aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

50. సూరా ఖాఫ్

50:1  ق ۚ وَالْقُرْآنِ الْمَجِيدِ
ఖాఫ్. దివ్యమైన ఖుర్ఆన్ సాక్షిగా!
50:2  بَلْ عَجِبُوا أَن جَاءَهُم مُّنذِرٌ مِّنْهُمْ فَقَالَ الْكَافِرُونَ هَٰذَا شَيْءٌ عَجِيبٌ
తమ వద్దకు స్వయంగా తమలో నుండే హెచ్చరించేవాడొకడు రావటం వారిని ఆశ్చర్యపరిచింది. అందుకే అవిశ్వాసులు ఇలా అన్నారు : “ఇది మరీ విచిత్రంగా ఉందే!
50:3  أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا ۖ ذَٰلِكَ رَجْعٌ بَعِيدٌ
“ఏమిటీ, మేము మరణించి మట్టిగా మారిన తరువాత (మళ్ళి బ్రతికించబడతామా?) ఈ తిరిగిపోవటం చాలా దూరం (బుద్ధికి అందనిది)!”
50:4  قَدْ عَلِمْنَا مَا تَنقُصُ الْأَرْضُ مِنْهُمْ ۖ وَعِندَنَا كِتَابٌ حَفِيظٌ
భూమి వారిలో (ఎందరిని) ఏ మేరకు హరిస్తుందో కూడా మాకు తెలుసు. మా దగ్గర అన్నింటినీ భద్రపరిచే పుస్తకం ఉంది.
50:5  بَلْ كَذَّبُوا بِالْحَقِّ لَمَّا جَاءَهُمْ فَهُمْ فِي أَمْرٍ مَّرِيجٍ
పైగా వారు, సత్యం తమ వద్దకు వచ్చినప్పుడు దాన్ని అబద్దంగా చిత్రీకరించారు. అసలు వారు అయోమయంలో పడిపోయారు.
50:6  أَفَلَمْ يَنظُرُوا إِلَى السَّمَاءِ فَوْقَهُمْ كَيْفَ بَنَيْنَاهَا وَزَيَّنَّاهَا وَمَا لَهَا مِن فُرُوجٍ
ఏమిటీ, తమపైన ఉన్న ఆకాశాన్ని వారు చూడలేదా, ఏ విధంగా మేము దాన్ని నిర్మించి, ముస్తాబు చేశామో? మరి అందులో ఎలాంటి పగుళ్ళూ లేవు.
50:7  وَالْأَرْضَ مَدَدْنَاهَا وَأَلْقَيْنَا فِيهَا رَوَاسِيَ وَأَنبَتْنَا فِيهَا مِن كُلِّ زَوْجٍ بَهِيجٍ
ఇంకా మేము భూమిని పరచి, అందులో పర్వతాలను చేశాము. ఇంకా అందులో అందాలు చిందే అన్నిరకాల వస్తువులను మొలిపించాము.
50:8  تَبْصِرَةً وَذِكْرَىٰ لِكُلِّ عَبْدٍ مُّنِيبٍ
(అల్లాహ్ వైపు) మరలి వచ్చే ప్రతి దాసునికి ఇవి కనువిప్పుగా, గుణపాఠంగా ఉన్నాయి.
50:9  وَنَزَّلْنَا مِنَ السَّمَاءِ مَاءً مُّبَارَكًا فَأَنبَتْنَا بِهِ جَنَّاتٍ وَحَبَّ الْحَصِيدِ
ఇంకా మేము ఆకాశం నుండి శుభప్రదమైన నీటిని (వర్షాన్ని) కురిపించాము. తద్వారా తోటలను, కోతకొచ్చే ఆహార ధాన్యాలను మొలిపించాము.
50:10  وَالنَّخْلَ بَاسِقَاتٍ لَّهَا طَلْعٌ نَّضِيدٌ
ఒకదానిపై ఒకటి పేరుకుని ఉండే పండ్ల గుత్తులు గల ఎత్తైన ఖర్జూరపు చెట్లను,
50:11  رِّزْقًا لِّلْعِبَادِ ۖ وَأَحْيَيْنَا بِهِ بَلْدَةً مَّيْتًا ۚ كَذَٰلِكَ الْخُرُوجُ
దాసుల ఉపాధి నిమిత్తం వీటిని (ఉత్పత్తి చేశాము). ఇంకా మేము దీంతో నిర్జీవంగా ఉన్న ప్రదేశానికి జీవం పోశాము. ఈ విధంగానే (సమాధుల నుండి) బయటకు రావలసి ఉన్నది.
50:12  كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ وَأَصْحَابُ الرَّسِّ وَثَمُودُ
వీరికి పూర్వం నూహ్ జాతి వారు, రస్ జనులు, సమూదు వారు ధిక్కరించిన వారే.
50:13  وَعَادٌ وَفِرْعَوْنُ وَإِخْوَانُ لُوطٍ
ఆదు వారు, ఫిరౌను జనులు, లూత్ సోదరులు,
50:14  وَأَصْحَابُ الْأَيْكَةِ وَقَوْمُ تُبَّعٍ ۚ كُلٌّ كَذَّبَ الرُّسُلَ فَحَقَّ وَعِيدِ
అయికా వారు, తుబ్బా జాతి వారు కూడా. వారంతా ప్రవక్తలను ధిక్కరించారు. దాంతో నా శిక్షా వాగ్దానం వారి విషయంలో నిజమని తేలింది.
50:15  أَفَعَيِينَا بِالْخَلْقِ الْأَوَّلِ ۚ بَلْ هُمْ فِي لَبْسٍ مِّنْ خَلْقٍ جَدِيدٍ
ఏమిటీ, మేము తొలి(సారి) సృష్టికే అలసిపోయామా? అది కాదు, వారసలు సరికొత్త సృష్టి గురించి సందిగ్ధంలో పడిపోయారు.
50:16  وَلَقَدْ خَلَقْنَا الْإِنسَانَ وَنَعْلَمُ مَا تُوَسْوِسُ بِهِ نَفْسُهُ ۖ وَنَحْنُ أَقْرَبُ إِلَيْهِ مِنْ حَبْلِ الْوَرِيدِ
మేమే మనిషిని సృష్టించాము. వాడి మదిలో మెదిలే ఆలోచనలు సయితం మాకు తెలుసు. మేమతని ప్రాణనాళం కంటే కూడా అతనికి అతి చేరువలో ఉన్నాం.
50:17  إِذْ يَتَلَقَّى الْمُتَلَقِّيَانِ عَنِ الْيَمِينِ وَعَنِ الشِّمَالِ قَعِيدٌ
తీసుకోవలసిన ఇద్దరు (దూతలు) తీసుకోవటానికి వెళ్ళినప్పుడు (వారిలో) ఒకతను కుడి ప్రక్కన, మరొకతను ఎడమ ప్రక్కన కూర్చొని ఉంటాడు.
50:18  مَّا يَلْفِظُ مِن قَوْلٍ إِلَّا لَدَيْهِ رَقِيبٌ عَتِيدٌ
(మనిషి) నోట ఒక మాట వెలువడటమే ఆలస్యం, అతని దగ్గర ఒక పర్యవేక్షకుడు (దాన్ని నమోదు చేయడానికి) సిద్ధంగా ఉంటాడు.
50:19  وَجَاءَتْ سَكْرَةُ الْمَوْتِ بِالْحَقِّ ۖ ذَٰلِكَ مَا كُنتَ مِنْهُ تَحِيدُ
చివరికి మరణ మైకం – సత్య సమేతంగా – రానేవచ్చింది. “( ఓ మనిషీ!) దేనిపట్ల నువ్వు బెదిరి పారిపోయేవాడివో అదే ఇది.”
50:20  وَنُفِخَ فِي الصُّورِ ۚ ذَٰلِكَ يَوْمُ الْوَعِيدِ
మరి శంఖం ఊదబడుతుంది. (శిక్ష గురించి) వాగ్దానం చేయబడిన రోజు ఇదే.
50:21  وَجَاءَتْ كُلُّ نَفْسٍ مَّعَهَا سَائِقٌ وَشَهِيدٌ
ప్రతి వ్యక్తీ తన వెంట తనను తీసుకొచ్చే వాడొకడు, సాక్ష్యమిచ్చేవాడొకడు ఉన్న స్థితిలో హాజరవుతాడు.
50:22  لَّقَدْ كُنتَ فِي غَفْلَةٍ مِّنْ هَٰذَا فَكَشَفْنَا عَنكَ غِطَاءَكَ فَبَصَرُكَ الْيَوْمَ حَدِيدٌ
(అతనితో ఇలా అనబడుతుంది:) “నిశ్చయంగా నువ్వు దీనిపట్ల అలసత్వం వహించావు. ఇక నీ నుండి నీ తెరను తొలగించాము. ఈనాడు నీ చూపు చాలా సునిశితంగా ఉంది.”
50:23  وَقَالَ قَرِينُهُ هَٰذَا مَا لَدَيَّ عَتِيدٌ
“ఇదిగో, (ఇతని కర్మల చిట్టా) నావద్ద సిద్ధంగా ఉంది” అని అతని సహవాసి (అయిన దైవదూత) అంటాడు.
50:24  أَلْقِيَا فِي جَهَنَّمَ كُلَّ كَفَّارٍ عَنِيدٍ
(అప్పుడు ఈ విధంగా సెలవీయబడుతుంది : ) “పొగరుబోతు అయిన ప్రతి దైవతిరస్కారిని నరకంలో విసరివేయండి.
50:25  مَّنَّاعٍ لِّلْخَيْرِ مُعْتَدٍ مُّرِيبٍ
“వాడు మంచిని అడ్డుకునేవాడు, బరితెగించి పోయేవాడు, అనుమానాల అయ్యగా ప్రవర్తించేవాడు.
50:26  الَّذِي جَعَلَ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ فَأَلْقِيَاهُ فِي الْعَذَابِ الشَّدِيدِ
“వాడు అల్లాహ్ తో పాటు మరో దైవాన్ని చేర్చాడు. కాబట్టి వాణ్ణి తీవ్రమైన శిక్షలో పడవేయండి.”
50:27  قَالَ قَرِينُهُ رَبَّنَا مَا أَطْغَيْتُهُ وَلَٰكِن كَانَ فِي ضَلَالٍ بَعِيدٍ
“మా ప్రభూ! నేనితన్ని పెడదారి పట్టించలేదు. ఇతనే స్వయంగా బహుదూరపు అపమార్గంలో పడిఉన్నాడ”ని అతని సహవాసి (అయిన షైతాన్) అంటాడు.
50:28  قَالَ لَا تَخْتَصِمُوا لَدَيَّ وَقَدْ قَدَّمْتُ إِلَيْكُم بِالْوَعِيدِ
అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు : “నా దగ్గర ఇప్పుడు గొడవ చేయకండి. నేను ముందుగానే హెచ్చరికను (శిక్షకు సంబంధించిన వాగ్దానాన్ని) పంపాను.”
50:29  مَا يُبَدَّلُ الْقَوْلُ لَدَيَّ وَمَا أَنَا بِظَلَّامٍ لِّلْعَبِيدِ
“నా దగ్గర మాట మారదు. నేను నా దాసులకు కొంచెం కూడా అన్యాయం చేసేవాణ్ణి కూడా కాను.”
50:30  يَوْمَ نَقُولُ لِجَهَنَّمَ هَلِ امْتَلَأْتِ وَتَقُولُ هَلْ مِن مَّزِيدٍ
“నువ్వు నిండిపోయావా?” అని మేము నరకాన్ని అడిగిన నాడు, “ఏం, ఇంకా ఏమన్నా ఉందా?” అని అది అంటుంది.
50:31  وَأُزْلِفَتِ الْجَنَّةُ لِلْمُتَّقِينَ غَيْرَ بَعِيدٍ
స్వర్గం భయభక్తులు గల వారికి దగ్గరగా తీసుకురాబడుతుంది – అది ఏమాత్రం దూరాన ఉండదు.
50:32  هَٰذَا مَا تُوعَدُونَ لِكُلِّ أَوَّابٍ حَفِيظٍ
“ఇదీ మీకు వాగ్దానం చేయబడినది. (అల్లాహ్ వైపు) మరలి, నిష్టగా ఉండే ప్రతి ఒక్కరికీ ఉద్దేశించినది.
50:33  مَّنْ خَشِيَ الرَّحْمَٰنَ بِالْغَيْبِ وَجَاءَ بِقَلْبٍ مُّنِيبٍ
“కరుణామయుణ్ణి చూడకుండానే అతనికి భయపడుతూ, (అల్లాహ్ వైపు) మరలే హృదయాన్ని తీసుకువచ్చిన వారికి ఇది ప్రత్యేకించబడింది.
50:34  ادْخُلُوهَا بِسَلَامٍ ۖ ذَٰلِكَ يَوْمُ الْخُلُودِ
“మీరు ఈ స్వర్గంలో ప్రశాంతంగా, సురక్షితంగా ప్రవేశించండి. ఇది నిత్యం నిలిచి ఉండే దినం.”
50:35  لَهُم مَّا يَشَاءُونَ فِيهَا وَلَدَيْنَا مَزِيدٌ
అక్కడ వారికి కోరుకున్నదల్లా లభిస్తుంది. (పైగా) మా దగ్గర మరెంతో ఉన్నది.
50:36  وَكَمْ أَهْلَكْنَا قَبْلَهُم مِّن قَرْنٍ هُمْ أَشَدُّ مِنْهُم بَطْشًا فَنَقَّبُوا فِي الْبِلَادِ هَلْ مِن مَّحِيصٍ
వీరికి పూర్వం ఎన్నో సముదాయాలను మేము తుదముట్టించి ఉన్నాము. వారు బలపరాక్రమాల రీత్యా వీళ్ళకన్నా ఘటికులే. వారు (నిలువ నీడ కోసం) పట్టణాలలో గాలించసాగారు. కాని పారిపోయి ఆశ్రయం పొందేస్థలం ఏదైనా వారికి లభించిందా?!
50:37  إِنَّ فِي ذَٰلِكَ لَذِكْرَىٰ لِمَن كَانَ لَهُ قَلْبٌ أَوْ أَلْقَى السَّمْعَ وَهُوَ شَهِيدٌ
హృదయాన్ని కలిగి ఉండి లేదా శ్రద్దగా ఆలకించి సావధానంగా మసలుకునే ప్రతి వ్యక్తికీ ఇందులో హితబోధన గలదు.
50:38  وَلَقَدْ خَلَقْنَا السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا فِي سِتَّةِ أَيَّامٍ وَمَا مَسَّنَا مِن لُّغُوبٍ
నిశ్చయంగా మేము భూమ్యాకాశాలను, వాటి మధ్య ఉన్న వాటన్నింటినీ (కేవలం) ఆరు దినాలలో సృష్టించాము. మరి మాకు అలసట సోకనయినా లేదు.
50:39  فَاصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ قَبْلَ طُلُوعِ الشَّمْسِ وَقَبْلَ الْغُرُوبِ
కనుక (ఓ ప్రవక్తా!) వారు చెప్పే మాటలపై నువ్వు ఓర్పు వహించు. సూర్యోదయానికి ముందు, సూర్యాస్తమయానికి ముందు కూడా స్తోత్రసమేతంగా నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ ఉండు.
50:40  وَمِنَ اللَّيْلِ فَسَبِّحْهُ وَأَدْبَارَ السُّجُودِ
రాత్రిపూట కూడా (ఏ సమయంలోనయినా) ఆయన పవిత్రతను కొనియాడు, మరి నమాజు తరువాత కూడా (ఆయన్నుస్తుతించు).
50:41  وَاسْتَمِعْ يَوْمَ يُنَادِ الْمُنَادِ مِن مَّكَانٍ قَرِيبٍ
ఇంకా వినుము: ఏ రోజున ఒక పిలిచేవాడొకడు చాలా దగ్గరి స్థలం నుండి పిలుస్తాడో...
50:42  يَوْمَ يَسْمَعُونَ الصَّيْحَةَ بِالْحَقِّ ۚ ذَٰلِكَ يَوْمُ الْخُرُوجِ
ఏ రోజున అందరూ ఒక భీకర అరుపును ఖచ్చితంగా వింటారో, అది (మృతుల సమాధుల నుండి) బయటపడే రోజై ఉంటుంది.
50:43  إِنَّا نَحْنُ نُحْيِي وَنُمِيتُ وَإِلَيْنَا الْمَصِيرُ
మేమే బ్రతికిస్తున్నాం. మేమే చంపుతున్నాం. ఎట్టకేలకు మా వైపుకే మరలి రావలసి ఉన్నది.
50:44  يَوْمَ تَشَقَّقُ الْأَرْضُ عَنْهُمْ سِرَاعًا ۚ ذَٰلِكَ حَشْرٌ عَلَيْنَا يَسِيرٌ
భూమి బ్రద్దలైపోయిన రోజున వారు ఉరుకులు పరుగులతో (బయటికి వస్తారు). ఈపాటి సమీకరణ మాకు చాలా తేలిక.
50:45  نَّحْنُ أَعْلَمُ بِمَا يَقُولُونَ ۖ وَمَا أَنتَ عَلَيْهِم بِجَبَّارٍ ۖ فَذَكِّرْ بِالْقُرْآنِ مَن يَخَافُ وَعِيدِ
వారు చెప్పేదేమిటో మాకు బాగా తెలుసు. (ఓ ప్రవక్తా!) నీవు వాళ్ళను బలవంతపెట్టే వాడివి కావు. కాబట్టి నీవు మా హెచ్చరికలను భయపడేవారికి ఖుర్ఆను ద్వారా బోధపరుస్తూ ఉండు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.