aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

40. సూరా అల్ మూమిన్

40:1  حم
హా మీమ్‌.
40:2  تَنزِيلُ الْكِتَابِ مِنَ اللَّهِ الْعَزِيزِ الْعَلِيمِ
ఈ గ్రంథావతరణ అల్లాహ్‌ తరఫున జరిగింది. ఆయన మహాశక్తిమంతుడు, సర్వం తెలిసినవాడు.
40:3  غَافِرِ الذَّنبِ وَقَابِلِ التَّوْبِ شَدِيدِ الْعِقَابِ ذِي الطَّوْلِ ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ إِلَيْهِ الْمَصِيرُ
పాపాలను క్షమించేవాడు, పశ్చాత్తాపాన్ని ఆమోదించేవాడు, కఠినంగా శిక్షించేవాడు, (అనంతంగా) అనుగ్రహించేవాడు - ఆయన తప్ప వేరే ఆరాధ్య దైవం లేడు. ఆయన వద్దకే మరలి పోవలసి ఉన్నది.
40:4  مَا يُجَادِلُ فِي آيَاتِ اللَّهِ إِلَّا الَّذِينَ كَفَرُوا فَلَا يَغْرُرْكَ تَقَلُّبُهُمْ فِي الْبِلَادِ
సత్యతిరస్కారులు మాత్రమే అల్లాహ్‌ వాక్యాల విషయంలో వాదులాడుతారు. కాబట్టి పట్టణ ప్రాంతాలలో వారి స్వైర విహారం నిన్ను మోసపుచ్చకూడదు సుమా!
40:5  كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ وَالْأَحْزَابُ مِن بَعْدِهِمْ ۖ وَهَمَّتْ كُلُّ أُمَّةٍ بِرَسُولِهِمْ لِيَأْخُذُوهُ ۖ وَجَادَلُوا بِالْبَاطِلِ لِيُدْحِضُوا بِهِ الْحَقَّ فَأَخَذْتُهُمْ ۖ فَكَيْفَ كَانَ عِقَابِ
వీరికి పూర్వం నూహ్‌ జాతి వారు, వారి తరువాత వచ్చిన వర్గాల వారు కూడా ధిక్కార వైఖరికి ఒడిగట్టారు. ప్రతి సముదాయం వారూ తమ ప్రవక్తను పట్టుకో జూశారు. అసత్యంతో సత్యాన్ని దెబ్బతీసేందుకు పిడివాదనలు చేశారు. అందుకే నేను వాళ్ళను పట్టుకున్నాను. మరి నా తరఫున ఎలా దెబ్బపడిందో (చూడు)!
40:6  وَكَذَٰلِكَ حَقَّتْ كَلِمَتُ رَبِّكَ عَلَى الَّذِينَ كَفَرُوا أَنَّهُمْ أَصْحَابُ النَّارِ
ఈ విధంగా - సత్యతిరస్కారులు నరక వాసులవుతారన్న నీ ప్రభువు వాక్కు నిజమని రుజువయింది.
40:7  الَّذِينَ يَحْمِلُونَ الْعَرْشَ وَمَنْ حَوْلَهُ يُسَبِّحُونَ بِحَمْدِ رَبِّهِمْ وَيُؤْمِنُونَ بِهِ وَيَسْتَغْفِرُونَ لِلَّذِينَ آمَنُوا رَبَّنَا وَسِعْتَ كُلَّ شَيْءٍ رَّحْمَةً وَعِلْمًا فَاغْفِرْ لِلَّذِينَ تَابُوا وَاتَّبَعُوا سَبِيلَكَ وَقِهِمْ عَذَابَ الْجَحِيمِ
అర్ష్‌ (అల్లాహ్‌ సింహాసనం)ను మోసేవారు, దాని చుట్టూ ఉన్న వారు (దైవదూతలు) స్తోత్రసమేతంగా తమ ప్రభువు పవిత్రతను కొనియాడుతున్నారు. వారు ఆయన్ని విశ్వసిస్తున్నారు. విశ్వాసుల మన్నింపు కొరకు ప్రార్థిస్తూ వారు ఇలా అంటారు: "మా ప్రభూ! నీవు ప్రతి వస్తువును నీ దయానుగ్రహంతో, పరిజ్ఞానంతో ఆవరించి ఉన్నావు. కనుక పశ్చాత్తాపం చెంది, నీ మార్గాన్ని అనుసరించినవారిని నీవు క్షమించు. ఇంకా వారిని నరక శిక్ష నుంచి కూడా కాపాడు.
40:8  رَبَّنَا وَأَدْخِلْهُمْ جَنَّاتِ عَدْنٍ الَّتِي وَعَدتَّهُمْ وَمَن صَلَحَ مِنْ آبَائِهِمْ وَأَزْوَاجِهِمْ وَذُرِّيَّاتِهِمْ ۚ إِنَّكَ أَنتَ الْعَزِيزُ الْحَكِيمُ
"మా ప్రభూ! నువ్వు వారికి వాగ్దానం చేసివున్న శాశ్వితమైన స్వర్గవనాలలో వారికి ప్రవేశం కల్పించు. మరి వారి పితామహులలోని, సతీమణులలోని, సంతానంలోని సజ్జనులకు కూడా (స్వర్గంలో స్థానం కల్పించు). నిశ్చయంగా నీవు సర్వసత్తాధికారివి, వివేక సంపన్నుడివి.
40:9  وَقِهِمُ السَّيِّئَاتِ ۚ وَمَن تَقِ السَّيِّئَاتِ يَوْمَئِذٍ فَقَدْ رَحِمْتَهُ ۚ وَذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ
"వారిని చెడుల నుండి కూడా కాపాడు. యదార్థమేమిటంటే ఆనాడు నీవు చెడుల నుంచి కాపాడినవారిపై నీవు (అమితంగా) దయ జూపినట్లే. గొప్ప సాఫల్యం అంటే అదే!"
40:10  إِنَّ الَّذِينَ كَفَرُوا يُنَادَوْنَ لَمَقْتُ اللَّهِ أَكْبَرُ مِن مَّقْتِكُمْ أَنفُسَكُمْ إِذْ تُدْعَوْنَ إِلَى الْإِيمَانِ فَتَكْفُرُونَ
తిరస్కార వైఖరిని అవలంబించిన వారిని పిలిచి ఇలా అనబడుతుంది : "మీపై మీకు ఎంత కోపం వస్తుందో, అంతకంటే ఎక్కువగానే అల్లాహ్‌కు మీపై కోపం వచ్చేది - మిమ్మల్ని విశ్వాసం వైపునకు పిలిచినపుడు, మీరేమో అవిశ్వాసానికి ఒడిగట్టేవారు."
40:11  قَالُوا رَبَّنَا أَمَتَّنَا اثْنَتَيْنِ وَأَحْيَيْتَنَا اثْنَتَيْنِ فَاعْتَرَفْنَا بِذُنُوبِنَا فَهَلْ إِلَىٰ خُرُوجٍ مِّن سَبِيلٍ
(అప్పుడు వారు) "మా ప్రభూ! నీవు రెండుసార్లు మాకు చావు నిచ్చావు. రెండు సార్లు బ్రతికించావు. ఇప్పుడు మేము మా పాపాలను ఒప్పుకుంటున్నాము. మరి ఇప్పుడు బయటపడే మార్గం ఏదన్నా ఉందా?" అని విన్నవించుకుంటారు.
40:12  ذَٰلِكُم بِأَنَّهُ إِذَا دُعِيَ اللَّهُ وَحْدَهُ كَفَرْتُمْ ۖ وَإِن يُشْرَكْ بِهِ تُؤْمِنُوا ۚ فَالْحُكْمُ لِلَّهِ الْعَلِيِّ الْكَبِيرِ
(సమాధానంగా ఇలా అనబడుతుంది) "మీకు ఈ దుర్గతి ఎందుకు పట్టిందంటే, ఒక్కడైన అల్లాహ్‌ను గురించి ప్రస్తావించబడినపుడు మీరు త్రోసిపుచ్చేవారు. మరి అదే ఆయనకు ఎవరినయినా సహవర్తుల్ని కల్పించినపుడు (సంతోషంగా) అంగీకరించేవారు. కాబట్టి ఇప్పుడు (అంతిమ) నిర్ణయాధికారం సర్వోన్నతుడు, గొప్పవాడు అయిన అల్లాహ్‌దే."
40:13  هُوَ الَّذِي يُرِيكُمْ آيَاتِهِ وَيُنَزِّلُ لَكُم مِّنَ السَّمَاءِ رِزْقًا ۚ وَمَا يَتَذَكَّرُ إِلَّا مَن يُنِيبُ
ఆయనే తన సూచనలను మీకు చూపిస్తున్నాడు. మీ కోసం ఆకాశం నుంచి ఉపాధిని కురిపిస్తున్నాడు. (అల్లాహ్‌ వైపునకు) మరలేవారు మాత్రమే దీన్నుండి హితబోధను గ్రహిస్తారు.
40:14  فَادْعُوا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ وَلَوْ كَرِهَ الْكَافِرُونَ
కాబట్టి మీరు మీ ధర్మాన్ని అల్లాహ్‌కే ప్రత్యేకం చేసుకుని ఆయన్నే వేడుకుంటూ ఉండండి - అవిశ్వాసులకు అది ఎంతగా సహించరానిదైనా సరే!
40:15  رَفِيعُ الدَّرَجَاتِ ذُو الْعَرْشِ يُلْقِي الرُّوحَ مِنْ أَمْرِهِ عَلَىٰ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ لِيُنذِرَ يَوْمَ التَّلَاقِ
ఆయన ఉన్నత శ్రేణులు కలవాడు, అర్ష్‌కు (సింహాసనానికి) అధిపతి. ఆయన తన దాసులలో తాను కోరినవారిపై తన సందేశాన్ని (వహీని) అవతరింపజేస్తాడు - సమావేశం కానున్న ఆ దినం గురించి అతడు (ప్రవక్త) భయపెట్టడానికి!
40:16  يَوْمَ هُم بَارِزُونَ ۖ لَا يَخْفَىٰ عَلَى اللَّهِ مِنْهُمْ شَيْءٌ ۚ لِّمَنِ الْمُلْكُ الْيَوْمَ ۖ لِلَّهِ الْوَاحِدِ الْقَهَّارِ
ఆ రోజున అందరూ బయల్పడతారు. అప్పుడు వారి (లోగుట్టు) విషయమేదీ అల్లాహ్‌ నుండి దాగి ఉండదు. ఈ రోజు విశ్వసార్వభౌమత్వం ఎవరిది? ఒక్కడైన, తిరుగులేనివాడైన అల్లాహ్‌ది మాత్రమే.
40:17  الْيَوْمَ تُجْزَىٰ كُلُّ نَفْسٍ بِمَا كَسَبَتْ ۚ لَا ظُلْمَ الْيَوْمَ ۚ إِنَّ اللَّهَ سَرِيعُ الْحِسَابِ
ఈ రోజు ప్రతి ప్రాణికీ అది సంపాదించిన దాని ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఈ రోజు (ఎవరికీ, ఎలాంటి) అన్యాయం జరగదు. నిశ్చయంగా అల్లాహ్‌ బహు శీఘ్రంగా లెక్కతేల్చేవాడు.
40:18  وَأَنذِرْهُمْ يَوْمَ الْآزِفَةِ إِذِ الْقُلُوبُ لَدَى الْحَنَاجِرِ كَاظِمِينَ ۚ مَا لِلظَّالِمِينَ مِنْ حَمِيمٍ وَلَا شَفِيعٍ يُطَاعُ
(ఓ ప్రవక్తా!) చాలా దగ్గరలోనే ఉన్న ఆ దినం గురించి వారిని హెచ్చరించు. అప్పుడు వారిగుండెలు గొంతుల దాకా వచ్చేస్తాయి. వారంతా గమ్మున (బాధను) దిగమ్రింగుతూ ఉంటారు. (ఆ రోజు) దుర్మార్గులను ఆదుకునే ఆప్తమిత్రుడు గానీ, మాట చెలామణీ చేసుకోగల సిఫారసు చేసేవాడుగానీ ఎవడూ ఉండడు.
40:19  يَعْلَمُ خَائِنَةَ الْأَعْيُنِ وَمَا تُخْفِي الصُّدُورُ
ఆయన కళ్లల్లోని మోసాన్ని, గుండెల్లోని గుట్టును సయితం (బాగా) ఎరిగినవాడు.
40:20  وَاللَّهُ يَقْضِي بِالْحَقِّ ۖ وَالَّذِينَ يَدْعُونَ مِن دُونِهِ لَا يَقْضُونَ بِشَيْءٍ ۗ إِنَّ اللَّهَ هُوَ السَّمِيعُ الْبَصِيرُ
అల్లాహ్‌ ఖచ్చితంగా న్యాయంగా తీర్పు చేస్తాడు. మరి అల్లాహ్‌ను వదలి వారు ఎవరెవరిని మొరపెట్టుకునేవారో వారు ఏ విషయంలోనూ తీర్పు చేయలేరు. నిశ్చయంగా అల్లాహ్‌ అంతా వినేవాడు, అంతా చూసేవాడు.
40:21  أَوَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ كَانُوا مِن قَبْلِهِمْ ۚ كَانُوا هُمْ أَشَدَّ مِنْهُمْ قُوَّةً وَآثَارًا فِي الْأَرْضِ فَأَخَذَهُمُ اللَّهُ بِذُنُوبِهِمْ وَمَا كَانَ لَهُم مِّنَ اللَّهِ مِن وَاقٍ
ఏమిటి, వారు భూమిపై సంచరించి, తమకు పూర్వం గడచిన వారికి పట్టిన గతేమిటో చూడలేదా? బలపరాక్రమాల రీత్యాగానీ, భూమిపై వదలి వెళ్ళిన చిహ్నాల దృష్ట్యాగానీ వారు వీరికన్నా గట్టివారే. మరి అల్లాహ్‌ వారి దురాగతాల కారణంగా వారిని పట్టుకున్నాడు. మరి అల్లాహ్‌కు వ్యతిరేకంగా వారిని ఆదుకునేవాడెవడూ లేకపోయాడు.
40:22  ذَٰلِكَ بِأَنَّهُمْ كَانَت تَّأْتِيهِمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ فَكَفَرُوا فَأَخَذَهُمُ اللَّهُ ۚ إِنَّهُ قَوِيٌّ شَدِيدُ الْعِقَابِ
వారికీ దుర్గతి పట్టటానికి కారణమేమిటంటే, వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన సూచనలను తీసుకువచ్చేవారు. కాని వారు మాత్రం వాటిని త్రోసిపుచ్చేవారు. అందుకే అల్లాహ్‌ వారిని పట్టుకున్నాడు. నిస్సందేహంగా ఆయన బలాఢ్యుడు. కఠినంగా శిక్షించేవాడు.
40:23  وَلَقَدْ أَرْسَلْنَا مُوسَىٰ بِآيَاتِنَا وَسُلْطَانٍ مُّبِينٍ
మేము మూసా (అలైహిస్సలాం)కు మా నిదర్శనాలను, తిరుగులేని ప్రమాణాన్ని ఇచ్చి పంపాము -
40:24  إِلَىٰ فِرْعَوْنَ وَهَامَانَ وَقَارُونَ فَقَالُوا سَاحِرٌ كَذَّابٌ
ఫిరౌను, హామాను, ఖారూను వద్దకు (పంపాము). కాని వారేమో, "ఇతను మాంత్రికుడు, అబద్ధాలకోరు" అని అన్నారు.
40:25  فَلَمَّا جَاءَهُم بِالْحَقِّ مِنْ عِندِنَا قَالُوا اقْتُلُوا أَبْنَاءَ الَّذِينَ آمَنُوا مَعَهُ وَاسْتَحْيُوا نِسَاءَهُمْ ۚ وَمَا كَيْدُ الْكَافِرِينَ إِلَّا فِي ضَلَالٍ
మరి అతను (మూసా) వారివద్దకు మా తరఫు నుంచి సత్యాన్ని తీసుకుని వచ్చినప్పుడు, "అతని పంచనచేరి విశ్వసించిన వారి కొడుకులను చంపేయండి, వారి ఆడవాళ్ళను మాత్రం బ్రతకనివ్వండి" అని వారు పలికారు. కాని అవిశ్వాసుల ఎత్తుగడలన్నీ భ్రష్టమైనవి.
40:26  وَقَالَ فِرْعَوْنُ ذَرُونِي أَقْتُلْ مُوسَىٰ وَلْيَدْعُ رَبَّهُ ۖ إِنِّي أَخَافُ أَن يُبَدِّلَ دِينَكُمْ أَوْ أَن يُظْهِرَ فِي الْأَرْضِ الْفَسَادَ
ఫిరౌన్‌ ఇలా అన్నాడు: "నన్ను వదలండి. నేను మూసాను చంపేస్తాను. అతడు తన ప్రభువును పిలుచుకోనివ్వండి. ఇతడు మీ మతాన్ని ఎక్కడ మార్చివేస్తాడో లేక రాజ్యంలో (చాలా పెద్ద) అరాచకాన్ని ఎక్కడ సృష్టిస్తాడోనని నేను భయపడుతున్నాను."
40:27  وَقَالَ مُوسَىٰ إِنِّي عُذْتُ بِرَبِّي وَرَبِّكُم مِّن كُلِّ مُتَكَبِّرٍ لَّا يُؤْمِنُ بِيَوْمِ الْحِسَابِ
దానికి మూసా, "లెక్కల దినాన్ని విశ్వసించని ప్రతి దురహంకారి (కీడు) నుంచి రక్షణకై నేను నా ప్రభువును, మీ ప్రభువును వేడుకుంటున్నాను" అన్నాడు.
40:28  وَقَالَ رَجُلٌ مُّؤْمِنٌ مِّنْ آلِ فِرْعَوْنَ يَكْتُمُ إِيمَانَهُ أَتَقْتُلُونَ رَجُلًا أَن يَقُولَ رَبِّيَ اللَّهُ وَقَدْ جَاءَكُم بِالْبَيِّنَاتِ مِن رَّبِّكُمْ ۖ وَإِن يَكُ كَاذِبًا فَعَلَيْهِ كَذِبُهُ ۖ وَإِن يَكُ صَادِقًا يُصِبْكُم بَعْضُ الَّذِي يَعِدُكُمْ ۖ إِنَّ اللَّهَ لَا يَهْدِي مَنْ هُوَ مُسْرِفٌ كَذَّابٌ
(అప్పటివరకూ) తన విశ్వాసాన్ని గోప్యంగా ఉంచిన, ఫిరౌన్‌ వంశానికి చెందిన విశ్వాసి అయిన ఒక పురుషుడు ఇలా అన్నాడు: "ఏమిటీ, 'అల్లాహ్‌ నా ప్రభువు' అని అన్నంత మాత్రానికే ఒక వ్యక్తిని మీరు చంపేస్తారా? నిజానికి అతడు మీ ప్రభువు తరఫు నుంచి స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చాడు. ఒకవేళ అతను చెప్పేది అబద్ధమైతే అతని అబద్ధం (పాపఫలం) అతని మీదే పడుతుంది. మరి అతను గనక తన వాదనలో సత్యవంతుడైతే, అతను మీకు చేసే వాగ్దానం (శిక్ష)లో ఎంతో కొంత మీపై కూడా వచ్చి పడుతుంది. బరితెగించి పోయేవాడికి, అబద్ధాల కోరుకి అల్లాహ్‌ సన్మార్గం చూపడు.
40:29  يَا قَوْمِ لَكُمُ الْمُلْكُ الْيَوْمَ ظَاهِرِينَ فِي الْأَرْضِ فَمَن يَنصُرُنَا مِن بَأْسِ اللَّهِ إِن جَاءَنَا ۚ قَالَ فِرْعَوْنُ مَا أُرِيكُمْ إِلَّا مَا أَرَىٰ وَمَا أَهْدِيكُمْ إِلَّا سَبِيلَ الرَّشَادِ
"ఓ నా జాతి ప్రజలారా! ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు. భూమిపై మీ ఆధిక్యత కొనసాగుతోంది. కాని అల్లాహ్‌ తరఫున మనపై ఏదైనా విపత్తు వచ్చిపడితే, మనల్ని ఆదుకునే వాడెవడు?" దానికి ఫిరౌన్‌ ఇలా సమాధానమిచ్చాడు: "నేను చూసేదే మీకు చెబుతున్నాను. సక్రమమైన మార్గం వైపుకే మీకు దర్శకత్వం వహిస్తున్నాను."
40:30  وَقَالَ الَّذِي آمَنَ يَا قَوْمِ إِنِّي أَخَافُ عَلَيْكُم مِّثْلَ يَوْمِ الْأَحْزَابِ
అప్పుడు ఆ విశ్వాసి ఇలా అన్నాడు : "ఓ నా జాతివారలారా! ఇతర సముదాయాలపై వచ్చిన (గడ్డు) దినం మీపై కూడా వస్తుందేమోనని నాకు భయంగా ఉంది.
40:31  مِثْلَ دَأْبِ قَوْمِ نُوحٍ وَعَادٍ وَثَمُودَ وَالَّذِينَ مِن بَعْدِهِمْ ۚ وَمَا اللَّهُ يُرِيدُ ظُلْمًا لِّلْعِبَادِ
"ఉదాహరణకు నూహ్‌, ఆద్‌, సమూద్‌ జాతుల వారికి, ఆ తరువాత వచ్చిన వారికి (పట్టిన దుర్గతే మీకూ పట్టవచ్చు). తన దాసులకు అన్యాయం చేయాలన్నది అల్లాహ్‌ అభిమతం ఎంత మాత్రం కాదు.
40:32  وَيَا قَوْمِ إِنِّي أَخَافُ عَلَيْكُمْ يَوْمَ التَّنَادِ
"మరి ఓ నా జాతివారలారా! కేకలేసి పిలిచే రోజు మీకు దాపురిస్తుందన్న భయం కూడా నాకుంది.
40:33  يَوْمَ تُوَلُّونَ مُدْبِرِينَ مَا لَكُم مِّنَ اللَّهِ مِنْ عَاصِمٍ ۗ وَمَن يُضْلِلِ اللَّهُ فَمَا لَهُ مِنْ هَادٍ
"ఆ రోజు మీరు వెన్ను చూపి తిరిగిపోతారు. మిమ్మల్ని అల్లాహ్‌ (పట్టు) నుండి కాపాడేవాడెవడూ ఉండడు. అల్లాహ్‌ మార్గ భ్రష్టతకు గురిచేసినవారికి సన్మార్గం చూపేవాడెవడూ ఉండడు.
40:34  وَلَقَدْ جَاءَكُمْ يُوسُفُ مِن قَبْلُ بِالْبَيِّنَاتِ فَمَا زِلْتُمْ فِي شَكٍّ مِّمَّا جَاءَكُم بِهِ ۖ حَتَّىٰ إِذَا هَلَكَ قُلْتُمْ لَن يَبْعَثَ اللَّهُ مِن بَعْدِهِ رَسُولًا ۚ كَذَٰلِكَ يُضِلُّ اللَّهُ مَنْ هُوَ مُسْرِفٌ مُّرْتَابٌ
"లోగడ యూసుఫ్‌ (అలైహిస్సలాం) కూడా మీ వద్దకు స్పష్టమైన ప్రమాణాలను తీసుకువచ్చాడు. అయినప్పటికీ ఆయన తెచ్చిన విషయాలపై మీరు అనుమానంతోనే ఉన్నారు. చివరకు ఆయన మరణించినపుడు, 'ఈయన తరువాత అల్లాహ్‌ ఇంకా ఏ ప్రవక్తనూ పంపబోడు' అని మీరు చెప్పుకోసాగారు. ఈ విధంగా అల్లాహ్‌ హద్దుమీరే వారినీ, సందేహాలతో బతికేవారిని అపమార్గానికి లోను చేస్తాడు.
40:35  الَّذِينَ يُجَادِلُونَ فِي آيَاتِ اللَّهِ بِغَيْرِ سُلْطَانٍ أَتَاهُمْ ۖ كَبُرَ مَقْتًا عِندَ اللَّهِ وَعِندَ الَّذِينَ آمَنُوا ۚ كَذَٰلِكَ يَطْبَعُ اللَّهُ عَلَىٰ كُلِّ قَلْبِ مُتَكَبِّرٍ جَبَّارٍ
"(ఎందుకంటే) వారు తమ వద్దకు వచ్చిన ఏ ప్రమాణమూ లేకుండానే, అల్లాహ్‌ నిదర్శనాల విషయంలో (మొండిగా) వాదిస్తారు. ఈ పోకడ అల్లాహ్‌ వద్ద, విశ్వాసుల వద్ద కూడా ఎంతో అయిష్టకరమైనది. ఈ విధంగా గర్విష్టి, క్రూరుడైన ప్రతి వ్యక్తి హృదయంపై అల్లాహ్‌ ముద్ర వేసేస్తాడు."
40:36  وَقَالَ فِرْعَوْنُ يَا هَامَانُ ابْنِ لِي صَرْحًا لَّعَلِّي أَبْلُغُ الْأَسْبَابَ
ఫిరౌన్‌ ఇలా అన్నాడు: "ఓ హామాన్‌! నా కోసం ఒక ఎత్తయిన కట్టడాన్ని నిర్మించు. బహుశా నేను ఆ మార్గాలపైకి పోతానేమో-
40:37  أَسْبَابَ السَّمَاوَاتِ فَأَطَّلِعَ إِلَىٰ إِلَٰهِ مُوسَىٰ وَإِنِّي لَأَظُنُّهُ كَاذِبًا ۚ وَكَذَٰلِكَ زُيِّنَ لِفِرْعَوْنَ سُوءُ عَمَلِهِ وَصُدَّ عَنِ السَّبِيلِ ۚ وَمَا كَيْدُ فِرْعَوْنَ إِلَّا فِي تَبَابٍ
"ఆ గగన మార్గాలలోకి పోయి, మూసా ఆరాధిస్తున్న దేవుణ్ణి తొంగి చూస్తాను. ఖచ్చితంగా ఇతను (మూసా) అబద్ధాల కోరని నా అనుమానం." ఈ విధంగా ఫిరౌన్‌ దురాగతాలు అతనికి అందమైనవిగా చూపబడ్డాయి. అతడు సన్మార్గం నుంచి ఆపి వేయబడ్డాడు. ఫిరౌన్‌ పన్నిన పన్నాగాలన్నీ (అతని) వినాశానికే దోహదపడ్డాయి.
40:38  وَقَالَ الَّذِي آمَنَ يَا قَوْمِ اتَّبِعُونِ أَهْدِكُمْ سَبِيلَ الرَّشَادِ
విశ్వసించిన ఆ వ్యక్తే ఇంకా ఇలా అన్నాడు : "ఓ నా జాతి (ప్రజలారా)! మీరు (అందరూ) నన్ను అనుసరించండి. నేను మిమ్మల్ని మంచి మార్గం వైపుకు దర్శకత్వం వహిస్తాను.
40:39  يَا قَوْمِ إِنَّمَا هَٰذِهِ الْحَيَاةُ الدُّنْيَا مَتَاعٌ وَإِنَّ الْآخِرَةَ هِيَ دَارُ الْقَرَارِ
"ఓ నా జాతి (వారలారా!) ఈ ప్రాపంచిక జీవిత సౌఖ్యాలు తాత్కాలికమైనవి. పరలోకమే శాశ్వతంగా ఉండే నిలయం.
40:40  مَنْ عَمِلَ سَيِّئَةً فَلَا يُجْزَىٰ إِلَّا مِثْلَهَا ۖ وَمَنْ عَمِلَ صَالِحًا مِّن ذَكَرٍ أَوْ أُنثَىٰ وَهُوَ مُؤْمِنٌ فَأُولَٰئِكَ يَدْخُلُونَ الْجَنَّةَ يُرْزَقُونَ فِيهَا بِغَيْرِ حِسَابٍ
"ఎవడయినా పాపానికి పాల్పడితే దానికి సరిసమానమైన (పాప) ఫలమే అతనికి లభిస్తుంది. మరెవడయినా పుణ్యకార్యం చేస్తే - అతడు పురుషుడైనా, స్త్రీ అయినా-అతడు గనక విశ్వాసి అయివుంటే - అలాంటి వారంతా స్వర్గంలో ప్రవేశిస్తారు. వారక్కడ లెక్క లేనంత ఉపాధిని పొందుతారు.
40:41  وَيَا قَوْمِ مَا لِي أَدْعُوكُمْ إِلَى النَّجَاةِ وَتَدْعُونَنِي إِلَى النَّارِ
"ఓ నా జాతి (జనులారా)! నేను మిమ్మల్ని మోక్షం వైపునకు పిలుస్తుంటే, మీరు నన్ను నరకాగ్ని వైపునకు పిలుస్తారేమిటి?
40:42  تَدْعُونَنِي لِأَكْفُرَ بِاللَّهِ وَأُشْرِكَ بِهِ مَا لَيْسَ لِي بِهِ عِلْمٌ وَأَنَا أَدْعُوكُمْ إِلَى الْعَزِيزِ الْغَفَّارِ
"నేను అల్లాహ్‌ను తిరస్కరించాలనీ, నేనెరుగని వాటిని ఆయనకు సహవర్తులుగా నిలబెట్టాలని మీరు నన్ను ఆహ్వానిస్తుంటే, నేను మాత్రం మిమ్మల్ని అసాధారణ శక్తిశాలి, క్షమాశీలి (అయిన అల్లాహ్‌) వైపునకు ఆహ్వానిస్తున్నాను.
40:43  لَا جَرَمَ أَنَّمَا تَدْعُونَنِي إِلَيْهِ لَيْسَ لَهُ دَعْوَةٌ فِي الدُّنْيَا وَلَا فِي الْآخِرَةِ وَأَنَّ مَرَدَّنَا إِلَى اللَّهِ وَأَنَّ الْمُسْرِفِينَ هُمْ أَصْحَابُ النَّارِ
"మీరు నన్ను ఎవరి వైపునకు పిలుస్తున్నారో వారు ఇహలోకంలోగానీ, పరలోకంలోగానీ పిలువటానికి అసలు యోగ్యులు కారన్న విషయంలో సందేహానికి ఆస్కారమే లేదు. మరి మనమంతా మరలిపోవలసింది అల్లాహ్‌ వద్దకే (అన్నది కూడా నిర్వివాదాంశమే). మరి బరితెగించి పోయేవారే నరక వాసులవుతారు (అనేది కూడా ముమ్మాటికీ నిజం).
40:44  فَسَتَذْكُرُونَ مَا أَقُولُ لَكُمْ ۚ وَأُفَوِّضُ أَمْرِي إِلَى اللَّهِ ۚ إِنَّ اللَّهَ بَصِيرٌ بِالْعِبَادِ
"మున్ముందు మీరు నేను చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకుంటారు. నేను మటుకు నా వ్యవహారాన్ని అల్లాహ్‌కు అప్పగిస్తున్నాను. నిశ్చయంగా అల్లాహ్‌ తన దాసులందరినీ చూస్తూనే ఉన్నాడు."
40:45  فَوَقَاهُ اللَّهُ سَيِّئَاتِ مَا مَكَرُوا ۖ وَحَاقَ بِآلِ فِرْعَوْنَ سُوءُ الْعَذَابِ
ఎట్టకేలకు అల్లాహ్‌ అతన్ని, వారు పన్నిన దుష్టపన్నాగాల కీడు నుంచి రక్షించాడు. కాగా; ఫిరౌనీయులపై బహు చెడ్డ విపత్తు విరుచుకుపడింది.
40:46  النَّارُ يُعْرَضُونَ عَلَيْهَا غُدُوًّا وَعَشِيًّا ۖ وَيَوْمَ تَقُومُ السَّاعَةُ أَدْخِلُوا آلَ فِرْعَوْنَ أَشَدَّ الْعَذَابِ
(ఇదిగో) అగ్ని - దాని ఎదుట వారు ప్రతి ఉదయం, సాయంత్రం రప్పించబడుతుంటారు. మరి ప్రళయం సంభవించిననాడు, "ఫిరౌను జనులను దుర్భరమైన శిక్షలో పడవేయండి" (అని సెలవీయబడుతుంది).
40:47  وَإِذْ يَتَحَاجُّونَ فِي النَّارِ فَيَقُولُ الضُّعَفَاءُ لِلَّذِينَ اسْتَكْبَرُوا إِنَّا كُنَّا لَكُمْ تَبَعًا فَهَلْ أَنتُم مُّغْنُونَ عَنَّا نَصِيبًا مِّنَ النَّارِ
మరి వారు నరకాగ్నిలో (కాలుతూ) పరస్పరం వాదోపవాదాలు మొదలెట్టినప్పుడు బలహీనులు, గర్విష్టులనుద్దేశించి, "మేము మీకు తాబేదార్లుగా ఉన్నాం కదా! మరి మీరిప్పుడు ఈ అగ్నిలో ఏ కొంత భాగాన్నయినా మా నుండి తొలగించగలరా?!" అని అంటారు.
40:48  قَالَ الَّذِينَ اسْتَكْبَرُوا إِنَّا كُلٌّ فِيهَا إِنَّ اللَّهَ قَدْ حَكَمَ بَيْنَ الْعِبَادِ
దానికి ఆ గర్విష్టులు "మనమంతా ఈ అగ్నిలో ఉన్నాం కదా! అల్లాహ్‌ తన దాసుల మధ్య తీర్పు చేసేశాడు" అని సమాధానమిస్తారు.
40:49  وَقَالَ الَّذِينَ فِي النَّارِ لِخَزَنَةِ جَهَنَّمَ ادْعُوا رَبَّكُمْ يُخَفِّفْ عَنَّا يَوْمًا مِّنَ الْعَذَابِ
మరి నరకవాసులంతా కలసి, "(కనీసం) ఒక్కరోజు శిక్షనైనా కాస్త తగ్గించమని మీ ప్రభువును కోరండి" అని నరక పాలకులతో అంటారు.
40:50  قَالُوا أَوَلَمْ تَكُ تَأْتِيكُمْ رُسُلُكُم بِالْبَيِّنَاتِ ۖ قَالُوا بَلَىٰ ۚ قَالُوا فَادْعُوا ۗ وَمَا دُعَاءُ الْكَافِرِينَ إِلَّا فِي ضَلَالٍ
దానికి వారు, "ఎందుకు, మీ ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలు తీసుకుని మీ వద్దకు రాలేదా?!" అని అడుగుతారు. "ఎందుకు రాలేదు? (వచ్చిన సంగతి నిజమే)" అని నరకవాసులు అంటారు. "మరైతే మీరే విజ్ఞప్తి చేసుకోండి" అని నరకపాలకులు చెబుతారు. (కాని) అవిశ్వాసుల విజ్ఞాపనలు నిరర్థకం తప్ప మరేమీ కావు.
40:51  إِنَّا لَنَنصُرُ رُسُلَنَا وَالَّذِينَ آمَنُوا فِي الْحَيَاةِ الدُّنْيَا وَيَوْمَ يَقُومُ الْأَشْهَادُ
నిశ్చయంగా మేము మా ప్రవక్తలకు, విశ్వాసులకు ప్రాపంచిక జీవితంలోనూ సహాయపడతాము, సాక్ష్యాలిచ్చేవారు నిలబడే రోజున కూడా (సహాయం చేస్తాము).
40:52  يَوْمَ لَا يَنفَعُ الظَّالِمِينَ مَعْذِرَتُهُمْ ۖ وَلَهُمُ اللَّعْنَةُ وَلَهُمْ سُوءُ الدَّارِ
ఆ రోజు దుర్మార్గులకు వారి సంజాయిషీ ఎంతమాత్రం ఉపయోగపడదు. వారిపై శాపం పడుతుంది. మరి వారి కోసం బహుచెడ్డ నివాసం ఉంటుంది.
40:53  وَلَقَدْ آتَيْنَا مُوسَى الْهُدَىٰ وَأَوْرَثْنَا بَنِي إِسْرَائِيلَ الْكِتَابَ
మరి మేము మూసాకు మార్గదర్శిని ప్రసాదించాము. ఇస్రాయీల్‌ సంతతిని ఆ గ్రంథానికి వారసులుగా చేశాము.
40:54  هُدًى وَذِكْرَىٰ لِأُولِي الْأَلْبَابِ
బుద్ధిజీవులకు అది మార్గదర్శినిగా, హితబోధినిగా ఉండేది.
40:55  فَاصْبِرْ إِنَّ وَعْدَ اللَّهِ حَقٌّ وَاسْتَغْفِرْ لِذَنبِكَ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ بِالْعَشِيِّ وَالْإِبْكَارِ
కనుక (ఓ ప్రవక్తా!) సహనం వహించు. నిస్సందేహంగా అల్లాహ్‌ వాగ్దానం నిజమైనది. నువ్వు నీ పొరపాట్ల క్షమాపణకై వేడుకుంటూ ఉండు. సాయం సమయంలోనూ, ప్రభాత సమయంలోనూ నీ ప్రభువు పవిత్రతను కొనియాడుతూ, స్తోత్రం చేస్తూ ఉండు.
40:56  إِنَّ الَّذِينَ يُجَادِلُونَ فِي آيَاتِ اللَّهِ بِغَيْرِ سُلْطَانٍ أَتَاهُمْ ۙ إِن فِي صُدُورِهِمْ إِلَّا كِبْرٌ مَّا هُم بِبَالِغِيهِ ۚ فَاسْتَعِذْ بِاللَّهِ ۖ إِنَّهُ هُوَ السَّمِيعُ الْبَصِيرُ
ఎవరయితే తమ వద్దకు వచ్చిన ప్రమాణమేదీ లేకుండానే అల్లాహ్‌ ఆయతుల విషయంలో గొడవపడుతున్నారో, వారి ఆంతర్యాలలో గర్వం తప్ప మరేమీ లేదు. వారు ఎలాగూ దానిని (తమ లక్ష్యాన్ని) చేరుకోలేరు. కనుక నువ్వు మాత్రం అల్లాహ్‌ శరణువేడుతూ ఉండు. నిశ్చయంగా ఆయన అంతా వినేవాడు, అన్నింటినీ చూసేవాడు.
40:57  لَخَلْقُ السَّمَاوَاتِ وَالْأَرْضِ أَكْبَرُ مِنْ خَلْقِ النَّاسِ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَعْلَمُونَ
నిశ్చయంగా భూమ్యాకాశాల సృష్టి మానవ సృష్టికన్నా గొప్ప విషయం. కాని చాలామంది దీన్ని తెలుసుకోరు.
40:58  وَمَا يَسْتَوِي الْأَعْمَىٰ وَالْبَصِيرُ وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَلَا الْمُسِيءُ ۚ قَلِيلًا مَّا تَتَذَكَّرُونَ
గుడ్డివాడు - చూపున్నవాడు సమానులు కారు. అలాగే విశ్వసించి, మంచి పనులు చేసేవారు - పాపాత్ములు (సమానులు కాజాలరు). కాని మీరు హితబోధను గ్రహించేది (చాలా) తక్కువ.
40:59  إِنَّ السَّاعَةَ لَآتِيَةٌ لَّا رَيْبَ فِيهَا وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يُؤْمِنُونَ
ప్రళయం (రావటం) తథ్యం. అందులో సందేహానికి తావే లేదు. కాని చాలామంది దీన్ని విశ్వసించరు (అది వేరే విషయం).
40:60  وَقَالَ رَبُّكُمُ ادْعُونِي أَسْتَجِبْ لَكُمْ ۚ إِنَّ الَّذِينَ يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِي سَيَدْخُلُونَ جَهَنَّمَ دَاخِرِينَ
మరి మీ ప్రభువు ఏమంటున్నాడంటే, "మీరు నన్నే ప్రార్థించండి. నేను మీ ప్రార్థనలను ఆమోదిస్తాను. నా దాస్యం పట్ల గర్వాహంకారం ప్రదర్శించేవారు త్వరలోనే అవమానితులై నరకంలో ప్రవేశించటం తథ్యం."
40:61  اللَّهُ الَّذِي جَعَلَ لَكُمُ اللَّيْلَ لِتَسْكُنُوا فِيهِ وَالنَّهَارَ مُبْصِرًا ۚ إِنَّ اللَّهَ لَذُو فَضْلٍ عَلَى النَّاسِ وَلَٰكِنَّ أَكْثَرَ النَّاسِ لَا يَشْكُرُونَ
అల్లాహ్‌ మీ కొరకు రాత్రిని చేశాడు - అందులో మీరు విశ్రాంతి పొందటానికి! మరి ఆయనే పగటిని (మీరు) చూడ గలిగేదిగా చేశాడు. నిశ్చయంగా అల్లాహ్‌ ప్రజల పట్ల దయా దాక్షిణ్యాలు గలవాడు. కాని ప్రజలలో చాలామంది కృతజ్ఞత తెలుపరు.
40:62  ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ خَالِقُ كُلِّ شَيْءٍ لَّا إِلَٰهَ إِلَّا هُوَ ۖ فَأَنَّىٰ تُؤْفَكُونَ
ఈ అల్లాహ్‌యే మీ (అందరికీ) ప్రభువు, ప్రతి వస్తువునూ సృష్టించినవాడు. ఆయన తప్ప వేరే ఆరాధ్యుడు లేడు. మరి మీరు ఎటు తిరిగిపోతున్నారు?
40:63  كَذَٰلِكَ يُؤْفَكُ الَّذِينَ كَانُوا بِآيَاتِ اللَّهِ يَجْحَدُونَ
ఇదే విధంగా (పూర్వం) అల్లాహ్‌ ఆయతులను తిరస్కరించే వారు కూడా తిరిగిపోయేవారు.
40:64  اللَّهُ الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ قَرَارًا وَالسَّمَاءَ بِنَاءً وَصَوَّرَكُمْ فَأَحْسَنَ صُوَرَكُمْ وَرَزَقَكُم مِّنَ الطَّيِّبَاتِ ۚ ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ ۖ فَتَبَارَكَ اللَّهُ رَبُّ الْعَالَمِينَ
అల్లాహ్‌యే మీ కోసం భూమిని నివాసస్థలంగా చేశాడు. ఆకాశాన్ని పందిరిగా నిర్మించాడు. మీ రూపురేఖలను తీర్చి దిద్దాడు. మీకు చాలా అందమైన రూపాన్నిచ్చాడు. తినటానికి పరిశుద్ధమైన ఆహార పదార్థాలను ప్రసాదించాడు. ఈ అల్లాహ్‌యే మీ ప్రభువు. మరి సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్‌ శుభాలు కలవాడు.
40:65  هُوَ الْحَيُّ لَا إِلَٰهَ إِلَّا هُوَ فَادْعُوهُ مُخْلِصِينَ لَهُ الدِّينَ ۗ الْحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ
ఆయన సజీవుడు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. కాబట్టి మీరు స్వచ్ఛమైన ఆరాధనను ఆయనకే సమర్పిస్తూ ఆయన్ని వేడుకోండి. ప్రశంసలన్నీ సకల లోకాల ప్రభువైన అల్లాహ్‌కే చెందుతాయి.
40:66  قُلْ إِنِّي نُهِيتُ أَنْ أَعْبُدَ الَّذِينَ تَدْعُونَ مِن دُونِ اللَّهِ لَمَّا جَاءَنِيَ الْبَيِّنَاتُ مِن رَّبِّي وَأُمِرْتُ أَنْ أُسْلِمَ لِرَبِّ الْعَالَمِينَ
(ఓ ప్రవక్తా!) వారికి ఈ విధంగా చెప్పు: "మీరు అల్లాహ్‌ను వదలి మొరపెట్టుకుంటున్నటువంటి వాటిని నేను పూజించటాన్ని వారించటం జరిగింది. ఆ మేరకు నా వద్దకు నా ప్రభువు తరఫున సూచనలు వచ్చేశాయి. సకల లోకాల ప్రభువుకే నేను విధేయుడనై ఉండాలని (కూడా) నాకు ఆజ్ఞాపించబడింది."
40:67  هُوَ الَّذِي خَلَقَكُم مِّن تُرَابٍ ثُمَّ مِن نُّطْفَةٍ ثُمَّ مِنْ عَلَقَةٍ ثُمَّ يُخْرِجُكُمْ طِفْلًا ثُمَّ لِتَبْلُغُوا أَشُدَّكُمْ ثُمَّ لِتَكُونُوا شُيُوخًا ۚ وَمِنكُم مَّن يُتَوَفَّىٰ مِن قَبْلُ ۖ وَلِتَبْلُغُوا أَجَلًا مُّسَمًّى وَلَعَلَّكُمْ تَعْقِلُونَ
ఆయనే మిమ్మల్ని మట్టితో, పిమ్మట వీర్యపు బిందువుతో, ఆ తరువాత ఘనీభవించిన రక్తంతో సృష్టించాడు. తరువాత మిమ్మల్ని శిశువు రూపంలో (తల్లి గర్భం నుంచి) బయటకు తీస్తున్నాడు. మరి మీరు యుక్తవయస్సుకు చేరేటందుకు మీకు ఎదుగుదలను ఇస్తున్నాడు, ఆపైన వార్ధక్యానికి చేరుకునేందుకు (గడువు ఇస్తున్నాడు). మీలో కొందరు ఆ స్థితికి చేరకముందే చనిపోతున్నారు. మీరు నిర్ణీత గడువుకు చేరుకోవటానికి, మీరు గ్రహించగలగటానికి (వీలుగా ఆయన మీకు అవకాశం ఇస్తూ ఉన్నాడు).
40:68  هُوَ الَّذِي يُحْيِي وَيُمِيتُ ۖ فَإِذَا قَضَىٰ أَمْرًا فَإِنَّمَا يَقُولُ لَهُ كُن فَيَكُونُ
జీవితాన్ని ప్రసాదించేవాడు, మరణాన్ని వొసగేవాడు ఆయనే. మరి ఆయన ఏ పనైనా చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, దాన్నుద్దేశించి 'అయిపో' అని మాత్రమే అంటాడు. అంతే, అది అయిపోతుంది.
40:69  أَلَمْ تَرَ إِلَى الَّذِينَ يُجَادِلُونَ فِي آيَاتِ اللَّهِ أَنَّىٰ يُصْرَفُونَ
అల్లాహ్‌ వాక్యాల విషయంలో గొడవ చేసే వారిని నువ్వు చూడలేదా? ఇంతకీ వారెక్కడికి మరలించబడుతున్నట్టు?
40:70  الَّذِينَ كَذَّبُوا بِالْكِتَابِ وَبِمَا أَرْسَلْنَا بِهِ رُسُلَنَا ۖ فَسَوْفَ يَعْلَمُونَ
వారు గ్రంథాన్ని, మా ప్రవక్తలతోపాటు పంపినదానిని కూడా ధిక్కరించారు. వారు త్వరలోనే (యదార్థం ఏమిటో) తెలుసుకుంటారు.
40:71  إِذِ الْأَغْلَالُ فِي أَعْنَاقِهِمْ وَالسَّلَاسِلُ يُسْحَبُونَ
అప్పుడు వారి మెడలలో (ఇనుప) పట్టాలు వేయబడి ఉంటాయి, సంకెళ్లు కూడా ఉంటాయి. మరి వారు ఈడ్వబడతారు.
40:72  فِي الْحَمِيمِ ثُمَّ فِي النَّارِ يُسْجَرُونَ
సలసలా కాగే నీళ్లలోకి. తరువాత నరకాగ్నిలో కాల్చబడతారు.
40:73  ثُمَّ قِيلَ لَهُمْ أَيْنَ مَا كُنتُمْ تُشْرِكُونَ
"మీరు అల్లాహ్‌ను వదలి సాటి కల్పించిన వారు (చిల్లర దేవుళ్లు) ఎక్కడున్నారు?" అని వారిని అడగటం జరుగుతుంది.
40:74  مِن دُونِ اللَّهِ ۖ قَالُوا ضَلُّوا عَنَّا بَل لَّمْ نَكُن نَّدْعُو مِن قَبْلُ شَيْئًا ۚ كَذَٰلِكَ يُضِلُّ اللَّهُ الْكَافِرِينَ
(అంటే) అల్లాహ్‌ను వదలి అన్న మాట. "వారు మా నుండి అదృశ్యమైపోయారు. కాదు, మేమింతకు ముందు అసలు దేనినీ మొరపెట్టుకోనేలేదు" అని వారు (తడబడుతూ) చెబుతారు. ఈ విధంగా అల్లాహ్‌ అవిశ్వాసులను దారి తప్పిస్తాడు.
40:75  ذَٰلِكُم بِمَا كُنتُمْ تَفْرَحُونَ فِي الْأَرْضِ بِغَيْرِ الْحَقِّ وَبِمَا كُنتُمْ تَمْرَحُونَ
"మీరు భూమ్మీద అన్యాయంగా అదిరిపడుతూ, అనుచిత రీతిలో మిడిసి పడినందుకు జరిగిన శాస్తి ఇది.
40:76  ادْخُلُوا أَبْوَابَ جَهَنَّمَ خَالِدِينَ فِيهَا ۖ فَبِئْسَ مَثْوَى الْمُتَكَبِّرِينَ
"ఇక నరక ద్వారాలలోనికి ప్రవేశించండి, ఎల్లకాలం అందులోనే పడి ఉందురు గాని; అహంకారులకు లభించిన ఈ చోటు ఎంత చెడ్దది?!" (అని అనబడుతుంది).
40:77  فَاصْبِرْ إِنَّ وَعْدَ اللَّهِ حَقٌّ ۚ فَإِمَّا نُرِيَنَّكَ بَعْضَ الَّذِي نَعِدُهُمْ أَوْ نَتَوَفَّيَنَّكَ فَإِلَيْنَا يُرْجَعُونَ
కనుక (ఓ ముహమ్మద్‌ -స!) నువ్వు సహనం వహించు. అల్లాహ్‌ వాగ్దానం ముమ్మాటికీ సత్యమైనది. మేము వారికి చేసివున్న వాగ్దానాలలో (హెచ్చరికలలో) కొన్నింటిని మేము నీకు చూపించినా లేక (అంతకుముందే) మేము నీకు మరణం వొసగినా (ఎట్టకేలకు) వారంతా మరలిరావలసింది మా వద్దకే కదా!
40:78  وَلَقَدْ أَرْسَلْنَا رُسُلًا مِّن قَبْلِكَ مِنْهُم مَّن قَصَصْنَا عَلَيْكَ وَمِنْهُم مَّن لَّمْ نَقْصُصْ عَلَيْكَ ۗ وَمَا كَانَ لِرَسُولٍ أَن يَأْتِيَ بِآيَةٍ إِلَّا بِإِذْنِ اللَّهِ ۚ فَإِذَا جَاءَ أَمْرُ اللَّهِ قُضِيَ بِالْحَقِّ وَخَسِرَ هُنَالِكَ الْمُبْطِلُونَ
నిశ్చయంగా నీకు పూర్వం కూడా మేము ఎంతోమంది ప్రవక్తల్ని పంపి ఉన్నాము. వారిలో కొందరి సంగతులు మేము నీకు తెలియపర్చాము. మరికొందరి వృత్తాంతాలను అసలు నీకు తెలుపనే లేదు. ఏ ప్రవక్త కూడా అల్లాహ్‌ అనుజ్ఞ లేకుండా ఏ మహిమనూ తీసుకురాలేకపోయేవాడు. మరి అల్లాహ్‌ ఆజ్ఞ వచ్చేసినపుడు సత్య (న్యాయ)బద్ధంగా తీర్పు జరిగితీరుతుంది. మరి అసత్యవాదులు మాత్రం అక్కడ నష్టానికి గురవుతారు.
40:79  اللَّهُ الَّذِي جَعَلَ لَكُمُ الْأَنْعَامَ لِتَرْكَبُوا مِنْهَا وَمِنْهَا تَأْكُلُونَ
అల్లాహ్‌ - ఆయనే మీ కొరకు పశువులను చేశాడు. వాటిలో కొన్నింటిపై మీరు స్వారీ చేస్తారు. మరి కొన్నింటిని తింటారు.
40:80  وَلَكُمْ فِيهَا مَنَافِعُ وَلِتَبْلُغُوا عَلَيْهَا حَاجَةً فِي صُدُورِكُمْ وَعَلَيْهَا وَعَلَى الْفُلْكِ تُحْمَلُونَ
వాటిలో మీ కొరకు మరెన్నో ప్రయోజనాలున్నాయి. మీరు వాటిపై ఎక్కి, మీ ఆంతర్యాల్లో ఉన్న అక్కరలను సాధించటానికి (అవి ఉపయోగపడుతున్నాయి) - మీరు వాటిపైన, ఓడలపైన తరలించబడుతున్నారు.
40:81  وَيُرِيكُمْ آيَاتِهِ فَأَيَّ آيَاتِ اللَّهِ تُنكِرُونَ
(ఈ విధంగా) అల్లాహ్‌ మీకు తన(శక్తి) సూచనలను చూపుతూపోతున్నాడు. మరి మీరు అల్లాహ్‌ సూచనల్లో వేటిని తిరస్కరించగలరు?
40:82  أَفَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَانُوا أَكْثَرَ مِنْهُمْ وَأَشَدَّ قُوَّةً وَآثَارًا فِي الْأَرْضِ فَمَا أَغْنَىٰ عَنْهُم مَّا كَانُوا يَكْسِبُونَ
వీరు భువిలో సంచారం చేసి, తమకు పూర్వం గడచిన వారికి పట్టిన గతేమిటో చూడలేదా? వారు సంఖ్యాపరంగా వీరి కన్నా అధికులే. బలపరాక్రమాల రీత్యా వీళ్లకన్నా గట్టివారే. భువిలో వారు ఎన్నో చిహ్నాలను (కూడా) వదలిపోయారు. కాని వారి ఘనకార్యాలు వారికి ఏ విధంగానూ ఉపయోగపడలేదు.
40:83  فَلَمَّا جَاءَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ فَرِحُوا بِمَا عِندَهُم مِّنَ الْعِلْمِ وَحَاقَ بِهِم مَّا كَانُوا بِهِ يَسْتَهْزِئُونَ
వారివద్దకు వారి ప్రవక్తలు ఎప్పుడు స్పష్టమైన సూచనలను తీసుకువచ్చినా తమవద్ద ఉన్న 'విద్య' ఆధారంగా వారు వికటాట్టహాసం చేసేవారు. వారు దేనిని పరిహసించేవారో ఎట్టకేలకు అదే వారిపై విరుచుకుపడింది.
40:84  فَلَمَّا رَأَوْا بَأْسَنَا قَالُوا آمَنَّا بِاللَّهِ وَحْدَهُ وَكَفَرْنَا بِمَا كُنَّا بِهِ مُشْرِكِينَ
మరి మా శిక్షను చూశాక - "ఒక్కడైన అల్లాహ్‌ను మేము విశ్వసించాము. ఆయనకు సహవర్తులుగా నిలబెడుతూ వచ్చిన వారందరినీ మేము త్రోసిపుచ్చుతున్నాం" అని చాటి చెప్పారు.
40:85  فَلَمْ يَكُ يَنفَعُهُمْ إِيمَانُهُمْ لَمَّا رَأَوْا بَأْسَنَا ۖ سُنَّتَ اللَّهِ الَّتِي قَدْ خَلَتْ فِي عِبَادِهِ ۖ وَخَسِرَ هُنَالِكَ الْكَافِرُونَ
కాని మా శిక్షను చూసిన తరువాత, వారి 'విశ్వాసం' వారికే విధంగానూ లాభదాయకం కాలేకపోయింది. ఇది అల్లాహ్‌ సంప్రదాయం! ఇది (తరతరాలుగా) ఆయన దాసుల్లో నెరవేరుతూ వస్తోంది. (దాన్ననుసరించే) అక్కడ అవిశ్వాసులు ఘోరంగా నష్టపోయారు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.