aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

47. సూరా ముహమ్మద్

47:1  الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَن سَبِيلِ اللَّهِ أَضَلَّ أَعْمَالَهُمْ
ఎవరయితే తిరస్కార వైఖరిని అవలంబించి, (ప్రజలను) అల్లాహ్ మార్గంలో పోకుండా ఆపారో వారి కర్మలను అల్లాహ్ వృధా చేసేశాడు.
47:2  وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَآمَنُوا بِمَا نُزِّلَ عَلَىٰ مُحَمَّدٍ وَهُوَ الْحَقُّ مِن رَّبِّهِمْ ۙ كَفَّرَ عَنْهُمْ سَيِّئَاتِهِمْ وَأَصْلَحَ بَالَهُمْ
మరెవరైతే విశ్వసించి, సత్కార్యాలు చేశారో, ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం పై అవతరింపజేయబడిన దానిని కూడా విశ్వసించారో – యదార్థానికి తమ ప్రభువు తరఫు నుంచి వచ్చిన సత్యం అదేను – అల్లాహ్ వారి పాపాలను వారి నుంచి దూరం చేశాడు. వారి పరిస్థితిని చక్కదిద్దాడు.
47:3  ذَٰلِكَ بِأَنَّ الَّذِينَ كَفَرُوا اتَّبَعُوا الْبَاطِلَ وَأَنَّ الَّذِينَ آمَنُوا اتَّبَعُوا الْحَقَّ مِن رَّبِّهِمْ ۚ كَذَٰلِكَ يَضْرِبُ اللَّهُ لِلنَّاسِ أَمْثَالَهُمْ
ఇలా ఎందుకు జరిగిందంటే అల్లాహ్ ను తిరస్కరించినవారు అసత్యాన్ని అనుసరించగా, విశ్వాసులేమో తమ ప్రభువు నుండి వచ్చిన సత్యాన్ని అనుసరించారు. ఇలాగే అల్లాహ్ మానవులకు వారి స్థితిగతులను తెలియపరుస్తాడు.
47:4  فَإِذَا لَقِيتُمُ الَّذِينَ كَفَرُوا فَضَرْبَ الرِّقَابِ حَتَّىٰ إِذَا أَثْخَنتُمُوهُمْ فَشُدُّوا الْوَثَاقَ فَإِمَّا مَنًّا بَعْدُ وَإِمَّا فِدَاءً حَتَّىٰ تَضَعَ الْحَرْبُ أَوْزَارَهَا ۚ ذَٰلِكَ وَلَوْ يَشَاءُ اللَّهُ لَانتَصَرَ مِنْهُمْ وَلَٰكِن لِّيَبْلُوَ بَعْضَكُم بِبَعْضٍ ۗ وَالَّذِينَ قُتِلُوا فِي سَبِيلِ اللَّهِ فَلَن يُضِلَّ أَعْمَالَهُمْ
మరి మీరు అవిశ్వాసులను (రణరంగంలో) ఎదుర్కొన్నప్పుడు వారి మెడలపై వ్రేటు వేయండి. వారిని బాగా అణచిన తరువాత గట్టిగా బంధించండి. పిదప మీరు వారిని (పరిహారం తీసుకోకుండా) వదలిపెట్టి మేలు చేసినా లేక పరిహారం పుచ్చుకొని వదలినా ( అది మీ ఇష్టం). యుద్ధం ఆయుధాలను పడవేసే దాకా (ఈ పోరు సాగాలి). (ఆజ్ఞాపించబడినది మాత్రం) ఇదే. అల్లాహ్ గనక తలచుకొంటే (స్వయంగా) తానొక్కడే ప్రతీకారం తీర్చుకునేవాడు. కాని మీలో ఒకరిని ఇంకొకరి ద్వారా పరీక్షించాలన్నది ఆయన అభిమతం. అల్లాహ్ మార్గంలో చంపబడినవారి కర్మలను ఆయన వృధా కానివ్వడు.
47:5  سَيَهْدِيهِمْ وَيُصْلِحُ بَالَهُمْ
ఆయన వారికి సన్మార్గం చూపుతాడు. వారి పరిస్థితిని చక్కదిద్దుతాడు.
47:6  وَيُدْخِلُهُمُ الْجَنَّةَ عَرَّفَهَا لَهُمْ
వారికి (ముందుగా) తెలిపిఉన్న స్వర్గంలో ప్రవేశం కల్పిస్తాడు.
47:7  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِن تَنصُرُوا اللَّهَ يَنصُرْكُمْ وَيُثَبِّتْ أَقْدَامَكُمْ
విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు గనక అల్లాహ్ కు సాయం చేస్తే ఆయన మీకు సాయం చేస్తాడు. మీ పాదాలకు నిలకడను ఇస్తాడు.
47:8  وَالَّذِينَ كَفَرُوا فَتَعْسًا لَّهُمْ وَأَضَلَّ أَعْمَالَهُمْ
మరెవరయితే తిరస్కార వైఖరిని అవలంబించారో వారికి వినాశం తప్పదు. అల్లాహ్ వారి కర్మలను వృధా చేసేస్తాడు.
47:9  ذَٰلِكَ بِأَنَّهُمْ كَرِهُوا مَا أَنزَلَ اللَّهُ فَأَحْبَطَ أَعْمَالَهُمْ
అల్లాహ్ అవతరింపజేసిన వస్తువును వారు ఇష్టపడకపోవటం చేత ఈ విధంగా జరిగింది. అందుకే అల్లాహ్ (కూడా) వారి కర్మలను నిష్ఫలం చేశాడు.
47:10  أَفَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِن قَبْلِهِمْ ۚ دَمَّرَ اللَّهُ عَلَيْهِمْ ۖ وَلِلْكَافِرِينَ أَمْثَالُهَا
ఏమిటి, వారు భూమిలో సంచరించి, తమకు పూర్వం గడచిన వారికి పట్టిన గతేమిటో గమనించలేదా? అల్లాహ్ వారిని సమూలంగా తుడిచిపెట్టేశాడు. తిరస్కారులకు ఇలాంటి శిక్షలే ఉంటాయి.
47:11  ذَٰلِكَ بِأَنَّ اللَّهَ مَوْلَى الَّذِينَ آمَنُوا وَأَنَّ الْكَافِرِينَ لَا مَوْلَىٰ لَهُمْ
విశ్వాసులకు అల్లాహ్ కార్యసాధకునిగా ఉండటం వల్లనూ, అవిశ్వాసులను ఆదుకునే వాడెవడూ లేకపోవటం వల్లనూ ఈ విధంగా జరిగింది.
47:12  إِنَّ اللَّهَ يُدْخِلُ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ۖ وَالَّذِينَ كَفَرُوا يَتَمَتَّعُونَ وَيَأْكُلُونَ كَمَا تَأْكُلُ الْأَنْعَامُ وَالنَّارُ مَثْوًى لَّهُمْ
నిశ్చయంగా అల్లాహ్ విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారిని క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలలో ప్రవేశింపజేస్తాడు. ఇకపోతే తిరస్కార వైఖరిని అవలంబించినవారు; వారు (అదేపనిగా ప్రాపంచిక) ప్రయోజనాలను జుర్రుకుంటున్నారు. పశువులు మెక్కినట్లుగా మెక్కుతున్నారు. మరి నరకాగ్ని వారి నివాసమవుతుంది.
47:13  وَكَأَيِّن مِّن قَرْيَةٍ هِيَ أَشَدُّ قُوَّةً مِّن قَرْيَتِكَ الَّتِي أَخْرَجَتْكَ أَهْلَكْنَاهُمْ فَلَا نَاصِرَ لَهُمْ
(ఓ ప్రవక్తా!) నిన్ను తీసివేసిన నీ నగరంకన్నా బలోపేతమైన నగరాలెన్నో ఉండేవి. (ఆ నగరవాసుల దురాగతాల మూలంగా) మేము వాటిని అంతం చేసేశాము. మరి వారిని ఆదుకునేవాడెవడూ లేకపోయాడు.
47:14  أَفَمَن كَانَ عَلَىٰ بَيِّنَةٍ مِّن رَّبِّهِ كَمَن زُيِّنَ لَهُ سُوءُ عَمَلِهِ وَاتَّبَعُوا أَهْوَاءَهُم
ఏమిటి, తన ప్రభువు తరఫున స్పష్టమైన పద్ధతిపై ఉన్న వ్యక్తి, తన దుష్కార్యాలు అందమైనవిగా అనిపించేలా చేయబడి, తన మనోవాంఛల వెనుక పరుగెత్తే వాని మాదిరిగా కాగలడా?
47:15  مَّثَلُ الْجَنَّةِ الَّتِي وُعِدَ الْمُتَّقُونَ ۖ فِيهَا أَنْهَارٌ مِّن مَّاءٍ غَيْرِ آسِنٍ وَأَنْهَارٌ مِّن لَّبَنٍ لَّمْ يَتَغَيَّرْ طَعْمُهُ وَأَنْهَارٌ مِّنْ خَمْرٍ لَّذَّةٍ لِّلشَّارِبِينَ وَأَنْهَارٌ مِّنْ عَسَلٍ مُّصَفًّى ۖ وَلَهُمْ فِيهَا مِن كُلِّ الثَّمَرَاتِ وَمَغْفِرَةٌ مِّن رَّبِّهِمْ ۖ كَمَنْ هُوَ خَالِدٌ فِي النَّارِ وَسُقُوا مَاءً حَمِيمًا فَقَطَّعَ أَمْعَاءَهُمْ
భయభక్తులు గలవారికి వాగ్దానం చేయబడిన స్వర్గ విశిష్టత ఇలా ఉంటుంది: దుర్వాసనకు (కాలుష్యానికి) తావులేని నీటి కాలువలు ఉన్నాయి. రుచిలో మార్పురాని పాల కాలువలు కూడా ఉన్నాయి. త్రాగే వారికి మృదు మధురంగా ఉండే మద్యం కాలువలు కూడా ఉన్నాయి. ఇంకా వారికోసం అందులో అన్ని రకాల పండ్లు ఫలాలు కూడా ఉన్నాయి. అంతేకాదు, వారి ప్రభువు తరఫునుంచి మన్నింపు కూడా ఉంది. ఏమిటి, ఈ అనుగ్రహాలను పొందినవాడు ఎల్లకాలం అగ్నిలో మాడుతూ ఉండేవాని మాదిరిగా, పేగులను సయితం ముక్కలు ముక్కలుగా చేసి వేసేటటువంటి సలసలా కాగే నీరు ఇవ్వబడే వారి మాదిరిగా కాగలడా?
47:16  وَمِنْهُم مَّن يَسْتَمِعُ إِلَيْكَ حَتَّىٰ إِذَا خَرَجُوا مِنْ عِندِكَ قَالُوا لِلَّذِينَ أُوتُوا الْعِلْمَ مَاذَا قَالَ آنِفًا ۚ أُولَٰئِكَ الَّذِينَ طَبَعَ اللَّهُ عَلَىٰ قُلُوبِهِمْ وَاتَّبَعُوا أَهْوَاءَهُمْ
వారిలో కొందరు (ఉన్నారు. వారు) నీ వైపు చెవియొగ్గి వింటారు. కాని వారు నీ దగ్గరి నుంచి నిష్క్రమించాక, జ్ఞానసంపన్నులతో, “ఇందాక ఈయనగారు చెప్పినదేమిటి?!” అని అడుగుతారు. అల్లాహ్ సీలు వేసినది ఇలాంటి వారి హృదయాలకే. వారు (ఎంతసేపటికీ) తమ మనోవాంఛలను అనుసరిస్తూ ఉంటారు.
47:17  وَالَّذِينَ اهْتَدَوْا زَادَهُمْ هُدًى وَآتَاهُمْ تَقْوَاهُمْ
మరెవరయితే సన్మార్గాన్ని పొందారో, వారి సన్మార్గభాగ్యంలో ఆయన (అల్లాహ్) మరింత వృద్ధిని ప్రసాదించాడు. వారికి వారి ధర్మ నిష్టను (తఖ్వా'ను) కూడా అనుగ్రహించాడు.
47:18  فَهَلْ يَنظُرُونَ إِلَّا السَّاعَةَ أَن تَأْتِيَهُم بَغْتَةً ۖ فَقَدْ جَاءَ أَشْرَاطُهَا ۚ فَأَنَّىٰ لَهُمْ إِذَا جَاءَتْهُمْ ذِكْرَاهُمْ
ఏమిటీ, ప్రళయ ఘడియ హటాత్తుగా తమపైకి రావాలని వారు ఎదురు చూస్తున్నారా? నిస్సందేహంగా దానికి సంబంధించిన సూచనలు (ఇప్పటికే) వచ్చేశాయి. మరి ఆ ఘడియ గనక వచ్చిపడితే హితబోధను గ్రహించే అవకాశం వారికి ఎక్కడ ఉంటుందనీ?
47:19  فَاعْلَمْ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا اللَّهُ وَاسْتَغْفِرْ لِذَنبِكَ وَلِلْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ ۗ وَاللَّهُ يَعْلَمُ مُتَقَلَّبَكُمْ وَمَثْوَاكُمْ
కనుక (ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్యుడు లేడని నువ్వు బాగా తెలుసుకో. నీ పొరపాట్లకుగాను క్షమాపణ వేడుకుంటూ ఉండు. విశ్వాసులైన పురుషుల, విశ్వాసులైన స్త్రీలందరి (మన్నింపు) కోసం కూడా వేడుకుంటూ ఉండు. మీ రాకపోకలను గురించి, మీ విశ్రాంతి స్థలాల గురించి అల్లాహ్‌కు బాగా తెలుసు.
47:20  وَيَقُولُ الَّذِينَ آمَنُوا لَوْلَا نُزِّلَتْ سُورَةٌ ۖ فَإِذَا أُنزِلَتْ سُورَةٌ مُّحْكَمَةٌ وَذُكِرَ فِيهَا الْقِتَالُ ۙ رَأَيْتَ الَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ يَنظُرُونَ إِلَيْكَ نَظَرَ الْمَغْشِيِّ عَلَيْهِ مِنَ الْمَوْتِ ۖ فَأَوْلَىٰ لَهُمْ
"ఏదైనా సూరా ఎందుకు అవతరించలేదు?" అని విశ్వసించినవారు అంటున్నారు. మరి యుద్ధ ప్రస్తావనతో కూడిన చాలా స్పష్టమైన భావం గల సూరా అవతరించినపుడు, హృదయాలలో రోగమున్నవారు, మరణ సమయంలో స్పృహలో లేనివాడు చూసినట్లుగా నిన్ను చూడటాన్ని నువ్వు గమనిస్తావు. (వారు అల్లాహ్‌కు విధేయత చూపి ఉంటే అది) వారి కొరకు చాలా బావుండేది.
47:21  طَاعَةٌ وَقَوْلٌ مَّعْرُوفٌ ۚ فَإِذَا عَزَمَ الْأَمْرُ فَلَوْ صَدَقُوا اللَّهَ لَكَانَ خَيْرًا لَّهُمْ
(వారు గనక) విధేయత (చూపి ఉంటే), మంచిమాట (పలికి ఉంటే), మరి కార్యాచరణ నిర్ణయించబడినపుడు వారు అల్లాహ్‌ పక్షాన సత్యవంతులుగా నిలబడి ఉంటే అది వారి కొరకు శ్రేయోదాయకమై ఉండేది.
47:22  فَهَلْ عَسَيْتُمْ إِن تَوَلَّيْتُمْ أَن تُفْسِدُوا فِي الْأَرْضِ وَتُقَطِّعُوا أَرْحَامَكُمْ
ఒకవేళ మీకు అధికారం లభిస్తే మీరు రాజ్యంలో (భువిలో) అరాచకం సృష్టించటానికి, బంధుత్వ సంబంధాల విచ్ఛిత్తికి పాల్పడటానికి కూడా వెనుకాడరు.
47:23  أُولَٰئِكَ الَّذِينَ لَعَنَهُمُ اللَّهُ فَأَصَمَّهُمْ وَأَعْمَىٰ أَبْصَارَهُمْ
అల్లాహ్‌ శాపం పడినది వీళ్ళపైనే. మరి (అల్లాహ్‌) వారిని చెవిటివారుగా చేశాడు, వారి కంటిచూపును పోగొట్టాడు.
47:24  أَفَلَا يَتَدَبَّرُونَ الْقُرْآنَ أَمْ عَلَىٰ قُلُوبٍ أَقْفَالُهَا
ఏమిటి, వారు ఖుర్‌ఆన్‌ గురించి లోతుగా ఆలోచించరా? లేక వారి హృదయాలపై తాళాలు పడి ఉన్నాయా?
47:25  إِنَّ الَّذِينَ ارْتَدُّوا عَلَىٰ أَدْبَارِهِم مِّن بَعْدِ مَا تَبَيَّنَ لَهُمُ الْهُدَى ۙ الشَّيْطَانُ سَوَّلَ لَهُمْ وَأَمْلَىٰ لَهُمْ
ఎవరయితే తమకు సన్మార్గం తేటతెల్లమైన తరువాత కూడా వీపు త్రిప్పుకుని మరలిపోయారో వారి కొరకు షైతాను ఒక విషయాన్ని (వారి చేష్టను) అందమైనదిగా చిత్రీకరించాడు. వారికి (మోసపూరితమైన) గడువును ఇచ్చాడు.
47:26  ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا لِلَّذِينَ كَرِهُوا مَا نَزَّلَ اللَّهُ سَنُطِيعُكُمْ فِي بَعْضِ الْأَمْرِ ۖ وَاللَّهُ يَعْلَمُ إِسْرَارَهُمْ
ఇలా ఎందుకు జరిగిందంటే, వారు అల్లాహ్‌ అవతరింపజేసిన వాణిని ద్వేషించే వారితో, "మేము కూడా కొన్ని విషయాలలో మీరు చెప్పినట్లు వింటాము" అని అన్నారు. వారి లోపాయికారి వ్యవహారాలన్నీ అల్లాహ్‌కు తెలుసు.
47:27  فَكَيْفَ إِذَا تَوَفَّتْهُمُ الْمَلَائِكَةُ يَضْرِبُونَ وُجُوهَهُمْ وَأَدْبَارَهُمْ
మరి దైవదూతలు వారి ఆత్మలను స్వాధీనం చేసుకుంటూ (ఎడాపెడా) వారి చెంపలపై, వారి పిరుదులపై వాయిస్తూ ఉన్నప్పుడు వారి గతేమవుతుందీ!?
47:28  ذَٰلِكَ بِأَنَّهُمُ اتَّبَعُوا مَا أَسْخَطَ اللَّهَ وَكَرِهُوا رِضْوَانَهُ فَأَحْبَطَ أَعْمَالَهُمْ
వారి ఈ దుర్గతికి కారణం వారు అవలంబించిన మార్గమే. తద్వారా వారు అల్లాహ్‌ను అప్రసన్నుణ్ణి చేశారు. ఆయన ప్రసన్నతను వారు ఇష్టపడలేదు. అందుకే అల్లాహ్‌ వారి కర్మలను వృధా గావించాడు.
47:29  أَمْ حَسِبَ الَّذِينَ فِي قُلُوبِهِم مَّرَضٌ أَن لَّن يُخْرِجَ اللَّهُ أَضْغَانَهُمْ
హృదయాలలో రోగమున్నవారు, అల్లాహ్‌ తమ (ఆంతర్యాల్లోని) కాపట్యాన్ని బహిర్గతం చేయడని అనుకుంటున్నారా?
47:30  وَلَوْ نَشَاءُ لَأَرَيْنَاكَهُمْ فَلَعَرَفْتَهُم بِسِيمَاهُمْ ۚ وَلَتَعْرِفَنَّهُمْ فِي لَحْنِ الْقَوْلِ ۚ وَاللَّهُ يَعْلَمُ أَعْمَالَكُمْ
మేము గనక తలచుకుంటే వారందరినీ నీకు చూపి ఉండేవారము. నువ్వు వాళ్ళ ముఖ కవళికలను బట్టి వాళ్లను పసిగట్ట గలిగేవాడివి. అయినప్పటికీ నువ్వు వాళ్లను వాళ్ల మాటల తీరును బట్టి తెలుసుకోగలవు. మీ కార్యకలాపాలన్నీ అల్లాహ్‌కు తెలుసు సుమా!
47:31  وَلَنَبْلُوَنَّكُمْ حَتَّىٰ نَعْلَمَ الْمُجَاهِدِينَ مِنكُمْ وَالصَّابِرِينَ وَنَبْلُوَ أَخْبَارَكُمْ
మీలో ధర్మయుద్ధం చేసేవారెవరో, సహనమూర్తులెవరో నిగ్గుతేల్చడానికి మేము తప్పకుండా మిమ్మల్ని పరీక్షిస్తాము. మీ స్థితిగతులను కూడా పరికిస్తాము.
47:32  إِنَّ الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَن سَبِيلِ اللَّهِ وَشَاقُّوا الرَّسُولَ مِن بَعْدِ مَا تَبَيَّنَ لَهُمُ الْهُدَىٰ لَن يَضُرُّوا اللَّهَ شَيْئًا وَسَيُحْبِطُ أَعْمَالَهُمْ
తమకు సన్మార్గం స్పష్టమైన తరువాత కూడా తిరస్కార వైఖరిని అవలంబించి, అల్లాహ్‌ మార్గం నుంచి జనులను ఆపుతూ, దైవప్రవక్తకు విరోధులైన వారు ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్‌కు నష్టం కలిగించలేరు. త్వరలోనే అల్లాహ్‌ వారి ఆచరణలను వృధా చేస్తాడు.
47:33  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا أَطِيعُوا اللَّهَ وَأَطِيعُوا الرَّسُولَ وَلَا تُبْطِلُوا أَعْمَالَكُمْ
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు విధేయత చూపండి. ప్రవక్త చెప్పినట్లు వినండి. మీ కర్మలను పాడు చేసుకోకండి.
47:34  إِنَّ الَّذِينَ كَفَرُوا وَصَدُّوا عَن سَبِيلِ اللَّهِ ثُمَّ مَاتُوا وَهُمْ كُفَّارٌ فَلَن يَغْفِرَ اللَّهُ لَهُمْ
నిశ్చయంగా -ఎవరయితే తిరస్కార వైఖరిని అవలంబించారో, అల్లాహ్‌ మార్గం నుంచి ఇతరులను అడ్డుకున్నారో, ఆపై అవిశ్వాస స్థితిలోనే మరణించారో వారిని అల్లాహ్‌ ఎంతమాత్రం క్షమించడు.
47:35  فَلَا تَهِنُوا وَتَدْعُوا إِلَى السَّلْمِ وَأَنتُمُ الْأَعْلَوْنَ وَاللَّهُ مَعَكُمْ وَلَن يَتِرَكُمْ أَعْمَالَكُمْ
కాబట్టి మీరు ధైర్యం కోల్పోయి సంధి కోసం వారిని పిలవకండి. నిజానికి మీదే పైచేయి అవుతుంది. అల్లాహ్‌ మీకు అండగా ఉన్నాడు. ఆయన మీ కర్మలను వృధా చేయటమనేది జరగదు.
47:36  إِنَّمَا الْحَيَاةُ الدُّنْيَا لَعِبٌ وَلَهْوٌ ۚ وَإِن تُؤْمِنُوا وَتَتَّقُوا يُؤْتِكُمْ أُجُورَكُمْ وَلَا يَسْأَلْكُمْ أَمْوَالَكُمْ
నిజానికి ఈ ప్రాపంచిక జీవితం ఓ ఆట, కాలక్షేపం మాత్రమే. మీరు గనక విశ్వసించి, భయభక్తుల వైఖరిని అవలంబించినట్లయితే అల్లాహ్‌ మీ పుణ్యఫలం మీకిస్తాడు. ఆయన మీ నుండి మీ సొమ్ముల్ని అడగడు.
47:37  إِن يَسْأَلْكُمُوهَا فَيُحْفِكُمْ تَبْخَلُوا وَيُخْرِجْ أَضْغَانَكُمْ
ఒకవేళ ఆయన మీనుండి మీ సొమ్మును అడిగితే, ఇవ్వమని మరీ గట్టిగా అడిగితే మీరు పిసినారులుగా ప్రవర్తిస్తారు. మరి ఆయన మీ కాపట్యాన్ని బట్టబయలు చేస్తాడు.
47:38  هَا أَنتُمْ هَٰؤُلَاءِ تُدْعَوْنَ لِتُنفِقُوا فِي سَبِيلِ اللَّهِ فَمِنكُم مَّن يَبْخَلُ ۖ وَمَن يَبْخَلْ فَإِنَّمَا يَبْخَلُ عَن نَّفْسِهِ ۚ وَاللَّهُ الْغَنِيُّ وَأَنتُمُ الْفُقَرَاءُ ۚ وَإِن تَتَوَلَّوْا يَسْتَبْدِلْ قَوْمًا غَيْرَكُمْ ثُمَّ لَا يَكُونُوا أَمْثَالَكُم
ఇదిగో! అల్లాహ్‌ మార్గంలో ఖర్చు చేయండని పిలిచినపుడు మీలో కొందరు పిసినారులుగా వ్యవహరిస్తున్నారు. ఎవడయితే పిసినారితనం వహిస్తున్నాడో అతను తన పట్లనే పిసినారితనం వహిస్తున్నాడు. అల్లాహ్‌ సంపన్నుడు (అక్కరలేనివాడు). మీరేమో పేదలు (ఆయనపై ఆధారపడినవారు). ఒకవేళ మీరు గనక మరలిపోతే ఆయన మీ బదులు - మీ స్థానంలో - మరో జాతివారిని తీసుకువస్తాడు. మరి వారు మీలాంటివారై ఉండరు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.