aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

3. సూరా ఆలి ఇమ్రాన్

3:1  الم
అలిఫ్‌ లామ్‌ మీమ్‌.
3:2  اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْحَيُّ الْقَيُّومُ
అల్లాహ్‌ - ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ఆయన సజీవుడు, సర్వసృష్టికి మూలాధారం.
3:3  نَزَّلَ عَلَيْكَ الْكِتَابَ بِالْحَقِّ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ وَأَنزَلَ التَّوْرَاةَ وَالْإِنجِيلَ
(ఓ ప్రవక్తా!) ఆయన నీపై సత్యంతోపాటు ఈ గ్రంథాన్ని అవతరింపజేశాడు. దానికి పూర్వం వచ్చిన గ్రంథాలను అది ధృవపరుస్తుంది. ఆయనే తౌరాతు, ఇన్జీలు గ్రంథాలను అవతరింపజేశాడు,
3:4  مِن قَبْلُ هُدًى لِّلنَّاسِ وَأَنزَلَ الْفُرْقَانَ ۗ إِنَّ الَّذِينَ كَفَرُوا بِآيَاتِ اللَّهِ لَهُمْ عَذَابٌ شَدِيدٌ ۗ وَاللَّهُ عَزِيزٌ ذُو انتِقَامٍ
ఇంతకు మునుపు ప్రజల కొరకు మార్గదర్శకత్వంగా. ఇంకా గీటురాయి (ఖుర్‌ఆన్‌)ని కూడా ఆయనే అవతరింపజేశాడు. అల్లాహ్‌ ఆయతులను తిరస్కరించిన వారికి కఠినశిక్ష పడటం ఖాయం. అల్లాహ్‌ సర్వాధిక్యుడు. ప్రతీకారం చేసేవాడూను.
3:5  إِنَّ اللَّهَ لَا يَخْفَىٰ عَلَيْهِ شَيْءٌ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ
నిశ్చయంగా - భూమ్యాకాశాలలోని ఏ వస్తువూ అల్లాహ్‌కు గోప్యంగా లేదు.
3:6  هُوَ الَّذِي يُصَوِّرُكُمْ فِي الْأَرْحَامِ كَيْفَ يَشَاءُ ۚ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْعَزِيزُ الْحَكِيمُ
ఆయనే తాను కోరిన విధంగా మాతృ గర్భాల్లో మీ రూపురేఖలను మలుస్తాడు. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. ఆయన శక్తి సంపన్నుడు, వివేక సంపన్నుడు కూడాను.
3:7  هُوَ الَّذِي أَنزَلَ عَلَيْكَ الْكِتَابَ مِنْهُ آيَاتٌ مُّحْكَمَاتٌ هُنَّ أُمُّ الْكِتَابِ وَأُخَرُ مُتَشَابِهَاتٌ ۖ فَأَمَّا الَّذِينَ فِي قُلُوبِهِمْ زَيْغٌ فَيَتَّبِعُونَ مَا تَشَابَهَ مِنْهُ ابْتِغَاءَ الْفِتْنَةِ وَابْتِغَاءَ تَأْوِيلِهِ ۗ وَمَا يَعْلَمُ تَأْوِيلَهُ إِلَّا اللَّهُ ۗ وَالرَّاسِخُونَ فِي الْعِلْمِ يَقُولُونَ آمَنَّا بِهِ كُلٌّ مِّنْ عِندِ رَبِّنَا ۗ وَمَا يَذَّكَّرُ إِلَّا أُولُو الْأَلْبَابِ
నీపై గ్రంథాన్ని అవతరింపజేసినవాడు ఆయనే. అందులో సుస్పష్టమైన (ముహ్కమాత్‌) వచనాలున్నాయి. అవి గ్రంథానికి మూలం. మరికొన్ని బహువిధ భావంతో కూడిన (ముతషాబిహాత్‌) వచనాలున్నాయి. హృదయాలలో వక్రత ఉన్న వారు అందులోని బహువిధ భావ వచనాల (ముతషాబిహాత్‌) వెంట పడి (ప్రజలను) భ్రష్టుపట్టించటానికి ప్రయత్నిస్తారు. తమ ఉద్దేశాలకనుగుణంగా తాత్పర్యాలు తీస్తారు. నిజానికి వాటి వాస్తవికత అల్లాహ్‌కు తప్ప వేరెవరికీ తెలీదు. అయితే జ్ఞానంలో పరిపక్వత పొందినవారు మాత్రం, ''మేము వీటిని విశ్వసించాము. ఇవన్నీ మా ప్రభువు తరఫు నుంచి వచ్చినవే'' అని అంటారు. వాస్తవానికి బుద్ధీ జ్ఞానాలు కలవారు మాత్రమే హితబోధను గ్రహిస్తారు.
3:8  رَبَّنَا لَا تُزِغْ قُلُوبَنَا بَعْدَ إِذْ هَدَيْتَنَا وَهَبْ لَنَا مِن لَّدُنكَ رَحْمَةً ۚ إِنَّكَ أَنتَ الْوَهَّابُ
(వారు ఇలా వేడుకుంటూ ఉంటారు:) ''మా ప్రభూ! సన్మార్గ భాగ్యం ప్రసాదించిన తరువాత మా హృదయాలలో వక్రతను రానీయకు. నీ వద్ద నుంచి మాకు కారుణ్యాన్ని ప్రసాదించు. నిశ్చయంగా నీవే గొప్ప దాతవు.''
3:9  رَبَّنَا إِنَّكَ جَامِعُ النَّاسِ لِيَوْمٍ لَّا رَيْبَ فِيهِ ۚ إِنَّ اللَّهَ لَا يُخْلِفُ الْمِيعَادَ
''మా ప్రభూ! నిశ్చయంగా నీవు జనులందరినీ ఒక రోజు సమీకరిస్తావు. ఆ రోజు రావటంలో సందేహానికి ఎలాంటి ఆస్కారం లేదు, అల్లాహ్‌ ఎట్టి పరిస్థితిలోనూ వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరించడు.''
3:10  إِنَّ الَّذِينَ كَفَرُوا لَن تُغْنِيَ عَنْهُمْ أَمْوَالُهُمْ وَلَا أَوْلَادُهُم مِّنَ اللَّهِ شَيْئًا ۖ وَأُولَٰئِكَ هُمْ وَقُودُ النَّارِ
అవిశ్వాసులను వారి సిరిసంపదలు గానీ, వారి సంతానం గానీ అల్లాహ్‌ (శిక్ష) నుంచి విడిపించటంలో ఏమాత్రం ఉపయోగపడవు. నరకానికి ఇంధనం అయ్యేవారు వీరే.
3:11  كَدَأْبِ آلِ فِرْعَوْنَ وَالَّذِينَ مِن قَبْلِهِمْ ۚ كَذَّبُوا بِآيَاتِنَا فَأَخَذَهُمُ اللَّهُ بِذُنُوبِهِمْ ۗ وَاللَّهُ شَدِيدُ الْعِقَابِ
ఫిరౌను జనులకు, వారికి పూర్వం గతించిన వారికి పట్టిన గతే వీరికీ పడుతుంది. (ఎందుకంటే) వారు మా వచనాలను ధిక్కరించారు. మరి అల్లాహ్‌ కూడా వారిని వారి పాపాలకుగాను పట్టుకున్నాడు. అల్లాహ్‌ తీవ్రంగా దండించేవాడు సుమా!
3:12  قُل لِّلَّذِينَ كَفَرُوا سَتُغْلَبُونَ وَتُحْشَرُونَ إِلَىٰ جَهَنَّمَ ۚ وَبِئْسَ الْمِهَادُ
(ఓ ప్రవక్తా!) అవిశ్వాసులతో చెప్పు: ''త్వరలోనే మీరు ఓటమి పాలవుతారు. నరకం వైపుకు సమీకరించబడతారు. అది అత్యంత చెడ్డ నివాస స్థలం.''
3:13  قَدْ كَانَ لَكُمْ آيَةٌ فِي فِئَتَيْنِ الْتَقَتَا ۖ فِئَةٌ تُقَاتِلُ فِي سَبِيلِ اللَّهِ وَأُخْرَىٰ كَافِرَةٌ يَرَوْنَهُم مِّثْلَيْهِمْ رَأْيَ الْعَيْنِ ۚ وَاللَّهُ يُؤَيِّدُ بِنَصْرِهِ مَن يَشَاءُ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَعِبْرَةً لِّأُولِي الْأَبْصَارِ
ముఖాముఖీ అయిన ఆ రెండు వర్గాలలో మీ కోసం నిశ్చయంగా గుణపాఠ సూచన ఉంది. వాటిలో ఒక వర్గం దైవ మార్గంలో పోరాడుతూ ఉండగా, రెండోది అవిశ్వాసుల వర్గం. వారు తమకన్నా రెండింతలుండటాన్ని వారు స్వయంగా తమ కళ్ళతో తిలకించారు. అల్లాహ్‌ తాను తలచిన వారికి తన సహాయంతో బలం చేకూర్చుతాడు. కళ్ళున్న వారికోసం ఇందులో గొప్ప గుణపాఠం ఉంది.
3:14  زُيِّنَ لِلنَّاسِ حُبُّ الشَّهَوَاتِ مِنَ النِّسَاءِ وَالْبَنِينَ وَالْقَنَاطِيرِ الْمُقَنطَرَةِ مِنَ الذَّهَبِ وَالْفِضَّةِ وَالْخَيْلِ الْمُسَوَّمَةِ وَالْأَنْعَامِ وَالْحَرْثِ ۗ ذَٰلِكَ مَتَاعُ الْحَيَاةِ الدُّنْيَا ۖ وَاللَّهُ عِندَهُ حُسْنُ الْمَآبِ
స్త్రీలు, కుమారులూ, పోగుచేయబడిన వెండి బంగారు రాసులూ, అచ్చువేయబడిన (మేలిజాతి) గుర్రాలు, పశువులూ, పంటపొలాలు వంటి వ్యామోహాలపై ప్రేమ, జనులకు మనోజ్ఞంగా చేయబడింది. ఇది ప్రాపంచిక జీవన సామగ్రి. మరలిపోవలసిన అత్యుత్తమ నివాసమైతే అల్లాహ్‌ వద్దనే ఉంది.
3:15  قُلْ أَؤُنَبِّئُكُم بِخَيْرٍ مِّن ذَٰلِكُمْ ۚ لِلَّذِينَ اتَّقَوْا عِندَ رَبِّهِمْ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا وَأَزْوَاجٌ مُّطَهَّرَةٌ وَرِضْوَانٌ مِّنَ اللَّهِ ۗ وَاللَّهُ بَصِيرٌ بِالْعِبَادِ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: వీటికన్నా మేలైనదేదో నేను మీకు తెలుపనా? దైవభక్తి కలవారికి వారి ప్రభువు వద్ద స్వర్గ వనాలున్నాయి. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తుంటాయి. వాటిలో వారు ఎల్లకాలం ఉంటారు. పవిత్రులైన భార్యలు వారి కోసం ఉంటారు. (వీటన్నింటితో పాటు) అల్లాహ్‌ ప్రసన్నత వారికి ప్రాప్తిస్తుంది. అల్లాహ్‌ దాసులను కనిపెట్టుకొని ఉన్నాడు.
3:16  الَّذِينَ يَقُولُونَ رَبَّنَا إِنَّنَا آمَنَّا فَاغْفِرْ لَنَا ذُنُوبَنَا وَقِنَا عَذَابَ النَّارِ
వారు ఇలా వేడుకుంటారు: ''మా ప్రభూ! మేము విశ్వసించాము. కనుక మా పాపాలను క్షమించు. ఇంకా మమ్మల్ని అగ్ని శిక్ష నుంచి కాపాడు.''
3:17  الصَّابِرِينَ وَالصَّادِقِينَ وَالْقَانِتِينَ وَالْمُنفِقِينَ وَالْمُسْتَغْفِرِينَ بِالْأَسْحَارِ
వారు ఓర్పు వహిస్తారు, సదా సత్యమే పలుకుతారు. విధేయత చూపుతారు. దైవమార్గంలో ఖర్చుచేస్తారు. రాత్రి చివరి భాగంలో క్షమాభిక్షకై వేడుకుంటారు.
3:18  شَهِدَ اللَّهُ أَنَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ وَالْمَلَائِكَةُ وَأُولُو الْعِلْمِ قَائِمًا بِالْقِسْطِ ۚ لَا إِلَٰهَ إِلَّا هُوَ الْعَزِيزُ الْحَكِيمُ
అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్యదైవం లేడని స్వయంగా అల్లాహ్‌, ఆయన దూతలు, జ్ఞానసంపన్నులూ సాక్ష్యమిస్తున్నారు. ఆయన సమత్వం, సమతూకంతో ఈ విశ్వాన్ని నిలిపి ఉంచాడు. సర్వాధిక్యుడు, వివేచనాశీలి అయిన ఆయన తప్ప మరొకరెవరూ ఆరాధనకు అర్హులు కారు.
3:19  إِنَّ الدِّينَ عِندَ اللَّهِ الْإِسْلَامُ ۗ وَمَا اخْتَلَفَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ إِلَّا مِن بَعْدِ مَا جَاءَهُمُ الْعِلْمُ بَغْيًا بَيْنَهُمْ ۗ وَمَن يَكْفُرْ بِآيَاتِ اللَّهِ فَإِنَّ اللَّهَ سَرِيعُ الْحِسَابِ
నిస్సందేహంగా ఇస్లాం మాత్రమే అల్లాహ్‌ వద్ద సమ్మతమైన ధర్మం. గ్రంథంకల ప్రజలు తమ వద్దకు జ్ఞానం వచ్చేసిన పిదపనే తమలోని పరస్పర అసూయాద్వేషాల కారణంగా విభేదించుకున్నారు. అల్లాహ్‌ వచనాల పట్ల ఎవరు తిరస్కార వైఖరిని అవలంబించినాసరే, అల్లాహ్‌ చాలా తొందరగానే వారి లెక్క తేలుస్తాడు.
3:20  فَإِنْ حَاجُّوكَ فَقُلْ أَسْلَمْتُ وَجْهِيَ لِلَّهِ وَمَنِ اتَّبَعَنِ ۗ وَقُل لِّلَّذِينَ أُوتُوا الْكِتَابَ وَالْأُمِّيِّينَ أَأَسْلَمْتُمْ ۚ فَإِنْ أَسْلَمُوا فَقَدِ اهْتَدَوا ۖ وَّإِن تَوَلَّوْا فَإِنَّمَا عَلَيْكَ الْبَلَاغُ ۗ وَاللَّهُ بَصِيرٌ بِالْعِبَادِ
ఒకవేళ అప్పటికీ వారు నీతో గొడవపడితే, ''నేనూ, నా అనుచరులు దైవ విధేయతకు తలఒగ్గాము'' అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పేయి. ''మరి మీరు కూడా దైవాజ్ఞకు తలఒగ్గుతున్నారా?'' అని గ్రంథవహులను, నిరక్షరాస్యులను అడుగు. ఒకవేళ వారేగనక ఒప్పుకున్నట్లయితే సన్మార్గ భాగ్యం పొందినట్లే. ఒకవేళ వారు విముఖతను ప్రదర్శిస్తే, సందేశాన్ని అందజేయటం వరకే నీ బాధ్యత. అల్లాహ్‌ తన దాసులను చూస్తూనే ఉన్నాడు.
3:21  إِنَّ الَّذِينَ يَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَيَقْتُلُونَ النَّبِيِّينَ بِغَيْرِ حَقٍّ وَيَقْتُلُونَ الَّذِينَ يَأْمُرُونَ بِالْقِسْطِ مِنَ النَّاسِ فَبَشِّرْهُم بِعَذَابٍ أَلِيمٍ
ఎవరయితే అల్లాహ్‌ ఆయతులను తిరస్కరిస్తూ, అన్యాయంగా ప్రవక్తలను చంపుతూ, ప్రజల్లో న్యాయం గురించి ఆజ్ఞాపించేవారిని కూడా తుదముట్టిస్తున్నారో వారికి (ఓ ప్రవక్తా!) వ్యధాభరితమైన శిక్ష ఉందన్న శుభవార్తను వినిపించు.
3:22  أُولَٰئِكَ الَّذِينَ حَبِطَتْ أَعْمَالُهُمْ فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَمَا لَهُم مِّن نَّاصِرِينَ
వారి కర్మలు ఇహపరాలలో వృధా అయిపోయాయి. వారిని ఆదుకునేవారెవరూ లేరు.
3:23  أَلَمْ تَرَ إِلَى الَّذِينَ أُوتُوا نَصِيبًا مِّنَ الْكِتَابِ يُدْعَوْنَ إِلَىٰ كِتَابِ اللَّهِ لِيَحْكُمَ بَيْنَهُمْ ثُمَّ يَتَوَلَّىٰ فَرِيقٌ مِّنْهُمْ وَهُم مُّعْرِضُونَ
గ్రంథంలోని ఒక భాగం ఇవ్వబడగా, తమ పరస్పర వ్యవహారాల తీర్పుకోసం దైవగ్రంథం వైపునకు రండి అని పిలిచినప్పటికీ వారిలోని ఒక వర్గం ముఖం తిప్పుకుని పోవటాన్ని నీవు చూడలేదా?
3:24  ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا لَن تَمَسَّنَا النَّارُ إِلَّا أَيَّامًا مَّعْدُودَاتٍ ۖ وَغَرَّهُمْ فِي دِينِهِم مَّا كَانُوا يَفْتَرُونَ
వారి (ఈ వైముఖ్య) ధోరణికి కారణం; ''నరకాగ్ని మమ్మల్ని లెక్కించదగిన కొన్ని రోజులు మాత్రమే కాల్చుతుంది'' అని వారు చెప్పటమే. వారి ఈ మనోకల్పిత విషయాలే ధర్మం విషయంలో వారిని మోసంలో పడవేశాయి.
3:25  فَكَيْفَ إِذَا جَمَعْنَاهُمْ لِيَوْمٍ لَّا رَيْبَ فِيهِ وَوُفِّيَتْ كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ
మరి మేము వారిని సమావేశపరచిన రోజున వారి గతేం కాను? అది రావటంలో ఎలాంటి సందేహానికి తావులేదు. అప్పుడు ప్రతి ప్రాణికీ అది సంపాదించుకున్న దాని పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. ఎవరికీ ఎలాంటి అన్యాయం జరగదు.
3:26  قُلِ اللَّهُمَّ مَالِكَ الْمُلْكِ تُؤْتِي الْمُلْكَ مَن تَشَاءُ وَتَنزِعُ الْمُلْكَ مِمَّن تَشَاءُ وَتُعِزُّ مَن تَشَاءُ وَتُذِلُّ مَن تَشَاءُ ۖ بِيَدِكَ الْخَيْرُ ۖ إِنَّكَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
(ఓ ముహమ్మద్‌!) ఈ విధంగా పలుకు: ''ఓ అల్లాహ్‌! విశ్వ రాజ్యాధిపతీ! నీవు కోరినవారికి రాజ్యాధికారం ఇస్తావు. నీవు కోరినవారి నుండి రాజ్యాన్ని లాక్కుంటావు. నీవు కోరిన వారికి గౌరవమొసగుతావు. నీవు కోరిన వారిని పరాభవానికి గురి చేస్తావు. సమస్త మేళ్లూ నీ చేతిలోనే ఉన్నాయి. నిశ్చయంగా నీవు ప్రతి వస్తువుపైన అధికారం కలవాడవు.
3:27  تُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَتُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ ۖ وَتُخْرِجُ الْحَيَّ مِنَ الْمَيِّتِ وَتُخْرِجُ الْمَيِّتَ مِنَ الْحَيِّ ۖ وَتَرْزُقُ مَن تَشَاءُ بِغَيْرِ حِسَابٍ
నువ్వే రాత్రిని పగటిలోనికి ప్రవేశింపజేస్తావు, పగటిని రాత్రి లోనికి తీసుకెళతావు. నువ్వే నిర్జీవమైన వాటి నుంచి జీవమున్న వాటిని తీస్తున్నావు, మరి నువ్వే జీవమున్న వాటి నుంచి నిర్జీవమైన వాటిని వెలికితీస్తున్నావు. ఇంకా నీవు కోరిన వారికి లెక్కలేనంత ఉపాధిని ఇస్తావు.''
3:28  لَّا يَتَّخِذِ الْمُؤْمِنُونَ الْكَافِرِينَ أَوْلِيَاءَ مِن دُونِ الْمُؤْمِنِينَ ۖ وَمَن يَفْعَلْ ذَٰلِكَ فَلَيْسَ مِنَ اللَّهِ فِي شَيْءٍ إِلَّا أَن تَتَّقُوا مِنْهُمْ تُقَاةً ۗ وَيُحَذِّرُكُمُ اللَّهُ نَفْسَهُ ۗ وَإِلَى اللَّهِ الْمَصِيرُ
విశ్వాసులు తమ తోటి విశ్వాసులను వదలి అవిశ్వాసులను స్నేహితులుగా చేసుకోరాదు. అలా చేసేవాడు ఏ విషయంలోనూ అల్లాహ్‌తో సంబంధం లేనివాడు. అయితే ఏ విధంగా నయినా వారి కీడు నుంచి రక్షణ పొందే ఉద్దేశ్యంతో మీరు మైత్రికోసం ప్రయత్నిస్తే అది వేరే విషయం. అల్లాహ్‌ తనకు మాత్రమే భయపడవలసిందిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. కడకు (మీరు) మరలిపోవలసింది అల్లాహ్‌ వద్దకే.
3:29  قُلْ إِن تُخْفُوا مَا فِي صُدُورِكُمْ أَوْ تُبْدُوهُ يَعْلَمْهُ اللَّهُ ۗ وَيَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: ''మీరు మీ గుండెల్లోని మాటలను దాచినా లేక వ్యక్తపరచినా - వాటన్నింటినీ అల్లాహ్‌ తెలుసుకుంటాడు. భూమ్యాకాశాలలో ఉన్నవన్నీ ఆయనకు తెలుసు. అల్లాహ్‌ సర్వాన్నీ చేయగల సమర్థుడు.''
3:30  يَوْمَ تَجِدُ كُلُّ نَفْسٍ مَّا عَمِلَتْ مِنْ خَيْرٍ مُّحْضَرًا وَمَا عَمِلَتْ مِن سُوءٍ تَوَدُّ لَوْ أَنَّ بَيْنَهَا وَبَيْنَهُ أَمَدًا بَعِيدًا ۗ وَيُحَذِّرُكُمُ اللَّهُ نَفْسَهُ ۗ وَاللَّهُ رَءُوفٌ بِالْعِبَادِ
ఆ రోజు ప్రతి వ్యక్తీ తాను చేసుకున్న పుణ్యాన్నీ, తాను చేసిన పాపాన్నీ తన ముందు చూసుకుంటాడు. తనకూ - తన పాపానికీ మధ్య ఎంతో దూరం ఉంటే బావుండేదే! అని కాంక్షిస్తాడు. అల్లాహ్‌ తన గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు. అల్లాహ్‌ తన దాసుల పట్ల అమితమైన వాత్సల్యం గలవాడు.
3:31  قُلْ إِن كُنتُمْ تُحِبُّونَ اللَّهَ فَاتَّبِعُونِي يُحْبِبْكُمُ اللَّهُ وَيَغْفِرْ لَكُمْ ذُنُوبَكُمْ ۗ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : ''మీకు నిజంగానే అల్లాహ్‌ పట్ల ప్రేమ ఉంటే మీరు నన్ను అనుసరించండి. (తత్ఫలితంగా) అల్లాహ్‌ మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీ పాపాలను మన్నిస్తాడు. ఆయన అమితంగా క్షమించేవాడు, అపారంగా కనికరించేవాడు.''
3:32  قُلْ أَطِيعُوا اللَّهَ وَالرَّسُولَ ۖ فَإِن تَوَلَّوْا فَإِنَّ اللَّهَ لَا يُحِبُّ الْكَافِرِينَ
ఇంకా వారికి చెప్పు : ''మీరు అల్లాహ్‌కూ, ప్రవక్తకూ విధేయులై ఉండండి.'' ఒకవేళ వారు విముఖత చూపితే అల్లాహ్‌ తిరస్కారులను ఏ మాత్రం ఇష్టపడడు.
3:33  إِنَّ اللَّهَ اصْطَفَىٰ آدَمَ وَنُوحًا وَآلَ إِبْرَاهِيمَ وَآلَ عِمْرَانَ عَلَى الْعَالَمِينَ
నిశ్చయంగా అల్లాహ్‌ ఆదమ్‌నూ, నూహ్‌నూ, ఇబ్రాహీం పరివారాన్నీ, ఇమ్రాన్‌ సంతతినీ సమస్త లోకవాసులపై (వారికి ప్రాధాన్యత ఇచ్చి తన సందేశం కోసం) ఎన్నుకున్నాడు.
3:34  ذُرِّيَّةً بَعْضُهَا مِن بَعْضٍ ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ
వారిలో కొందరు మరికొందరి సంతానం. అల్లాహ్‌ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
3:35  إِذْ قَالَتِ امْرَأَتُ عِمْرَانَ رَبِّ إِنِّي نَذَرْتُ لَكَ مَا فِي بَطْنِي مُحَرَّرًا فَتَقَبَّلْ مِنِّي ۖ إِنَّكَ أَنتَ السَّمِيعُ الْعَلِيمُ
(ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేయి,) ఇమ్రాను భార్య ఇలా వేడుకున్నది: ''ఓ నా ప్రభూ! నా గర్భంలో ఉన్న దానిని నీ సేవ కోసం అంకితం చేయాలని మొక్కుకున్నాను. నీవు నా తరఫున దీనిని స్వీకరించు. నిస్సందేహంగా నీవు సర్వం వినేవాడవు, సర్వం తెలిసినవాడవు.''
3:36  فَلَمَّا وَضَعَتْهَا قَالَتْ رَبِّ إِنِّي وَضَعْتُهَا أُنثَىٰ وَاللَّهُ أَعْلَمُ بِمَا وَضَعَتْ وَلَيْسَ الذَّكَرُ كَالْأُنثَىٰ ۖ وَإِنِّي سَمَّيْتُهَا مَرْيَمَ وَإِنِّي أُعِيذُهَا بِكَ وَذُرِّيَّتَهَا مِنَ الشَّيْطَانِ الرَّجِيمِ
తరువాత ఆమె ప్రసవించినప్పుడు, ''ప్రభూ! నాకు ఆడపిల్ల కలిగినదే!'' అని విన్నవించుకుంది. ఆమె కన్న సంతానం ఏదో అల్లాహ్‌కు బాగా తెలుసు. మగ పిల్లవాడు ఆడపిల్ల వంటివాడు కాడు. ''నేను ఈ పాపకు మర్యమ్‌ అని పేరు పెట్టాను. నేను ఈమెనూ, ఈమె సంతానాన్ని శాపగ్రస్తుడైన షైతాన్‌ బారి నుంచి రక్షణ పొందటానికి నీకు అప్పగిస్తున్నాను'' అని అన్నది.
3:37  فَتَقَبَّلَهَا رَبُّهَا بِقَبُولٍ حَسَنٍ وَأَنبَتَهَا نَبَاتًا حَسَنًا وَكَفَّلَهَا زَكَرِيَّا ۖ كُلَّمَا دَخَلَ عَلَيْهَا زَكَرِيَّا الْمِحْرَابَ وَجَدَ عِندَهَا رِزْقًا ۖ قَالَ يَا مَرْيَمُ أَنَّىٰ لَكِ هَٰذَا ۖ قَالَتْ هُوَ مِنْ عِندِ اللَّهِ ۖ إِنَّ اللَّهَ يَرْزُقُ مَن يَشَاءُ بِغَيْرِ حِسَابٍ
అంతే! ఆమె ప్రభువు ఆ పసిపాపను ఉత్తమరీతిలో స్వీకరించి, అత్యుత్తమ రీతిలో ఆమెను పోషించాడు. ఆమె బాగోగులు చూసే బాధ్యతను జకరియ్యాకు అప్పగించాడు. జకరియ్యా ఆమె కుటీరానికి వెళ్ళినప్పుడల్లా, ఆమె వద్ద ఆహార పదార్థాలు కనిపించేవి. ''మర్యమ్‌! ఇవి నీ వద్దకు ఎక్కడి నుంచి వచ్చాయి?'' అని ఆయన అడిగితే, ''అల్లాహ్‌ వద్ద నుంచి'' అని ఆమె చెప్పేది. నిశ్చయంగా అల్లాహ్‌ తాను కోరిన వారికి లెక్క లేనంతగా ఉపాధిని ప్రసాదిస్తాడు.
3:38  هُنَالِكَ دَعَا زَكَرِيَّا رَبَّهُ ۖ قَالَ رَبِّ هَبْ لِي مِن لَّدُنكَ ذُرِّيَّةً طَيِّبَةً ۖ إِنَّكَ سَمِيعُ الدُّعَاءِ
అక్కడే జకరియ్యా (అలైహిస్సలాం) తన ప్రభువును వేడుకున్నాడు. ''ఓ నా ప్రభూ! నీ వద్ద నుండి నాకు మంచి సంతానాన్ని ప్రసాదించు. నిస్సందేహంగా నీవు మొరను ఆలకించేవాడవు'' అని అన్నాడు.
3:39  فَنَادَتْهُ الْمَلَائِكَةُ وَهُوَ قَائِمٌ يُصَلِّي فِي الْمِحْرَابِ أَنَّ اللَّهَ يُبَشِّرُكَ بِيَحْيَىٰ مُصَدِّقًا بِكَلِمَةٍ مِّنَ اللَّهِ وَسَيِّدًا وَحَصُورًا وَنَبِيًّا مِّنَ الصَّالِحِينَ
కుటీరంలో నిలబడి నమాజు చేస్తుండగా దైవదూతలు తనను పిలిచి, ''అల్లాహ్‌ నీకు యహ్యా గురించిన శుభవార్త ఇస్తున్నాడు. అతడు దైవవాక్కును ధృవపరుస్తాడు. నాయకుడౌతాడు. ఇంద్రియ నిగ్రహం కలవాడు, దైవప్రవక్త, సద్వర్తనుల కోవకు చెందినవాడై ఉంటాడు'' అని చెప్పారు.
3:40  قَالَ رَبِّ أَنَّىٰ يَكُونُ لِي غُلَامٌ وَقَدْ بَلَغَنِيَ الْكِبَرُ وَامْرَأَتِي عَاقِرٌ ۖ قَالَ كَذَٰلِكَ اللَّهُ يَفْعَلُ مَا يَشَاءُ
దానికి జకరియ్యా ఇలా విన్నవించుకున్నాడు : ''ప్రభూ! నేనేమో పండు ముసలివాణ్ణి. నా భార్య ఏమో గొడ్రాలు. అలాంటప్పుడు నాకు కొడుకు ఎలా పుడతాడు?'' దానికి, ''అలాగే జరుగుతుంది. అల్లాహ్‌ తాను కోరినది చేస్తాడు'' అని (దైవదూత) సమాధానం ఇచ్చాడు.
3:41  قَالَ رَبِّ اجْعَل لِّي آيَةً ۖ قَالَ آيَتُكَ أَلَّا تُكَلِّمَ النَّاسَ ثَلَاثَةَ أَيَّامٍ إِلَّا رَمْزًا ۗ وَاذْكُر رَّبَّكَ كَثِيرًا وَسَبِّحْ بِالْعَشِيِّ وَالْإِبْكَارِ
''నా ప్రభూ! దీనికి సంబంధించిన నిదర్శనం ఏదన్నా నా కొరకు నిర్ణయించు'' అని అతను మనవి చేసుకోగా, ''నీ కొరకు నిదర్శనం ఏమిటంటే, మూడు రోజుల వరకూ నువ్వు సైగలు చేయటం తప్ప జనులతో మాట్లాడలేవు. నువ్వు నీ ప్రభువును అత్యధికంగా స్మరిస్తూ ఉండు. ఉదయం, సాయంత్రం ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు'' అని చెప్పాడు.
3:42  وَإِذْ قَالَتِ الْمَلَائِكَةُ يَا مَرْيَمُ إِنَّ اللَّهَ اصْطَفَاكِ وَطَهَّرَكِ وَاصْطَفَاكِ عَلَىٰ نِسَاءِ الْعَالَمِينَ
(ఆ సందర్భాన్ని కూడా జ్ఞాపకం చేయి. మర్యమ్‌ను ఉద్దేశించి) దైవదూతలు ఇలా అన్నారు: ''ఓ మర్యమ్‌! అల్లాహ్‌ (తన సేవ కొరకు) నిన్ను ఎన్నుకున్నాడు. నిన్ను పరిశుద్ధురాలిగా చేశాడు. ప్రపంచంలోని మహిళలందరిపై నీకు ప్రాధాన్యతను ఇస్తూ నీ ఎంపిక చేశాడు.
3:43  يَا مَرْيَمُ اقْنُتِي لِرَبِّكِ وَاسْجُدِي وَارْكَعِي مَعَ الرَّاكِعِينَ
''(కనుక) ఓ మర్యమ్‌! నువ్వు నీ ప్రభువుకు విధేయత చూపు. ఆయనకు సజ్దా చెయ్యి (ఆయన సాన్నిధ్యంలో మోకరిల్లు). 'రుకూ' చేసే వారితో పాటు నువ్వూ రుకూ చెయ్యి (వినమ్రతతో ఆయన ముందు తలవంచు).''
3:44  ذَٰلِكَ مِنْ أَنبَاءِ الْغَيْبِ نُوحِيهِ إِلَيْكَ ۚ وَمَا كُنتَ لَدَيْهِمْ إِذْ يُلْقُونَ أَقْلَامَهُمْ أَيُّهُمْ يَكْفُلُ مَرْيَمَ وَمَا كُنتَ لَدَيْهِمْ إِذْ يَخْتَصِمُونَ
ఇవి అగోచర విషయాలలోనివి. (ఓ ప్రవక్తా!) వాటిని నీకు వహీ ద్వారా తెలియజేస్తున్నాము. మర్యమ్‌కు పోషకులుగా ఎవరుండాలి? అన్న విషయమై వారు తమ కలములు విసరినప్పుడు నీవు అక్కడ లేవు. (ఈ వ్యవహారంపై) వారు గొడవ పడినప్పుడు కూడా నీవు అక్కడ లేవు.
3:45  إِذْ قَالَتِ الْمَلَائِكَةُ يَا مَرْيَمُ إِنَّ اللَّهَ يُبَشِّرُكِ بِكَلِمَةٍ مِّنْهُ اسْمُهُ الْمَسِيحُ عِيسَى ابْنُ مَرْيَمَ وَجِيهًا فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَمِنَ الْمُقَرَّبِينَ
దైవదూతలు, ''ఓ మర్యమ్‌! అల్లాహ్‌ నీకు తన వాక్కుకు సంబంధించిన శుభవార్తను వినిపిస్తున్నాడు. అతని పేరు మసీహ్‌ ఈసా బిన్‌ మర్‌యమ్‌. అతడు ఇహపరాలలో గౌరవనీయుడవుతాడు. అతను (అల్లాహ్‌) సామీప్యం పొందిన వారిలో ఒకడు.''
3:46  وَيُكَلِّمُ النَّاسَ فِي الْمَهْدِ وَكَهْلًا وَمِنَ الصَّالِحِينَ
''అతడు ఉయ్యాలలో ఉన్నప్పుడూ, పెద్దవాడైనప్పుడూను ప్రజలతో మాట్లాడతాడు. ఇంకా అతడు సద్వర్తనులలోని వాడై ఉంటాడు'' అని అన్నప్పుడు;
3:47  قَالَتْ رَبِّ أَنَّىٰ يَكُونُ لِي وَلَدٌ وَلَمْ يَمْسَسْنِي بَشَرٌ ۖ قَالَ كَذَٰلِكِ اللَّهُ يَخْلُقُ مَا يَشَاءُ ۚ إِذَا قَضَىٰ أَمْرًا فَإِنَّمَا يَقُولُ لَهُ كُن فَيَكُونُ
ఆమె, ''నా ప్రభూ! నాకు పిల్లవాడు ఎలా పుడ్తాడు? నన్ను ఏ మనిషీ తాకలేదే!'' అని అన్నది. ''అలాగే జరుగుతుంది. అల్లాహ్‌ తాను కోరినది పుట్టిస్తాడు. ఆయన ఏదైనా పనిని చేయ సంకల్పించుకుని 'అయిపో' అని అంటే చాలు, అది 'అయిపోతుంది' అని (దైవదూత ద్వారా) సమాధానం లభించింది.
3:48  وَيُعَلِّمُهُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَالتَّوْرَاةَ وَالْإِنجِيلَ
అల్లాహ్‌ అతనికి అక్షర జ్ఞానాన్ని, వివేకాన్ని, తౌరాతు, ఇన్జీలు గ్రంథాల జ్ఞానాన్నీ నేర్పుతాడు (అని కూడా దైవదూతలు తెలిపారు).
3:49  وَرَسُولًا إِلَىٰ بَنِي إِسْرَائِيلَ أَنِّي قَدْ جِئْتُكُم بِآيَةٍ مِّن رَّبِّكُمْ ۖ أَنِّي أَخْلُقُ لَكُم مِّنَ الطِّينِ كَهَيْئَةِ الطَّيْرِ فَأَنفُخُ فِيهِ فَيَكُونُ طَيْرًا بِإِذْنِ اللَّهِ ۖ وَأُبْرِئُ الْأَكْمَهَ وَالْأَبْرَصَ وَأُحْيِي الْمَوْتَىٰ بِإِذْنِ اللَّهِ ۖ وَأُنَبِّئُكُم بِمَا تَأْكُلُونَ وَمَا تَدَّخِرُونَ فِي بُيُوتِكُمْ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لَّكُمْ إِن كُنتُم مُّؤْمِنِينَ
ఇంకా అతను ఇస్రాయీలు వంశీయుల వైపుకు ప్రవక్తగా పంపబడతాడు. (వారినుద్దేశించి ఆయన ఇలా అంటాడు:) ''నేను మీ వద్దకు మీ ప్రభువు దగ్గరి నుంచి సూచనను తీసుకువచ్చాను. నేను మీ కోసం పక్షి ఆకారం ఉన్న ఒక మట్టి బొమ్మను తయారు చేసి అందులో ఊదుతాను. అల్లాహ్‌ ఆజ్ఞతో అది పక్షి అవుతుంది. ఇంకా అల్లాహ్‌ ఆజ్ఞతో నేను పుట్టుగ్రుడ్డిని, కుష్ఠు రోగిని బాగుచేస్తాను. మృతులను బ్రతికిస్తాను. మీరు తినే వాటినీ, మీరు మీ ఇండ్లలో నిలువచేసి ఉంచిన వాటిని గురించి (కూడా) చెబుతాను. మీరే గనక విశ్వసించేవారైతే ఇందులో మీ కొరకు గొప్ప సూచన ఉంది.''
3:50  وَمُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيَّ مِنَ التَّوْرَاةِ وَلِأُحِلَّ لَكُم بَعْضَ الَّذِي حُرِّمَ عَلَيْكُمْ ۚ وَجِئْتُكُم بِآيَةٍ مِّن رَّبِّكُمْ فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ
''ఇంకా నేను నాకు పూర్వం అవతరించిన తౌరాతు (గ్రంథము)ను ధృవపరుస్తున్నాను. మీ కొరకు నిషేధించబడిన కొన్ని వస్తువులను ధర్మసమ్మతం గావించటానికి కూడా నేను వచ్చాను. ఇంకా నేను మీ వద్దకు మీ ప్రభువు సూచనను తీసుకు వచ్చాను. కనుక మీరు అల్లాహ్‌కు భయపడండి. నాకు విధేయత చూపండి.''
3:51  إِنَّ اللَّهَ رَبِّي وَرَبُّكُمْ فَاعْبُدُوهُ ۗ هَٰذَا صِرَاطٌ مُّسْتَقِيمٌ
''నిశ్చయంగా అల్లాహ్‌ నాకూ ప్రభువే, మీకూ ప్రభువే. కనుక మీరంతా ఆయన్నే ఆరాధించండి. ఇదే రుజుమార్గం.''
3:52  فَلَمَّا أَحَسَّ عِيسَىٰ مِنْهُمُ الْكُفْرَ قَالَ مَنْ أَنصَارِي إِلَى اللَّهِ ۖ قَالَ الْحَوَارِيُّونَ نَحْنُ أَنصَارُ اللَّهِ آمَنَّا بِاللَّهِ وَاشْهَدْ بِأَنَّا مُسْلِمُونَ
అయితే వారిలోని తిరస్కార వైఖరిని పసిగట్టిన తరువాత ఈసా, ''అల్లాహ్‌ మార్గంలో నాకు తోడ్పడేవారెవరు?'' అని ప్రశ్నించగా, హవారీలు, ''అల్లాహ్‌ మార్గంలో మేము (మీకు) తోడ్పడతాము. మేము అల్లాహ్‌ను విశ్వసించాము. మేము విధేయులమయ్యాము. ఈ విషయానికి మీరు సాక్షులుగా ఉండండి'' అని జవాబిచ్చారు.
3:53  رَبَّنَا آمَنَّا بِمَا أَنزَلْتَ وَاتَّبَعْنَا الرَّسُولَ فَاكْتُبْنَا مَعَ الشَّاهِدِينَ
(వారు ఇంకా ఇలా అన్నారు:) ''ప్రభూ! నీవు అవతరింపజేసిన దాన్ని మేము విశ్వసించాము. మేము నీ ప్రవక్తను అనుసరించాము. కనుక సాక్షుల జాబితాలో మా పేర్లు కూడా వ్రాసుకో.''
3:54  وَمَكَرُوا وَمَكَرَ اللَّهُ ۖ وَاللَّهُ خَيْرُ الْمَاكِرِينَ
అవిశ్వాసులు రహస్యంగా ఎత్తులు వేయసాగారు. అల్లాహ్‌ కూడా వారి ఎత్తులకు పై ఎత్తులు వేశాడు. ఎత్తులు వేసే వారిలో అల్లాహ్‌ సాటిలేని మేటి.
3:55  إِذْ قَالَ اللَّهُ يَا عِيسَىٰ إِنِّي مُتَوَفِّيكَ وَرَافِعُكَ إِلَيَّ وَمُطَهِّرُكَ مِنَ الَّذِينَ كَفَرُوا وَجَاعِلُ الَّذِينَ اتَّبَعُوكَ فَوْقَ الَّذِينَ كَفَرُوا إِلَىٰ يَوْمِ الْقِيَامَةِ ۖ ثُمَّ إِلَيَّ مَرْجِعُكُمْ فَأَحْكُمُ بَيْنَكُمْ فِيمَا كُنتُمْ فِيهِ تَخْتَلِفُونَ
అప్పుడు అల్లాహ్‌ ఇలా అన్నాడు : ఓ ఈసా! నేను నిన్ను పూర్తిగా తీసుకుంటాను. నిన్ను నా వైపుకు లేపుకుంటాను. అవిశ్వాసుల బారి నుంచి నిన్ను పరిశుద్ధునిగా చేస్తాను. నిన్ను అనుసరించిన వారిని ప్రళయదినం వరకూ అవిశ్వాసులపై పైచేయిగా ఉంచుతాను. ఆ తర్వాత మీరంతా మరలి రావలసింది నా వద్దకే. అప్పుడు నేనే మీ మధ్య ఉన్న పరస్పర విభేదాలపై తీర్పు చేస్తాను.
3:56  فَأَمَّا الَّذِينَ كَفَرُوا فَأُعَذِّبُهُمْ عَذَابًا شَدِيدًا فِي الدُّنْيَا وَالْآخِرَةِ وَمَا لَهُم مِّن نَّاصِرِينَ
మరి అవిశ్వాసులకైతే నేను ఇహలోకంలోనూ, పరలోకంలోనూ కఠిన శిక్ష విధిస్తాను. వారిని ఆదుకునే వారెవరూ ఉండరు.
3:57  وَأَمَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ فَيُوَفِّيهِمْ أُجُورَهُمْ ۗ وَاللَّهُ لَا يُحِبُّ الظَّالِمِينَ
అయితే విశ్వసించి, సత్కార్యాలు చేసినవారికి వారి పూర్తి పుణ్యఫలాన్ని అల్లాహ్‌ ఇస్తాడు. అల్లాహ్‌ దుర్మార్గులను ఎంత మాత్రం ఇష్టపడడు.
3:58  ذَٰلِكَ نَتْلُوهُ عَلَيْكَ مِنَ الْآيَاتِ وَالذِّكْرِ الْحَكِيمِ
(ఓ ముహమ్మద్‌!) మేము నీకు (దివ్య ఖుర్‌ఆన్‌) ఆయతులను, వివేకంతో కూడిన హితబోధను చదివి వినిపిస్తున్నాము.
3:59  إِنَّ مَثَلَ عِيسَىٰ عِندَ اللَّهِ كَمَثَلِ آدَمَ ۖ خَلَقَهُ مِن تُرَابٍ ثُمَّ قَالَ لَهُ كُن فَيَكُونُ
అల్లాహ్‌ దృష్టిలో ఈసా ఉపమానం ఆదం ఉపమానాన్ని పోలినదే. (ఆయన) అతన్ని మట్టితో చేసి 'అయిపో' అని ఆజ్ఞాపించగానే అతను (మనిషిగా) అయిపోయాడు.
3:60  الْحَقُّ مِن رَّبِّكَ فَلَا تَكُن مِّنَ الْمُمْتَرِينَ
నీ ప్రభువు తరఫు నుంచి (వచ్చిన) సత్యం ఇదే. జాగ్రత్త! శంకించే వారిలో చేరిపోకు.
3:61  فَمَنْ حَاجَّكَ فِيهِ مِن بَعْدِ مَا جَاءَكَ مِنَ الْعِلْمِ فَقُلْ تَعَالَوْا نَدْعُ أَبْنَاءَنَا وَأَبْنَاءَكُمْ وَنِسَاءَنَا وَنِسَاءَكُمْ وَأَنفُسَنَا وَأَنفُسَكُمْ ثُمَّ نَبْتَهِلْ فَنَجْعَل لَّعْنَتَ اللَّهِ عَلَى الْكَاذِبِينَ
కనుక నీ వద్దకు ఈ జ్ఞానం వచ్చిన తరువాత కూడా నీతో ఎవరయినా ఈ విషయంలో వాదనకు దిగితే వారితో స్పష్టంగా ఇలా చెప్పేయి: ''రండి! మీరూ మేము కలసి మన కుమారులను, మన స్త్రీలను పిలుద్దాం. స్వయంగా మనం కూడా వద్దాం. ఆ తర్వాత - 'అబద్ధాలు చెప్పేవారిపై అల్లాహ్‌ శాపం పడుగాక' అని దీనాతిదీనంగా ప్రార్థిద్దాము.''
3:62  إِنَّ هَٰذَا لَهُوَ الْقَصَصُ الْحَقُّ ۚ وَمَا مِنْ إِلَٰهٍ إِلَّا اللَّهُ ۚ وَإِنَّ اللَّهَ لَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
నిశ్చయంగా ఇదే సత్యబద్ధమైన వృత్తాంతం. అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్యుడు లేడు. నిస్సందేహంగా అల్లాహ్‌యే సర్వాధిక్యుడు, వివేకవంతుడు.
3:63  فَإِن تَوَلَّوْا فَإِنَّ اللَّهَ عَلِيمٌ بِالْمُفْسِدِينَ
(ఈ సవాలు విసిరిన) తరువాత కూడా వారు (సత్యాన్ని) ఒప్పుకోక తిరిగిపోయినట్లయితే, అసలు సంక్షోభాన్ని రేకెత్తించే వారెవరో అల్లాహ్‌కు బాగా తెలుసు.
3:64  قُلْ يَا أَهْلَ الْكِتَابِ تَعَالَوْا إِلَىٰ كَلِمَةٍ سَوَاءٍ بَيْنَنَا وَبَيْنَكُمْ أَلَّا نَعْبُدَ إِلَّا اللَّهَ وَلَا نُشْرِكَ بِهِ شَيْئًا وَلَا يَتَّخِذَ بَعْضُنَا بَعْضًا أَرْبَابًا مِّن دُونِ اللَّهِ ۚ فَإِن تَوَلَّوْا فَقُولُوا اشْهَدُوا بِأَنَّا مُسْلِمُونَ
(ఓ ప్రవక్తా!) వారికి స్పష్టంగా చెప్పు: ''ఓ గ్రంథవహులారా! మాలోనూ, మీ లోనూ సమానంగా ఉన్న ఒక విషయం వైపుకు రండి. అదేమంటే మనం అల్లాహ్‌ను తప్ప వేరెవరినీ ఆరాధించకూడదు, ఆయనకు భాగస్వాములుగా ఎవరినీ కల్పించరాదు. అల్లాహ్‌ను వదలి మనలో ఎవరూ ఇంకొకరిని ప్రభువులుగా చేసుకోరాదు.'' ఈ ప్రతిపాదన పట్ల గనక వారు విముఖత చూపితే, ''మేము మాత్రం ముస్లిం (విధేయు)లము అన్న విషయానికి మీరు సాక్షులుగా ఉండండి'' అని వారికి చెప్పేయండి.
3:65  يَا أَهْلَ الْكِتَابِ لِمَ تُحَاجُّونَ فِي إِبْرَاهِيمَ وَمَا أُنزِلَتِ التَّوْرَاةُ وَالْإِنجِيلُ إِلَّا مِن بَعْدِهِ ۚ أَفَلَا تَعْقِلُونَ
ఓ గ్రంథవహులారా! మీరు ఇబ్రాహీం విషయంలో ఎందుకు గొడవపడుతున్నారు. తౌరాతు, ఇన్జీలు గ్రంథాలైతే ఆయన తరువాతనే అవతరించాయి కదా! అయినా మీరు అర్థం చేసుకోరే?!
3:66  هَا أَنتُمْ هَٰؤُلَاءِ حَاجَجْتُمْ فِيمَا لَكُم بِهِ عِلْمٌ فَلِمَ تُحَاجُّونَ فِيمَا لَيْسَ لَكُم بِهِ عِلْمٌ ۚ وَاللَّهُ يَعْلَمُ وَأَنتُمْ لَا تَعْلَمُونَ
చూడండి, మీకు తెలిసిన విషయం గురించి మీరెలాగూ వాదించారు. కాని మీకు తెలియని విషయాల గురించి ఎందుకు వాదిస్తున్నారు? (యదార్థం) అల్లాహ్‌కు తెలుసుగాని మీకు తెలియదు.
3:67  مَا كَانَ إِبْرَاهِيمُ يَهُودِيًّا وَلَا نَصْرَانِيًّا وَلَٰكِن كَانَ حَنِيفًا مُّسْلِمًا وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ
ఇబ్రాహీం యూదుడూ కాదు, క్రైస్తవుడూ కాదు. ఆయన ఒకే దేవునివైపు అభిముఖుడైన ముస్లిం. ఆయన ముష్రిక్కులలోని వాడు ఎంతమాత్రం కాదు.
3:68  إِنَّ أَوْلَى النَّاسِ بِإِبْرَاهِيمَ لَلَّذِينَ اتَّبَعُوهُ وَهَٰذَا النَّبِيُّ وَالَّذِينَ آمَنُوا ۗ وَاللَّهُ وَلِيُّ الْمُؤْمِنِينَ
అందరికన్నా ఎక్కువగా ఇబ్రాహీంకు దగ్గరివారమని చెప్పుకునే హక్కు ఎవరికయినా ఉందీ అంటే, అది ఆయన్ని అనుసరించినవారికీ, ఈ ప్రవక్తకూ, విశ్వాసులకూ మాత్రమే ఉంది. అల్లాహ్‌ విశ్వాసులకు మాత్రమే నేస్తం.
3:69  وَدَّت طَّائِفَةٌ مِّنْ أَهْلِ الْكِتَابِ لَوْ يُضِلُّونَكُمْ وَمَا يُضِلُّونَ إِلَّا أَنفُسَهُمْ وَمَا يَشْعُرُونَ
గ్రంథవహులలోని ఒక వర్గం మిమ్మల్ని పెడత్రోవ పట్టించాలని చూస్తోంది. నిజానికి వారు తమను తామే పెడత్రోవలో పడ వేసుకుంటున్నారు. కాని ఆ విషయాన్ని వారు గ్రహించటంలేదు.
3:70  يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَأَنتُمْ تَشْهَدُونَ
''ఓ గ్రంథవహులారా! మీరు స్వయంగా అల్లాహ్‌ ఆయతులకు సాక్షిగా ఉండి కూడా వాటిని ఎందుకు తిరస్కరిస్తున్నారు?''
3:71  يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَلْبِسُونَ الْحَقَّ بِالْبَاطِلِ وَتَكْتُمُونَ الْحَقَّ وَأَنتُمْ تَعْلَمُونَ
''గ్రంథం కల ఓ ప్రజలారా! తెలిసి కూడా మీరు సత్యానికి అసత్యపు రంగు పులిమి దానిని ఎందుకు అనుమానాస్పదం చేస్తారు? (ఉద్దేశపూర్వకంగా) సత్యాన్ని ఎందుకు కప్పిపుచ్చుతున్నారు??''
3:72  وَقَالَت طَّائِفَةٌ مِّنْ أَهْلِ الْكِتَابِ آمِنُوا بِالَّذِي أُنزِلَ عَلَى الَّذِينَ آمَنُوا وَجْهَ النَّهَارِ وَاكْفُرُوا آخِرَهُ لَعَلَّهُمْ يَرْجِعُونَ
గ్రంథవహులలోని ఒక వర్గం ఇలా అన్నది : ''విశ్వసించిన వారిపై అవతరించిన దానిని ఉదయం విశ్వసించి, సాయంత్రం తిరస్కరించండి. బహుశా ఇలాగయినా వారు మరలి పోతారేమో!''
3:73  وَلَا تُؤْمِنُوا إِلَّا لِمَن تَبِعَ دِينَكُمْ قُلْ إِنَّ الْهُدَىٰ هُدَى اللَّهِ أَن يُؤْتَىٰ أَحَدٌ مِّثْلَ مَا أُوتِيتُمْ أَوْ يُحَاجُّوكُمْ عِندَ رَبِّكُمْ ۗ قُلْ إِنَّ الْفَضْلَ بِيَدِ اللَّهِ يُؤْتِيهِ مَن يَشَاءُ ۗ وَاللَّهُ وَاسِعٌ عَلِيمٌ
''మీరు మీ ధర్మాన్ని అనుసరించేవారిని తప్ప వేరెవరినీ నమ్మవద్దు'' (అని అంటారు). (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : ''నిశ్చయంగా అల్లాహ్‌ చూపే మార్గమే సన్మార్గం.'' (గ్రంథవహులు తమ వారికి ఇంకా ఈ విధంగా కూడా నూరి పోస్తారు:) ''మీకు ఇవ్వబడినదే వేరెవరికయినా ఇవ్వబడి ఉండ వచ్చనీ, లేక వారు మీ ప్రభువు సమక్షంలో మీకు వ్యతిరేకంగా వాదిస్తారని (మీరు ఎంతమాత్రం అనుకోకండి).'' ఓ ప్రవక్తా! వారితో అను: ''అనుగ్రహాలన్నీ అల్లాహ్‌ చేతిలో ఉన్నాయి. ఆయన తాను కోరిన వారికి వాటిని ఇస్తాడు. అల్లాహ్‌ గొప్ప విస్తృతి కలవాడు, అన్నీ తెలిసినవాడు.''
3:74  يَخْتَصُّ بِرَحْمَتِهِ مَن يَشَاءُ ۗ وَاللَّهُ ذُو الْفَضْلِ الْعَظِيمِ
''ఆయన తాను కోరిన వారిని తన కారుణ్యం కొరకు ప్రత్యేకించుకుంటాడు. అల్లాహ్‌ గొప్ప అనుగ్రహం కలవాడు.''
3:75  وَمِنْ أَهْلِ الْكِتَابِ مَنْ إِن تَأْمَنْهُ بِقِنطَارٍ يُؤَدِّهِ إِلَيْكَ وَمِنْهُم مَّنْ إِن تَأْمَنْهُ بِدِينَارٍ لَّا يُؤَدِّهِ إِلَيْكَ إِلَّا مَا دُمْتَ عَلَيْهِ قَائِمًا ۗ ذَٰلِكَ بِأَنَّهُمْ قَالُوا لَيْسَ عَلَيْنَا فِي الْأُمِّيِّينَ سَبِيلٌ وَيَقُولُونَ عَلَى اللَّهِ الْكَذِبَ وَهُمْ يَعْلَمُونَ
గ్రంథవహులలో కొందరు ఎలాంటివారంటే, నీవు వారి వద్ద ఒక పెద్ద ధనరాశిని అమానతుగా పెట్టినాసరే, వారు దాన్ని నీకు తిరిగి ఇచ్చేస్తారు. వారిలో మరి కొందరు కూడా ఉన్నారు. వారెలాంటి వారంటే నువ్వు వారికి ఒక్క దీనారును అప్పగించినా వారు తిరిగి ఇవ్వరు - నువ్వు వారి నెత్తిమీద నిల్చుంటే తప్ప! ఎందుకంటే ''నిరక్షర కుక్షుల (యూదేతరుల) హక్కు విషయంలో మమ్మల్ని నిలదీయటం జరగదు'' అని వారు చెప్పి ఉన్నారు. వీరు తెలిసి కూడా అల్లాహ్‌కు అబద్ధాన్ని ఆపాదిస్తున్నారు.
3:76  بَلَىٰ مَنْ أَوْفَىٰ بِعَهْدِهِ وَاتَّقَىٰ فَإِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَّقِينَ
ఎందుకు నిలదీయటం జరగదు? (వారిని నిలదీయటం ఖాయం). అయితే ఇచ్చిన మాటను నిలుపుకుని, భయభక్తుల వైఖరిని అవలంబిస్తే, అల్లాహ్‌ భయభక్తులుగలవారిని ప్రేమిస్తాడు.
3:77  إِنَّ الَّذِينَ يَشْتَرُونَ بِعَهْدِ اللَّهِ وَأَيْمَانِهِمْ ثَمَنًا قَلِيلًا أُولَٰئِكَ لَا خَلَاقَ لَهُمْ فِي الْآخِرَةِ وَلَا يُكَلِّمُهُمُ اللَّهُ وَلَا يَنظُرُ إِلَيْهِمْ يَوْمَ الْقِيَامَةِ وَلَا يُزَكِّيهِمْ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
ఎవరయితే అల్లాహ్‌ వాగ్దానాన్ని, తమ ప్రమాణాలను కొద్ది పాటి మూల్యానికి అమ్ముకుంటారో అలాంటి వారికి పరలోకంలో ఏ భాగమూ లేదు. అల్లాహ్‌ వారిని ప్రళయదినాన పలకరించటంగానీ, వారి వంక చూడటంగానీ చేయడు. వారిని పరిశుద్ధ పరచడు. పైగా వారి కోసం బాధాకరమైన శిక్ష ఉంటుంది.
3:78  وَإِنَّ مِنْهُمْ لَفَرِيقًا يَلْوُونَ أَلْسِنَتَهُم بِالْكِتَابِ لِتَحْسَبُوهُ مِنَ الْكِتَابِ وَمَا هُوَ مِنَ الْكِتَابِ وَيَقُولُونَ هُوَ مِنْ عِندِ اللَّهِ وَمَا هُوَ مِنْ عِندِ اللَّهِ وَيَقُولُونَ عَلَى اللَّهِ الْكَذِبَ وَهُمْ يَعْلَمُونَ
వారిలోని మరికొందరు గ్రంథాన్ని పఠిస్తూ తమ నాలుకలను త్రిప్పుతారు - అది గ్రంథంలోని భాగమే అని మీరు భావించాలన్న ఉద్దేశ్యంతో వారలా చేస్తారు. కాని వాస్తవానికి అది గ్రంథంలో అంతర్భాగం కానేకాదు. ''అది అల్లాహ్‌ తరఫు నుంచి వచ్చినది'' అని వారు అంటారు. యదార్థానికి అది అల్లాహ్‌ తరఫునుండి వచ్చినది కాదు. వారు ఉద్దేశ్యపూర్వకంగా అల్లాహ్‌కు అసత్యాన్ని అంటగడుతున్నారు.
3:79  مَا كَانَ لِبَشَرٍ أَن يُؤْتِيَهُ اللَّهُ الْكِتَابَ وَالْحُكْمَ وَالنُّبُوَّةَ ثُمَّ يَقُولَ لِلنَّاسِ كُونُوا عِبَادًا لِّي مِن دُونِ اللَّهِ وَلَٰكِن كُونُوا رَبَّانِيِّينَ بِمَا كُنتُمْ تُعَلِّمُونَ الْكِتَابَ وَبِمَا كُنتُمْ تَدْرُسُونَ
అల్లాహ్‌ ఏ మనిషికయినా గ్రంథాన్నీ, వివేకాన్నీ, ప్రవక్త పదవిని (నబువ్వత్‌ను) ప్రసాదించిన మీదట కూడా 'మీరు అల్లాహ్‌ను వదలిపెట్టి నాకు దాసులుకండి' అని అతడు ప్రజలతో అనటం ఎంతమాత్రం తగదు. దానికి బదులు, 'మీరంతా ప్రభువు వారైపోండి' అని అతడనాలి. ఎందుకంటే మీరు గ్రంథాన్ని నేర్పేవారవటం చేతనూ, గ్రంథాన్ని చదివేవారవటం చేతనూ (మీరు మీ ప్రభువు వారవటమే ధర్మం).
3:80  وَلَا يَأْمُرَكُمْ أَن تَتَّخِذُوا الْمَلَائِكَةَ وَالنَّبِيِّينَ أَرْبَابًا ۗ أَيَأْمُرُكُم بِالْكُفْرِ بَعْدَ إِذْ أَنتُم مُّسْلِمُونَ
దూతలను, ప్రవక్తలను ప్రభువులుగా చేసుకోమని అతడు మీకు ఎన్నటికీ ఆదేశించ(లే)డు. ఏమిటీ, మీరు ముస్లిములయిన మీదట కూడా అతడు మిమ్మల్ని అవిశ్వాసానికి పాల్పడమని ఆజ్ఞాపిస్తాడా? (ఇది అసంభవం).
3:81  وَإِذْ أَخَذَ اللَّهُ مِيثَاقَ النَّبِيِّينَ لَمَا آتَيْتُكُم مِّن كِتَابٍ وَحِكْمَةٍ ثُمَّ جَاءَكُمْ رَسُولٌ مُّصَدِّقٌ لِّمَا مَعَكُمْ لَتُؤْمِنُنَّ بِهِ وَلَتَنصُرُنَّهُ ۚ قَالَ أَأَقْرَرْتُمْ وَأَخَذْتُمْ عَلَىٰ ذَٰلِكُمْ إِصْرِي ۖ قَالُوا أَقْرَرْنَا ۚ قَالَ فَاشْهَدُوا وَأَنَا مَعَكُم مِّنَ الشَّاهِدِينَ
అల్లాహ్‌ (తన) ప్రవక్తల నుండి వాగ్దానం తీసుకున్నప్పుడు, ''నేను మీకు గ్రంథాన్ని, వివేకాన్ని ఒసగిన తరువాత, మీ వద్ద ఉన్న దాన్ని సత్యమని ధృవీకరించే ప్రవక్త మీ వద్దకు వస్తే మీరు తప్పకుండా అతన్ని విశ్వసించాలి, అతనికి సహాయపడాలి'' అని చెప్పాడు. తరువాత ఆయన, ''ఈ విషయాన్ని మీరు ఒప్పుకుంటున్నారా? నేను మీపై మోపిన బాధ్యతను స్వీకరిస్తున్నారా?'' అని ప్రశ్నించగా, ''మేము ఒప్పుకుంటున్నాము'' అని అందరూ అన్నారు. ''మరయితే దీనికి మీరు సాక్షులుగా ఉండండి. మీతోపాటు నేనూ సాక్షిగా ఉంటాను'' అని అల్లాహ్‌ అన్నాడు.
3:82  فَمَن تَوَلَّىٰ بَعْدَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْفَاسِقُونَ
దీని తరువాత కూడా ఎవరు వెనుతిరిగిపోతారో వారే పరమ అవిధేయులు.
3:83  أَفَغَيْرَ دِينِ اللَّهِ يَبْغُونَ وَلَهُ أَسْلَمَ مَن فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ طَوْعًا وَكَرْهًا وَإِلَيْهِ يُرْجَعُونَ
ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారంతా - తమకు ఇష్టమున్నా లేకపోయినా అల్లాహ్‌ విధేయతకు కట్టుబడి ఉండగా, వీరు అల్లాహ్‌ ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తున్నారా? ఎట్టకేలకు వారంతా ఆయన వైపునకే మరలించబడతారు.
3:84  قُلْ آمَنَّا بِاللَّهِ وَمَا أُنزِلَ عَلَيْنَا وَمَا أُنزِلَ عَلَىٰ إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطِ وَمَا أُوتِيَ مُوسَىٰ وَعِيسَىٰ وَالنَّبِيُّونَ مِن رَّبِّهِمْ لَا نُفَرِّقُ بَيْنَ أَحَدٍ مِّنْهُمْ وَنَحْنُ لَهُ مُسْلِمُونَ
(ఓ ప్రవక్తా!) వారితో అను: ''మేము అల్లాహ్‌ను, మాపై అవతరింపజెయ్యబడిన దానినీ విశ్వసించాము. ఇంకా ఇబ్రాహీము, ఇస్మాయీలు, ఇస్‌హాఖు, యాఖూబుపై, ఆయన సంతానంపై అవతరింపజెయ్యబడిన దానినీ, మూసా, ఈసా ఇంకా ఇతర ప్రవక్తలకు వారి ప్రభువు తరఫున వొసగబడిన వాటిని మేము విశ్వసించాము. మేము వారి మధ్య ఎలాంటి భేదభావాన్ని కనబరచము. మేము ఆయనకే విధేయులము.''
3:85  وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ
ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు.
3:86  كَيْفَ يَهْدِي اللَّهُ قَوْمًا كَفَرُوا بَعْدَ إِيمَانِهِمْ وَشَهِدُوا أَنَّ الرَّسُولَ حَقٌّ وَجَاءَهُمُ الْبَيِّنَاتُ ۚ وَاللَّهُ لَا يَهْدِي الْقَوْمَ الظَّالِمِينَ
(తొలుత) విశ్వసించి, ఈయన ప్రవక్త అనే విషయం సత్యమేనని సాక్ష్యం (కూడా) యిచ్చి, తీరా తమ వద్దకు స్పష్టమైన సూచనలు వచ్చేసిన మీదట అవిశ్వాసులైపోయిన వారికి అల్లాహ్‌ సన్మార్గం ఎలా చూపుతాడు? అల్లాహ్‌ ఇటువంటి దుర్మార్గులకు దారి చూపడు.
3:87  أُولَٰئِكَ جَزَاؤُهُمْ أَنَّ عَلَيْهِمْ لَعْنَةَ اللَّهِ وَالْمَلَائِكَةِ وَالنَّاسِ أَجْمَعِينَ
వారి పాపఫలంగా వారిపై అల్లాహ్‌ శాపం, దూతల, సమస్త జనుల శాపం పడుతుంది.
3:88  خَالِدِينَ فِيهَا لَا يُخَفَّفُ عَنْهُمُ الْعَذَابُ وَلَا هُمْ يُنظَرُونَ
ఈ (శాపగ్రస్త) స్థితిలో వారు కలకాలం ఉంటారు. వారి శిక్షను తగ్గించటంగానీ, వారికి గడువు ఇవ్వటంగానీ జరగదు.
3:89  إِلَّا الَّذِينَ تَابُوا مِن بَعْدِ ذَٰلِكَ وَأَصْلَحُوا فَإِنَّ اللَّهَ غَفُورٌ رَّحِيمٌ
అయితే ఆ తరువాత ఎవరు పశ్చాత్తాపం చెంది, తమ నడవడికను సరిదిద్దుకుంటారో (వారు రక్షించబడతారు). నిశ్చయంగా అల్లాహ్‌ క్షమించేవాడు, కరుణించేవాడు.
3:90  إِنَّ الَّذِينَ كَفَرُوا بَعْدَ إِيمَانِهِمْ ثُمَّ ازْدَادُوا كُفْرًا لَّن تُقْبَلَ تَوْبَتُهُمْ وَأُولَٰئِكَ هُمُ الضَّالُّونَ
ఎవరు విశ్వసించిన మీదట అవిశ్వాస వైఖరికి ఒడిగడతారో, ఆ తరువాత అవిశ్వాసంలో మరింత పెచ్చరిల్లుతారో వారి పశ్చాత్తాపం సుతరామూ స్వీకరించబడదు. అపమార్గం పాలైన వారంటే వీరే.
3:91  إِنَّ الَّذِينَ كَفَرُوا وَمَاتُوا وَهُمْ كُفَّارٌ فَلَن يُقْبَلَ مِنْ أَحَدِهِم مِّلْءُ الْأَرْضِ ذَهَبًا وَلَوِ افْتَدَىٰ بِهِ ۗ أُولَٰئِكَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ وَمَا لَهُم مِّن نَّاصِرِينَ
మరెవరు అవిశ్వాసానికి ఒడిగట్టి, అవిశ్వాసులుగానే మరణించారో వారిలో ఎవరయినాసరే భూమి నిండా బంగారం సమర్పించినా, తమ పాపానికి పరిహారంగా ఇచ్చినాసరే అది స్వీకారయోగ్యం అవదు. వ్యధాభరితమైన శిక్షకు పాత్రులయ్యే వారంటే వీరే. వీరిని ఆదుకునే వాడెవడూ ఉండడు.
3:92  لَن تَنَالُوا الْبِرَّ حَتَّىٰ تُنفِقُوا مِمَّا تُحِبُّونَ ۚ وَمَا تُنفِقُوا مِن شَيْءٍ فَإِنَّ اللَّهَ بِهِ عَلِيمٌ
మీకు ప్రియాతిప్రియమైన వస్తువుల నుండి మీరు (దైవ మార్గంలో) ఖర్చు పెట్టనంతవరకూ మీరు పుణ్య స్థాయికి చేరుకోలేరు. మీరు ఖర్చుపెట్టేదంతా అల్లాహ్‌కు తెలుసు.
3:93  كُلُّ الطَّعَامِ كَانَ حِلًّا لِّبَنِي إِسْرَائِيلَ إِلَّا مَا حَرَّمَ إِسْرَائِيلُ عَلَىٰ نَفْسِهِ مِن قَبْلِ أَن تُنَزَّلَ التَّوْرَاةُ ۗ قُلْ فَأْتُوا بِالتَّوْرَاةِ فَاتْلُوهَا إِن كُنتُمْ صَادِقِينَ
తౌరాతు గ్రంథం అవతరించక పూర్వం, ఇస్రాయీల్‌ (యాఖూబు) తన కోసం నిషేధించుకున్న వస్తువులు తప్ప ఇతర ఆహార పదార్థాలన్నీ ఇస్రాయీల్‌ వంశస్థుల కొరకు ధర్మ సమ్మతం గానే ఉండేవి. 'మీరు సత్యవంతులే అయితే తౌరాతును తీసుకుని రండి, దాన్ని చదివి వినిపించండి' అని (ఓ ముహమ్మద్‌!) వారికి చెప్పు.
3:94  فَمَنِ افْتَرَىٰ عَلَى اللَّهِ الْكَذِبَ مِن بَعْدِ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الظَّالِمُونَ
దీని తరువాత కూడా ఎవరయినా అల్లాహ్‌కు అబద్ధాన్ని ఆపాదిస్తే వారే దుర్మార్గులవుతారు.
3:95  قُلْ صَدَقَ اللَّهُ ۗ فَاتَّبِعُوا مِلَّةَ إِبْرَاهِيمَ حَنِيفًا وَمَا كَانَ مِنَ الْمُشْرِكِينَ
వారికి చెప్పు: ''అల్లాహ్‌ సత్యం పలికాడు. కనుక మీరంతా ఏకాగ్ర చిత్తంకల ఇబ్రాహీము ధర్మాన్నే అనుసరించండి. ఆయన బహుదైవోపాసకులలోని వాడు కాడు.''
3:96  إِنَّ أَوَّلَ بَيْتٍ وُضِعَ لِلنَّاسِ لَلَّذِي بِبَكَّةَ مُبَارَكًا وَهُدًى لِّلْعَالَمِينَ
నిశ్చయంగా మానవుల కొరకు ప్రప్రథమంగా ఖరారు చేయబడిన (దైవ) గృహం బక్కాలో (మక్కాలో) ఉన్నదే. అది శుభప్రదమైనది, సమస్త లోకవాసులకు మార్గదర్శకం కూడాను.
3:97  فِيهِ آيَاتٌ بَيِّنَاتٌ مَّقَامُ إِبْرَاهِيمَ ۖ وَمَن دَخَلَهُ كَانَ آمِنًا ۗ وَلِلَّهِ عَلَى النَّاسِ حِجُّ الْبَيْتِ مَنِ اسْتَطَاعَ إِلَيْهِ سَبِيلًا ۚ وَمَن كَفَرَ فَإِنَّ اللَّهَ غَنِيٌّ عَنِ الْعَالَمِينَ
అందులో స్పష్టమయిన సూచనలున్నాయి. మఖామె ఇబ్రాహీం (ఇబ్రాహీం నిలబడిన స్థలం) ఉన్నది. అందులోకి ప్రవేశించినవాడు రక్షణ పొందుతాడు. అక్కడికి వెళ్ళే స్థోమత గలవారికి, ఆ గృహ (యాత్ర) హజ్‌ చేయటాన్ని అల్లాహ్‌ విధిగా చేశాడు. మరెవరయినా (ఈ ఆజ్ఞను శిరసావహించటానికి) నిరాకరిస్తే అల్లాహ్‌కు సమస్త లోకవాసుల అవసరం ఎంతమాత్రం లేదు.
3:98  قُلْ يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَاللَّهُ شَهِيدٌ عَلَىٰ مَا تَعْمَلُونَ
''ఓ గ్రంథవహులారా! మీరు అల్లాహ్‌ ఆయతుల(వాక్యాల)ను ఎందుకు తిరస్కరిస్తున్నారు? మీరు చేసే కర్మలకు అల్లాహ్‌ సాక్షిగా ఉన్నాడు'' అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
3:99  قُلْ يَا أَهْلَ الْكِتَابِ لِمَ تَصُدُّونَ عَن سَبِيلِ اللَّهِ مَنْ آمَنَ تَبْغُونَهَا عِوَجًا وَأَنتُمْ شُهَدَاءُ ۗ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ
''గ్రంథవహులారా! అల్లాహ్‌ మార్గం నుంచి మీరు విశ్వసించినవారిని ఎందుకు అడ్డుకుంటున్నారు? (ఇదే సన్మార్గం అన్న దానికి) మీరు సాక్షులై ఉండి కూడా అందులో లోపాలు వెతికే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అల్లాహ్‌ మీ చేష్టల పట్ల పరధ్యానానికి లోనైలేడు'' అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
3:100  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِن تُطِيعُوا فَرِيقًا مِّنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ يَرُدُّوكُم بَعْدَ إِيمَانِكُمْ كَافِرِينَ
విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు గ్రంథవహులలోని ఏదయినా వర్గంవారి మాటను విన్నారంటే, వారు మిమ్మల్ని మీ విశ్వాసస్థితి నుంచి అవిశ్వాసులుగా మార్చుతారు.
3:101  وَكَيْفَ تَكْفُرُونَ وَأَنتُمْ تُتْلَىٰ عَلَيْكُمْ آيَاتُ اللَّهِ وَفِيكُمْ رَسُولُهُ ۗ وَمَن يَعْتَصِم بِاللَّهِ فَقَدْ هُدِيَ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
మీకు అల్లాహ్‌ ఆయతులు (వాక్యాలు) చదివి వినిపిస్తుండగా, ఆయన ప్రవక్త మీ మధ్యనుండగా మీరు అవిశ్వాసానికి ఎలా పాల్పడగలరు? ఎవరు అల్లాహ్‌ (ధర్మము)ను గట్టిగా పట్టుకున్నాడో నిస్సందేహంగా అతడు రుజుమార్గం వైపు దర్శకత్వం వహించబడినట్లే.
3:102  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا اللَّهَ حَقَّ تُقَاتِهِ وَلَا تَمُوتُنَّ إِلَّا وَأَنتُم مُّسْلِمُونَ
ఓ విశ్వాసులారా! అల్లాహ్‌కు ఎంతగా భయపడాలో అంతగా భయపడండి. ముస్లింలుగా తప్ప మరణించకండి.
3:103  وَاعْتَصِمُوا بِحَبْلِ اللَّهِ جَمِيعًا وَلَا تَفَرَّقُوا ۚ وَاذْكُرُوا نِعْمَتَ اللَّهِ عَلَيْكُمْ إِذْ كُنتُمْ أَعْدَاءً فَأَلَّفَ بَيْنَ قُلُوبِكُمْ فَأَصْبَحْتُم بِنِعْمَتِهِ إِخْوَانًا وَكُنتُمْ عَلَىٰ شَفَا حُفْرَةٍ مِّنَ النَّارِ فَأَنقَذَكُم مِّنْهَا ۗ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمْ آيَاتِهِ لَعَلَّكُمْ تَهْتَدُونَ
అల్లాహ్‌ త్రాడును అందరూ కలసి గట్టిగా పట్టుకోండి. చీలిపోకండి. అల్లాహ్‌ మీపై కురిపించిన దయానుగ్రహాన్ని జ్ఞప్తికి తెచ్చుకోండి - అప్పుడు మీరు ఒండొకరికి శత్రువులుగా ఉండేవారు. ఆయన మీ హృదయాలలో పరస్పరం ప్రేమానురాగాలను సృజించాడు. దాంతో ఆయన అనుగ్రహం వల్ల మీరు ఒకరి కొకరు అన్నదమ్ములుగా మారారు. మీరు అగ్నిగుండం ఆఖరి అంచులకు చేరుకోగా, ఆయన మిమ్మల్ని దాన్నుంచి కాపాడాడు. మీరు సన్మార్గం పొందాలని ఈ విధంగా అల్లాహ్‌ మీకు తన సూచనలను విశదపరుస్తున్నాడు.
3:104  وَلْتَكُن مِّنكُمْ أُمَّةٌ يَدْعُونَ إِلَى الْخَيْرِ وَيَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ ۚ وَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
మేలు వైపుకు పిలిచే, మంచిని చెయ్యమని ఆజ్ఞాపించే, చెడుల నుంచి వారించే ఒక వర్గం మీలో ఉండాలి. ఈ పనిని చేసేవారే సాఫల్యాన్ని పొందుతారు.
3:105  وَلَا تَكُونُوا كَالَّذِينَ تَفَرَّقُوا وَاخْتَلَفُوا مِن بَعْدِ مَا جَاءَهُمُ الْبَيِّنَاتُ ۚ وَأُولَٰئِكَ لَهُمْ عَذَابٌ عَظِيمٌ
తమ వద్దకు స్పష్టమయిన నిదర్శనాలు వచ్చేసిన తరువాత కూడా వర్గాలుగా విడిపోయి, విభేదించుకున్న వారి మాదిరిగా మీరు తయారవకండి. మహాశిక్ష ఉన్నది ఇటువంటివారి కోసమే.
3:106  يَوْمَ تَبْيَضُّ وُجُوهٌ وَتَسْوَدُّ وُجُوهٌ ۚ فَأَمَّا الَّذِينَ اسْوَدَّتْ وُجُوهُهُمْ أَكَفَرْتُم بَعْدَ إِيمَانِكُمْ فَذُوقُوا الْعَذَابَ بِمَا كُنتُمْ تَكْفُرُونَ
ఆనాడు కొన్ని ముఖాలు వెలిగిపోతూ ఉంటాయి. మరికొన్ని ముఖాలు నల్లబడి ఉంటాయి. నలుపు ఆవరించి ఉన్న మొహాలు కలిగిన వారినుద్దేశించి, ''మీరు విశ్వసించిన మీదట తిరస్కార వైఖరికి ఒడిగట్టారా? సరే, మీరు తిరస్కరించిన దాని ఫలితంగా శిక్షను చవిచూడండి'' (అని అనబడుతుంది).
3:107  وَأَمَّا الَّذِينَ ابْيَضَّتْ وُجُوهُهُمْ فَفِي رَحْمَةِ اللَّهِ هُمْ فِيهَا خَالِدُونَ
తెల్లగా ప్రకాశిస్తున్న మొహాలవారు దైవకారుణ్యంలో ఉంటారు. అందులో వారు కలకాలం ఉంటారు.
3:108  تِلْكَ آيَاتُ اللَّهِ نَتْلُوهَا عَلَيْكَ بِالْحَقِّ ۗ وَمَا اللَّهُ يُرِيدُ ظُلْمًا لِّلْعَالَمِينَ
(ఓ ప్రవక్తా!) ఇవి అల్లాహ్‌ వచనాలు. వాటిని మేము నీకు ఉన్నదున్నట్లుగా చదివి వినిపిస్తున్నాము. లోకవాసులకు అన్యాయం చేయాలన్న తలంపు అల్లాహ్‌కు ఎంతమాత్రం లేదు.
3:109  وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ
ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న సమస్తమూ అల్లాహ్‌కే చెందుతుంది. సకల వ్యవహారాలూ అల్లాహ్‌ వైపుకే మళ్ళించ బడతాయి.
3:110  كُنتُمْ خَيْرَ أُمَّةٍ أُخْرِجَتْ لِلنَّاسِ تَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَتَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَتُؤْمِنُونَ بِاللَّهِ ۗ وَلَوْ آمَنَ أَهْلُ الْكِتَابِ لَكَانَ خَيْرًا لَّهُم ۚ مِّنْهُمُ الْمُؤْمِنُونَ وَأَكْثَرُهُمُ الْفَاسِقُونَ
మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన శ్రేష్ఠ సమాజం మీరు. మీరు మంచి విషయాలకై ఆజ్ఞాపిస్తారు, చెడు నుంచి ఆపుతారు, ఇంకా మీరు అల్లాహ్‌ను విశ్వసిస్తారు. గ్రంథవహులు కూడా విశ్వసించి ఉంటే, అది వారి కోసం శ్రేయస్కరం అయ్యేది. వారిలో కొందరు విశ్వాసులు కూడా ఉన్నారు. కాని అత్యధికులు అవిధేయులే.
3:111  لَن يَضُرُّوكُمْ إِلَّا أَذًى ۖ وَإِن يُقَاتِلُوكُمْ يُوَلُّوكُمُ الْأَدْبَارَ ثُمَّ لَا يُنصَرُونَ
వారు మీకు ఏమాత్రం హాని కలిగించలేరు - మహా అయితే కొంచెం బాధించటం తప్ప. ఒకవేళ మీతో తలపడవలసిన పరిస్థితే ఏర్పడినట్లయితే వారు మీకు వెన్ను చూపి పారిపోతారు. ఆ తరువాత వారికెలాంటి సహాయమూ లభించదు.
3:112  ضُرِبَتْ عَلَيْهِمُ الذِّلَّةُ أَيْنَ مَا ثُقِفُوا إِلَّا بِحَبْلٍ مِّنَ اللَّهِ وَحَبْلٍ مِّنَ النَّاسِ وَبَاءُوا بِغَضَبٍ مِّنَ اللَّهِ وَضُرِبَتْ عَلَيْهِمُ الْمَسْكَنَةُ ۚ ذَٰلِكَ بِأَنَّهُمْ كَانُوا يَكْفُرُونَ بِآيَاتِ اللَّهِ وَيَقْتُلُونَ الْأَنبِيَاءَ بِغَيْرِ حَقٍّ ۚ ذَٰلِكَ بِمَا عَصَوا وَّكَانُوا يَعْتَدُونَ
సర్వత్రా వారిపై పరాభవపు దెబ్బ పడుతుంది - వారికి అల్లాహ్‌ శరణు లేదా ప్రజల నుండి అభయహస్తం లభిస్తే తప్ప! వారు దైవాగ్రహానికి పాత్రులైపోయారు. వారికి దీనావస్థ అంట గట్టబడింది. వారి ఈ స్థితికి కారణమేమిటంటే వారు అల్లాహ్‌ ఆయతులను తిరస్కరించేవారు, అన్యాయంగా ప్రవక్తలను చంపి వేసేవారు. వారి అవిధేయతకు, అతిక్రమణలకు శాస్తి ఇది!
3:113  لَيْسُوا سَوَاءً ۗ مِّنْ أَهْلِ الْكِتَابِ أُمَّةٌ قَائِمَةٌ يَتْلُونَ آيَاتِ اللَّهِ آنَاءَ اللَّيْلِ وَهُمْ يَسْجُدُونَ
వారంతా ఒకలాంటివారు కారు. ఈ గ్రంథవహులలోని ఒక వర్గం వారు (సత్యంపై) నిలకడగా ఉన్నారు. వారు రాత్రి సమయాల్లో కూడా దైవవాక్యాలను పారాయణం చేస్తారు, సాష్టాంగపడతారు.
3:114  يُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ وَيَأْمُرُونَ بِالْمَعْرُوفِ وَيَنْهَوْنَ عَنِ الْمُنكَرِ وَيُسَارِعُونَ فِي الْخَيْرَاتِ وَأُولَٰئِكَ مِنَ الصَّالِحِينَ
అల్లాహ్‌ను, అంతిమదినాన్ని కూడా వారు విశ్వసిస్తారు. మంచిని ఆజ్ఞాపిస్తారు, చెడు నుండి ఆపుతారు. సత్కార్యాల కోసం పరస్పరం పోటీపడతారు. వీరు సజ్జనుల కోవకు చెందినవారు.
3:115  وَمَا يَفْعَلُوا مِنْ خَيْرٍ فَلَن يُكْفَرُوهُ ۗ وَاللَّهُ عَلِيمٌ بِالْمُتَّقِينَ
వారు ఏ మంచి పనిచేసినా దానికి విలువ ఇవ్వకపోవటం అనేది జరగదు. భయభక్తులు గలవారి గురించి అల్లాహ్‌కు బాగా తెలుసు.
3:116  إِنَّ الَّذِينَ كَفَرُوا لَن تُغْنِيَ عَنْهُمْ أَمْوَالُهُمْ وَلَا أَوْلَادُهُم مِّنَ اللَّهِ شَيْئًا ۖ وَأُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۚ هُمْ فِيهَا خَالِدُونَ
ఇకపోతే అవిశ్వాసులు; వారి సంపదగానీ, సంతానం గానీ దైవ సమక్షంలో వారికి ఏ మాత్రం పనికిరావు. వారు నరకాగ్ని వాసులు. కలకాలం అందులోనే పడి ఉంటారు.
3:117  مَثَلُ مَا يُنفِقُونَ فِي هَٰذِهِ الْحَيَاةِ الدُّنْيَا كَمَثَلِ رِيحٍ فِيهَا صِرٌّ أَصَابَتْ حَرْثَ قَوْمٍ ظَلَمُوا أَنفُسَهُمْ فَأَهْلَكَتْهُ ۚ وَمَا ظَلَمَهُمُ اللَّهُ وَلَٰكِنْ أَنفُسَهُمْ يَظْلِمُونَ
ఈ అవిశ్వాసులు ఇహలోక జీవితంలో చేస్తున్న ఖర్చు తీవ్రమయిన చలిగాలులు తగిలి సర్వనాశనమైన దుర్మార్గుల పొలాన్ని పోలినది. అల్లాహ్‌ వారికెలాంటి అన్యాయమూ చేయలేదు. వాస్తవానికి వారే తమ మీద తాము అన్యాయం చేసుకునే వారు.
3:118  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَتَّخِذُوا بِطَانَةً مِّن دُونِكُمْ لَا يَأْلُونَكُمْ خَبَالًا وَدُّوا مَا عَنِتُّمْ قَدْ بَدَتِ الْبَغْضَاءُ مِنْ أَفْوَاهِهِمْ وَمَا تُخْفِي صُدُورُهُمْ أَكْبَرُ ۚ قَدْ بَيَّنَّا لَكُمُ الْآيَاتِ ۖ إِن كُنتُمْ تَعْقِلُونَ
ఓ విశ్వాసులారా! మీరు మీ వారిని తప్ప వేరితరులను మీ ఆంతరంగికులుగా చేసుకోకండి. ఇతరులు మీకు నష్టం కలిగించటానికి తమకు దొరికే ఏ అవకాశాన్నీ విడిచిపెట్టరు. మీరు కష్టాల్లో పడాలన్నదే వారి కోరిక. వారిలోని అక్కసు స్వయంగా వారి నోట వెల్లడయింది. ఇక వారు తమ ఆంతర్యాల్లో దాచి ఉంచినది మరింత తీవ్రమైనది. మేము మీ కొరకు సూచనలను స్పష్టం చేశాము. మీరు బుద్ధిమంతులే అయితే (వీటిపై యోచన చేయండి).
3:119  هَا أَنتُمْ أُولَاءِ تُحِبُّونَهُمْ وَلَا يُحِبُّونَكُمْ وَتُؤْمِنُونَ بِالْكِتَابِ كُلِّهِ وَإِذَا لَقُوكُمْ قَالُوا آمَنَّا وَإِذَا خَلَوْا عَضُّوا عَلَيْكُمُ الْأَنَامِلَ مِنَ الْغَيْظِ ۚ قُلْ مُوتُوا بِغَيْظِكُمْ ۗ إِنَّ اللَّهَ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
మీరైతే వారిని ప్రేమిస్తున్నారు. కాని వారు మాత్రం మిమ్మల్ని ప్రేమించటం లేదు. మీరు గ్రంథాన్నంతటినీ విశ్వసిస్తున్నారు (కాని వారు విశ్వసించటం లేదు. మరలాంటప్పుడు వారు మీకు స్నేహితులెలా అవుతారు?). వారు మిమ్మల్ని కలసినప్పుడు తాము విశ్వసించామని చెబుతారు, కాని మీ దగ్గరి నుంచి తప్పుకున్నప్పుడు మీపై కోపంకొద్దీ తమ వ్రేళ్లను కసిగా కొరుక్కుం టారు. ''మీరు మీ కోపావేశంలోనే చావండి. నిశ్చయంగా అల్లాహ్‌ గుండెల్లోని గుట్టును గురించి బాగా తెలిసినవాడు'' అని వారికి చెప్పండి.
3:120  إِن تَمْسَسْكُمْ حَسَنَةٌ تَسُؤْهُمْ وَإِن تُصِبْكُمْ سَيِّئَةٌ يَفْرَحُوا بِهَا ۖ وَإِن تَصْبِرُوا وَتَتَّقُوا لَا يَضُرُّكُمْ كَيْدُهُمْ شَيْئًا ۗ إِنَّ اللَّهَ بِمَا يَعْمَلُونَ مُحِيطٌ
మీకేదైనా మేలు కలిగితే వారు బాధపడతారు. అదే మీకేదైనా హాని జరిగితే మాత్రం ఆనందిస్తారు. మీరే గనక సహనంతో, భయభక్తులతో వ్యవహరించినట్లయితే వారి కుట్ర మీకెలాంటి నష్టమూ చేకూర్చదు. ఎందుకంటే వారి కార్యకలాపాలన్నింటినీ అల్లాహ్‌ ముట్టడించి ఉన్నాడు.
3:121  وَإِذْ غَدَوْتَ مِنْ أَهْلِكَ تُبَوِّئُ الْمُؤْمِنِينَ مَقَاعِدَ لِلْقِتَالِ ۗ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ
(ఓ ప్రవక్తా! ఆ సమయాన్ని కూడా జ్ఞప్తికి తెచ్చుకో,) అప్పుడు నీవు తెలతెలవారుతుండగా నీ ఇంటి నుండి బయలుదేరి రణరంగంలో విశ్వాసులు మోహరించవలసిన స్థలాలను నిర్థారించ సాగావు. అల్లాహ్‌ అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
3:122  إِذْ هَمَّت طَّائِفَتَانِ مِنكُمْ أَن تَفْشَلَا وَاللَّهُ وَلِيُّهُمَا ۗ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
మీలోని రెండు సమూహాల వారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లినప్పుడు అల్లాహ్‌ వారికి అండగా ఉన్నాడు. విశ్వాసులైన వారు సదా అల్లాహ్‌నే నమ్ముకోవాలి.
3:123  وَلَقَدْ نَصَرَكُمُ اللَّهُ بِبَدْرٍ وَأَنتُمْ أَذِلَّةٌ ۖ فَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تَشْكُرُونَ
బద్ర్‌ (యుద్ధం)లో మీరు అత్యంత దయనీయ స్థితిలో ఉన్నప్పుడు అల్లాహ్‌ మిమ్మల్ని ఆదుకున్నాడు. కాబట్టి అల్లాహ్‌కు మాత్రమే భయపడండి. తద్వారా మీకు కృతజ్ఞతలు తెలుపుకునే సద్బుద్ధి ప్రాప్తిస్తుంది.
3:124  إِذْ تَقُولُ لِلْمُؤْمِنِينَ أَلَن يَكْفِيَكُمْ أَن يُمِدَّكُمْ رَبُّكُم بِثَلَاثَةِ آلَافٍ مِّنَ الْمَلَائِكَةِ مُنزَلِينَ
(ఈ కృతజ్ఞతల మూలంగానే మీకు సహాయ సహకారాలు అందవచ్చు. (ఓ ప్రవక్తా!) నీవు విశ్వాసులను ఓదార్చిన ఆ ఘడియలను కాస్త జ్ఞాపకం చేసుకో!) ''ఏమిటీ, ఆకాశం నుంచి మూడు వేల మంది దూతలను దింపి మీ ప్రభువు మీకు తోడ్పడటం మీకు చాలదా?'' అని అప్పుడు నువ్వు వారితో అన్నావు.
3:125  بَلَىٰ ۚ إِن تَصْبِرُوا وَتَتَّقُوا وَيَأْتُوكُم مِّن فَوْرِهِمْ هَٰذَا يُمْدِدْكُمْ رَبُّكُم بِخَمْسَةِ آلَافٍ مِّنَ الْمَلَائِكَةِ مُسَوِّمِينَ
''అవును. మీరే గనక సహనం వహించి, భయభక్తులతో మెలగుతూ ఉండి, వారు (దైవ విరోధులు) ఇదే ఆవేశంతో మీపైకి దండెత్తివస్తే, మీ ప్రభువు ఐదువేల మంది ప్రత్యేక చిహ్నాలుగల దూతలతో మీకు సాయమందిస్తాడు.''
3:126  وَمَا جَعَلَهُ اللَّهُ إِلَّا بُشْرَىٰ لَكُمْ وَلِتَطْمَئِنَّ قُلُوبُكُم بِهِ ۗ وَمَا النَّصْرُ إِلَّا مِنْ عِندِ اللَّهِ الْعَزِيزِ الْحَكِيمِ
అల్లాహ్‌ మీ కొరకు దీనిని శుభవార్తగానూ, ఇంకా మీ మనోనిబ్బరం కోసం జరిగే ఏర్పాటుగానూ చేశాడు. యదార్థానికి అసలు సహాయం మాత్రం అల్లాహ్‌ తరఫు నుంచి లభించేదే. ఆయన సర్వాధిక్యుడు, వివేచనాపరుడు.
3:127  لِيَقْطَعَ طَرَفًا مِّنَ الَّذِينَ كَفَرُوا أَوْ يَكْبِتَهُمْ فَيَنقَلِبُوا خَائِبِينَ
అవిశ్వాసులలోని ఒక వర్గం కథ ముగించడానికి లేదా వారిని పరాభవం పాలుచేయడానికి, (వారంతా) ఓటమిపాలై వెనుతిరిగిపోవటానికిగాను (అల్లాహ్‌ మీకు ఈ సహాయమందించాడు).
3:128  لَيْسَ لَكَ مِنَ الْأَمْرِ شَيْءٌ أَوْ يَتُوبَ عَلَيْهِمْ أَوْ يُعَذِّبَهُمْ فَإِنَّهُمْ ظَالِمُونَ
(ఓ ప్రవక్తా! ఈ వ్యవహారంలో) నీకెలాంటి నిర్ణయాధికారం లేదు. అల్లాహ్‌ (గనక తలిస్తే) వారి పశ్చాత్తాపాన్ని ఆమోదిస్తాడు లేదా వారిని శిక్షిస్తాడు. ప్రస్తుతానికి వారు అక్రమానికి పాల్పడినవారే!
3:129  وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۚ يَغْفِرُ لِمَن يَشَاءُ وَيُعَذِّبُ مَن يَشَاءُ ۚ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ
భూమ్యాకాశాలలో వున్నదంతా అల్లాహ్‌దే. ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు, తాను కోరిన వారిని శిక్షిస్తాడు. అల్లాహ్‌ క్షమించేవాడూ, కరుణించేవాడు కూడాను.
3:130  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَأْكُلُوا الرِّبَا أَضْعَافًا مُّضَاعَفَةً ۖ وَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ
ఓ విశ్వసించిన వారలారా! ద్విగుణీకృతం, బహుగుణీకృతం చేసి వడ్డీని తినకండి. మీరు సాఫల్యం పొందటానికి గాను అల్లాహ్‌కు భయపడండి.
3:131  وَاتَّقُوا النَّارَ الَّتِي أُعِدَّتْ لِلْكَافِرِينَ
అవిశ్వాసుల కొరకు సిద్ధం చేయబడిన నరకాగ్నికి భయపడండి.
3:132  وَأَطِيعُوا اللَّهَ وَالرَّسُولَ لَعَلَّكُمْ تُرْحَمُونَ
అల్లాహ్‌కూ, ప్రవక్తకూ విధేయత చూపండి - తద్వారా మీరు కనికరించబడే అవకాశం ఉంది.
3:133  وَسَارِعُوا إِلَىٰ مَغْفِرَةٍ مِّن رَّبِّكُمْ وَجَنَّةٍ عَرْضُهَا السَّمَاوَاتُ وَالْأَرْضُ أُعِدَّتْ لِلْمُتَّقِينَ
మీ ప్రభువు యొక్క క్షమాభిక్ష వైపునకు, స్వర్గం వైపునకు పరుగెత్తండి. ఆ స్వర్గం వెడల్పు భూమ్యాకాశాలంత ఉంటుంది. అది భయభక్తులు గలవారి కోసం తయారు చేయబడింది.
3:134  الَّذِينَ يُنفِقُونَ فِي السَّرَّاءِ وَالضَّرَّاءِ وَالْكَاظِمِينَ الْغَيْظَ وَالْعَافِينَ عَنِ النَّاسِ ۗ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ
వారు కలిమిలోనూ, లేమిలోనూ (దైవమార్గంలో) ఖర్చు చేస్తారు. కోపాన్ని దిగమ్రింగుతారు, ప్రజల పట్ల మన్నింపుల వైఖరిని అవలంబిస్తారు. అల్లాహ్‌ ఇలాంటి సదాచార సంపన్నులనే ప్రేమిస్తాడు.
3:135  وَالَّذِينَ إِذَا فَعَلُوا فَاحِشَةً أَوْ ظَلَمُوا أَنفُسَهُمْ ذَكَرُوا اللَّهَ فَاسْتَغْفَرُوا لِذُنُوبِهِمْ وَمَن يَغْفِرُ الذُّنُوبَ إِلَّا اللَّهُ وَلَمْ يُصِرُّوا عَلَىٰ مَا فَعَلُوا وَهُمْ يَعْلَمُونَ
తమ ద్వారా ఏదైనా నీతిబాహ్యమైన పని జరిగిపోతే లేదా తమ ఆత్మలకు వారు ఏదైనా అన్యాయం చేసుకుంటే వెంటనే అల్లాహ్‌ను తలచుకుని, తమ పాపాల క్షమాపణకై వేడుకుంటారు. - నిజానికి అల్లాహ్‌ తప్ప పాపాలను క్షమించే వాడెవడున్నాడు? - వారు తమ వల్ల జరిగింది తప్పు అని తెలిసినపుడు దానిపై హటం చెయ్యరు.
3:136  أُولَٰئِكَ جَزَاؤُهُم مَّغْفِرَةٌ مِّن رَّبِّهِمْ وَجَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَنِعْمَ أَجْرُ الْعَامِلِينَ
తమ ప్రభువు తరఫు నుంచి క్షమాభిక్ష, క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ప్రతిఫలంగా లభించేది ఇటువంటి వారికే. వాటిలో వారు ఎల్లకాలం ఉంటారు. ఈ సత్కార్యాలు చేసేవారికి లభించే పుణ్యఫలం ఎంత చక్కనిది!
3:137  قَدْ خَلَتْ مِن قَبْلِكُمْ سُنَنٌ فَسِيرُوا فِي الْأَرْضِ فَانظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الْمُكَذِّبِينَ
మీకు పూర్వం కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. కనుక (దివ్య సందేశాన్ని) ధిక్కరించిన వారికి పట్టిన గతేమిటో భూమిలో సంచరించి చూడండి.
3:138  هَٰذَا بَيَانٌ لِّلنَّاسِ وَهُدًى وَمَوْعِظَةٌ لِّلْمُتَّقِينَ
సామాన్య ప్రజానీకం కోసం ఇది (ఈ ఖుర్‌ఆన్‌) ఒక బోధన. భయభక్తులు కలవారి కోసమైతే ఇది మార్గదర్శకం మరియు హితోపదేశం.
3:139  وَلَا تَهِنُوا وَلَا تَحْزَنُوا وَأَنتُمُ الْأَعْلَوْنَ إِن كُنتُم مُّؤْمِنِينَ
క్రుంగిపోకండి, దుఃఖించకండి. విశ్వాసులుగా ఉంటే కడకు మీరే ఆధిక్యత పొందుతారు.
3:140  إِن يَمْسَسْكُمْ قَرْحٌ فَقَدْ مَسَّ الْقَوْمَ قَرْحٌ مِّثْلُهُ ۚ وَتِلْكَ الْأَيَّامُ نُدَاوِلُهَا بَيْنَ النَّاسِ وَلِيَعْلَمَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَيَتَّخِذَ مِنكُمْ شُهَدَاءَ ۗ وَاللَّهُ لَا يُحِبُّ الظَّالِمِينَ
మీరు దెబ్బతిన్నారనుకుంటే మీ ప్రత్యర్థులు కూడా అలాగే దెబ్బతిన్నారు. మేము ఈ కాలచక్రాన్ని జనుల మధ్య త్రిప్పుతూ ఉంటాము. (ఉహుద్‌ యుద్ధంలో మీకు ఎదురైన అపజయానికి అసలు కారణం ఏమిటంటే) మీలో (నికార్సయిన) విశ్వాసులు ఎవరో అల్లాహ్‌ చూపించదలిచాడు. మీలో కొందరికి 'షహాదత్‌' (వీర మరణ) స్థాయిని కూడా ఆయన ప్రసాదించదలిచాడు. అల్లాహ్‌ దుర్మార్గులను సుతరామూ ఇష్టపడడు.
3:141  وَلِيُمَحِّصَ اللَّهُ الَّذِينَ آمَنُوا وَيَمْحَقَ الْكَافِرِينَ
ఈ పరీక్ష ద్వారా అల్లాహ్‌ సిసలైన విశ్వాసులను వేరు చేసి అవిశ్వాసులను తుదముట్టించదలిచాడు.
3:142  أَمْ حَسِبْتُمْ أَن تَدْخُلُوا الْجَنَّةَ وَلَمَّا يَعْلَمِ اللَّهُ الَّذِينَ جَاهَدُوا مِنكُمْ وَيَعْلَمَ الصَّابِرِينَ
ఏమిటీ, మీరు స్వర్గంలో (ఇట్టే) ప్రవేశించగలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీలో (తన మార్గంలో) పోరాడేవారెవరో, ఓర్పు వహించేవారెవరో ఇప్పటివరకూ అల్లాహ్‌ పరీక్షించనే లేదు.
3:143  وَلَقَدْ كُنتُمْ تَمَنَّوْنَ الْمَوْتَ مِن قَبْلِ أَن تَلْقَوْهُ فَقَدْ رَأَيْتُمُوهُ وَأَنتُمْ تَنظُرُونَ
యుద్ధానికి ముందైతే మీరు (వీర) మరణాన్ని ఎంతగానో కోరుకునేవారు. ఇప్పుడు దాన్ని మీరు మీ కళ్లారా తిలకించారు.
3:144  وَمَا مُحَمَّدٌ إِلَّا رَسُولٌ قَدْ خَلَتْ مِن قَبْلِهِ الرُّسُلُ ۚ أَفَإِن مَّاتَ أَوْ قُتِلَ انقَلَبْتُمْ عَلَىٰ أَعْقَابِكُمْ ۚ وَمَن يَنقَلِبْ عَلَىٰ عَقِبَيْهِ فَلَن يَضُرَّ اللَّهَ شَيْئًا ۗ وَسَيَجْزِي اللَّهُ الشَّاكِرِينَ
ముహమ్మద్‌ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఒక ప్రవక్త మాత్రమే. ఈయనకు పూర్వం కూడా (చాలామంది) ప్రవక్తలు గతించారు. ఒకవేళ ఈయన చనిపోతే లేక చంపబడితే మీరు- ఇస్లాం నుంచి - వెనుతిరిగిపోతారా? వెనుతిరిగిపోయేవాడు అల్లాహ్‌కు ఏ మాత్రం హాని కలిగించలేడు. కృతజ్ఞతలు తెలిపే వారికి అల్లాహ్‌ త్వరలోనే మంచి ప్రతిఫలం వొసగుతాడు.
3:145  وَمَا كَانَ لِنَفْسٍ أَن تَمُوتَ إِلَّا بِإِذْنِ اللَّهِ كِتَابًا مُّؤَجَّلًا ۗ وَمَن يُرِدْ ثَوَابَ الدُّنْيَا نُؤْتِهِ مِنْهَا وَمَن يُرِدْ ثَوَابَ الْآخِرَةِ نُؤْتِهِ مِنْهَا ۚ وَسَنَجْزِي الشَّاكِرِينَ
దైవాజ్ఞ కానంతవరకూ ఏ ప్రాణీ చావదు. నిర్థారిత సమయం రాయబడి ఉంది. ప్రాపంచిక ఫలితాన్ని కోరుకున్న వారికి మేము ఎంతో కొంత ఇచ్చేస్తాము. పరలోక ప్రతిఫలాన్ని కోరుకున్న వారికి మేము దాన్ని కూడా అనుగ్రహిస్తాము. కృతజ్ఞులై ఉండేవారికి మేము త్వరలోనే మంచి ప్రతిఫలాన్ని వొసగుతాము.
3:146  وَكَأَيِّن مِّن نَّبِيٍّ قَاتَلَ مَعَهُ رِبِّيُّونَ كَثِيرٌ فَمَا وَهَنُوا لِمَا أَصَابَهُمْ فِي سَبِيلِ اللَّهِ وَمَا ضَعُفُوا وَمَا اسْتَكَانُوا ۗ وَاللَّهُ يُحِبُّ الصَّابِرِينَ
ఎంతోమంది ప్రవక్తలకు ఆదరువుగా నిలిచి, ఎందరో అల్లాహ్‌ భక్తులు దైవమార్గంలో పోరాడారు. వారికి కూడా అల్లాహ్‌ మార్గంలో కష్టాలెదురయ్యాయి. కాని వారెన్నడూ ధైర్యం కోల్పో లేదు, అశక్తతకు లోనుకాలేదు, లొంగిపోనూ లేదు. అల్లాహ్‌ ఇష్టపడేది (ఇలాంటి) సహనమూర్తులనే.
3:147  وَمَا كَانَ قَوْلَهُمْ إِلَّا أَن قَالُوا رَبَّنَا اغْفِرْ لَنَا ذُنُوبَنَا وَإِسْرَافَنَا فِي أَمْرِنَا وَثَبِّتْ أَقْدَامَنَا وَانصُرْنَا عَلَى الْقَوْمِ الْكَافِرِينَ
వారిది ఒక్కటే పలుకు : ''మా ప్రభూ! మా పాపాలను క్షమించు. మా పనుల్లో మా వల్ల జరిగిన 'అతి'ని మన్నించు. మా పాదాలకు నిలకడను ప్రసాదించు. అవిశ్వాస జనులకు వ్యతిరేకంగా మాకు తోడ్పాటునందించు.''
3:148  فَآتَاهُمُ اللَّهُ ثَوَابَ الدُّنْيَا وَحُسْنَ ثَوَابِ الْآخِرَةِ ۗ وَاللَّهُ يُحِبُّ الْمُحْسِنِينَ
అల్లాహ్‌ వారికి ప్రాపంచిక ఫలాన్నీ ఇచ్చాడు, పరలోకపు ఉత్తమ పుణ్య ఫలాన్ని కూడా ప్రసాదించాడు. సత్కార్యాలను ఉత్తమరీతిలో నిర్వర్తించేవారిని అల్లాహ్‌ ఎంతగానో ప్రేమిస్తాడు.
3:149  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِن تُطِيعُوا الَّذِينَ كَفَرُوا يَرُدُّوكُمْ عَلَىٰ أَعْقَابِكُمْ فَتَنقَلِبُوا خَاسِرِينَ
ఓ విశ్వాసులారా! మీరు గనక అవిశ్వాసుల మాట విన్నారంటే, వారు మిమ్మల్ని మీ కాలి మడమలపైనే తిరోన్ముఖుల్ని చేస్తారు (ధర్మభ్రష్టుల్ని చేస్తారు). అప్పుడు నష్టపోయేది మీరే.
3:150  بَلِ اللَّهُ مَوْلَاكُمْ ۖ وَهُوَ خَيْرُ النَّاصِرِينَ
వాస్తవానికి అల్లాహ్‌యే మీ రక్షకుడు, ఆయనే అత్యుత్తమ సహాయకుడూను.
3:151  سَنُلْقِي فِي قُلُوبِ الَّذِينَ كَفَرُوا الرُّعْبَ بِمَا أَشْرَكُوا بِاللَّهِ مَا لَمْ يُنَزِّلْ بِهِ سُلْطَانًا ۖ وَمَأْوَاهُمُ النَّارُ ۚ وَبِئْسَ مَثْوَى الظَّالِمِينَ
త్వరలోనే మేము అవిశ్వాసుల హృదయాలలో భయాన్ని కలిగిస్తాము. ఎందుకంటే అల్లాహ్‌ ఏ ప్రమాణాన్నీ అవతరింప జేయనప్పటికీ - నిరాధారంగా - వారు ఇతరత్రా వాటిని అల్లాహ్‌కు భాగస్వాములుగా కల్పిస్తున్నారు. కనుక నరకాగ్నియే వారి నివాస స్థలం. అది దుర్మార్గుల చెడ్డ నివాసం.
3:152  وَلَقَدْ صَدَقَكُمُ اللَّهُ وَعْدَهُ إِذْ تَحُسُّونَهُم بِإِذْنِهِ ۖ حَتَّىٰ إِذَا فَشِلْتُمْ وَتَنَازَعْتُمْ فِي الْأَمْرِ وَعَصَيْتُم مِّن بَعْدِ مَا أَرَاكُم مَّا تُحِبُّونَ ۚ مِنكُم مَّن يُرِيدُ الدُّنْيَا وَمِنكُم مَّن يُرِيدُ الْآخِرَةَ ۚ ثُمَّ صَرَفَكُمْ عَنْهُمْ لِيَبْتَلِيَكُمْ ۖ وَلَقَدْ عَفَا عَنكُمْ ۗ وَاللَّهُ ذُو فَضْلٍ عَلَى الْمُؤْمِنِينَ
అల్లాహ్‌ మీకు చేసిన వాగ్దానాన్ని నిజం చేసి చూపాడు. అప్పుడు మీరు ఆయన అనుజ్ఞతో వారిని వధించసాగారు. అయితే ఆఖరికి మీరు పిరికితనం చూపారు. కార్యనిర్వహణలో విభేదించుకున్నారు. మీరు ఇష్టపడే వస్తువును ఆయన మీకు చూపేసరికి, మీరు అవిధేయతకు ఒడిగట్టారు. మీలో కొందరు ప్రపంచం కోసం ప్రాకులాడగా, మరికొందరు పరలోకాన్ని కోరుకున్నారు. అందువల్ల అల్లాహ్‌ మిమ్మల్ని పరీక్షించే నిమిత్తం, మిమ్మల్ని వారి నుంచి వెనక్కి మళ్లించాడు. అయినా ఆయన మిమ్మల్ని క్షమించాడు. యదార్థానికి అల్లాహ్‌ విశ్వాసుల పట్ల గొప్ప అనుగ్రహం గలవాడు..
3:153  إِذْ تُصْعِدُونَ وَلَا تَلْوُونَ عَلَىٰ أَحَدٍ وَالرَّسُولُ يَدْعُوكُمْ فِي أُخْرَاكُمْ فَأَثَابَكُمْ غَمًّا بِغَمٍّ لِّكَيْلَا تَحْزَنُوا عَلَىٰ مَا فَاتَكُمْ وَلَا مَا أَصَابَكُمْ ۗ وَاللَّهُ خَبِيرٌ بِمَا تَعْمَلُونَ
ఆ సమయంలో మీరు పరారవసాగారు. ఇంకొకరిని పట్టించుకునే ధ్యాసే మీకు లేకపోయింది. ఆ క్షణంలో వెనుక నుంచి ప్రవక్త మిమ్మల్ని కేక వేస్తూనే వున్నాడు. కనుక మీకు దక్కకుండా పోయిన దాని గురించి, వాటిల్లిన నష్టాన్ని గురించి మీరు బాధపడకుండా ఉండటానికి అల్లాహ్‌ మీకు దుఃఖం వెంబడి దుఃఖం కలుగజేశాడు. మీరు చేసే పనులన్నీ అల్లాహ్‌కు తెలుసు.
3:154  ثُمَّ أَنزَلَ عَلَيْكُم مِّن بَعْدِ الْغَمِّ أَمَنَةً نُّعَاسًا يَغْشَىٰ طَائِفَةً مِّنكُمْ ۖ وَطَائِفَةٌ قَدْ أَهَمَّتْهُمْ أَنفُسُهُمْ يَظُنُّونَ بِاللَّهِ غَيْرَ الْحَقِّ ظَنَّ الْجَاهِلِيَّةِ ۖ يَقُولُونَ هَل لَّنَا مِنَ الْأَمْرِ مِن شَيْءٍ ۗ قُلْ إِنَّ الْأَمْرَ كُلَّهُ لِلَّهِ ۗ يُخْفُونَ فِي أَنفُسِهِم مَّا لَا يُبْدُونَ لَكَ ۖ يَقُولُونَ لَوْ كَانَ لَنَا مِنَ الْأَمْرِ شَيْءٌ مَّا قُتِلْنَا هَاهُنَا ۗ قُل لَّوْ كُنتُمْ فِي بُيُوتِكُمْ لَبَرَزَ الَّذِينَ كُتِبَ عَلَيْهِمُ الْقَتْلُ إِلَىٰ مَضَاجِعِهِمْ ۖ وَلِيَبْتَلِيَ اللَّهُ مَا فِي صُدُورِكُمْ وَلِيُمَحِّصَ مَا فِي قُلُوبِكُمْ ۗ وَاللَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
మరి ఈ దుఃఖం తరువాత ఆయన శాంతియుత స్థితిని మీపై అవతరింపజేశాడు. దాంతో మీలోని ఒక వర్గం వారిపై కునుకు ఆవహించసాగింది. అయితే మరోవర్గం వారు తమ ప్రాణరక్షణ గురించి తీవ్ర విచారంలో పడిపోయారు. వారు అల్లాహ్‌ యెడల మరీ అజ్ఞానంతో కూడిన, సత్యదూరమైన సందేహాలను, అనుమానాలను వ్యక్తపరచసాగారు. ''ఇంతకీ మాకంటూ ఏదన్నా అధికారం ఉందా?'' అని వారనేవారు. ''దీనికి సంబంధించిన నిర్ణయాధికారం అంతా అల్లాహ్‌దే'' అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. వారు తమ ఆంతర్యాల్లో అణచి పెట్టుకున్న విషయాలను నీ ముందు వెలిబుచ్చటం లేదు. ''మాకంటూ అధికారమేదైనా ఉండి ఉంటే మేమిలా హత మార్చబడి ఉండేవాళ్ళం కాము'' అని వారంటున్నారు. (అంటే తమ మనుషులు చంపబడేవారు కాదు అని వారి అభిప్రాయం). ''ఒకవేళ మీరు మీ ఇండ్లల్లోనే ఉన్నప్పటికీ, వధించబడటం అన్నది మీకు రాసిపెట్టి ఉంటే మీ అంతట మీరే వధ్యస్థలాలకు వచ్చి తీర్తారు'' అని వారికి చెప్పు. మీ మనసుల్లో దాగి ఉన్న వాటిని పరికించేందుకు, మీ హృదయాలలో వున్న దానిని శుద్ధి చేసేందుకు (అల్లాహ్‌ ఈ పరిస్థితులను ఉత్పన్నం చేశాడు). అల్లాహ్‌ గుండెల్లోని గుట్టును బాగా ఎరిగినవాడు.
3:155  إِنَّ الَّذِينَ تَوَلَّوْا مِنكُمْ يَوْمَ الْتَقَى الْجَمْعَانِ إِنَّمَا اسْتَزَلَّهُمُ الشَّيْطَانُ بِبَعْضِ مَا كَسَبُوا ۖ وَلَقَدْ عَفَا اللَّهُ عَنْهُمْ ۗ إِنَّ اللَّهَ غَفُورٌ حَلِيمٌ
ఇరు సమూహాలు ముఖాముఖీ అయిన రోజున మీలో కొందరు వెన్నుచూపారు. వారు చేసిన కొన్ని తప్పుల వల్ల షైతాన్‌ వారిని తడబాటుకు లోనుచేశాడు. అయినా అల్లాహ్‌ వారిని మన్నించాడు. అల్లాహ్‌ క్షమించేవాడు, సహనశీలుడూను.
3:156  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا لَا تَكُونُوا كَالَّذِينَ كَفَرُوا وَقَالُوا لِإِخْوَانِهِمْ إِذَا ضَرَبُوا فِي الْأَرْضِ أَوْ كَانُوا غُزًّى لَّوْ كَانُوا عِندَنَا مَا مَاتُوا وَمَا قُتِلُوا لِيَجْعَلَ اللَّهُ ذَٰلِكَ حَسْرَةً فِي قُلُوبِهِمْ ۗ وَاللَّهُ يُحْيِي وَيُمِيتُ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ بَصِيرٌ
ఓ విశ్వసించిన వారలారా! మీరు ఆ అవిశ్వాసుల్లాగా ప్రవర్తించకండి. వారు, తమ సోదరులు ప్రయాణంలోనో, యుద్ధంలోనో ఉన్నప్పుడు, ''ఒకవేళ వారు మా వద్దనే ఉండి ఉంటే చనిపోయేవారూ కాదు, చంపబడేవారూ కాదు'' అని అంటారు. ఈ విధమైన తమ ఆలోచనలను అల్లాహ్‌ తమ హృదయశోకానికి కారణాలుగా చేయాలనే వారిలాంటి మాటలు మాట్లాడుతుంటారు. వాస్తవానికి ప్రాణభిక్ష పెట్టేవాడు, ప్రాణం తీసేవాడు అల్లాహ్‌ మాత్రమే. మీరు చేసే పనులన్నిటినీ అల్లాహ్‌ కనిపెడుతూనే ఉన్నాడు.
3:157  وَلَئِن قُتِلْتُمْ فِي سَبِيلِ اللَّهِ أَوْ مُتُّمْ لَمَغْفِرَةٌ مِّنَ اللَّهِ وَرَحْمَةٌ خَيْرٌ مِّمَّا يَجْمَعُونَ
మీరు దైవమార్గంలో చంపబడినా లేక చనిపోయినా, (మీకు లభించే) దేవుని క్షమాభిక్ష మరియు కారుణ్యం వారు కూడబెడుతున్న దానికన్నా ఎంతో మేలైనవి.
3:158  وَلَئِن مُّتُّمْ أَوْ قُتِلْتُمْ لَإِلَى اللَّهِ تُحْشَرُونَ
మీరు చనిపోయినా లేక చంపబడినా (చివరకు) మీరు సమీకరించబడేది అల్లాహ్‌ వద్దకే (అని మరువకండి).
3:159  فَبِمَا رَحْمَةٍ مِّنَ اللَّهِ لِنتَ لَهُمْ ۖ وَلَوْ كُنتَ فَظًّا غَلِيظَ الْقَلْبِ لَانفَضُّوا مِنْ حَوْلِكَ ۖ فَاعْفُ عَنْهُمْ وَاسْتَغْفِرْ لَهُمْ وَشَاوِرْهُمْ فِي الْأَمْرِ ۖ فَإِذَا عَزَمْتَ فَتَوَكَّلْ عَلَى اللَّهِ ۚ إِنَّ اللَّهَ يُحِبُّ الْمُتَوَكِّلِينَ
(ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ దయవల్లనే నీవు వారి యెడల మృదు మనస్కుడవయ్యావు. ఒకవేళ నువ్వే గనక కర్కశుడవు, కఠిన మనస్కుడవు అయివుంటే వారంతా నీ దగ్గరి నుంచి వెళ్ళిపోయేవారు. కనుక నువ్వు వారిపట్ల మన్నింపుల వైఖరిని అవలంబించు, వారి క్షమాపణ కోసం (దైవాన్ని) వేడుకో. కార్య నిర్వహణలో వారిని సంప్రదిస్తూ ఉండు. ఏదైనా పని గురించి తుది నిర్ణయానికి వచ్చినప్పుడు, అల్లాహ్‌పై భారం మోపు. నిశ్చయంగా అల్లాహ్‌ తనను నమ్ముకున్న వారిని ప్రేమిస్తాడు.
3:160  إِن يَنصُرْكُمُ اللَّهُ فَلَا غَالِبَ لَكُمْ ۖ وَإِن يَخْذُلْكُمْ فَمَن ذَا الَّذِي يَنصُرُكُم مِّن بَعْدِهِ ۗ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
అల్లాహ్‌యే గనక మీకు తోడ్పాటునందిస్తే ఇక మిమ్మల్ని ఎవరూ జయించలేరు. ఒకవేళ ఆయనే గనక మిమ్మల్ని విడిచి పెట్టేస్తే, తరువాత మీకు సహాయపడ గలవాడెవడు? కాబట్టి విశ్వసించినవారు సదా అల్లాహ్‌నే నమ్ముకోవాలి.
3:161  وَمَا كَانَ لِنَبِيٍّ أَن يَغُلَّ ۚ وَمَن يَغْلُلْ يَأْتِ بِمَا غَلَّ يَوْمَ الْقِيَامَةِ ۚ ثُمَّ تُوَفَّىٰ كُلُّ نَفْسٍ مَّا كَسَبَتْ وَهُمْ لَا يُظْلَمُونَ
ఒక ప్రవక్త ద్రోహానికి పాల్పడటమనేది జరగని పని. ద్రోహానికి పాల్పడే ప్రతి ఒక్కడూ తను ద్రోహానికి పాల్పడిన దానిని తీసుకుని ప్రళయదినాన హాజరవుతాడు. తరువాత ప్రతి ఒక్కరికీ వారు చేసుకున్న కర్మలకు పూర్తి ప్రతిఫలం ఇవ్వబడుతుంది. వారికెలాంటి అన్యాయం జరగదు.
3:162  أَفَمَنِ اتَّبَعَ رِضْوَانَ اللَّهِ كَمَن بَاءَ بِسَخَطٍ مِّنَ اللَّهِ وَمَأْوَاهُ جَهَنَّمُ ۚ وَبِئْسَ الْمَصِيرُ
ఏమిటీ, దైవ ప్రసన్నతకు అనుగుణంగా నడుచుకున్న వాడు, దైవాగ్రహానికి పాత్రుడై అతిచెడ్డ నివాసమైన నరకానికి పోయేవానితో సమానుడవుతాడా?
3:163  هُمْ دَرَجَاتٌ عِندَ اللَّهِ ۗ وَاللَّهُ بَصِيرٌ بِمَا يَعْمَلُونَ
అల్లాహ్‌ వద్ద వారి స్థానాలు వేర్వేరుగా ఉన్నాయి సుమా! వారు చేసేదంతా అల్లాహ్‌ చూస్తూనే ఉన్నాడు.
3:164  لَقَدْ مَنَّ اللَّهُ عَلَى الْمُؤْمِنِينَ إِذْ بَعَثَ فِيهِمْ رَسُولًا مِّنْ أَنفُسِهِمْ يَتْلُو عَلَيْهِمْ آيَاتِهِ وَيُزَكِّيهِمْ وَيُعَلِّمُهُمُ الْكِتَابَ وَالْحِكْمَةَ وَإِن كَانُوا مِن قَبْلُ لَفِي ضَلَالٍ مُّبِينٍ
అల్లాహ్‌ విశ్వాసులకు చేసిన మహోపకారం ఏమిటంటే, ఆయన వారిలో నుండే ఒక ప్రవక్తను ఎన్నుకుని వారి వద్దకు పంపాడు. అతడు వారికి ఆయన వాక్యాలను చదివి వినిపిస్తాడు. వారిని పరిశుద్ధుల్ని చేస్తాడు. వారికి గ్రంథ జ్ఞానాన్నీ, వివేకాన్నీ బోధిస్తాడు. నిశ్చయంగా అంతకు ముందైతే వాళ్ళు స్పష్టమైన అపమార్గానికి లోనై ఉండేవారు.
3:165  أَوَلَمَّا أَصَابَتْكُم مُّصِيبَةٌ قَدْ أَصَبْتُم مِّثْلَيْهَا قُلْتُمْ أَنَّىٰ هَٰذَا ۖ قُلْ هُوَ مِنْ عِندِ أَنفُسِكُمْ ۗ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
(ఏమిటీ?) మీపై ఆపదరాగానే - దీనికన్నా రెండింతలుగా మీరు వారిపై విరుచుకుపడి ఉండి కూడా - ఇదెక్కడి నుంచి వచ్చిపడిందని అంటారా? ''ఇది చేజేతులా మీరు కొనితెచ్చుకున్నదే'' అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు. నిశ్చయంగా అల్లాహ్‌ ప్రతి దానినీ చేయగల సమర్థుడు.
3:166  وَمَا أَصَابَكُمْ يَوْمَ الْتَقَى الْجَمْعَانِ فَبِإِذْنِ اللَّهِ وَلِيَعْلَمَ الْمُؤْمِنِينَ
ఇరువర్గాల వారు ఢీకొన్న ఆ రోజున మీకు కలిగిన బాధ అల్లాహ్‌ ఆజ్ఞ మేరకేనని తెలుసుకోండి. మీలో (సిసలైన) విశ్వాసులెవరో అల్లాహ్‌ (బహిరంగంగా) తెలుసుకోదలిచాడు.
3:167  وَلِيَعْلَمَ الَّذِينَ نَافَقُوا ۚ وَقِيلَ لَهُمْ تَعَالَوْا قَاتِلُوا فِي سَبِيلِ اللَّهِ أَوِ ادْفَعُوا ۖ قَالُوا لَوْ نَعْلَمُ قِتَالًا لَّاتَّبَعْنَاكُمْ ۗ هُمْ لِلْكُفْرِ يَوْمَئِذٍ أَقْرَبُ مِنْهُمْ لِلْإِيمَانِ ۚ يَقُولُونَ بِأَفْوَاهِهِم مَّا لَيْسَ فِي قُلُوبِهِمْ ۗ وَاللَّهُ أَعْلَمُ بِمَا يَكْتُمُونَ
దగాకోరులెవరో కూడా ఆయన తెలుసుకోవాలను కున్నాడు. ''రండి, అల్లాహ్ మార్గంలో పోరాడండి లేదా అవిశ్వాసులను ఎదుర్కోండి'' అని వారితో (కపటులతో) అన్నప్పుడు, ''యుద్ధం జరగబోతుందని మాకు తెలిసి ఉంటే తప్పకుండా మీవెంట వచ్చే వాళ్ళమే'' అని వారు బదులిచ్చారు. ఆనాడు వాళ్లు విశ్వాసం కన్నా అవిశ్వాసానికి బహు చేరువలో ఉన్నారు. తమ మనసుల్లో లేని దాన్ని నోటితో పలుకుతున్నారు. వారు దాచి ఉంచే దానిని అల్లాహ్‌ బాగా ఎరుగు.
3:168  الَّذِينَ قَالُوا لِإِخْوَانِهِمْ وَقَعَدُوا لَوْ أَطَاعُونَا مَا قُتِلُوا ۗ قُلْ فَادْرَءُوا عَنْ أَنفُسِكُمُ الْمَوْتَ إِن كُنتُمْ صَادِقِينَ
వారు తమ ఇండ్లల్లోనే కూర్చున్నదిగాక, తమ సోదరుల గురించి మాట్లాడుకుంటూ, వారు కూడా తమ మాట విని ఉన్నట్లయితే ఈ విధంగా చంపబడి ఉండేవారు కాదు అని అంటారు. ''మీరు సత్యవంతులే అయితే మీ ప్రాణాలను మృత్యు వాతన పడకుండా కాపాడుకోండి'' అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
3:169  وَلَا تَحْسَبَنَّ الَّذِينَ قُتِلُوا فِي سَبِيلِ اللَّهِ أَمْوَاتًا ۚ بَلْ أَحْيَاءٌ عِندَ رَبِّهِمْ يُرْزَقُونَ
అల్లాహ్‌ మార్గంలో చంపబడిన వారిని సుతరామూ మృతులుగా తలపోయకండి. వారు సజీవులు. వారికి తమ ప్రభువు వద్ద ఆహారం ఇవ్వబడుతుంది.
3:170  فَرِحِينَ بِمَا آتَاهُمُ اللَّهُ مِن فَضْلِهِ وَيَسْتَبْشِرُونَ بِالَّذِينَ لَمْ يَلْحَقُوا بِهِم مِّنْ خَلْفِهِمْ أَلَّا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ
అల్లాహ్‌ తన అనుగ్రహం నుంచి ప్రసాదించిన దాంతో వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకా తమతో వచ్చిచేరని, తమ వెనుక (ప్రపంచంలోనే) ఉండిపోయినవారి (విశ్వాసుల) గురించి పరస్పరం శుభవార్త వినిపించుకుంటున్నారు. భయ పడవలసిన, దుఃఖించవలసిన అవసరం లేనందులకు (వారు ఆనందంగా ఉన్నారు).
3:171  يَسْتَبْشِرُونَ بِنِعْمَةٍ مِّنَ اللَّهِ وَفَضْلٍ وَأَنَّ اللَّهَ لَا يُضِيعُ أَجْرَ الْمُؤْمِنِينَ
అల్లాహ్‌ వరాల పట్ల, (ఆయన) అనుగ్రహం పట్ల వారు ఎంతగానో సంతోషిస్తున్నారు. అల్లాహ్‌ విశ్వాసుల పుణ్యఫలాన్ని వృధా కానివ్వడన్న విషయం కూడా వారినెంతగానో సంతృప్త పరచింది.
3:172  الَّذِينَ اسْتَجَابُوا لِلَّهِ وَالرَّسُولِ مِن بَعْدِ مَا أَصَابَهُمُ الْقَرْحُ ۚ لِلَّذِينَ أَحْسَنُوا مِنْهُمْ وَاتَّقَوْا أَجْرٌ عَظِيمٌ
ఎవరయితే తీవ్రంగా గాయపడిన తరువాత కూడా అల్లాహ్‌ మరియు అల్లాహ్‌ప్రవక్త ఆజ్ఞలను శిరసావహించారో, వారిలో ఎవరయితే సదాచరణ చేసి, భయభక్తులతో మసలుకున్నారో వారి కొరకు గొప్ప పుణ్యఫలముంది.
3:173  الَّذِينَ قَالَ لَهُمُ النَّاسُ إِنَّ النَّاسَ قَدْ جَمَعُوا لَكُمْ فَاخْشَوْهُمْ فَزَادَهُمْ إِيمَانًا وَقَالُوا حَسْبُنَا اللَّهُ وَنِعْمَ الْوَكِيلُ
''అవిశ్వాస జనులు మీకు వ్యతిరేకంగా భారీ సైన్యాన్ని మోహరించి ఉన్నారు. మీరు వారికి భయపడండి'' అని ప్రజలు వారితో అన్నప్పుడు, ఆ మాట వారి విశ్వాసాన్ని మరింతగా పెంచింది. దానికి జవాబుగా, ''మాకు అల్లాహ్‌ చాలు. ఆయన చాలా మంచి కార్యసాధకుడు'' అని వారన్నారు.
3:174  فَانقَلَبُوا بِنِعْمَةٍ مِّنَ اللَّهِ وَفَضْلٍ لَّمْ يَمْسَسْهُمْ سُوءٌ وَاتَّبَعُوا رِضْوَانَ اللَّهِ ۗ وَاللَّهُ ذُو فَضْلٍ عَظِيمٍ
(తత్ఫలితంగా) వారు అల్లాహ్‌ ప్రసాదించిన వరాలతో, అనుగ్రహంతో తిరిగి వచ్చారు. వారికెలాంటి కీడూ కలగలేదు. వారు అల్లాహ్‌ ప్రసన్నతను అనుసరించారు. అల్లాహ్‌ గొప్ప అనుగ్రహం కలవాడు.
3:175  إِنَّمَا ذَٰلِكُمُ الشَّيْطَانُ يُخَوِّفُ أَوْلِيَاءَهُ فَلَا تَخَافُوهُمْ وَخَافُونِ إِن كُنتُم مُّؤْمِنِينَ
నిజానికి (ఈ వార్త అందజేసిన) వాడు షైతాను. వాడు తన మిత్రుల గురించి మీకు భయపెట్టాడు. కనుక మీరు అవిశ్వాసులకు భయపడకండి, మీరు విశ్వాసులే అయితే నాకు భయపడండి.
3:176  وَلَا يَحْزُنكَ الَّذِينَ يُسَارِعُونَ فِي الْكُفْرِ ۚ إِنَّهُمْ لَن يَضُرُّوا اللَّهَ شَيْئًا ۗ يُرِيدُ اللَّهُ أَلَّا يَجْعَلَ لَهُمْ حَظًّا فِي الْآخِرَةِ ۖ وَلَهُمْ عَذَابٌ عَظِيمٌ
(ఓ ప్రవక్తా!) అవిశ్వాసంలో ముందుకు దూసుకుపోతున్న వారిని చూసి నువ్వు దిగులు చెందకు. వారు అల్లాహ్‌కు ఏమాత్రం కీడు కలిగించలేరు. వారికి పరలోకంలో ఎలాంటి భాగమూ ఇవ్వరాదన్నది అల్లాహ్‌ ఉద్దేశం. వారి కొరకు ఘోర శిక్ష కలదు.
3:177  إِنَّ الَّذِينَ اشْتَرَوُا الْكُفْرَ بِالْإِيمَانِ لَن يَضُرُّوا اللَّهَ شَيْئًا وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
విశ్వాసానికి బదులుగా అవిశ్వాసాన్ని కొనేవారు ఎట్టి పరిస్థితిలోనూ అల్లాహ్‌కు అపకారం చేయలేరు. పైగా వ్యధాభరితమైన శిక్ష వారికోసం సిద్ధం చేయబడి ఉంది.
3:178  وَلَا يَحْسَبَنَّ الَّذِينَ كَفَرُوا أَنَّمَا نُمْلِي لَهُمْ خَيْرٌ لِّأَنفُسِهِمْ ۚ إِنَّمَا نُمْلِي لَهُمْ لِيَزْدَادُوا إِثْمًا ۚ وَلَهُمْ عَذَابٌ مُّهِينٌ
మేము ఇస్తున్న అవకాశాన్ని అవిశ్వాసులు తమ పాలిట మేలైనదని భావించరాదు సుమా! వారు తమ పాపాల పుట్టను పెంచుకోవటానికే ఈ అవకాశం ఇస్తున్నాం. అవమానభరిత మైన శిక్ష వారి కోసమే ఉంది.
3:179  مَّا كَانَ اللَّهُ لِيَذَرَ الْمُؤْمِنِينَ عَلَىٰ مَا أَنتُمْ عَلَيْهِ حَتَّىٰ يَمِيزَ الْخَبِيثَ مِنَ الطَّيِّبِ ۗ وَمَا كَانَ اللَّهُ لِيُطْلِعَكُمْ عَلَى الْغَيْبِ وَلَٰكِنَّ اللَّهَ يَجْتَبِي مِن رُّسُلِهِ مَن يَشَاءُ ۖ فَآمِنُوا بِاللَّهِ وَرُسُلِهِ ۚ وَإِن تُؤْمِنُوا وَتَتَّقُوا فَلَكُمْ أَجْرٌ عَظِيمٌ
అపవిత్రులను పవిత్రుల నుంచి వేరుపరచే వరకూ అల్లాహ్‌ విశ్వాసులను ఇప్పుడున్న స్థితిలోనే వదలిపెట్టడు. అలా అని అల్లాహ్‌ మీకు అగోచర విషయాలనూ తెలుపడు. పైగా అల్లాహ్‌ తన ప్రవక్తలలో తాను కోరిన వారిని (ఇందుకోసం) ఎన్నుకుంటాడు. అందుచేత మీరు అల్లాహ్‌ను, ఆయన ప్రవక్తలను విశ్వసించండి. మీరే గనక విశ్వసించి, దైవభీతిపరులుగా మసలుకున్నట్లయితే మీకు గొప్ప పుణ్యఫలం లభిస్తుంది.
3:180  وَلَا يَحْسَبَنَّ الَّذِينَ يَبْخَلُونَ بِمَا آتَاهُمُ اللَّهُ مِن فَضْلِهِ هُوَ خَيْرًا لَّهُم ۖ بَلْ هُوَ شَرٌّ لَّهُمْ ۖ سَيُطَوَّقُونَ مَا بَخِلُوا بِهِ يَوْمَ الْقِيَامَةِ ۗ وَلِلَّهِ مِيرَاثُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَاللَّهُ بِمَا تَعْمَلُونَ خَبِيرٌ
అల్లాహ్‌ తన కృపతో ప్రసాదించిన దానిలో పిసినారులుగా ప్రవర్తించేవారు, ఆ పిసినారితనం తమ పాలిట మేలైనదని భావించరాదు. వాస్తవానికి అది వారి పాలిట హానికరం. పిసినారి తనంతో వారు కూడబెట్టుకున్న వస్తువే ప్రళయదినాన వారి మెడకు గుదిబండగా మారుతుంది. భూమ్యాకాశాల వారసత్వం అల్లాహ్‌కే చెందుతుంది. మీరు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు.
3:181  لَّقَدْ سَمِعَ اللَّهُ قَوْلَ الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ فَقِيرٌ وَنَحْنُ أَغْنِيَاءُ ۘ سَنَكْتُبُ مَا قَالُوا وَقَتْلَهُمُ الْأَنبِيَاءَ بِغَيْرِ حَقٍّ وَنَقُولُ ذُوقُوا عَذَابَ الْحَرِيقِ
''అల్లాహ్‌ పేదవాడు, మేము ధనికులం'' అని అన్నవారి మాటను అల్లాహ్‌ విన్నాడు. వారి ఈ మాటను మేము వ్రాసుకుంటాము. వారు ప్రవక్తలను అన్యాయంగా హతమార్చటాన్ని కూడా మేము నమోదు చేసుకుంటాము. ''దహించే అగ్ని శిక్షను చవిచూడండి.''
3:182  ذَٰلِكَ بِمَا قَدَّمَتْ أَيْدِيكُمْ وَأَنَّ اللَّهَ لَيْسَ بِظَلَّامٍ لِّلْعَبِيدِ
''ఇది మీరు ఇంతకుమునుపు చేసుకున్న కర్మలకు ప్రతిఫలం. అల్లాహ్‌ తన దాసులకు అన్యాయం చేసేవాడు కాడు'' అని (తీర్పుదినాన) మేము వారికి చెబుతాము.
3:183  الَّذِينَ قَالُوا إِنَّ اللَّهَ عَهِدَ إِلَيْنَا أَلَّا نُؤْمِنَ لِرَسُولٍ حَتَّىٰ يَأْتِيَنَا بِقُرْبَانٍ تَأْكُلُهُ النَّارُ ۗ قُلْ قَدْ جَاءَكُمْ رُسُلٌ مِّن قَبْلِي بِالْبَيِّنَاتِ وَبِالَّذِي قُلْتُمْ فَلِمَ قَتَلْتُمُوهُمْ إِن كُنتُمْ صَادِقِينَ
''అగ్ని తినివేసేటటువంటి ఖుర్బానీని మా వద్దకు తేనంత వరకూ ఏ ప్రవక్తనూ విశ్వసించరాదని అల్లాహ్‌ మాకు ఆజ్ఞాపించాడు'' అని చెప్పిన జనం వారు. ఓ ప్రవక్తా! వారితో ఇలా అను: ''నాకు పూర్వం మీ వద్దకు వచ్చిన ప్రవక్తలు ఇతర అనేక మహిమలతోపాటు, మీరు కోరుతున్న ఈ మహిమను కూడా తీసుకువచ్చారు. మరి మీరు సత్యవంతులే అయితే వారిని ఎందుకు చంపారు?''
3:184  فَإِن كَذَّبُوكَ فَقَدْ كُذِّبَ رُسُلٌ مِّن قَبْلِكَ جَاءُوا بِالْبَيِّنَاتِ وَالزُّبُرِ وَالْكِتَابِ الْمُنِيرِ
(ఇంతగా బోధపరచినప్పటికీ) వారు నిన్ను ధిక్కరిస్తే, నీకు పూర్వం కూడా స్పష్టమయిన నిదర్శనాలను, సహీఫాలను, జోతిర్మయమైన గ్రంథాన్ని తీసుకువచ్చిన ప్రవక్తలు కూడా ఇటువంటి ధిక్కారానికి గురయ్యారు.
3:185  كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ ۗ وَإِنَّمَا تُوَفَّوْنَ أُجُورَكُمْ يَوْمَ الْقِيَامَةِ ۖ فَمَن زُحْزِحَ عَنِ النَّارِ وَأُدْخِلَ الْجَنَّةَ فَقَدْ فَازَ ۗ وَمَا الْحَيَاةُ الدُّنْيَا إِلَّا مَتَاعُ الْغُرُورِ
ప్రతి ప్రాణీ మృత్యువు రుచి చూడవలసిందే. ప్రళయదినాన మీరు అందరూ మీ కర్మల పూర్తి ఫలితాన్ని పొందుతారు. అప్పుడు ఎవడు నరకాగ్ని నుంచి కాపాడబడి, స్వర్గంలో ప్రవేశం కల్పించబడతాడో అతడు నిశ్చయంగా సఫలీకృతుడయ్యాడు. ప్రాపంచిక జీవితమైతే ఒక మాయావస్తువు తప్ప మరేమీ కాదు.
3:186  لَتُبْلَوُنَّ فِي أَمْوَالِكُمْ وَأَنفُسِكُمْ وَلَتَسْمَعُنَّ مِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ مِن قَبْلِكُمْ وَمِنَ الَّذِينَ أَشْرَكُوا أَذًى كَثِيرًا ۚ وَإِن تَصْبِرُوا وَتَتَّقُوا فَإِنَّ ذَٰلِكَ مِنْ عَزْمِ الْأُمُورِ
నిశ్చయంగా మీ ధనప్రాణాల ద్వారా మీరు పరీక్షించ బడతారు. అంతేకాదు, మీకు పూర్వం గ్రంథం వొసగబడిన వారి తరఫునుండీ, ముష్రిక్కుల తరఫునుండీ మీరు బాధాకరమైన మాటలెన్నో వినవలసి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు గనక సహనం పాటిస్తూ, భయభక్తులతో మసలుకుంటే ఇదెంతో సాహసోపేతమైన పనే!
3:187  وَإِذْ أَخَذَ اللَّهُ مِيثَاقَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ لَتُبَيِّنُنَّهُ لِلنَّاسِ وَلَا تَكْتُمُونَهُ فَنَبَذُوهُ وَرَاءَ ظُهُورِهِمْ وَاشْتَرَوْا بِهِ ثَمَنًا قَلِيلًا ۖ فَبِئْسَ مَا يَشْتَرُونَ
(జ్ఞాపకం చెయ్యి,) అల్లాహ్‌ గ్రంథవహుల నుంచి, ''మీరు గ్రంథజ్ఞానాన్ని ప్రజలకు తప్పకుండా వివరించాలి. దానిని దాచకూడదు'' అని వాగ్దానం తీసుకున్నాడు. అయినప్పటికీ వారు ఈ వాగ్దానాన్ని తమ వీపు వెనుక పడవేయటమేగాక అతి తక్కువ మూల్యానికి దాన్ని అమ్మివేశారు. వారు చేసిన ఈ వర్తకం బహు చెడ్డది.
3:188  لَا تَحْسَبَنَّ الَّذِينَ يَفْرَحُونَ بِمَا أَتَوا وَّيُحِبُّونَ أَن يُحْمَدُوا بِمَا لَمْ يَفْعَلُوا فَلَا تَحْسَبَنَّهُم بِمَفَازَةٍ مِّنَ الْعَذَابِ ۖ وَلَهُمْ عَذَابٌ أَلِيمٌ
తాము చేసిన పనులపై సంబరపడేవారు, తాము చేయని పనికి కూడా తమకు జేజేలు లభించాలని తహతహలాడేవారు శిక్ష నుంచి బయటపడ్తారని నువ్వు అనుకోకు. వారి కొరకైతే వ్యధా భరితమైన శిక్ష ఉంది.
3:189  وَلِلَّهِ مُلْكُ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَاللَّهُ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
భూమ్యాకాశాల సార్వభౌమత్వం అల్లాహ్‌దే. అల్లాహ్‌ ప్రతి వస్తువుపై అధికారం గలవాడు.
3:190  إِنَّ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ وَاخْتِلَافِ اللَّيْلِ وَالنَّهَارِ لَآيَاتٍ لِّأُولِي الْأَلْبَابِ
నిశ్చయంగా భూమ్యాకాశాల సృష్టిలో, రేయింబవళ్ల రాకపోకలలో విజ్ఞులకు ఎన్నో సూచనలున్నాయి.
3:191  الَّذِينَ يَذْكُرُونَ اللَّهَ قِيَامًا وَقُعُودًا وَعَلَىٰ جُنُوبِهِمْ وَيَتَفَكَّرُونَ فِي خَلْقِ السَّمَاوَاتِ وَالْأَرْضِ رَبَّنَا مَا خَلَقْتَ هَٰذَا بَاطِلًا سُبْحَانَكَ فَقِنَا عَذَابَ النَّارِ
వారు నిల్చుని, కూర్చుని, తమ పడకలపై ఒత్తిగిలి అల్లాహ్‌ను స్మరిస్తూ ఉంటారు. భూమ్యాకాశాల సృష్టి గురించి యోచన చేస్తూ ఉంటారు. వారిలా అంటారు : ''మా ప్రభూ! నువ్వు ఈ సృష్టిని నిరర్థకంగా చేయలేదు. నువ్వు పవిత్రుడవు. మమ్మల్ని నరకాగ్ని శిక్ష నుంచి కాపాడు.''
3:192  رَبَّنَا إِنَّكَ مَن تُدْخِلِ النَّارَ فَقَدْ أَخْزَيْتَهُ ۖ وَمَا لِلظَّالِمِينَ مِنْ أَنصَارٍ
''ఓ మా పోషకుడా! నువ్వెవరినైతే నరకాగ్నిలో పడవేస్తావో, వాణ్ణి నువ్వు పరాభవానికి, అవమానానికి గురి చేసినట్లే. యదార్థానికి దుర్మార్గులకు తోడ్పడేవారెవరూ ఉండరు.''
3:193  رَّبَّنَا إِنَّنَا سَمِعْنَا مُنَادِيًا يُنَادِي لِلْإِيمَانِ أَنْ آمِنُوا بِرَبِّكُمْ فَآمَنَّا ۚ رَبَّنَا فَاغْفِرْ لَنَا ذُنُوبَنَا وَكَفِّرْ عَنَّا سَيِّئَاتِنَا وَتَوَفَّنَا مَعَ الْأَبْرَارِ
''మా ప్రభూ! పిలిచేవాడొకడు విశ్వాసం (ఈమాన్‌) వైపుకు పిలవటం, 'ప్రజలారా! మీ ప్రభువును విశ్వసించండి' అని పిలుపునివ్వటం మేము విన్నాము. అంతే! మేము విశ్వసించాము. కనుక ఓ ప్రభూ! మా పాపాలను క్షమించు. మా చెడుగులను మా నుంచి దూరం చెయ్యి. సజ్జనులతోపాటు మాకు మరణం వొసగు.''
3:194  رَبَّنَا وَآتِنَا مَا وَعَدتَّنَا عَلَىٰ رُسُلِكَ وَلَا تُخْزِنَا يَوْمَ الْقِيَامَةِ ۗ إِنَّكَ لَا تُخْلِفُ الْمِيعَادَ
''మా ప్రభూ! నీ ప్రవక్తల ద్వారా నీవు మాకు చేసిన వాగ్దానం ప్రకారం మమ్మల్ని అనుగ్రహించు. ప్రళయదినాన మమ్మల్ని అవమానపరచకు. ఎట్టి పరిస్థితిలోనూ నీవు వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరించేవాడవు కావు.''
3:195  فَاسْتَجَابَ لَهُمْ رَبُّهُمْ أَنِّي لَا أُضِيعُ عَمَلَ عَامِلٍ مِّنكُم مِّن ذَكَرٍ أَوْ أُنثَىٰ ۖ بَعْضُكُم مِّن بَعْضٍ ۖ فَالَّذِينَ هَاجَرُوا وَأُخْرِجُوا مِن دِيَارِهِمْ وَأُوذُوا فِي سَبِيلِي وَقَاتَلُوا وَقُتِلُوا لَأُكَفِّرَنَّ عَنْهُمْ سَيِّئَاتِهِمْ وَلَأُدْخِلَنَّهُمْ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ ثَوَابًا مِّنْ عِندِ اللَّهِ ۗ وَاللَّهُ عِندَهُ حُسْنُ الثَّوَابِ
వారి ప్రభువు వారి మొరను ఆలకించి ఆమోదించాడు: ''మీలో పని చేసేవారి పనిని - వారు పురుషులైనా సరే, స్త్రీలయినాసరే - నేను వృధా చేయను. మీరు పరస్పరం ఒకే కోవకు చెందినవారు. కాబట్టి తమ స్వస్థలం వదలి వలస వెళ్ళినవారు (హిజ్రత్‌ చేసినవారు), తమ ఇళ్ళనుంచి వెళ్లగొట్ట బడినవారు, నా మార్గంలో వేధింపులకు గురైనవారు, నా మార్గంలో పోరాడి చంపబడినవారు - అటువంటి వారి చెడుగులను వారి నుంచి దూరం చేస్తాను. క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలలో వారిని ప్రవేశింపజేస్తాను. ఇదీ అల్లాహ్‌ తరఫున వారికి లభించే పుణ్యఫలం. అల్లాహ్‌ వద్దనే అత్యుత్తమమయిన పుణ్యఫలం ఉంది'' అని సెలవిచ్చాడు.
3:196  لَا يَغُرَّنَّكَ تَقَلُّبُ الَّذِينَ كَفَرُوا فِي الْبِلَادِ
(ఓ ప్రవక్తా!) నగరాలలో దైవ తిరస్కారుల స్వేచ్ఛా సంచారం నిన్ను మోసపుచ్చకూడదు.
3:197  مَتَاعٌ قَلِيلٌ ثُمَّ مَأْوَاهُمْ جَهَنَّمُ ۚ وَبِئْسَ الْمِهَادُ
ఇది చాలా స్వల్ప ప్రయోజనం మాత్రమే. ఆ తరువాత నరకమే వారి నివాస స్థలం అవుతుంది. అదెంతో అధ్వాన్నమైన స్థలం.
3:198  لَٰكِنِ الَّذِينَ اتَّقَوْا رَبَّهُمْ لَهُمْ جَنَّاتٌ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا نُزُلًا مِّنْ عِندِ اللَّهِ ۗ وَمَا عِندَ اللَّهِ خَيْرٌ لِّلْأَبْرَارِ
కాని తమ ప్రభువుకు భయపడుతూ మసలుకునేవారి కోసం క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలున్నాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. ఇదీ అల్లాహ్‌ వద్ద నుంచి వారికి లభించే ఆతిథ్యం. సద్వర్తనుల కోసం అల్లాహ్‌ వద్ద ఉన్నది అన్నింటికంటే శ్రేష్ఠమైనది.
3:199  وَإِنَّ مِنْ أَهْلِ الْكِتَابِ لَمَن يُؤْمِنُ بِاللَّهِ وَمَا أُنزِلَ إِلَيْكُمْ وَمَا أُنزِلَ إِلَيْهِمْ خَاشِعِينَ لِلَّهِ لَا يَشْتَرُونَ بِآيَاتِ اللَّهِ ثَمَنًا قَلِيلًا ۗ أُولَٰئِكَ لَهُمْ أَجْرُهُمْ عِندَ رَبِّهِمْ ۗ إِنَّ اللَّهَ سَرِيعُ الْحِسَابِ
గ్రంథవహులలో కొందరున్నారు - వారు అల్లాహ్‌ను, మీపై అవతరించిన దానినీ, వారి వైపునకు అవతరించిన దాన్ని కూడా విశ్వసిస్తారు. అల్లాహ్‌కు భయపడుతూ ఉంటారు. అల్లాహ్‌ ఆయతులను కొద్దిపాటి మూల్యానికి అమ్ముకోరు. అలాంటివారి ప్రతిఫలం వారి ప్రభువు వద్ద ఉంది. నిశ్చయంగా అల్లాహ్‌ వేగంగా లెక్క తీసుకుంటాడు.
3:200  يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اصْبِرُوا وَصَابِرُوا وَرَابِطُوا وَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تُفْلِحُونَ
ఓ విశ్వసించిన వారలారా! మీరు సహనస్థయిర్యాలను ప్రదర్శించండి. పరస్పరం సహనం గురించి బోధించుకుంటూ, (అల్లాహ్‌ మార్గంలో పోరుకు) సమాయత్తమై ఉండండి. అల్లాహ్‌కు భయపడుతూ ఉండండి. తద్వారా మీరు సాఫల్యం పొందవచ్చు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.