aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

66. సూరా అత్ తహ్రీం

66:1  يَا أَيُّهَا النَّبِيُّ لِمَ تُحَرِّمُ مَا أَحَلَّ اللَّهُ لَكَ ۖ تَبْتَغِي مَرْضَاتَ أَزْوَاجِكَ ۚ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
ఓ ప్రవక్తా! అల్లాహ్ నీ కోసం ధర్మ సమ్మతం చేసిన దానిని నువ్వెందుకు (నీ కొరకు) నిషేధించుకుంటున్నావు? (ఏమిటి?) నువ్వు నీ భార్యల ప్రసన్నతను పొందగోరుతున్నావా? అల్లాహ్ క్షమాశీలుడు, దయామయుడు.
66:2  قَدْ فَرَضَ اللَّهُ لَكُمْ تَحِلَّةَ أَيْمَانِكُمْ ۚ وَاللَّهُ مَوْلَاكُمْ ۖ وَهُوَ الْعَلِيمُ الْحَكِيمُ
(అనుచితమైన) మీ ప్రతిజ్ఞలను మీరు ఉపసంహరించుకోవటాన్ని అల్లాహ్ విధిగా ఖరారు చేశాడు సుమా! అల్లాహ్ యే మీ సంరక్షకుడు. ఆయనే సర్వజ్ఞాని, వివేక సంపన్నుడు.
66:3  وَإِذْ أَسَرَّ النَّبِيُّ إِلَىٰ بَعْضِ أَزْوَاجِهِ حَدِيثًا فَلَمَّا نَبَّأَتْ بِهِ وَأَظْهَرَهُ اللَّهُ عَلَيْهِ عَرَّفَ بَعْضَهُ وَأَعْرَضَ عَن بَعْضٍ ۖ فَلَمَّا نَبَّأَهَا بِهِ قَالَتْ مَنْ أَنبَأَكَ هَٰذَا ۖ قَالَ نَبَّأَنِيَ الْعَلِيمُ الْخَبِيرُ
ప్రవక్త తన భార్యలలో ఒకామెతో ఒక రహస్య విషయం చెప్పినప్పుడు, ఆమె ఆ విషయాన్ని (మరొకామెకు) తెలియపరిచింది. ఈ సంగతిని అల్లాహ్ తన ప్రవక్తకు తెలియపరచగా, ప్రవక్త ఈ విషయాన్ని కొంతచేప్పి, మరికొంత దాటవేశాడు. ప్రవక్త ఈ సమాచారాన్ని తన భార్యకు తెలిపినపుడు, “ఇంతకీ ఈ విషయం మీకెవరు తెలిపారు?” అని ఆమె అడిగింది. “అన్నీ తెలిసిన, సర్వం ఎరిగిన అల్లాహ్ నాకీ సంగతిని తెలియజేశాడు” అని ప్రవక్త చెప్పాడు.
66:4  إِن تَتُوبَا إِلَى اللَّهِ فَقَدْ صَغَتْ قُلُوبُكُمَا ۖ وَإِن تَظَاهَرَا عَلَيْهِ فَإِنَّ اللَّهَ هُوَ مَوْلَاهُ وَجِبْرِيلُ وَصَالِحُ الْمُؤْمِنِينَ ۖ وَالْمَلَائِكَةُ بَعْدَ ذَٰلِكَ ظَهِيرٌ
(ఓ ప్రవక్త సతీమణులారా!) మీరిద్దరూ అల్లాహ్ సమక్షంలో పశ్చాత్తాపం చెందితే (అది మీకే శ్రేయస్కరం). నిశ్చయంగా మీ హృదయాలు వంగిపోయాయి. మీరు గనక ప్రవక్తకు వ్యతిరేకంగా ఒండొకరికి సహాయపడితే ప్రవక్తకు సంరక్షకుడుగా అల్లాహ్ ఉన్నాడు. జిబ్రయీలు, సజ్జనులైన విశ్వాసులు (అతనికి) ఆదరువుగా ఉన్నారు – అదీగాక దైవదూతలు కూడా అతనికి సహాయకులుగా ఉన్నారు.
66:5  عَسَىٰ رَبُّهُ إِن طَلَّقَكُنَّ أَن يُبْدِلَهُ أَزْوَاجًا خَيْرًا مِّنكُنَّ مُسْلِمَاتٍ مُّؤْمِنَاتٍ قَانِتَاتٍ تَائِبَاتٍ عَابِدَاتٍ سَائِحَاتٍ ثَيِّبَاتٍ وَأَبْكَارًا
ఒకవేళ అతను (ప్రవక్త) మీకు విడాకులిస్తే అతి త్వరలోనే అతని ప్రభువు అతనికి మీకు బదులుగా మీకన్నా ఉత్తమురాలైన భార్యలను ప్రసాదిస్తాడు. వారు ముస్లిములు, విశ్వాసం కలిగి ఉన్న వారు, విధేయత చూపేవారు, పశ్చాత్తాపం చెందేవారు, ఆరాధనలు చేసేవారు, ఉపవాసాలు పాటించేవారు అయి ఉంటారు. వారు వితంతువులూ అయి ఉంటారు, కన్యలూ అయి ఉంటారు.
66:6  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا قُوا أَنفُسَكُمْ وَأَهْلِيكُمْ نَارًا وَقُودُهَا النَّاسُ وَالْحِجَارَةُ عَلَيْهَا مَلَائِكَةٌ غِلَاظٌ شِدَادٌ لَّا يَعْصُونَ اللَّهَ مَا أَمَرَهُمْ وَيَفْعَلُونَ مَا يُؤْمَرُونَ
ఓ విశ్వాసులారా! మీరు మిమ్మల్ని, మీ కుటుంబీకుల్ని అగ్ని బారి నుండి కాపాడుకోండి. (ఆ అగ్ని ఎటువంటిదంటే) మనుషులు, రాళ్లు దాని ఇంధనం కానున్నారు. దానిపై కర్కశులు, బలిష్టులు అయిన దూతలు నియమితులై ఉన్నారు. అల్లాహ్ ఆజ్ఞలను పాలించటంలో వారు ఏమాత్రం అలక్ష్యం చేయరు. పైగా వారికి జారీ చేయబడిన ఆజ్ఞలను వారు ఖచ్చితంగా పాలిస్తారు.
66:7  يَا أَيُّهَا الَّذِينَ كَفَرُوا لَا تَعْتَذِرُوا الْيَوْمَ ۖ إِنَّمَا تُجْزَوْنَ مَا كُنتُمْ تَعْمَلُونَ
ఓ అవిశ్వాసులారా! ఈ రోజు మీరు సాకులు చెప్పకండి. మీరు చేసుకున్న కర్మల ఫలితం మాత్రమే మీకివ్వబడుతుంది.
66:8  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا تُوبُوا إِلَى اللَّهِ تَوْبَةً نَّصُوحًا عَسَىٰ رَبُّكُمْ أَن يُكَفِّرَ عَنكُمْ سَيِّئَاتِكُمْ وَيُدْخِلَكُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ يَوْمَ لَا يُخْزِي اللَّهُ النَّبِيَّ وَالَّذِينَ آمَنُوا مَعَهُ ۖ نُورُهُمْ يَسْعَىٰ بَيْنَ أَيْدِيهِمْ وَبِأَيْمَانِهِمْ يَقُولُونَ رَبَّنَا أَتْمِمْ لَنَا نُورَنَا وَاغْفِرْ لَنَا ۖ إِنَّكَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఓ విశ్వాసులారా! అల్లాహ్ వైపు పశ్చాత్తాపంతో మరలండి – నిష్కల్మషమైన పశ్చాత్తాపభావంతో! మీ ప్రభువు మీ పాపాలను మీనుండి దూరం చేయవచ్చు. క్రింద సెలయేళ్ళు ప్రవహించే (స్వర్గ) వనాలలో మీకు ప్రవేశం కల్పించవచ్చు. ఆ రోజు అల్లాహ్ ప్రవక్తనూ, అతని వెంటనున్న విశ్వాసులను అవమానపరచడు. వారి కాంతి వారి ముందూ, వారి కుడి వైపూ పరుగెడుతూ ఉంటుంది. అప్పుడు వారిలా వేడుకుంటూ ఉంటారు: “మా ప్రభూ! మా కాంతిని మా కొరకు పరిపూర్ణం గావించు. మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా నీవు అన్నింటిపై అధికారం కలవాడవు.”
66:9  يَا أَيُّهَا النَّبِيُّ جَاهِدِ الْكُفَّارَ وَالْمُنَافِقِينَ وَاغْلُظْ عَلَيْهِمْ ۚ وَمَأْوَاهُمْ جَهَنَّمُ ۖ وَبِئْسَ الْمَصِيرُ
ఓ ప్రవక్తా! అవిశ్వాసులతో, కపటులతో పోరాడు. వారి పట్ల కఠినంగా వ్యవహరించు. వారి నివాసం నరకం. అది చాలా చెడ్డ గమ్యం.
66:10  ضَرَبَ اللَّهُ مَثَلًا لِّلَّذِينَ كَفَرُوا امْرَأَتَ نُوحٍ وَامْرَأَتَ لُوطٍ ۖ كَانَتَا تَحْتَ عَبْدَيْنِ مِنْ عِبَادِنَا صَالِحَيْنِ فَخَانَتَاهُمَا فَلَمْ يُغْنِيَا عَنْهُمَا مِنَ اللَّهِ شَيْئًا وَقِيلَ ادْخُلَا النَّارَ مَعَ الدَّاخِلِينَ
అల్లాహ్ అవిశ్వాసుల (హితబోధ) కోసం నూహు, లూతు భార్యల ఉదాహరణలను ఇస్తున్నాడు. వారిద్దరూ మా దాసుల్లోని ఇద్దరు సజ్జనుల అధ్వర్యంలో ఉండేవారు. అయితే వారిద్దరూ తమ భర్తల పట్ల ద్రోహానికి ఒడిగట్టారు. అందువల్ల వారిద్దరూ (సజ్జనదాసులు) దైవశిక్ష విషయంలో వారిని (తమ భార్యలను) ఏ విధంగానూ ఆదుకోలేకపోయారు. “పొండి, నరకానికి పోయేవారితో పాటు మీరూ పోయిపడండి” అని ఆ స్త్రీలిరువురితో అనబడింది.
66:11  وَضَرَبَ اللَّهُ مَثَلًا لِّلَّذِينَ آمَنُوا امْرَأَتَ فِرْعَوْنَ إِذْ قَالَتْ رَبِّ ابْنِ لِي عِندَكَ بَيْتًا فِي الْجَنَّةِ وَنَجِّنِي مِن فِرْعَوْنَ وَعَمَلِهِ وَنَجِّنِي مِنَ الْقَوْمِ الظَّالِمِينَ
మరి అల్లాహ్ విశ్వాసుల కొరకు ఫిరౌను భార్య ఉదాహరణను ఇస్తున్నాడు. అప్పుడామె ఇలా వేడుకున్నది: “నా ప్రభూ! నా కోసం నీ దగ్గర – స్వర్గంలో – ఒక గృహాన్ని నిర్మించు. నన్ను ఫిరౌను నుండి, అతని (దుష్ట) పోకడ నుండి రక్షించు. దుర్మార్గ జనుల నుండి నాకు విముక్తిని ప్రసాదించు.”
66:12  وَمَرْيَمَ ابْنَتَ عِمْرَانَ الَّتِي أَحْصَنَتْ فَرْجَهَا فَنَفَخْنَا فِيهِ مِن رُّوحِنَا وَصَدَّقَتْ بِكَلِمَاتِ رَبِّهَا وَكُتُبِهِ وَكَانَتْ مِنَ الْقَانِتِينَ
మరి ఇమ్రాన్ కుమార్తె అయిన మర్యం (గురించి కూడా అల్లాహ్ ఉదాహరిస్తున్నాడు). ఆమె తన మానాన్ని కాపాడుకున్నది. మరి మేము మా తరఫున ఆమెలో ప్రాణాన్ని ఊదాము. మరి ఆమె తన ప్రభువు వచనాలను, ఆయన గ్రంథాలను సత్యమని ధృవపరచింది. ఆమె వినయవిధేయతలు గల స్త్రీమూర్తుల కోవకు చెందినది.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.