aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

46. సూరా అల్ ఆహ్ ఖాఫ్

46:1  حم
హా – మీమ్.
46:2  تَنزِيلُ الْكِتَابِ مِنَ اللَّهِ الْعَزِيزِ الْحَكِيمِ
ఈ గ్రంథావతరణ సర్వాధిక్యుడు, వివేకవంతుడైన అల్లాహ్ తరఫున జరిగింది.
46:3  مَا خَلَقْنَا السَّمَاوَاتِ وَالْأَرْضَ وَمَا بَيْنَهُمَا إِلَّا بِالْحَقِّ وَأَجَلٍ مُّسَمًّى ۚ وَالَّذِينَ كَفَرُوا عَمَّا أُنذِرُوا مُعْرِضُونَ
మేము భూమ్యాకాశాలను, వాటి మధ్యనున్న వస్తువులన్నింటినీ సత్య (ప్రణాళికా) బద్ధంగా ఒక నిర్ణీత గడువు కొరకు సృష్టించాము. కాని అవిశ్వాసులు తాము హెచ్చరించబడే విషయం నుండి ముఖం త్రిప్పుకుంటున్నారు.
46:4  قُلْ أَرَأَيْتُم مَّا تَدْعُونَ مِن دُونِ اللَّهِ أَرُونِي مَاذَا خَلَقُوا مِنَ الْأَرْضِ أَمْ لَهُمْ شِرْكٌ فِي السَّمَاوَاتِ ۖ ائْتُونِي بِكِتَابٍ مِّن قَبْلِ هَٰذَا أَوْ أَثَارَةٍ مِّنْ عِلْمٍ إِن كُنتُمْ صَادِقِينَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “చూడండి! మీరు అల్లాహ్ ను వదలి ఎవరెవరిని పూజిస్తున్నారో వారు భూమండలంలో ఏ భాగాన్ని సృష్టించారో కాస్త నాకు చూపుతారా? పోనీ, ఆకాశాలలో అయినా వారికేదన్న వాటా ఉన్నదా?! మీరు సత్యవంతులే అయితే (ఆ మేరకు) దీనికి మునుపు వచ్చిన ఏదైనా గ్రంథం గానీ, లేక ఉల్లేఖించబడే ఏదైనా జ్ఞానాన్ని గాని నా వద్దకు తీసుకురండి.
46:5  وَمَنْ أَضَلُّ مِمَّن يَدْعُو مِن دُونِ اللَّهِ مَن لَّا يَسْتَجِيبُ لَهُ إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ وَهُمْ عَن دُعَائِهِمْ غَافِلُونَ
అల్లాహ్ ను వదలి ప్రళయదినం వరకూ తన మొరను ఆమోదించలేని వారిని, పైగా తను మొరపెట్టుకున్న సంగతి కూడా తెలియని వారిని మొరపెట్టుకునేవానికన్నా పెద్ద మార్గభ్రష్టుడు ఎవడుంటాడు?
46:6  وَإِذَا حُشِرَ النَّاسُ كَانُوا لَهُمْ أَعْدَاءً وَكَانُوا بِعِبَادَتِهِمْ كَافِرِينَ
మానవులంతా సమీకరించబడినపుడు వారు వారికి (తమ భక్తులకు) శత్రువులై పోతారు. వీళ్ళ పూజాపురస్కారాలను కూడా వాళ్ళు త్రోసిపుచ్చుతారు.
46:7  وَإِذَا تُتْلَىٰ عَلَيْهِمْ آيَاتُنَا بَيِّنَاتٍ قَالَ الَّذِينَ كَفَرُوا لِلْحَقِّ لَمَّا جَاءَهُمْ هَٰذَا سِحْرٌ مُّبِينٌ
స్పష్టమైన మా వాక్యాలను వారికి చదివి వినిపించినప్పుడు, తమ వద్దకు వచ్చేసిన సత్యానుద్దేశించి ఈ తిరస్కారులు, “ఇదొక పచ్చి ఇంద్రజాలం” అంటారు.
46:8  أَمْ يَقُولُونَ افْتَرَاهُ ۖ قُلْ إِنِ افْتَرَيْتُهُ فَلَا تَمْلِكُونَ لِي مِنَ اللَّهِ شَيْئًا ۖ هُوَ أَعْلَمُ بِمَا تُفِيضُونَ فِيهِ ۖ كَفَىٰ بِهِ شَهِيدًا بَيْنِي وَبَيْنَكُمْ ۖ وَهُوَ الْغَفُورُ الرَّحِيمُ
ఏమిటి, “అతనే (ప్రవక్తే) స్వయంగా దీన్ని కల్పించాడ”ని వారంటున్నారా? (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “ఒకవేళ నేనే దీన్ని స్వయంగా కల్పించుకుని ఉంటే, మీరు అల్లాహ్ సమక్షంలో నాకు ఏవిధంగానూ తోడ్పడలేరు. మీరు దీని (ఖుర్ఆన్) గురించి చెప్పే లేక వినే విషయాలన్నీ అల్లాహ్ కు బాగా తెలుసు. మీకూ – నాకూ మధ్య సాక్షిగా ఆయన ఒక్కడే చాలు. ఆయన క్షమించేవాడు, దయ చూపేవాడు.
46:9  قُلْ مَا كُنتُ بِدْعًا مِّنَ الرُّسُلِ وَمَا أَدْرِي مَا يُفْعَلُ بِي وَلَا بِكُمْ ۖ إِنْ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰ إِلَيَّ وَمَا أَنَا إِلَّا نَذِيرٌ مُّبِينٌ
వారికి చెప్పు : “నేను కొత్తగా వచ్చిన ప్రవక్తనేమీ కాను. (రేపు) నా పట్లా, మీ పట్లా జరిగే వ్యవహారం ఎలాంటిదో కూడా నాకు తెలీదు. నా వద్దకు పంపబడిన సందేశాన్ని (వహీని) మాత్రమే నేను అనుసరిస్తాను. నేను చాలా స్పష్టంగా హెచ్చరించే వాణ్ణి మాత్రమే.”
46:10  قُلْ أَرَأَيْتُمْ إِن كَانَ مِنْ عِندِ اللَّهِ وَكَفَرْتُم بِهِ وَشَهِدَ شَاهِدٌ مِّن بَنِي إِسْرَائِيلَ عَلَىٰ مِثْلِهِ فَآمَنَ وَاسْتَكْبَرْتُمْ ۖ إِنَّ اللَّهَ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “చూడండి! ఒకవేళ ఇది (ఈ ఖుర్ఆన్) అల్లాహ్ తరఫు నుంచే వచ్చి ఉండి, మీరు దాన్ని తిరస్కరించినట్లయితే ఇస్రాయీలు సంతతికి చెందిన ఒక సాక్షి ఇలాంటి (ఒక గ్రంథానికి) సాక్ష్యాన్ని కూడా ఇచ్చి, అతను విశ్వసించి ఉండగా మీరు మాత్రం అహంకారం ప్రదర్శిస్తే (మీ గతేమవుతుందో ఆలోచించారా?) నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గులకు సన్మార్గం చూపడు.”
46:11  وَقَالَ الَّذِينَ كَفَرُوا لِلَّذِينَ آمَنُوا لَوْ كَانَ خَيْرًا مَّا سَبَقُونَا إِلَيْهِ ۚ وَإِذْ لَمْ يَهْتَدُوا بِهِ فَسَيَقُولُونَ هَٰذَا إِفْكٌ قَدِيمٌ
అవిశ్వాసులు విశ్వసించిన వారినుద్దేశించి, “ఒకవేళ ఇది (ఈ ధర్మం) గనక శ్రేయస్కరమైనదై ఉంటే వీళ్ళు మాకన్నా ముందు దీని వైపుకు వెళ్లి ఉండేవారు కారు” అని అంటున్నారు. వారెలాగూ ఈ గ్రంథం ద్వారా సన్మార్గం పొందలేదు. అందువల్ల ‘ఇదొక పాత అబద్ధం’ అని కొట్టిపారేస్తారు.
46:12  وَمِن قَبْلِهِ كِتَابُ مُوسَىٰ إِمَامًا وَرَحْمَةً ۚ وَهَٰذَا كِتَابٌ مُّصَدِّقٌ لِّسَانًا عَرَبِيًّا لِّيُنذِرَ الَّذِينَ ظَلَمُوا وَبُشْرَىٰ لِلْمُحْسِنِينَ
దీనికి పూర్వం మూసా గ్రంథం సారధిగా, కారుణ్యంగా ఉండేది. కాగా; ఈ గ్రంథం దాన్ని ధృవీకరించేదిగా అరబీ భాషలో ఉన్నది. దుర్మార్గులను హెచ్చరించటానికి, సద్వర్తనులకు శుభవార్త ఇవ్వటానికి!
46:13  إِنَّ الَّذِينَ قَالُوا رَبُّنَا اللَّهُ ثُمَّ اسْتَقَامُوا فَلَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
ఎవరైతే “మా ప్రభువు అల్లాహ్ యే” అని పలికి, తర్వాత దానిపై గట్టిగా నిలబడ్డారో వారికెలాంటి భయంగానీ, దుఃఖంగానీ లేదు.
46:14  أُولَٰئِكَ أَصْحَابُ الْجَنَّةِ خَالِدِينَ فِيهَا جَزَاءً بِمَا كَانُوا يَعْمَلُونَ
వారే స్వర్గవాసులు. వారందులో కలకాలం ఉంటారు. వారు చేసుకున్న కర్మలకు ప్రతిఫలం (ఇది).
46:15  وَوَصَّيْنَا الْإِنسَانَ بِوَالِدَيْهِ إِحْسَانًا ۖ حَمَلَتْهُ أُمُّهُ كُرْهًا وَوَضَعَتْهُ كُرْهًا ۖ وَحَمْلُهُ وَفِصَالُهُ ثَلَاثُونَ شَهْرًا ۚ حَتَّىٰ إِذَا بَلَغَ أَشُدَّهُ وَبَلَغَ أَرْبَعِينَ سَنَةً قَالَ رَبِّ أَوْزِعْنِي أَنْ أَشْكُرَ نِعْمَتَكَ الَّتِي أَنْعَمْتَ عَلَيَّ وَعَلَىٰ وَالِدَيَّ وَأَنْ أَعْمَلَ صَالِحًا تَرْضَاهُ وَأَصْلِحْ لِي فِي ذُرِّيَّتِي ۖ إِنِّي تُبْتُ إِلَيْكَ وَإِنِّي مِنَ الْمُسْلِمِينَ
మేము మనిషికి, తన తల్లిదండ్రుల యెడల ఉత్తమరీతిలో వ్యవహరించవలసినదిగా తాకీదు చేశాము. అతని తల్లి బాధను భరిస్తూ గర్భంలో అతన్ని మోసింది. బాధను భరిస్తూనే అతన్ని ప్రసవించింది. అతన్ని గర్భంలో మోయటానికి, అతని పాలు విడిపించటానికి ముఫ్ఫై మాసాల కాలం పట్టింది. తుదకు అతను పూర్తి పరిపక్వతకు, అంటే నలభై ఏళ్లప్రాయానికి చేరుకున్నప్పుడు ఇలా విన్నవించుకున్నాడు : “నా ప్రభూ! నీవు నాపై, నా తల్లిదండ్రులపై కురిపించిన అనుగ్రహ భాగ్యాలకుగాను కృతఙ్ఞతలు తెలుపుకునే, నీ ప్రసన్నతను చూరగొనే విధంగా సత్కార్యాలు చేసే సద్బుద్ధిని నాకు ప్రసాదించు. ఇంకా నా సంతానాన్ని కూడా సజ్జనులుగా తీర్చిదిద్దు. నేను నీ వైపునకే మరలుతున్నాను. నేను నీ విధేయులలో ఒకణ్ణి.”
46:16  أُولَٰئِكَ الَّذِينَ نَتَقَبَّلُ عَنْهُمْ أَحْسَنَ مَا عَمِلُوا وَنَتَجَاوَزُ عَن سَيِّئَاتِهِمْ فِي أَصْحَابِ الْجَنَّةِ ۖ وَعْدَ الصِّدْقِ الَّذِي كَانُوا يُوعَدُونَ
ఇలాంటి వారి సత్కార్యాలనే మేము స్వీకరిస్తాము. వారి తప్పులను క్షమిస్తాము. వారికి చేయబడిన సత్య వాగ్దానం ప్రకారం వారు స్వర్గవాసులలో ఉంటారు.
46:17  وَالَّذِي قَالَ لِوَالِدَيْهِ أُفٍّ لَّكُمَا أَتَعِدَانِنِي أَنْ أُخْرَجَ وَقَدْ خَلَتِ الْقُرُونُ مِن قَبْلِي وَهُمَا يَسْتَغِيثَانِ اللَّهَ وَيْلَكَ آمِنْ إِنَّ وَعْدَ اللَّهِ حَقٌّ فَيَقُولُ مَا هَٰذَا إِلَّا أَسَاطِيرُ الْأَوَّلِينَ
మరెవరయితే తన తల్లిదండ్రులతో, “ఛీ, (నేను మీతో విసిగివేసారి పోయాను). నేను చచ్చాక మళ్ళి లేపబడతాననే మీరు (పద్దాకా) చెబుతూ ఉంటారా ఏమిటి?! నాకు పూర్వం కూడా ఎన్నో తరాలు గతించాయి తెలుసా?!” అని అంటాడో, అతనికి సమాధానంగా వారిద్దరూ (తల్లిదండ్రులు) అల్లాహ్ సహాయం వేడుకుంటూ, “నీ పాడుగాను! ఒరేయ్ నువ్వు విశ్వసించరా! అల్లాహ్ వాగ్దానం తప్పకుండా నిజమవుతుందిరా” అని అంటారు. దానికతను “ఇవన్నీ పూర్వీకుల పసలేని గాధలు” అంటాడు.
46:18  أُولَٰئِكَ الَّذِينَ حَقَّ عَلَيْهِمُ الْقَوْلُ فِي أُمَمٍ قَدْ خَلَتْ مِن قَبْلِهِم مِّنَ الْجِنِّ وَالْإِنسِ ۖ إِنَّهُمْ كَانُوا خَاسِرِينَ
వీళ్లపైనే (అల్లాహ్‌ శిక్ష అవతరిస్తుందనే) వాక్కు రూఢీ అయింది. వీరికి పూర్వం గతించిన జిన్నాతుల, మానవుల వర్గాల లోనే వీరు కూడా చేరిపోతారు. నిస్సందేహంగా వీళ్లంతా నష్ట పోయేవారే.
46:19  وَلِكُلٍّ دَرَجَاتٌ مِّمَّا عَمِلُوا ۖ وَلِيُوَفِّيَهُمْ أَعْمَالَهُمْ وَهُمْ لَا يُظْلَمُونَ
ప్రతి ఒక్కరికీ వారి వారి కర్మలను బట్టి తరగతులు లభిస్తాయి. వారి ఆచరణలకుగాను సంపూర్ణ ప్రతిఫలం లభించటానికి (ఈ తరగతులు నిర్ధారించబడ్డాయి). వారికి ఏ విధమైన అన్యాయం కూడా జరగదు.
46:20  وَيَوْمَ يُعْرَضُ الَّذِينَ كَفَرُوا عَلَى النَّارِ أَذْهَبْتُمْ طَيِّبَاتِكُمْ فِي حَيَاتِكُمُ الدُّنْيَا وَاسْتَمْتَعْتُم بِهَا فَالْيَوْمَ تُجْزَوْنَ عَذَابَ الْهُونِ بِمَا كُنتُمْ تَسْتَكْبِرُونَ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ وَبِمَا كُنتُمْ تَفْسُقُونَ
అవిశ్వాసులు నరకాగ్ని ముందుకు తీసుకురాబడిన రోజున (వారితో ఇలా అనబడుతుంది:) మీరు మీ మంచి మంచి వస్తువులను ప్రాపంచిక జీవితంలోనే పొందారు. వాటిని అక్కడే అనుభవించారు. ఈ రోజు మీకు అవమానకరమైన శిక్ష విధించబడుతుంది. ఎందుకంటే మీరు భువిలో అకారణంగా అహంకారం ప్రదర్శించేవారు, ఆజ్ఞోల్లంఘనకు పాల్పడేవారు.
46:21  وَاذْكُرْ أَخَا عَادٍ إِذْ أَنذَرَ قَوْمَهُ بِالْأَحْقَافِ وَقَدْ خَلَتِ النُّذُرُ مِن بَيْنِ يَدَيْهِ وَمِنْ خَلْفِهِ أَلَّا تَعْبُدُوا إِلَّا اللَّهَ إِنِّي أَخَافُ عَلَيْكُمْ عَذَابَ يَوْمٍ عَظِيمٍ
మరి ఆద్‌ (జాతి) సోదరుడు తన జాతి వారిని ఇసుక గుట్టల వద్ద హెచ్చరించిన సంగతిని జ్ఞాపకం చేసుకో. అతనికి పూర్వం కూడా హెచ్చరిక చేసేవారు గడిచారు, అతని తరువాత కూడా. "మీరు అల్లాహ్‌ను తప్ప ఇతరులను పూజించకండి. ఒక మహానాడు మీపై విరుచుకుపడే శిక్ష గురించి నేను భయపడుతున్నాను" (అని అతను హెచ్చరించాడు).
46:22  قَالُوا أَجِئْتَنَا لِتَأْفِكَنَا عَنْ آلِهَتِنَا فَأْتِنَا بِمَا تَعِدُنَا إِن كُنتَ مِنَ الصَّادِقِينَ
దానికి వారు, "ఏమిటి, మమ్మల్ని మా దేవుళ్ళ (పూజ) నుంచి మళ్ళించడానికేనా నువ్వు వచ్చింది?! ఒకవేళ నువ్వు సత్యవంతుడవే అయితే, ఏదీ నువ్వు మాతో వాగ్దానం చేసే ఆ ఆపదను మాపైకి తీసుకురా!" అని ఎద్దేవా చేశారు.
46:23  قَالَ إِنَّمَا الْعِلْمُ عِندَ اللَّهِ وَأُبَلِّغُكُم مَّا أُرْسِلْتُ بِهِ وَلَٰكِنِّي أَرَاكُمْ قَوْمًا تَجْهَلُونَ
(హూద్‌) ఇలా అన్నాడు: "(దాని) జ్ఞానం అల్లాహ్‌ వద్దనే ఉంది. నేను మట్టుకు నాకిచ్చి పంపబడిన సందేశాన్ని మీకు అందజేస్తున్నాను. కాని మీరు మాత్రం మూర్ఖజనంగా కనబడుతున్నారు."
46:24  فَلَمَّا رَأَوْهُ عَارِضًا مُّسْتَقْبِلَ أَوْدِيَتِهِمْ قَالُوا هَٰذَا عَارِضٌ مُّمْطِرُنَا ۚ بَلْ هُوَ مَا اسْتَعْجَلْتُم بِهِ ۖ رِيحٌ فِيهَا عَذَابٌ أَلِيمٌ
మరి వాళ్లు ఆ విపత్తును కారు మేఘం రూపంలో తమ లోయల వైపునకు రావటం చూసి, "ఇది మాపై వర్షాన్ని కురిపించే మబ్బు తునక" అని చెప్పుకోసాగారు. కాదు, నిజానికది మీరు తొందరపెట్టిన (విపత్కర) మేఘం. అదొక పెనుగాలి. అందులో వ్యధాభరితమైన శిక్ష ఉంది.
46:25  تُدَمِّرُ كُلَّ شَيْءٍ بِأَمْرِ رَبِّهَا فَأَصْبَحُوا لَا يُرَىٰ إِلَّا مَسَاكِنُهُمْ ۚ كَذَٰلِكَ نَجْزِي الْقَوْمَ الْمُجْرِمِينَ
తన ప్రభువు ఆజ్ఞపై అది సర్వాన్నీ తుడిచిపెట్టేస్తుంది. అంతే! తెల్లవారేసరికి వారి నివాస గృహాలు తప్ప మరేమీ కనిపించలేదు. అపరాధ జనులను మేము ఇలాగే దండిస్తాము.
46:26  وَلَقَدْ مَكَّنَّاهُمْ فِيمَا إِن مَّكَّنَّاكُمْ فِيهِ وَجَعَلْنَا لَهُمْ سَمْعًا وَأَبْصَارًا وَأَفْئِدَةً فَمَا أَغْنَىٰ عَنْهُمْ سَمْعُهُمْ وَلَا أَبْصَارُهُمْ وَلَا أَفْئِدَتُهُم مِّن شَيْءٍ إِذْ كَانُوا يَجْحَدُونَ بِآيَاتِ اللَّهِ وَحَاقَ بِهِم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
నిశ్చయంగా మేము వారికి (ఆదు జాతి వారికి), మీకు సయితం ఇవ్వని ఎన్నో శక్తియుక్తులను ఇచ్చాము. మేము వారికి చెవులను, కళ్లను, హృదయాలను కూడా ప్రసాదించాము. కాని వారు అల్లాహ్‌ వాక్యాలను త్రోసిపుచ్చినప్పుడు వారి చెవులుగానీ, కళ్లుగానీ, వారి హృదయాలుగానీ వారికే విధంగానూ ఉపకరించలేదు. వారు దేన్ని గురించి ఎగతాళి చేసేవారో చివరకు అదే వారిని చుట్టుముట్టింది.
46:27  وَلَقَدْ أَهْلَكْنَا مَا حَوْلَكُم مِّنَ الْقُرَىٰ وَصَرَّفْنَا الْآيَاتِ لَعَلَّهُمْ يَرْجِعُونَ
మీ చుట్టుప్రక్కల ఉండే ఎన్నో జనవాసాలను మేము తుడిచి పెట్టేశాము. వారు దారికి వస్తారేమోనన్న ఉద్దేశంతో మేము రకరకాలుగా మా సూచనలను వారికి వివరించాము.
46:28  فَلَوْلَا نَصَرَهُمُ الَّذِينَ اتَّخَذُوا مِن دُونِ اللَّهِ قُرْبَانًا آلِهَةً ۖ بَلْ ضَلُّوا عَنْهُمْ ۚ وَذَٰلِكَ إِفْكُهُمْ وَمَا كَانُوا يَفْتَرُونَ
దైవ సామీప్యం పొందటానికి వారు - అల్లాహ్‌ను వదలి - ఆశ్రయించిన దేముళ్లు వారినెందుకు ఆదుకోలేదు? పైగా వారు వీళ్లకు అస్సలు కనబడకుండా పోయారు. (నిజానికి) అది వారి అసత్యం, వారు కల్పించుకున్న అభూతకల్పన మాత్రమే.
46:29  وَإِذْ صَرَفْنَا إِلَيْكَ نَفَرًا مِّنَ الْجِنِّ يَسْتَمِعُونَ الْقُرْآنَ فَلَمَّا حَضَرُوهُ قَالُوا أَنصِتُوا ۖ فَلَمَّا قُضِيَ وَلَّوْا إِلَىٰ قَوْمِهِم مُّنذِرِينَ
(ఓ ప్రవక్తా!) జిన్నుల సమూహం ఒకదానిని మేము ఖుర్‌ఆన్‌ వినేందుకు నీ వైపునకు పంపిన సంగతిని కాస్త మననం చేసుకో. వారు ప్రవక్త దగ్గరకు చేరుకున్నప్పుడు, "నిశ్శబ్దంగా వినండి" అని (పరస్పరం) చెప్పుకున్నారు. మరి ఆ పారాయణం ముగియ గానే, తమ వర్గం వారిని హెచ్చరించటానికి వాళ్ల వద్దకు తిరిగి వచ్చారు.
46:30  قَالُوا يَا قَوْمَنَا إِنَّا سَمِعْنَا كِتَابًا أُنزِلَ مِن بَعْدِ مُوسَىٰ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ يَهْدِي إِلَى الْحَقِّ وَإِلَىٰ طَرِيقٍ مُّسْتَقِيمٍ
వారిలా అన్నారు : "ఓ మా జాతివారలారా! మూసా తరువాత అవతరింపజేయబడిన గ్రంథాన్ని మేము విన్నాము. అది తనకు పూర్వం ఉన్న దైవగ్రంథాలన్నింటినీ ధృవీకరిస్తోంది. ఇంకా - అది సత్యధర్మం వైపునకు, తిన్నని దారి వైపునకూ దర్శకత్వం వహిస్తోంది.
46:31  يَا قَوْمَنَا أَجِيبُوا دَاعِيَ اللَّهِ وَآمِنُوا بِهِ يَغْفِرْ لَكُم مِّن ذُنُوبِكُمْ وَيُجِرْكُم مِّنْ عَذَابٍ أَلِيمٍ
"ఓ మా జాతివారలారా! అల్లాహ్‌ వైపునకు పిలిచేవాని మాట వినండి. అతన్ని విశ్వసించండి. అల్లాహ్‌ మీ పాపాలను మన్నిస్తాడు. బాధాకరమైన శిక్ష నుండి మిమ్మల్ని రక్షిస్తాడు.
46:32  وَمَن لَّا يُجِبْ دَاعِيَ اللَّهِ فَلَيْسَ بِمُعْجِزٍ فِي الْأَرْضِ وَلَيْسَ لَهُ مِن دُونِهِ أَوْلِيَاءُ ۚ أُولَٰئِكَ فِي ضَلَالٍ مُّبِينٍ
"అల్లాహ్‌వైపు పిలిచేవాని మాట విననివాడు భూమిలో ఎక్కడా (పారిపోయి అల్లాహ్‌ను) అలుపుకు గురిచేయలేడు. అల్లాహ్‌ తప్ప అతనికి సాయపడేవారు కూడా ఎవరూ ఉండరు. ఇలాంటి వారు స్పష్టమైన మార్గభ్రష్టతకు లోనై ఉన్నారు."
46:33  أَوَلَمْ يَرَوْا أَنَّ اللَّهَ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَلَمْ يَعْيَ بِخَلْقِهِنَّ بِقَادِرٍ عَلَىٰ أَن يُحْيِيَ الْمَوْتَىٰ ۚ بَلَىٰ إِنَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
ఏమిటి, భూమ్యాకాశాలను సృష్టించిన అల్లాహ్‌, వాటిని సృష్టించటంలో ఏ విధంగానయితే అలసిపోలేదో అదే విధంగా ఆయన మృతులను తిరిగి బ్రతికించగలడని వారు చూడటం లేదా? అవును, ఆయన ప్రతిదీ చేయగల అధికారం కలవాడు.
46:34  وَيَوْمَ يُعْرَضُ الَّذِينَ كَفَرُوا عَلَى النَّارِ أَلَيْسَ هَٰذَا بِالْحَقِّ ۖ قَالُوا بَلَىٰ وَرَبِّنَا ۚ قَالَ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ
అవిశ్వాసులు నరకం వద్దకు తేబడిన రోజున, "ఏమిటి, ఇది సత్యం కాదా?!" (అని వారిని ప్రశ్నించటం జరుగుతుంది). "అవును. మా ప్రభువు సాక్షిగా! (ఇది సత్యమే" అని వారి నుంచి సమాధానం వస్తుంది). "సరే! ఇప్పుడు మీ తిరస్కార వైఖరికి బదులుగా శిక్షను చవిచూడండి" అనంటాడు (అల్లాహ్‌).
46:35  فَاصْبِرْ كَمَا صَبَرَ أُولُو الْعَزْمِ مِنَ الرُّسُلِ وَلَا تَسْتَعْجِل لَّهُمْ ۚ كَأَنَّهُمْ يَوْمَ يَرَوْنَ مَا يُوعَدُونَ لَمْ يَلْبَثُوا إِلَّا سَاعَةً مِّن نَّهَارٍ ۚ بَلَاغٌ ۚ فَهَلْ يُهْلَكُ إِلَّا الْقَوْمُ الْفَاسِقُونَ
కనుక (ఓ ప్రవక్తా!) సాహసమూర్తులైన ప్రవక్తలు ఓపిక పట్టినట్లే నువ్వు కూడా ఓపిక పట్టు. వారి విషయంలో (శిక్ష కోసం) తొందరపెట్టకు. వారికి వాగ్దానం చేయబడుతున్న దానిని (శిక్షను) వారు కళ్ళారా చూసుకున్నప్పుడు, తాము (మహా అంటే) ఒక దినములోని ఒక గడియ మాత్రమే (ప్రపంచంలో) ఉండి ఉంటామని వారికి అనిపిస్తుంది. ఇదీ (నీవు అందజేయవలసిన) సందేశం! ఇక అవిధేయులు మాత్రమే సర్వనాశనం చేయబడతారు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.