగా నీవు మసలుకున్నావంటే వారు నిన్ను అల్లాహ్‌ మార్గం నుంచి అపమార్గం పట్టిస్తారు. వారు వట్టి ఊహలను అనుసరిస్తారు. కేవలం అంచనాలతో మాట్లాడతారు.
6:117  إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ مَن يَضِلُّ عَن سَبِيلِهِ ۖ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ
తన దారిలో నుంచి పెడదారి తీసే వారెవరో నీ ప్రభువుకు బాగా తెలుసు. తన మార్గంపై నడిచేవారెవరో కూడా ఆయనకు బాగా తెలుసు.
6:118  فَكُلُوا مِمَّا ذُكِرَ اسْمُ اللَّهِ عَلَيْهِ إِن كُنتُم بِآيَاتِهِ مُؤْمِنِينَ
కనుక అల్లాహ్‌ ఆదేశాలపై మీకు గనక విశ్వాసముంటే అల్లాహ్‌ పేరు స్మరించబడిన జంతువు మాంసాన్ని తినండి.
6:119  وَمَا لَكُمْ أَلَّا تَأْكُلُوا مِمَّا ذُكِرَ اسْمُ اللَّهِ عَلَيْهِ وَقَدْ فَصَّلَ لَكُم مَّا حَرَّمَ عَلَيْكُمْ إِلَّا مَا اضْطُرِرْتُمْ إِلَيْهِ ۗ وَإِنَّ كَثِيرًا لَّيُضِلُّونَ بِأَهْوَائِهِم بِغَيْرِ عِلْمٍ ۗ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِالْمُعْتَدِينَ
అల్లాహ్‌ పేరు ఉచ్చరించబడిన జంతువు మాంసాన్ని మీరు తినకపోవటానికి అసలు కారణం ఏమిటీ? అల్లాహ్‌ మీ కొరకు నిషేధించిన జంతువుల వివరాలను ముందుగానే స్పష్టపరిచాడు కదా! గత్యంతరం లేని పరిస్థితుల్లో అవి కూడా (ప్రాణరక్షణ కోసం నిషిద్ధ జంతువులు సయితం) మీకోసం ధర్మ సమ్మతం అవుతాయి. వాస్తవమేమిటంటే చాలా మంది ఏ ప్రమాణమూ లేకుండానే - తమ కోరికల ఆధారంగా - జనులను పెడత్రోవ పట్టిస్తూ ఉంటారు. నిశ్చయంగా నియమాలను ఉల్లంఘించే వారిని నీ ప్రభువు బాగా ఎరుగు.
6:120  وَذَرُوا ظَاهِرَ الْإِثْمِ وَبَاطِنَهُ ۚ إِنَّ الَّذِينَ يَكْسِبُونَ الْإِثْمَ سَيُجْزَوْنَ بِمَا كَانُوا يَقْتَرِفُونَ
మీరు బహిరంగ పాపాలనూ, గోప్యమైన పాపాలను కూడా విడనాడండి. పాపాలకు ఒడిగట్టేవారికి అతి త్వరలోనే వారు చేసుకున్నదానికి శిక్ష పడి తీరుతుంది.
6:121  وَلَا تَأْكُلُوا مِمَّا لَمْ يُذْكَرِ اسْمُ اللَّهِ عَلَيْهِ وَإِنَّهُ لَفِسْقٌ ۗ وَإِنَّ الشَّيَاطِينَ لَيُوحُونَ إِلَىٰ أَوْلِيَائِهِمْ لِيُجَادِلُوكُمْ ۖ وَإِنْ أَطَعْتُمُوهُمْ إِنَّكُمْ لَمُشْرِكُونَ
అల్లాహ్‌ పేరు స్మరించబడని జంతువులను తినకండి. ఎందుకంటే ఇది ఆజ్ఞోల్లంఘన క్రిందికి వస్తుంది. మీతో వాదులాడటానికి షైతానులు తమ మిత్రులను ఉసిగొల్పుతుంటారు. ఒకవేళ మీరు గనక వారిని అనుసరించారంటే మీరు కూడా అల్లాహ్‌కు సహవర్తుల్ని కల్పించినవారు (ముష్రిక్కులు) అయిపోతారు (జాగ్రత్త!).
6:122  أَوَمَن كَانَ مَيْتًا فَأَحْيَيْنَاهُ وَجَعَلْنَا لَهُ نُورًا يَمْشِي بِهِ فِي النَّاسِ كَمَن مَّثَلُهُ فِي الظُّلُمَاتِ لَيْسَ بِخَارِجٍ مِّنْهَا ۚ كَذَٰلِكَ زُيِّنَ لِلْكَافِرِينَ مَا كَانُوا يَعْمَلُونَ
మృతుడుగా ఉన్న ఒక వ్యక్తికి మేము జీవితం ప్రసాదించి, అతనికి జ్యోతి నొసగగా, దానిని పుచ్చుకుని అతను జనుల మధ్య సంచరిస్తున్నాడు. ఇలాంటి వ్యక్తి, కటిక చీకట్లలో కూరుకుపోయి వాటి నుండి ఏమాత్రం బయటపడలేని వ్యక్తి లాంటివాడా? ఇదే విధంగా సత్యతిరస్కారులకు వారి పనులు వారికెంతో అందమైనవిగా తోస్తాయి.
6:123  وَكَذَٰلِكَ جَعَلْنَا فِي كُلِّ قَرْيَةٍ أَكَابِرَ مُجْرِمِيهَا لِيَمْكُرُوا فِيهَا ۖ وَمَا يَمْكُرُونَ إِلَّا بِأَنفُسِهِمْ وَمَا يَشْعُرُونَ
ఇదే విధంగా మేము ప్రతి పట్టణంలోనూ అక్కడి సర్దారులనే అపరాధాలకు ఒడిగట్టేవారుగా చేశాము - అక్కడ వారు తమ పన్నాగాలు పన్నటానికి! వాస్తవానికి వారు తమను తామే వంచించుకుంటున్నారు. కాని వారికి ఆ సంగతి తెలియటం లేదు.
6:124  وَإِذَا جَاءَتْهُمْ آيَةٌ قَالُوا لَن نُّؤْمِنَ حَتَّىٰ نُؤْتَىٰ مِثْلَ مَا أُوتِيَ رُسُلُ اللَّهِ ۘ اللَّهُ أَعْلَمُ حَيْثُ يَجْعَلُ رِسَالَتَهُ ۗ سَيُصِيبُ الَّذِينَ أَجْرَمُوا صَغَارٌ عِندَ اللَّهِ وَعَذَابٌ شَدِيدٌ بِمَا كَانُوا يَمْكُرُونَ
వారి వద్దకు ఏదైనా సూచన వచ్చినప్పుడు, “దైవప్రవక్తలకు ఇవ్వబడినదే మాకూ ఇవ్వబడనంతవరకూ మేము విశ్వసించేది లేదు” అని వారు అంటారు. తన దౌత్యాన్ని ఎవరికి అందజేయాలో అల్లాహ్‌కే బాగా తెలుసు. అతి త్వరలోనే అపరాధులు అల్లాహ్‌ వద్దకు చేరుకుని పరాభవాన్నీ, తమ దుష్టపన్నాగాలకు గాను కఠినాతి కఠినమైన శిక్షను అనుభవిస్తారు.
6:125  فَمَن يُرِدِ اللَّهُ أَن يَهْدِيَهُ يَشْرَحْ صَدْرَهُ لِلْإِسْلَامِ ۖ وَمَن يُرِدْ أَن يُضِلَّهُ يَجْعَلْ صَدْرَهُ ضَيِّقًا حَرَجًا كَأَنَّمَا يَصَّعَّدُ فِي السَّمَاءِ ۚ كَذَٰلِكَ يَجْعَلُ اللَّهُ الرِّجْسَ عَلَى الَّذِينَ لَا يُؤْمِنُونَ
కనుక అల్లాహ్‌, తాను సన్మార్గ భాగ్యం ప్రసాదించదలచిన వ్యక్తి హృదయాన్ని ఇస్లాం కొరకు విప్పుతాడు. అలాగే తాను అపమార్గాన వదిలేయదలచిన వ్యక్తి హృదయాన్ని ఆకాశానికెక్కే వానిలాగా కుంచింపజేస్తాడు. ఈ విధంగా అల్లాహ్‌ విశ్వసించని వారికి మాలిన్యాన్ని అంటగడతాడు.
6:126  وَهَٰذَا صِرَاطُ رَبِّكَ مُسْتَقِيمًا ۗ قَدْ فَصَّلْنَا الْآيَاتِ لِقَوْمٍ يَذَّكَّرُونَ
ఇదే నీ ప్రభువు యొక్క రుజుమార్గం. ఉపదేశాన్ని స్వీకరించే వారి కోసం మేము ఈ ఆయతులను స్పష్టంగా విడమరచి చెప్పాము.
6:127  لَهُمْ دَارُ السَّلَامِ عِندَ رَبِّهِمْ ۖ وَهُوَ وَلِيُّهُم بِمَا كَانُوا يَعْمَلُونَ
వారి కొరకు వారి ప్రభువు వద్ద శాంతి నిలయం ఉంది. వారి మంచి పనుల మూలంగా అల్లాహ్‌ వారికి రక్షకునిగా నిలుస్తాడు.
6:128  وَيَوْمَ يَحْشُرُهُمْ جَمِيعًا يَا مَعْشَرَ الْجِنِّ قَدِ اسْتَكْثَرْتُم مِّنَ الْإِنسِ ۖ وَقَالَ أَوْلِيَاؤُهُم مِّنَ الْإِنسِ رَبَّنَا اسْتَمْتَعَ بَعْضُنَا بِبَعْضٍ وَبَلَغْنَا أَجَلَنَا الَّذِي أَجَّلْتَ لَنَا ۚ قَالَ النَّارُ مَثْوَاكُمْ خَالِدِينَ فِيهَا إِلَّا مَا شَاءَ اللَّهُ ۗ إِنَّ رَبَّكَ حَكِيمٌ عَلِيمٌ
అల్లాహ్‌ వారందరినీ సమీకరించే రోజు, “ఓ జిన్నాతు వర్గీయులారా! మీరు మనుషుల్లోని చాలామందిని మీవారుగా చేసుకున్నారు” అని అంటాడు. అప్పుడు వారితో సంబంధాలు పెట్టుకుని ఉన్న మనుషులు ఇలా అంటారు: “మా ప్రభూ! మేము ఒండొకరి ద్వారా లబ్ది పొందిన సంగతి నిజమే. ఎట్టకేలకు నీవు మా కోసం నిర్థారించిన గడువుకు మేము చేరుకున్నాము.” అప్పుడు అల్లాహ్‌ ఇలా అంటాడు: “ఇక నరకమే మీ అందరి నివాస స్థలం. అందులోనే మీరు కలకాలం పడి ఉంటారు. అయితే అల్లాహ్‌ ఏదయినా తలిస్తే అది వేరే విషయం” నిస్సందేహంగా నీ ప్రభువు వివేక సంపన్నుడు, జ్ఞానవంతుడు.
6:129  وَكَذَٰلِكَ نُوَلِّي بَعْضَ الظَّالِمِينَ بَعْضًا بِمَا كَانُوا يَكْسِبُونَ
ఈ విధంగా కొందరు దుర్మార్గులను (కాఫిర్లను) మేము- వారు చేసుకున్న కర్మల కారణంగా - మరి కొందరికి సన్నిహితులుగా చేస్తాము.
6:130  يَا مَعْشَرَ الْجِنِّ وَالْإِنسِ أَلَمْ يَأْتِكُمْ رُسُلٌ مِّنكُمْ يَقُصُّونَ عَلَيْكُمْ آيَاتِي وَيُنذِرُونَكُمْ لِقَاءَ يَوْمِكُمْ هَٰذَا ۚ قَالُوا شَهِدْنَا عَلَىٰ أَنفُسِنَا ۖ وَغَرَّتْهُمُ الْحَيَاةُ الدُّنْيَا وَشَهِدُوا عَلَىٰ أَنفُسِهِمْ أَنَّهُمْ كَانُوا كَافِرِينَ
ఓ జిన్నాతు మరియు మానవ వర్గీయులారా! ఏమిటీ, నా ఆదేశాలను మీకు విడమరచి చెప్పే, ఈనాటి ఈ దినం గురించి మిమ్మల్ని హెచ్చరించే ప్రవక్తలు స్వయంగా మీనుండే మీ వద్దకు రాలేదా? (అని అల్లాహ్‌ తరఫున ప్రశ్నించబడినప్పుడు), “అవును వచ్చారు. మాకు వ్యతిరేకంగా స్వయంగా మేమే సాక్ష్యమిస్తున్నాం” అని అంటారు. ప్రాపంచిక జీవితం వారిని మోసానికి గురి చేసింది. తాము తిరస్కారులయ్యామన్న సంగతిని గురించి వారు స్వయంగా సాక్ష్యమిస్తారు.
6:131  ذَٰلِكَ أَن لَّمْ يَكُن رَّبُّكَ مُهْلِكَ الْقُرَىٰ بِظُلْمٍ وَأَهْلُهَا غَافِلُونَ
ఎందుకంటే, నీ ప్రభువు ఏ సీమను కూడా అక్కడి ప్రజలు (సత్యాసత్యాలు) తెలుసుకోకుండా ఉన్న స్థితిలో-వారి తిరస్కార వైఖరి మూలంగా నాశనం చేయడు.
6:132  وَلِكُلٍّ دَرَجَاتٌ مِّمَّا عَمِلُوا ۚ وَمَا رَبُّكَ بِغَافِلٍ عَمَّا يَعْمَلُونَ
ప్రతి ఒక్కరికీ వారి ఆచరణలను బట్టి అంతస్తులు లభిస్తాయి. నీ ప్రభువు వారి పనుల విషయంలో అజాగ్రత్తగా లేడు.
6:133  وَرَبُّكَ الْغَنِيُّ ذُو الرَّحْمَةِ ۚ إِن يَشَأْ يُذْهِبْكُمْ وَيَسْتَخْلِفْ مِن بَعْدِكُم مَّا يَشَاءُ كَمَا أَنشَأَكُم مِّن ذُرِّيَّةِ قَوْمٍ آخَرِينَ
ఇంకా నీ ప్రభువు ఏ అక్కరాలేనివాడు, కనికరించేవాడు. ఆయన గనక తలచుకుంటే మీ అందరినీ తుద ముట్టించి, మిమ్మల్ని వేరొక వంశం నుంచి పుట్టించినట్లే, మీ స్థానంలో తాను కోరినవారిని వసింపజేస్తాడు.
6:134  إِنَّ مَا تُوعَدُونَ لَآتٍ ۖ وَمَا أَنتُم بِمُعْجِزِينَ
మీకు వాగ్దానం చెయ్యబడుతున్నది ముమ్మాటికీ వచ్చి తీర్తుంది. మీరు (అల్లాహ్‌ను) అశక్తుణ్ణి చేయలేరు.
6:135  قُلْ يَا قَوْمِ اعْمَلُوا عَلَىٰ مَكَانَتِكُمْ إِنِّي عَامِلٌ ۖ فَسَوْفَ تَعْلَمُونَ مَن تَكُونُ لَهُ عَاقِبَةُ الدَّارِ ۗ إِنَّهُ لَا يُفْلِحُ الظَّالِمُونَ
ఓ ప్రవక్తా! వారికి ఇలా చెప్పు : “ఓ నా జాతి ప్రజలారా! మీ పని మీరు చేయండి. నా కర్తవ్యాన్ని నేను నెరవేరుస్తూ ఉంటాను. ఈ లోకంలో మేలైన పరిణామం ఎవరికి చెందుతుందో త్వరలోనే మీకు తెలిసిపోతుంది. అన్యాయానికి పాల్పడే వారు నిశ్చయంగా ఎన్నటికీ సాఫల్యం పొందలేరు.'
6:136  وَجَعَلُوا لِلَّهِ مِمَّا ذَرَأَ مِنَ الْحَرْثِ وَالْأَنْعَامِ نَصِيبًا فَقَالُوا هَٰذَا لِلَّهِ بِزَعْمِهِمْ وَهَٰذَا لِشُرَكَائِنَا ۖ فَمَا كَانَ لِشُرَكَائِهِمْ فَلَا يَصِلُ إِلَى اللَّهِ ۖ وَمَا كَانَ لِلَّهِ فَهُوَ يَصِلُ إِلَىٰ شُرَكَائِهِمْ ۗ سَاءَ مَا يَحْكُمُونَ
అల్లాహ్‌ సృష్టించిన పంట పొలాలలో నుంచి, పశువులలో నుంచి వీళ్లు కొంత భాగాన్ని అల్లాహ్‌ కోసం నిర్థారించారు. పైపెచ్చు “ఇది అల్లాహ్‌ భాగం, ఇది మేము నిలబెట్టిన సహవర్తుల భాగం” అని స్వయంగా తామే తీర్మానించుకొని చెబుతారు. సహవర్తుల కోసం నిర్థారించిన భాగం అల్లాహ్‌కు ఎలాగూ చేరదు. కాని అల్లాహ్‌ కోసం నిర్థారించినది మాత్రం వారు నిలబెట్టిన సహవర్తులకు ఇట్టే చేరిపోతుంది. వారి ఈ తీర్పు ఎంత ఘోరమైనది!?
6:137  وَكَذَٰلِكَ زَيَّنَ لِكَثِيرٍ مِّنَ الْمُشْرِكِينَ قَتْلَ أَوْلَادِهِمْ شُرَكَاؤُهُمْ لِيُرْدُوهُمْ وَلِيَلْبِسُوا عَلَيْهِمْ دِينَهُمْ ۖ وَلَوْ شَاءَ اللَّهُ مَا فَعَلُوهُ ۖ فَذَرْهُمْ وَمَا يَفْتَرُونَ
మరి ఇలాగే చాలామంది ముష్రిక్కుల దృష్టిలో వారి సహవర్తులు, వారిని నాశనం చేయడానికీ, వారి మత ధర్మాన్ని వారికి సందేహాస్పదంగా చేయటానికి వారి సంతాన హత్యను వారికి మంచిదిగా తోచినట్లు చేశారు. అల్లాహ్‌ తలచుకుని ఉంటే వారలా చేసి ఉండేవారు కాదు. కనుక నీవు వారినీ, వారు కల్పించే కల్పనలనూ వదిలెయ్యి.
6:138  وَقَالُوا هَٰذِهِ أَنْعَامٌ وَحَرْثٌ حِجْرٌ لَّا يَطْعَمُهَا إِلَّا مَن نَّشَاءُ بِزَعْمِهِمْ وَأَنْعَامٌ حُرِّمَتْ ظُهُورُهَا وَأَنْعَامٌ لَّا يَذْكُرُونَ اسْمَ اللَّهِ عَلَيْهَا افْتِرَاءً عَلَيْهِ ۚ سَيَجْزِيهِم بِمَا كَانُوا يَفْتَرُونَ
“ఈ కొన్ని పశువులు, పంట పొలాలు అందరికీ సమ్మతం కావు. మేము కోరినవారు తప్ప ఇతరులెవరూ వాటిని తినటం సమ్మతం కాదు” అని వారు తమంతట తాముగా – కల్పించుకొని - చెబుతారు. కొన్ని పశువులపై స్వారీ చేయటం, వాటి ద్వారా బరువు లాగించటం నిషేధించబడింది (అని అంటారు). మరి కొన్ని పశువులపై (జిబహ్‌ చేసే సమయంలో) వారు అల్లాహ్‌ పేరు ఉచ్చరించరు, అల్లాహ్‌కు అబద్ధాన్ని అంటగట్టటానికిగాను (వారు ఇలా చేస్తారు). వారు కల్పించే ఈ అబద్ధాలకుగాను త్వరలోనే అల్లాహ్‌ వారికి దాని ప్రతిఫలం ఇస్తాడు.
6:139  وَقَالُوا مَا فِي بُطُونِ هَٰذِهِ الْأَنْعَامِ خَالِصَةٌ لِّذُكُورِنَا وَمُحَرَّمٌ عَلَىٰ أَزْوَاجِنَا ۖ وَإِن يَكُن مَّيْتَةً فَهُمْ فِيهِ شُرَكَاءُ ۚ سَيَجْزِيهِمْ وَصْفَهُمْ ۚ إِنَّهُ حَكِيمٌ عَلِيمٌ
“ఈ పశువుల గర్భాలలో ఉన్నది కేవలం మా పురుషుల కోసమే. మా స్త్రీల కోసం అది నిషిద్ధం. ఒకవేళ అది చచ్చినదైతే అందరికీ అందులో భాగం ఉంటుంది” అని కూడా వారంటారు. వారి ఈ తప్పుడు మాటలకుగాను అల్లాహ్‌ త్వరలోనే వారిని దండిస్తాడు. నిశ్చయంగా ఆయన మహావివేకి, మహాజ్ఞాని.
6:140  قَدْ خَسِرَ الَّذِينَ قَتَلُوا أَوْلَادَهُمْ سَفَهًا بِغَيْرِ عِلْمٍ وَحَرَّمُوا مَا رَزَقَهُمُ اللَّهُ افْتِرَاءً عَلَى اللَّهِ ۚ قَدْ ضَلُّوا وَمَا كَانُوا مُهْتَدِينَ
మూర్ఖత్వం కొద్దీ, ఏ ఆధారమూ లేకుండానే తమ సంతానాన్ని హత్యచేసిన వారూ, అల్లాహ్‌ ఉపాధిగా ప్రసాదించిన వస్తువులను అల్లాహ్‌కు అబద్ధాలను అంటగడుతూ నిషేధించుకున్నవారూ ముమ్మాటికీ నష్టానికి గురయ్యారు. నిశ్చయంగా వారు మార్గ విహీనతకు లోనయ్యారు. వారు సన్మార్గాన లేరు.
6:141  وَهُوَ الَّذِي أَنشَأَ جَنَّاتٍ مَّعْرُوشَاتٍ وَغَيْرَ مَعْرُوشَاتٍ وَالنَّخْلَ وَالزَّرْعَ مُخْتَلِفًا أُكُلُهُ وَالزَّيْتُونَ وَالرُّمَّانَ مُتَشَابِهًا وَغَيْرَ مُتَشَابِهٍ ۚ كُلُوا مِن ثَمَرِهِ إِذَا أَثْمَرَ وَآتُوا حَقَّهُ يَوْمَ حَصَادِهِ ۖ وَلَا تُسْرِفُوا ۚ إِنَّهُ لَا يُحِبُّ الْمُسْرِفِينَ
ఆయనే పందిళ్ళపై ఎక్కించబడే తోటలను, పందిళ్ళపై ఎక్కించబడని తోటలను, ఖర్జూర చెట్లను, పంటపొలాలను సృజించాడు. వాటి ద్వారా రకరకాల ఆహార వస్తువులు లభ్యమవుతాయి. జైతూను (ఆలివ్‌), దానిమ్మ వృక్షాలను కూడా సృజించాడు. వాటిలో కొన్ని పరస్పరం పోలి ఉంటాయి. మరికొన్ని పోలి ఉండవు. వాటన్నింటి పండ్లు పండినప్పుడు వాటిని తినండి. పంటకోసే రోజున తప్పనిసరిగా చెల్లించవలసిన దాని హక్కును చెల్లించండి. మితిమీరకండి. మితిమీరే వారిని అల్లాహ్‌ ఎట్టిపరిస్థితిలోనూ ఇష్టపడడు.
6:142  وَمِنَ الْأَنْعَامِ حَمُولَةً وَفَرْشًا ۚ كُلُوا مِمَّا رَزَقَكُمُ اللَّهُ وَلَا تَتَّبِعُوا خُطُوَاتِ الشَّيْطَانِ ۚ إِنَّهُ لَكُمْ عَدُوٌّ مُّبِينٌ
పశువులలో ఎత్తుగా ఉండే వాటిని, పొట్టిగా ఉండేవాటినీ పుట్టించినవాడు కూడా ఆయనే. అల్లాహ్‌ మీకు ఇచ్చిన దానిని తినండి. కాని షైతాను అడుగుజాడల్లో నడవకండి. నిశ్చయంగా వాడు మీ బహిరంగ శత్రువు.
6:143  ثَمَانِيَةَ أَزْوَاجٍ ۖ مِّنَ الضَّأْنِ اثْنَيْنِ وَمِنَ الْمَعْزِ اثْنَيْنِ ۗ قُلْ آلذَّكَرَيْنِ حَرَّمَ أَمِ الْأُنثَيَيْنِ أَمَّا اشْتَمَلَتْ عَلَيْهِ أَرْحَامُ الْأُنثَيَيْنِ ۖ نَبِّئُونِي بِعِلْمٍ إِن كُنتُمْ صَادِقِينَ
(ఇవి ఆయన సృష్టించిన) ఎనిమిది ఆడమగలు. అంటే గొఱ్ఱెలలో రెండు రకాలు, మేకలలో రెండు రకాలు. “అల్లాహ్‌ నిషేధించినది ఆ రెండు మగ పశువులనా లేక రెండు ఆడ పశువులనా లేక ఆ రెండు ఆడపశువుల గర్భాలలో ఉన్న వాటినా? మీరు సత్యవంతులే అయితే ప్రమాణబద్ధంగా నాకు తెలియజేయండి” అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు.
6:144  وَمِنَ الْإِبِلِ اثْنَيْنِ وَمِنَ الْبَقَرِ اثْنَيْنِ ۗ قُلْ آلذَّكَرَيْنِ حَرَّمَ أَمِ الْأُنثَيَيْنِ أَمَّا اشْتَمَلَتْ عَلَيْهِ أَرْحَامُ الْأُنثَيَيْنِ ۖ أَمْ كُنتُمْ شُهَدَاءَ إِذْ وَصَّاكُمُ اللَّهُ بِهَٰذَا ۚ فَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا لِّيُضِلَّ النَّاسَ بِغَيْرِ عِلْمٍ ۗ إِنَّ اللَّهَ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
అలాగే ఒంటెలలో రెండు రకాలు, ఆవులలో రెండు రకాలను (ఆయన పుట్టించాడు). మరి వీటిలో అల్లాహ్‌ నిషేధించినది రెండు పోతులనా? లేక రెండు పడ్డలనా? లేక ఆ రెండు పడ్డల కడుపులలో ఉన్న దూడలను నిషేధించాడా? అని (ఓ ప్రవక్తా!) వాళ్ళను అడుగు. ఈ మేరకు అల్లాహ్‌ మీకు ఆదేశించినప్పుడు మీరక్కడ ఉన్నారా? ఏ ఆధారమూ లేకుండానే- ప్రజల్ని అపమార్గం పట్టించే ఉద్దేశంతో- అల్లాహ్‌కు అబద్ధాన్ని ఆపాదించే వానికన్నా పరమ దుర్మార్గుడు ఎవడుంటాడు? ఇలాంటి దుర్మార్గులకు అల్లాహ్‌ సన్మార్గం చూపడు.
6:145  قُل لَّا أَجِدُ فِي مَا أُوحِيَ إِلَيَّ مُحَرَّمًا عَلَىٰ طَاعِمٍ يَطْعَمُهُ إِلَّا أَن يَكُونَ مَيْتَةً أَوْ دَمًا مَّسْفُوحًا أَوْ لَحْمَ خِنزِيرٍ فَإِنَّهُ رِجْسٌ أَوْ فِسْقًا أُهِلَّ لِغَيْرِ اللَّهِ بِهِ ۚ فَمَنِ اضْطُرَّ غَيْرَ بَاغٍ وَلَا عَادٍ فَإِنَّ رَبَّكَ غَفُورٌ رَّحِيمٌ
ఓ ప్రవక్తా! వారికి చెప్పు : (వహీ ద్వారా) నా వద్దకు వచ్చిన ఆజ్ఞలలో చచ్చిన జంతువు, ప్రవహించే రక్తం, పందిమాంసం - అది పరమ అశుద్ధం గనక! - ఇంకా దైవేతరుల పేర కోయబడిన జంతువు తప్ప మరేదీ తినేవాడి కోసం నిషేధించబడినట్లు నాకు కనిపించదు. అయితే గత్యంతరం లేని పరిస్థితిలో- రుచికోసం కాకుండా, హద్దు మీరకుండా ఉంటే (వాటిని తింటే అట్టి స్థితిలో) నీ ప్రభువు క్షమించేవాడూ, కరుణించేవాడు.
6:146  وَعَلَى الَّذِينَ هَادُوا حَرَّمْنَا كُلَّ ذِي ظُفُرٍ ۖ وَمِنَ الْبَقَرِ وَالْغَنَمِ حَرَّمْنَا عَلَيْهِمْ شُحُومَهُمَا إِلَّا مَا حَمَلَتْ ظُهُورُهُمَا أَوِ الْحَوَايَا أَوْ مَا اخْتَلَطَ بِعَظْمٍ ۚ ذَٰلِكَ جَزَيْنَاهُم بِبَغْيِهِمْ ۖ وَإِنَّا لَصَادِقُونَ
యూదులకు మేము గోళ్ళు గల జంతువులన్నింటినీ నిషేధించాము. ఇంకా వారికి, ఆవు మరియు మేకలలో వాటి వీపులకు తగిలివున్న కొవ్వునీ, ప్రేగులపై ఉన్నదానినీ, ఎముకలతో కలిసి ఉన్న దానిని తప్ప - మిగిలిన క్రొవ్వును కూడా నిషేధించాము. వారి తలబిరుసుతనం మూలంగా మేము వారికి ఈ శిక్ష విధించాము. ముమ్మాటికీ మేము చెప్పేది నిజం.
6:147  فَإِن كَذَّبُوكَ فَقُل رَّبُّكُمْ ذُو رَحْمَةٍ وَاسِعَةٍ وَلَا يُرَدُّ بَأْسُهُ عَنِ الْقَوْمِ الْمُجْرِمِينَ
ఆ తరువాత కూడా వాళ్ళు నిన్ను ధిక్కరిస్తే, “మీ ప్రభువు విస్తృతమైన కారుణ్యం కలవాడు. అయితే ఆయన శిక్ష అపరాధ జనులపై నుంచి తొలగిపోదు” అని వారికి చెప్పెయ్యి.
6:148  سَيَقُولُ الَّذِينَ أَشْرَكُوا لَوْ شَاءَ اللَّهُ مَا أَشْرَكْنَا وَلَا آبَاؤُنَا وَلَا حَرَّمْنَا مِن شَيْءٍ ۚ كَذَٰلِكَ كَذَّبَ الَّذِينَ مِن قَبْلِهِمْ حَتَّىٰ ذَاقُوا بَأْسَنَا ۗ قُلْ هَلْ عِندَكُم مِّنْ عِلْمٍ فَتُخْرِجُوهُ لَنَا ۖ إِن تَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَإِنْ أَنتُمْ إِلَّا تَخْرُصُونَ
“అల్లాహ్‌ తలచుకొని ఉంటే మేముగానీ, మా తాత ముత్తాతలుగానీ షిర్క్‌కు పాల్పడేవారం కాము; ఏ వస్తువునూ నిషిద్ధంగా ఖరారు చేసేవారం కూడా కాము” అని ముష్రిక్కులు అంటారు. వీరికి పూర్వం గతించిన వారు కూడా ఇలాగే ధిక్కార వైఖరిని అవలంబించారు. కడకు వారు మా శిక్షను చవి చూశారు. (ఓ ప్రవక్తా!) వారిని అడుగు: “మీ దగ్గర ఏదైనా ప్రమాణం ఉంటే, దాన్ని మా ముందు సమర్పించండి. మీరు కేవలం ఊహలను అనుసరిస్తారు. అంచనాలతో మాట్లాడతారు.”
6:149  قُلْ فَلِلَّهِ الْحُجَّةُ الْبَالِغَةُ ۖ فَلَوْ شَاءَ لَهَدَاكُمْ أَجْمَعِينَ
ఇంకా వారికి ఇలా చెప్పు: “పరిపూర్ణమైన వాదన అల్లాహ్‌దే. ఆయనే గనక తలచుకుంటే మీ అందరినీ సన్మార్గంపై నడిపించేవాడే.”
6:150  قُلْ هَلُمَّ شُهَدَاءَكُمُ الَّذِينَ يَشْهَدُونَ أَنَّ اللَّهَ حَرَّمَ هَٰذَا ۖ فَإِن شَهِدُوا فَلَا تَشْهَدْ مَعَهُمْ ۚ وَلَا تَتَّبِعْ أَهْوَاءَ الَّذِينَ كَذَّبُوا بِآيَاتِنَا وَالَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ وَهُم بِرَبِّهِمْ يَعْدِلُونَ
“అల్లాహ్‌ ఈ వస్తువుల్ని నిషేధించాడు అని సాక్ష్యమిచ్చే మీ సాక్షులను తీసుకురండి” అని వారిని అడుగు. మరి వారు గనక అలా సాక్ష్యమిస్తే నీవు మాత్రం వారితోపాటు సాక్ష్యం ఇవ్వకు. వారి మిథ్యా భావాలను అనుసరించకు. మా ఆయతులను ధిక్కరించేవారి, పరలోకాన్ని విశ్వసించనివారి, ఇంకా ఇతరులను తమ ప్రభువుకు సమానులుగా నిలబెట్టేవారి కోరికలను అనుసరించకు.
6:151  قُلْ تَعَالَوْا أَتْلُ مَا حَرَّمَ رَبُّكُمْ عَلَيْكُمْ ۖ أَلَّا تُشْرِكُوا بِهِ شَيْئًا ۖ وَبِالْوَالِدَيْنِ إِحْسَانًا ۖ وَلَا تَقْتُلُوا أَوْلَادَكُم مِّنْ إِمْلَاقٍ ۖ نَّحْنُ نَرْزُقُكُمْ وَإِيَّاهُمْ ۖ وَلَا تَقْرَبُوا الْفَوَاحِشَ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ ۖ وَلَا تَقْتُلُوا النَّفْسَ الَّتِي حَرَّمَ اللَّهُ إِلَّا بِالْحَقِّ ۚ ذَٰلِكُمْ وَصَّاكُم بِهِ لَعَلَّكُمْ تَعْقِلُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “రండి, మీ ప్రభువు మీపై నిషేధించిన వస్తువులు ఏవో మీకు చదివి వినిపిస్తాను. అవేమంటే; అల్లాహ్‌కు సహవర్తులుగా ఎవరినీ కల్పించకండి. తల్లిదండ్రుల యెడల ఉత్తమరీతిలో మెలగండి. పేదరికపు భయంతో మీ సంతానాన్ని హతమార్చకండి. మేము మీకూ ఆహారం ఇస్తున్నాము, వారికీ ఇస్తాము. సిగ్గు మాలిన పనులు- అవి బాహాటంగా జరిగేవైనా, గుట్టుగా జరిగేవైనా - వాటి దరిదాపులక్కూడా వెళ్ళకండి. సత్య (న్యాయ) బద్ధంగా తప్ప అల్లాహ్‌ నిషేధించిన ఏ ప్రాణినీ హతమార్చకండి. మీరు ఆలోచించి పనిచేస్తారని, అల్లాహ్‌ మీకీ విషయాలను గురించి గట్టిగా తాకీదు చేశాడు.
6:152  وَلَا تَقْرَبُوا مَالَ الْيَتِيمِ إِلَّا بِالَّتِي هِيَ أَحْسَنُ حَتَّىٰ يَبْلُغَ أَشُدَّهُ ۖ وَأَوْفُوا الْكَيْلَ وَالْمِيزَانَ بِالْقِسْطِ ۖ لَا نُكَلِّفُ نَفْسًا إِلَّا وُسْعَهَا ۖ وَإِذَا قُلْتُمْ فَاعْدِلُوا وَلَوْ كَانَ ذَا قُرْبَىٰ ۖ وَبِعَهْدِ اللَّهِ أَوْفُوا ۚ ذَٰلِكُمْ وَصَّاكُم بِهِ لَعَلَّكُمْ تَذَكَّرُونَ
“తండ్రిలేని బిడ్డ, యుక్తవయస్సుకు చేరుకునే వరకూ- ఉత్తమ రీతిలో తప్ప - అతని ఆస్తి దరిదాపులకు కూడా వెళ్ళకండి. కొలతలు తూనికలలో పూర్తిగా, న్యాయంగా వ్యవహరించండి. మేము ఏ ప్రాణిపైన కూడా శక్తికి మించిన భారం మోపము. పలికితే న్యాయమే పలకండి. న్యాయసమ్మతంగా మాట్లాడండి- వ్యవహారం మీ బంధువుకు సంబంధించినదైనా సరే! అల్లాహ్‌తో చేసిన బాసను నెరవేర్చండి. మీరు సదా జ్ఞాపక ముంచుకునేందుకు గాను అల్లాహ్‌ మీకిలా తాకీదు చేశాడు.
6:153  وَأَنَّ هَٰذَا صِرَاطِي مُسْتَقِيمًا فَاتَّبِعُوهُ ۖ وَلَا تَتَّبِعُوا السُّبُلَ فَتَفَرَّقَ بِكُمْ عَن سَبِيلِهِ ۚ ذَٰلِكُمْ وَصَّاكُم بِهِ لَعَلَّكُمْ تَتَّقُونَ
ఇదే నా రుజుమార్గం. కనుక మీరు దీనినే అనుసరించండి. ఇతరత్రా మార్గాలను అనుసరించకండి. అవి మిమ్మల్ని అల్లాహ్‌ మార్గం నుండి వేరు పరుస్తాయి. మీరు భయభక్తుల వైఖరిని అవలంబించేటందుకుగాను అల్లాహ్‌ మీకు ఈ విధంగా తాకీదు చేశాడు.
6:154  ثُمَّ آتَيْنَا مُوسَى الْكِتَابَ تَمَامًا عَلَى الَّذِي أَحْسَنَ وَتَفْصِيلًا لِّكُلِّ شَيْءٍ وَهُدًى وَرَحْمَةً لَّعَلَّهُم بِلِقَاءِ رَبِّهِمْ يُؤْمِنُونَ
తరువాత మేము ఉత్తమంగా ఆచరించేవారిపై అనుగ్రహం పరిపూర్తికావటానికి, ఆజ్ఞలన్నీ స్పష్టంగా వివరించటానికి, మార్గదర్శకత్వం లభించటానికీ, కరుణించబడటానికి, వారు తమ ప్రభువును కలుసుకునే విషయమై దృఢ విశ్వాసం కలిగి ఉండటానికిగాను మూసాకు గ్రంథాన్ని వొసగాము.
6:155  وَهَٰذَا كِتَابٌ أَنزَلْنَاهُ مُبَارَكٌ فَاتَّبِعُوهُ وَاتَّقُوا لَعَلَّكُمْ تُرْحَمُونَ
మరియు ఇది (ఈ ఖుర్‌ఆన్‌) మేము అవతరింపజేసిన ఒక శుభప్రదమైన గ్రంథం. కాబట్టి మీరు దీనిని అనుసరించండి. భయభక్తులతో మెలగండి. తద్వారా మీరు కరుణించబడే అవకాశం ఉంది.
6:156  أَن تَقُولُوا إِنَّمَا أُنزِلَ الْكِتَابُ عَلَىٰ طَائِفَتَيْنِ مِن قَبْلِنَا وَإِن كُنَّا عَن دِرَاسَتِهِمْ لَغَافِلِينَ
“మాకు పూర్వముండిన రెండు వర్గాలపై మాత్రం గ్రంథం అవతరింపజేయబడింది. వారు ఏమి చదివేవారో, మరేమి చదివించేవారో అసలు మాకేమీ తెలియదు” అని మీరు అనకుండా ఉండటానికీ,
6:157  أَوْ تَقُولُوا لَوْ أَنَّا أُنزِلَ عَلَيْنَا الْكِتَابُ لَكُنَّا أَهْدَىٰ مِنْهُمْ ۚ فَقَدْ جَاءَكُم بَيِّنَةٌ مِّن رَّبِّكُمْ وَهُدًى وَرَحْمَةٌ ۚ فَمَنْ أَظْلَمُ مِمَّن كَذَّبَ بِآيَاتِ اللَّهِ وَصَدَفَ عَنْهَا ۗ سَنَجْزِي الَّذِينَ يَصْدِفُونَ عَنْ آيَاتِنَا سُوءَ الْعَذَابِ بِمَا كَانُوا يَصْدِفُونَ
“ఒకవేళ మాకే గనక గ్రంథం వొసగబడి ఉంటే మేము వారికన్నా ఎక్కువ రుజువర్తనులం అయ్యేవాళ్ళం” అని అనకుండా ఉండటానికిగాను (మేము ఖుర్‌ఆన్‌ గ్రంథాన్ని మీ వద్దకు పంపాము). ఇప్పుడు మీవద్దకు మీ ప్రభువు తరఫునుంచి ఒక స్పష్టమైన గ్రంథం, మార్గదర్శక సాధనం మరియు కారుణ్యం వచ్చేసింది. అయినప్పటికీ అల్లాహ్‌ ఆయతులను అసత్యాలని కొట్టిపారేసి, వాటి నుంచి (ప్రజలను) ఆపే వాడికన్నా పరమ దుర్మార్గుడు ఇంకెవడుంటాడు? మేము త్వరలోనే మా ఆయతుల నుండి ఆపేవారిని, వారి ఈ ఆపుదల కారణంగా ఘోరంగా శిక్షిస్తాము.
6:158  هَلْ يَنظُرُونَ إِلَّا أَن تَأْتِيَهُمُ الْمَلَائِكَةُ أَوْ يَأْتِيَ رَبُّكَ أَوْ يَأْتِيَ بَعْضُ آيَاتِ رَبِّكَ ۗ يَوْمَ يَأْتِي بَعْضُ آيَاتِ رَبِّكَ لَا يَنفَعُ نَفْسًا إِيمَانُهَا لَمْ تَكُنْ آمَنَتْ مِن قَبْلُ أَوْ كَسَبَتْ فِي إِيمَانِهَا خَيْرًا ۗ قُلِ انتَظِرُوا إِنَّا مُنتَظِرُونَ
ఏమిటీ, తమ వద్దకు దైవదూతలు రావాలనీ, లేక నీ ప్రభువే స్వయంగా ప్రత్యక్షమవ్వాలనీ లేక నీ ప్రభువు వద్ద నుంచి ఏదైనా (గొప్ప) నిదర్శనం రావాలని వీళ్లు వేచి ఉన్నారా? నీ ప్రభువు వద్ద నుంచి ఏదయినా గొప్ప సూచన వచ్చేసిన రోజున, ముందు నుంచీ విశ్వసించకుండా ఆ రోజునే విశ్వసించినవాని విశ్వాసం, లేక విశ్వసించి కూడా ఏ సత్కార్యమూ చేయని వాని విశ్వాసం అతనికి ఏ విధంగానూ ఉపయోగపడదు. కనుక “మీరూ నిరీక్షించండి, మేము కూడా నిరీక్షిస్తూ ఉంటాము” అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
6:159  إِنَّ الَّذِينَ فَرَّقُوا دِينَهُمْ وَكَانُوا شِيَعًا لَّسْتَ مِنْهُمْ فِي شَيْءٍ ۚ إِنَّمَا أَمْرُهُمْ إِلَى اللَّهِ ثُمَّ يُنَبِّئُهُم بِمَا كَانُوا يَفْعَلُونَ
ఎవరు తమ ధర్మాన్ని ముక్క చెక్కలుగా చేసి, వర్గాలుగా ముఠాలుగా విడిపోయారో వాళ్ళతో నీకే సంబంధమూ లేదు. వాళ్ళ వ్యవహారం దైవాధీనమై ఉంది. తర్వాత వాళ్లు చేసిందేమిటో ఆయన వారికి తెలియజేస్తాడు.
6:160  مَن جَاءَ بِالْحَسَنَةِ فَلَهُ عَشْرُ أَمْثَالِهَا ۖ وَمَن جَاءَ بِالسَّيِّئَةِ فَلَا يُجْزَىٰ إِلَّا مِثْلَهَا وَهُمْ لَا يُظْلَمُونَ
సత్కార్యం చేసినవాని సత్కార్యానికి పదిరెట్లు లభిస్తాయి. దుష్కార్యానికి ఒడిగట్టిన వాని దుష్కార్యానికి దానికి సరిపడా శిక్ష మాత్రమే విధించబడుతుంది. వారికి ఎలాంటి అన్యాయం జరగదు.
6:161  قُلْ إِنَّنِي هَدَانِي رَبِّي إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ دِينًا قِيَمًا مِّلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا ۚ وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ
(ఓ ప్రవక్తా!) ఈ విధంగా చెప్పు: “నా ప్రభువు నాకు రుజుమార్గం చూపించాడు. అదొక స్థిరమైన ధర్మం. ఎలాంటి వక్రతా లేనిది, అల్లాహ్‌ వైపు ఏకాగ్రతతో మరలిన ఇబ్రాహీమ్‌ విధానం అది. ఆయన ముష్రిక్కులలోని వాడు కాడు.”
6:162  قُلْ إِنَّ صَلَاتِي وَنُسُكِي وَمَحْيَايَ وَمَمَاتِي لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
ఇంకా ఈ విధంగా ప్రకటించు : “నిస్సందేహంగా నా నమాజు, నా సకల ఆరాధనలు, నా జీవనం, నా మరణం - ఇవన్నీ సర్వలోకాల ప్రభువైన అల్లాహ్‌ కొరకే.
6:163  لَا شَرِيكَ لَهُ ۖ وَبِذَٰلِكَ أُمِرْتُ وَأَنَا أَوَّلُ الْمُسْلِمِينَ
ఆయనకు భాగస్వాములెవరూ లేరు. దీని గురించే నాకు ఆజ్ఞాపించబడింది. ఆజ్ఞాపాలన చేసే వారిలో నేను మొదటివాణ్ణి.”
6:164  قُلْ أَغَيْرَ اللَّهِ أَبْغِي رَبًّا وَهُوَ رَبُّ كُلِّ شَيْءٍ ۚ وَلَا تَكْسِبُ كُلُّ نَفْسٍ إِلَّا عَلَيْهَا ۚ وَلَا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ ۚ ثُمَّ إِلَىٰ رَبِّكُم مَّرْجِعُكُمْ فَيُنَبِّئُكُم بِمَا كُنتُمْ فِيهِ تَخْتَلِفُونَ
(ఓ ప్రవక్తా!) వారిని అడుగు: “ఏమిటీ, నేను అల్లాహ్‌ను కాదని వేరొక ప్రభువును వెతుక్కోవాలా?! వాస్తవానికి ప్రతిదానికీ ప్రభువు ఆయనే. ఎవరు చేసిన పనులకు వారే బాధ్యులు. బరువును మోసేవాడెవడూ ఇంకొకడి బరువును మోయడు. ఆ తర్వాత మీరంతా మీ ప్రభువు వద్దకే పోవలసి ఉంది. అప్పుడు ఆయన మీరు ఏ ఏ విషయాలలో విభేదించుకున్నారో వాటి వాస్తవాలను తెలియజేస్తాడు.
6:165  وَهُوَ الَّذِي جَعَلَكُمْ خَلَائِفَ الْأَرْضِ وَرَفَعَ بَعْضَكُمْ فَوْقَ بَعْضٍ دَرَجَاتٍ لِّيَبْلُوَكُمْ فِي مَا آتَاكُمْ ۗ إِنَّ رَبَّكَ سَرِيعُ الْعِقَابِ وَإِنَّهُ لَغَفُورٌ رَّحِيمٌ
ఆయనే మిమ్మల్ని భూమండలంలో ఖలీఫాలుగా చేశాడు. మీకు ప్రసాదించిన వాటిలో మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం కొందరికి మరికొందరిపై ఉన్నత స్థానాలను ప్రసాదించాడు. నిశ్చయంగా నీ ప్రభువు శిక్షించటంలో వేగవంతుడు. అలాగే ఆయన అపారంగా క్షమించేవాడు, కరుణించేవాడు కూడాను.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.