aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

48. సూరా అల్ ఫతహ్

48:1  إِنَّا فَتَحْنَا لَكَ فَتْحًا مُّبِينًا
(ఓ ప్రవక్తా!) మేము నీకు చాలా స్పష్టమైన విజయాన్ని ప్రసాదించాము.
48:2  لِّيَغْفِرَ لَكَ اللَّهُ مَا تَقَدَّمَ مِن ذَنبِكَ وَمَا تَأَخَّرَ وَيُتِمَّ نِعْمَتَهُ عَلَيْكَ وَيَهْدِيَكَ صِرَاطًا مُّسْتَقِيمًا
అల్లాహ్ నీ ముందటి, వెనుకటి పొరపాట్లను మన్నించటానికి, నీపై తన అనుగ్రహాన్ని పరిపూర్ణం గావించటానికి, నిన్ను రుజుమార్గంపై నడిపించటానికి,
48:3  وَيَنصُرَكَ اللَّهُ نَصْرًا عَزِيزًا
ఇంకా, అల్లాహ్ నీకు గొప్ప సహాయం అందజేయటానికిగాను (ఈ విజయం వొసగబడింది).
48:4  هُوَ الَّذِي أَنزَلَ السَّكِينَةَ فِي قُلُوبِ الْمُؤْمِنِينَ لِيَزْدَادُوا إِيمَانًا مَّعَ إِيمَانِهِمْ ۗ وَلِلَّهِ جُنُودُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَكَانَ اللَّهُ عَلِيمًا حَكِيمًا
విశ్వాసుల హృదయాలలో నెమ్మదిని (ప్రశాంతతను, నిబ్బరాన్ని) వేసినవాడు ఆయనే, వారి విశ్వాసంతోపాటు మరింత విశ్వాసం పెంపొందటానికి, భూమ్యాకాశాలలోని సైనిక దళాలన్నీ అల్లాహ్ వే. అల్లాహ్ జ్ఞాన సంపన్నుడు, వివేకవంతుడు.
48:5  لِّيُدْخِلَ الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا وَيُكَفِّرَ عَنْهُمْ سَيِّئَاتِهِمْ ۚ وَكَانَ ذَٰلِكَ عِندَ اللَّهِ فَوْزًا عَظِيمًا
విశ్వసించిన పురుషులను, విశ్వసించిన స్త్రీలను క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేయడానికి, వారక్కడ కలకాలం ఉండేటందుకు, వారి పాపాలను వారినుండి తొలగించేటందుకు (అల్లాహ్ వారికి ఈ స్థిమితాన్ని ప్రసాదించాడు). అల్లాహ్ సన్నిధిలో ఇదే గొప్ప విజయం.
48:6  وَيُعَذِّبَ الْمُنَافِقِينَ وَالْمُنَافِقَاتِ وَالْمُشْرِكِينَ وَالْمُشْرِكَاتِ الظَّانِّينَ بِاللَّهِ ظَنَّ السَّوْءِ ۚ عَلَيْهِمْ دَائِرَةُ السَّوْءِ ۖ وَغَضِبَ اللَّهُ عَلَيْهِمْ وَلَعَنَهُمْ وَأَعَدَّ لَهُمْ جَهَنَّمَ ۖ وَسَاءَتْ مَصِيرًا
అల్లాహ్ విషయంలో చెడుగా అనుమానించే కపట విశ్వాసులైన పురుషులను – కపట విశ్వాసులైన స్త్రీలను, బహుదైవారాధకులైన పురుషులను – బహుదైవారాధకులైన స్త్రీలను దండించటానికి (కూడా అల్లాహ్ ముస్లింలకు మనోనిబ్బరాన్ని నూరిపోశాడు). వాస్తవానికి వారి దురనుమానాలు వారిపైనే పడతాయి. అల్లాహ్ వారిపై ఆగ్రహించాడు. వారిని శపించాడు. వారికోసం నరకాన్ని సిద్ధం చేశాడు. అది అత్యంత చెడ్డ గమ్యస్థానం.
48:7  وَلِلَّهِ جُنُودُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ وَكَانَ اللَّهُ عَزِيزًا حَكِيمًا
మరి భూమ్యాకాశాల సేవలన్నీ అల్లాహ్ వే. అల్లాహ్ మహాశక్తిశాలి, వివేచనా శీలి.
48:8  إِنَّا أَرْسَلْنَاكَ شَاهِدًا وَمُبَشِّرًا وَنَذِيرًا
(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా మేము నిన్ను సాక్ష్యమిచ్చేవానిగా, శుభవార్తను వినిపించేవానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము.
48:9  لِّتُؤْمِنُوا بِاللَّهِ وَرَسُولِهِ وَتُعَزِّرُوهُ وَتُوَقِّرُوهُ وَتُسَبِّحُوهُ بُكْرَةً وَأَصِيلًا
(ఓ ముస్లిములారా!) మీరు అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను విశ్వసించటానికి, అతనికి తోడ్పడటానికి, అతన్నిగౌరవించటానికి, ఉదయం సాయంత్రం అల్లాహ్ పవిత్రతను కొనియాడుతూ ఉండటానికి గాను (మేము ఈ ఏర్పాటు చేశాము).
48:10  إِنَّ الَّذِينَ يُبَايِعُونَكَ إِنَّمَا يُبَايِعُونَ اللَّهَ يَدُ اللَّهِ فَوْقَ أَيْدِيهِمْ ۚ فَمَن نَّكَثَ فَإِنَّمَا يَنكُثُ عَلَىٰ نَفْسِهِ ۖ وَمَنْ أَوْفَىٰ بِمَا عَاهَدَ عَلَيْهُ اللَّهَ فَسَيُؤْتِيهِ أَجْرًا عَظِيمًا
ఎవరయితే (నీ చేతిలో చెయ్యేసి) విధేయతా ప్రమాణం చేస్తున్నారో వారు యదార్థానికి అల్లాహ్ తో ప్రమాణం చేస్తున్నారు. వారి చేతులపై అల్లాహ్ చెయ్యి ఉంది. ఎవడయినా ప్రమాణ భంగానికి పాల్పడినట్లయితే, ఆ ప్రమాణ భంగపు నష్టం తన అత్మకే చేకూర్చుకుంటాడు. మరేవరయినా అల్లాహ్ తో చేసిన వాగ్దానాన్నినెరవేరిస్తే అల్లాహ్ అతనికి త్వరలోనే గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
48:11  سَيَقُولُ لَكَ الْمُخَلَّفُونَ مِنَ الْأَعْرَابِ شَغَلَتْنَا أَمْوَالُنَا وَأَهْلُونَا فَاسْتَغْفِرْ لَنَا ۚ يَقُولُونَ بِأَلْسِنَتِهِم مَّا لَيْسَ فِي قُلُوبِهِمْ ۚ قُلْ فَمَن يَمْلِكُ لَكُم مِّنَ اللَّهِ شَيْئًا إِنْ أَرَادَ بِكُمْ ضَرًّا أَوْ أَرَادَ بِكُمْ نَفْعًا ۚ بَلْ كَانَ اللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرًا
ఇక పల్లెటూరి ప్రజలలో వెనుక ఉండిపోయిన వారు ఇప్పుడు నీ దగ్గరకు వచ్చి, “మా ఆస్తిపాస్తులు, మా ఆలుబిడ్డలు మమ్మల్ని కదలకుండా చేశాయి. తమరు కాస్త మా క్షమాపణకై ప్రార్ధించండి” అని ప్రాధేయపడతారు. వారు తమ హృదయాలలో లేని దాన్ని నోటితో పలుకుతున్నారు. వారికి ఈ విధంగా చెప్పు : “అల్లాహ్ యే గనక మీకేదైనా నష్టాన్ని కలిగించదలిస్తే లేదా మీకేదైనా లాభాన్ని చేకూర్చదలిస్తే మీ విషయంలో అల్లాహ్ నిర్ణయాన్ని అడ్డుకునే అధికారం ఎవరికుంది? పైగా మీరు చేస్తున్నదంతా అల్లాహ్ కు బాగా తెలుసు.
48:12  بَلْ ظَنَنتُمْ أَن لَّن يَنقَلِبَ الرَّسُولُ وَالْمُؤْمِنُونَ إِلَىٰ أَهْلِيهِمْ أَبَدًا وَزُيِّنَ ذَٰلِكَ فِي قُلُوبِكُمْ وَظَنَنتُمْ ظَنَّ السَّوْءِ وَكُنتُمْ قَوْمًا بُورًا
అంతేకాదు, “దైవప్రవక్త గానీ, ముస్లింలు గానీ తమ ఇంటి వారి వైపుకు తిరిగిరావటం అసంభవం అని మీరు తలపోశారు. ఈ ఆలోచన మీ అంతర్యాలను అలరించింది. మొత్తానికి మీ అనుమానాలు బహుచెడ్డవి. అసలు మీరు ముందునుంచే వినాశం పొందే జనుల్లా ఉన్నారు.
48:13  وَمَن لَّمْ يُؤْمِن بِاللَّهِ وَرَسُولِهِ فَإِنَّا أَعْتَدْنَا لِلْكَافِرِينَ سَعِيرًا
మరెవడైతే అల్లాహ్ నూ, ఆయన ప్రవక్తనూ విశ్వసించాడో అలాంటి అవిశ్వాసుల కోసం మేము మండే అగ్నిని సిద్ధం చేసి ఉంచాము.
48:14  وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ يَغْفِرُ لِمَن يَشَاءُ وَيُعَذِّبُ مَن يَشَاءُ ۚ وَكَانَ اللَّهُ غَفُورًا رَّحِيمًا
భూమ్యాకాశాల సర్వసత్తాధికారం అల్లాహ్ దే. తను కోరినవారిని ఆయన క్షమిస్తాడు, తను కోరినవారిని శిక్షిస్తాడు. అల్లాహ్ అపారంగా క్షమించేవాడు, కరుణించేవాడు.
48:15  سَيَقُولُ الْمُخَلَّفُونَ إِذَا انطَلَقْتُمْ إِلَىٰ مَغَانِمَ لِتَأْخُذُوهَا ذَرُونَا نَتَّبِعْكُمْ ۖ يُرِيدُونَ أَن يُبَدِّلُوا كَلَامَ اللَّهِ ۚ قُل لَّن تَتَّبِعُونَا كَذَٰلِكُمْ قَالَ اللَّهُ مِن قَبْلُ ۖ فَسَيَقُولُونَ بَلْ تَحْسُدُونَنَا ۚ بَلْ كَانُوا لَا يَفْقَهُونَ إِلَّا قَلِيلًا
మీరు యుద్ధప్రాప్తిని తీసుకోవటానికి వెళుతున్నప్పుడు, వెనుక ఉండిపోయిన జనులు (గబగబా) వచ్చి, “మమ్మల్ని కూడా మీ వెంట రావటానికి అనుమతించండి” అని అంటారు. వారు అల్లాహ్ మాటనే మార్చివేయజూస్తున్నారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పేయి : “మీరు ఎట్టి పరిస్థితిలోనూ మా వెంట రాలేరు. ఈ మేరకు అల్లాహ్ ముందుగానే సెలవిచ్చాడు.” దానికి వారు, “అది కాదులెండి. మీరు మాపై అసూయ చెందుతున్నారు” అని సమాధానమిస్తారు. అసలు విషయం ఏమిటంటే వారు విషయాన్ని చాలా కొద్దిగానే గ్రహిస్తారు.
48:16  قُل لِّلْمُخَلَّفِينَ مِنَ الْأَعْرَابِ سَتُدْعَوْنَ إِلَىٰ قَوْمٍ أُولِي بَأْسٍ شَدِيدٍ تُقَاتِلُونَهُمْ أَوْ يُسْلِمُونَ ۖ فَإِن تُطِيعُوا يُؤْتِكُمُ اللَّهُ أَجْرًا حَسَنًا ۖ وَإِن تَتَوَلَّوْا كَمَا تَوَلَّيْتُم مِّن قَبْلُ يُعَذِّبْكُمْ عَذَابًا أَلِيمًا
(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం!) పల్లెటూరి ప్రజలలో వెనుక ఉండిపోయిన వారితో ఇలా అను: “త్వరలోనే మీకు, తీవ్రంగా పోరాడే ఒక జాతితో తలపడేందుకు పిలుపు వస్తుంది. మీరు వారితో యుద్ధం చేయవలసి వస్తుంది. లేదా వారంతట వారే ఆత్మసమర్పణ చేసుకుంటారు. (ఆ సమయంలో) మీరు గనక విధేయత చూపితే అల్లాహ్ మీకు ఉత్తమ ప్రతిఫలం ప్రసాదిస్తాడు. ఒకవేళ మీరు లోగడ విముఖత చూపినట్లే విముఖులైతే ఆయన మిమ్మల్ని బాధాకరమైన శిక్షకు లోను చేస్తాడు.”
48:17  لَّيْسَ عَلَى الْأَعْمَىٰ حَرَجٌ وَلَا عَلَى الْأَعْرَجِ حَرَجٌ وَلَا عَلَى الْمَرِيضِ حَرَجٌ ۗ وَمَن يُطِعِ اللَّهَ وَرَسُولَهُ يُدْخِلْهُ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۖ وَمَن يَتَوَلَّ يُعَذِّبْهُ عَذَابًا أَلِيمًا
గుడ్డివానిపై ఎలాంటి నిందారోపణ లేదు, కుంటివానిపై ఎలాంటి నిందారోపణ లేదు, వ్యాధి గ్రస్తునిపై కూడా ఎలాంటి నిందారోపణ లేదు. ఎవడు అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు విధేయుడై మసలుకుంటాడో అల్లాహ్ అతన్ని క్రింద సెలయేరులు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. మరి వెన్నుచూపి తిరిగిపోయిన వానికి వ్యధాభరితమైన శిక్షకు గురిచేస్తాడు.
48:18  لَّقَدْ رَضِيَ اللَّهُ عَنِ الْمُؤْمِنِينَ إِذْ يُبَايِعُونَكَ تَحْتَ الشَّجَرَةِ فَعَلِمَ مَا فِي قُلُوبِهِمْ فَأَنزَلَ السَّكِينَةَ عَلَيْهِمْ وَأَثَابَهُمْ فَتْحًا قَرِيبًا
(ఓ ప్రవక్తా!) విశ్వాసులు చెట్టు క్రింద నీతో (విధేయతా) ప్రమాణం చేస్తూ ఉన్నప్పుడు అల్లాహ్ వారిపట్ల ప్రసన్నుడయ్యాడు. వారి హృదయాలలో ఉన్న దాన్ని ఆయన తెలుసుకున్నాడు. అందువల్ల వారిపై ప్రశాంతస్థితిని (స్థిమితాన్ని) అవతరింపజేశాడు. ఇంకా సమీపంలోనే లభించే విజయాన్ని కూడా అనుగ్రహించాడు.
48:19  وَمَغَانِمَ كَثِيرَةً يَأْخُذُونَهَا ۗ وَكَانَ اللَّهُ عَزِيزًا حَكِيمًا
ఇంకా ఎన్నో విజయసొత్తులను కూడా! వాటిని వారు స్వంతం చేసుకుంటారు. అల్లాహ్ అపారశక్తిమంతుడు, వివేకసంపన్నుడు.
48:20  وَعَدَكُمُ اللَّهُ مَغَانِمَ كَثِيرَةً تَأْخُذُونَهَا فَعَجَّلَ لَكُمْ هَٰذِهِ وَكَفَّ أَيْدِيَ النَّاسِ عَنكُمْ وَلِتَكُونَ آيَةً لِّلْمُؤْمِنِينَ وَيَهْدِيَكُمْ صِرَاطًا مُّسْتَقِيمًا
అల్లాహ్ మీకు ఎన్నో విజయధనాలను గురించి వాగ్దానం చేసి ఉన్నాడు. వాటిని మీరు కైవసం చేసుకుంటారు. దీన్ని మాత్రం ఆయన మీకు తొందరగానే ప్రసాదించాడు. ప్రజల చేతులను మీనుండి కట్టిపడేశాడు – విశ్వాసులకు ఇదొక సూచనగా ఉండటానికి! ఇంకా ఆయన మిమ్మల్ని రుజుమార్గాన నడపటానికి!!
48:21  وَأُخْرَىٰ لَمْ تَقْدِرُوا عَلَيْهَا قَدْ أَحَاطَ اللَّهُ بِهَا ۚ وَكَانَ اللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرًا
ఇంకా – మీరింతవరకూ మీ అదుపులో తీసుకోలేకపోయిన మరికొన్ని విజయాలను కూడా వొసగాడు. అల్లాహ్ వాటిని పరివేష్టించి ఉన్నాడు. అల్లాహ్ ప్రతి దానిపై అధికారం కలవాడు.
48:22  وَلَوْ قَاتَلَكُمُ الَّذِينَ كَفَرُوا لَوَلَّوُا الْأَدْبَارَ ثُمَّ لَا يَجِدُونَ وَلِيًّا وَلَا نَصِيرًا
ఒకవేళ ఈ అవిశ్వాసులు మీతో యుద్ధానికి దిగినా వెన్నుచూపి పారిపోయి ఉండేవారు. మరి తమ కోసం ఏ సహాయకుణ్ణి, రక్షకుణ్ణి వారు పొంది ఉండేవారు కాదు.
48:23  سُنَّةَ اللَّهِ الَّتِي قَدْ خَلَتْ مِن قَبْلُ ۖ وَلَن تَجِدَ لِسُنَّةِ اللَّهِ تَبْدِيلًا
ఇది అల్లాహ్ (సమ్మతించిన) సంప్రదాయం. ఇంతకు ముందు నుంచే ఇది ఆనవాయితీగా వస్తూ వుంది. నీవు అల్లాహ్ సంప్రదాయంలో ఎలాంటి మార్పునూ పొందజాలవు.
48:24  وَهُوَ الَّذِي كَفَّ أَيْدِيَهُمْ عَنكُمْ وَأَيْدِيَكُمْ عَنْهُم بِبَطْنِ مَكَّةَ مِن بَعْدِ أَنْ أَظْفَرَكُمْ عَلَيْهِمْ ۚ وَكَانَ اللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرًا
ముఖ్యంగా మక్కాలో అల్లాహ్ మీకు అవిశ్వాసులపై ప్రాబల్యం ఇచ్చిన మీదట అవిశ్వాసుల చేతులను మీ నుండి, మీ చేతులను వారి నుండి ఆపినవాడు ఆయనే. (అప్పుడు) మీరు చేసేదంతా అల్లాహ్ గమనిస్తూనే ఉన్నాడు.
48:25  هُمُ الَّذِينَ كَفَرُوا وَصَدُّوكُمْ عَنِ الْمَسْجِدِ الْحَرَامِ وَالْهَدْيَ مَعْكُوفًا أَن يَبْلُغَ مَحِلَّهُ ۚ وَلَوْلَا رِجَالٌ مُّؤْمِنُونَ وَنِسَاءٌ مُّؤْمِنَاتٌ لَّمْ تَعْلَمُوهُمْ أَن تَطَئُوهُمْ فَتُصِيبَكُم مِّنْهُم مَّعَرَّةٌ بِغَيْرِ عِلْمٍ ۖ لِّيُدْخِلَ اللَّهُ فِي رَحْمَتِهِ مَن يَشَاءُ ۚ لَوْ تَزَيَّلُوا لَعَذَّبْنَا الَّذِينَ كَفَرُوا مِنْهُمْ عَذَابًا أَلِيمًا
వారే తిరస్కార వైఖరిని అవలంబించినవారు. మిమ్మల్ని మస్జిదె హరాం నుండి అపినవారు. ఖుర్బానీ కొరకు ప్రత్యేకించబడిన పశువులను వాటి ఖుర్బానీ ప్రదేశానికి చేరకుండా అడ్డు తగిలినవారు. (మక్కా నగరంలో) నీకు తెలియని ముస్లిం పురుషులు, (మరెంతో మంది) ముస్లిం స్త్రీలు లేకుండా ఉండి నట్లయితే, తెలీని స్థితిలో వారు మీచేత త్రొక్కివేయబడతారన్న అనుమానం లేకుండా ఉన్నట్లయితే, వారివల్ల నీపై అపవాదు వచ్చే ప్రమాదం లేకపోయినట్లయితే (మీకు యుద్ధం చేసేందుకు అనుమతి ఇవ్వబడి ఉండేది. కాని అలాంటి పరిస్థితి రానివ్వలేదు). అల్లాహ్ తాను కోరిన వారిని తన కారుణ్యంలో చేర్పించుకోవటానికే ఆ పరిస్థితి రానివ్వలేదు. ఒకవేళ వారు (ఆ ముస్లింలు మక్కా నుండి) గనక వేర్పడి (వెళ్ళిపోయి) ఉంటే, మేము వారిలోని తిరస్కారులను బాధాకరమైన శిక్షకు గురిచేసి ఉండేవారము.
48:26  إِذْ جَعَلَ الَّذِينَ كَفَرُوا فِي قُلُوبِهِمُ الْحَمِيَّةَ حَمِيَّةَ الْجَاهِلِيَّةِ فَأَنزَلَ اللَّهُ سَكِينَتَهُ عَلَىٰ رَسُولِهِ وَعَلَى الْمُؤْمِنِينَ وَأَلْزَمَهُمْ كَلِمَةَ التَّقْوَىٰ وَكَانُوا أَحَقَّ بِهَا وَأَهْلَهَا ۚ وَكَانَ اللَّهُ بِكُلِّ شَيْءٍ عَلِيمًا
సత్య తిరస్కారులు తమ హృదయాలలో అహంభావాన్ని, అందునా అజ్ఞానకాలపు అహంభావాన్ని పెంచుకున్న ఆ (క్లిష్ట) తరుణంలో అల్లాహ్ తన ప్రవక్తపై, విశ్వాసులపై తన తరఫున ప్రశాంత స్థితిని అవతరింపజేశాడు. ఇంకా అల్లాహ్ ముస్లింలను భక్తి (తఖ్వా) వాక్కుకు కట్టుబడి ఉండేలా చేశాడు. వారు దానికి తగినవారు, హక్కుదారులు కూడా. అల్లాహ్ ప్రతిదీ బాగా తెలిసినవాడు.
48:27  لَّقَدْ صَدَقَ اللَّهُ رَسُولَهُ الرُّؤْيَا بِالْحَقِّ ۖ لَتَدْخُلُنَّ الْمَسْجِدَ الْحَرَامَ إِن شَاءَ اللَّهُ آمِنِينَ مُحَلِّقِينَ رُءُوسَكُمْ وَمُقَصِّرِينَ لَا تَخَافُونَ ۖ فَعَلِمَ مَا لَمْ تَعْلَمُوا فَجَعَلَ مِن دُونِ ذَٰلِكَ فَتْحًا قَرِيبًا
నిశ్చయంగా అల్లాహ్ తన ప్రవక్తకు సత్యంతో కూడుకున్న స్వప్నాన్ని చూపించాడు. అల్లాహ్ తలిస్తే మీరు తప్పకుండా మస్జిదె హరాం లో సురక్షితంగా ప్రవేశిస్తారు. శిరోముండనం చేయించుకుంటారు, తల వెంట్రుకలను కత్తిరించుకుంటారు. మీకే భయమూ ఉండదు. మీకు తెలియని విషయాలు ఆయనకు తెలుసు. మరి దానికి ముందే ఆయన ఓ శీఘ్ర విజయాన్ని కూడా మీకు అనుగ్రహించాడు.
48:28  هُوَ الَّذِي أَرْسَلَ رَسُولَهُ بِالْهُدَىٰ وَدِينِ الْحَقِّ لِيُظْهِرَهُ عَلَى الدِّينِ كُلِّهِ ۚ وَكَفَىٰ بِاللَّهِ شَهِيدًا
తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని, సత్యధర్మాన్ని ఇచ్చి దాన్ని ఇతర ధర్మాలన్నింటిపై పై చేయిగా ఉండేలా చేయటానికి పంపినవాడు ఆయనే. సాక్షిగా అల్లాహ్ యే చాలు.
48:29  مُّحَمَّدٌ رَّسُولُ اللَّهِ ۚ وَالَّذِينَ مَعَهُ أَشِدَّاءُ عَلَى الْكُفَّارِ رُحَمَاءُ بَيْنَهُمْ ۖ تَرَاهُمْ رُكَّعًا سُجَّدًا يَبْتَغُونَ فَضْلًا مِّنَ اللَّهِ وَرِضْوَانًا ۖ سِيمَاهُمْ فِي وُجُوهِهِم مِّنْ أَثَرِ السُّجُودِ ۚ ذَٰلِكَ مَثَلُهُمْ فِي التَّوْرَاةِ ۚ وَمَثَلُهُمْ فِي الْإِنجِيلِ كَزَرْعٍ أَخْرَجَ شَطْأَهُ فَآزَرَهُ فَاسْتَغْلَظَ فَاسْتَوَىٰ عَلَىٰ سُوقِهِ يُعْجِبُ الزُّرَّاعَ لِيَغِيظَ بِهِمُ الْكُفَّارَ ۗ وَعَدَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ مِنْهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا
ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం అల్లాహ్ ప్రవక్త. ఆయన సల్లల్లాహు అలైహివ సల్లం వెంట ఉన్నవారు అవిశ్వాసులకు కొరుకుడు పడనివారు. ఒండొకరి పట్ల మాత్రం దయార్ద్ర హృదయులు. దైవకృపను, దైవప్రసన్నతను చూరగొనే ప్రయత్నంలో వారు (దైవ సన్నిధిలో) వినమ్రులై వంగటాన్ని, సాష్టాంగపడటాన్ని నీవు చూస్తావు. వారి సాష్టాంగ ప్రణామాల ప్రత్యేక ప్రభావం వారి ముఖారవిందాలపై తొణకిస లాడుతూ ఉంటుంది. వీరికి సంబంధించిన ఈ ఉపమానమే తౌరాతులో ఉంది. ఇంజీలులో (కూడా) వారి ఉపమానం ఉంది. అది ఒక పంటపొలం వంటిది. అది తన మొలకను మొలకెత్తించింది. తరువాత దానిని బలపరిచింది. ఆ తరువాత అది లావు అయింది. ఆ పైన అది తన కాండంపై నిటారుగా నిలబడింది, రైతులను అలరించసాగింది – వారి ద్వారా అవిశ్వాసులను మరింత ఉడికించాలని! వారిలో విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారికి మన్నింపును, గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదిస్తానని అల్లాహ్ వాగ్దానం చేసి ఉన్నాడు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.