aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

61. సూరా అస్ సఫ్

61:1  سَبَّحَ لِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۖ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న ప్రతి వస్తువూ అల్లాహ్ పవిత్రతను కొనియాడుతున్నది. ఆయన సర్వశక్తుడు, వివేకవంతుడు.
61:2  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لِمَ تَقُولُونَ مَا لَا تَفْعَلُونَ
ఓ విశ్వాసులారా! మీరు చేయ(లే)ని దాన్ని గురించి ఎందుకు చెబుతారు?
61:3  كَبُرَ مَقْتًا عِندَ اللَّهِ أَن تَقُولُوا مَا لَا تَفْعَلُونَ
మీరు చేయని దాన్ని గురించి చెప్పటం అల్లాహ్ సమక్షంలో ఎంతో సహించరానిది.
61:4  إِنَّ اللَّهَ يُحِبُّ الَّذِينَ يُقَاتِلُونَ فِي سَبِيلِهِ صَفًّا كَأَنَّهُم بُنْيَانٌ مَّرْصُوصٌ
అల్లాహ్ ప్రేమించేది సీసం పోసి నిర్మింపబడిన గోడలాగా వరుసతీరి స్థిరంగా అతని మార్గంలో పోరాడేవారినే సుమా!
61:5  وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ يَا قَوْمِ لِمَ تُؤْذُونَنِي وَقَد تَّعْلَمُونَ أَنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُمْ ۖ فَلَمَّا زَاغُوا أَزَاغَ اللَّهُ قُلُوبَهُمْ ۚ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الْفَاسِقِينَ
మూసా తన జాతివారితో, “ఓ నా జాతి ప్రజలారా! నేను మీ వద్దకు అల్లాహ్ తరఫున పంపబడిన ప్రవక్తనన్న సంగతి తెలిసి కూడా మీరు నన్నెందుకు ఇంతగా వేధిస్తున్నారు?” అని చెప్పినప్పటి విషయం (జ్ఞాపకం చేసుకోదగినది). వారు వక్రంగానే ఉండటంతో, అల్లాహ్ వారి హృదయాలు వంకరగానే ఉండేలా చేశాడు. అవిధేయ జనులకు అల్లాహ్ సన్మార్గం చూపడు.
61:6  وَإِذْ قَالَ عِيسَى ابْنُ مَرْيَمَ يَا بَنِي إِسْرَائِيلَ إِنِّي رَسُولُ اللَّهِ إِلَيْكُم مُّصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيَّ مِنَ التَّوْرَاةِ وَمُبَشِّرًا بِرَسُولٍ يَأْتِي مِن بَعْدِي اسْمُهُ أَحْمَدُ ۖ فَلَمَّا جَاءَهُم بِالْبَيِّنَاتِ قَالُوا هَٰذَا سِحْرٌ مُّبِينٌ
మర్యమ్ కుమారుడైన ఈసా, “ఓ ఇస్రాయీలు సంతతివారలారా! నేను మీ వైపు అల్లాహ్ తరఫున పంపబడిన ప్రవక్తను. నాకు పూర్వం వచ్చిన తౌరాతు గ్రంథాన్ని ధృవపరుస్తున్నాను. నా తరువాత రాబోయే ప్రవక్తను గురించి శుభవార్తను ఇస్తున్నాను. అతని పేరు అహ్మద్” అని చెప్పినప్పటి సంగతి (కూడా స్మరించదగినదే). తీరా అతను స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చినప్పుడు, “ఇది పచ్చి ఇంద్రజాలం” అని వారు అన్నారు (తేలిగ్గా కొట్టి పారేశారు).
61:7  وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ الْكَذِبَ وَهُوَ يُدْعَىٰ إِلَى الْإِسْلَامِ ۚ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
ఇస్లాం వైపు తనను ఆహ్వానించబడుతున్నప్పటికీ అల్లాహ్ పై అబద్ధపు నిందలను కల్పించేవాడికంటే పరమ దుర్మార్గుడెవడుంటాడు, ఇలాంటి దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గం చూపడు.
61:8  يُرِيدُونَ لِيُطْفِئُوا نُورَ اللَّهِ بِأَفْوَاهِهِمْ وَاللَّهُ مُتِمُّ نُورِهِ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ
వారు అల్లాహ్ జ్యోతిని తమ నోళ్ళతో ఊది ఆర్పివేయదలుస్తున్నారు. అయితే అల్లాహ్ మాత్రం తన జ్యోతిని పరిపూర్ణం గావిస్తాడు – అవిశ్వాసులకు అది ఎంతగా సహించరానిదైనాసరే!
61:9  هُوَ الَّذِي أَرْسَلَ رَسُولَهُ بِالْهُدَىٰ وَدِينِ الْحَقِّ لِيُظْهِرَهُ عَلَى الدِّينِ كُلِّهِ وَلَوْ كَرِهَ الْمُشْرِكُونَ
ఆయనే తన ప్రవక్తకు సన్మార్గాన్ని, సత్యధర్మాన్ని ఇచ్చి పంపాడు – దాన్ని మత ధర్మాలన్నింటిపై ఆధిక్యం వహించేలా చేయటానికి! ఈ విషయం బహుదైవారాధకులకు ఇష్టం లేకపోయినా సరే.
61:10  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا هَلْ أَدُلُّكُمْ عَلَىٰ تِجَارَةٍ تُنجِيكُم مِّنْ عَذَابٍ أَلِيمٍ
ఓ విశ్వాసులారా! మిమ్మల్ని వ్యధాభరితమైన శిక్ష నుండి రక్షించే వర్తకమేదో నేను మీకు తెలుపనా?
61:11  تُؤْمِنُونَ بِاللَّهِ وَرَسُولِهِ وَتُجَاهِدُونَ فِي سَبِيلِ اللَّهِ بِأَمْوَالِكُمْ وَأَنفُسِكُمْ ۚ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ
మీరు అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. అల్లాహ్ మార్గంలో మీ ధన ప్రాణాలొడ్డి పోరాడండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీకు ఎంతో మేలైనది.
61:12  يَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ وَيُدْخِلْكُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ وَمَسَاكِنَ طَيِّبَةً فِي جَنَّاتِ عَدْنٍ ۚ ذَٰلِكَ الْفَوْزُ الْعَظِيمُ
అల్లాహ్ మీ పాపాలను క్షమిస్తాడు. క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలలో మీకు ప్రవేశం కల్పిస్తాడు. శాశ్వతంగా ఉండే ఉద్యానవనాలలో గల పరిశుబ్రమైన గృహాలలో ప్రవేశింపజేస్తాడు. నిజానికి ఇదే గొప్ప సాఫల్యం.
61:13  وَأُخْرَىٰ تُحِبُّونَهَا ۖ نَصْرٌ مِّنَ اللَّهِ وَفَتْحٌ قَرِيبٌ ۗ وَبَشِّرِ الْمُؤْمِنِينَ
మీరెంతగానో ఇష్టపడే మరొకటి (అనుగ్రహం) కూడా వొసగుతాడు. అది అల్లాహ్ సహాయం, శీఘ్ర విజయం! (ఓ ప్రవక్తా!) విశ్వాసులకు దీని గురించి శుభవార్తను వినిపించు.
61:14  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُونُوا أَنصَارَ اللَّهِ كَمَا قَالَ عِيسَى ابْنُ مَرْيَمَ لِلْحَوَارِيِّينَ مَنْ أَنصَارِي إِلَى اللَّهِ ۖ قَالَ الْحَوَارِيُّونَ نَحْنُ أَنصَارُ اللَّهِ ۖ فَآمَنَت طَّائِفَةٌ مِّن بَنِي إِسْرَائِيلَ وَكَفَرَت طَّائِفَةٌ ۖ فَأَيَّدْنَا الَّذِينَ آمَنُوا عَلَىٰ عَدُوِّهِمْ فَأَصْبَحُوا ظَاهِرِينَ
ఓ విశ్వాసులారా! మర్యం కుమారుడైన ఈసా తన హవారీలతో, “అల్లాహ్ మార్గంలో నాకు సహాయపడగల వారెవరు?” అని అన్నప్పుడు, “అల్లాహ్ మార్గంలో మేము సహాయపడతాము” అని హవారీలు సమాధాన మిచ్చినట్లు మీరు కూడా అల్లాహ్ కు సహాయకులు అవండి. తరువాత ఇస్రాయీలు సంతతివారిలో ఒక వర్గం వారు విశ్వసించగా, మరొక వర్గం వారు తిరస్కరించారు. అప్పుడు మేము విశ్వసించిన వారికి వారి శత్రువులకు వ్యతిరేకంగా తోడ్పడ్డాము. తత్ఫలితంగా వారు గెలుపొందారు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.