aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

35. సూరా ఫాతిర్

35:1  الْحَمْدُ لِلَّهِ فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ جَاعِلِ الْمَلَائِكَةِ رُسُلًا أُولِي أَجْنِحَةٍ مَّثْنَىٰ وَثُلَاثَ وَرُبَاعَ ۚ يَزِيدُ فِي الْخَلْقِ مَا يَشَاءُ ۚ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
సర్వస్తోత్రాలు (శూన్యంలో నుంచి) ఆకాశాలను, భూమిని సృష్టించిన అల్లాహ్‌కే శోభిస్తాయి. ఆయన రెండేసి, మూడేసి, నాలుగేసి రెక్కలు గల దూతలను తన సందేశ వాహకులుగా చేసుకుంటాడు. సృష్టిలో తాను కోరిన దాన్ని పెంచుతాడు. అల్లాహ్‌ అన్నింటిపై అధికారం కలవాడు.
35:2  مَّا يَفْتَحِ اللَّهُ لِلنَّاسِ مِن رَّحْمَةٍ فَلَا مُمْسِكَ لَهَا ۖ وَمَا يُمْسِكْ فَلَا مُرْسِلَ لَهُ مِن بَعْدِهِ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
అల్లాహ్‌ తన దాసుల కోసం తెరిచే కారుణ్యాన్ని నిలిపివేసే వాడెవడూ లేడు. మరి ఆయన దేన్నయినా నిలిపివేస్తే, ఆ తరువాత దాన్ని పంపేవాడు కూడా ఎవడూ లేడు. ఆయన సర్వాధిక్యుడు, వివేక సంపన్నుడు.
35:3  يَا أَيُّهَا النَّاسُ اذْكُرُوا نِعْمَتَ اللَّهِ عَلَيْكُمْ ۚ هَلْ مِنْ خَالِقٍ غَيْرُ اللَّهِ يَرْزُقُكُم مِّنَ السَّمَاءِ وَالْأَرْضِ ۚ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ فَأَنَّىٰ تُؤْفَكُونَ
ఓ ప్రజలారా! మీపైవున్న అల్లాహ్‌ అనుగ్రహాన్ని కాస్త జ్ఞాపకం చేసుకోండి. ఏమిటి, అల్లాహ్‌ గాకుండా ఆకాశం నుంచి, భూమి నుంచి మీకు ఉపాధిని సమకూర్చే వేరే సృష్టికర్త కూడా ఎవడైనా ఉన్నాడా? ఆయన తప్ప మరో ఆరాధ్యుడెవడూలేడు. మరి మీరు (ఆయన వైపు నుండి) ఎటు తిరిగిపోతున్నారు?
35:4  وَإِن يُكَذِّبُوكَ فَقَدْ كُذِّبَتْ رُسُلٌ مِّن قَبْلِكَ ۚ وَإِلَى اللَّهِ تُرْجَعُ الْأُمُورُ
(ఓ ప్రవక్తా!) ఒకవేళ వీళ్ళు నిన్ను ధిక్కరించినట్లయితే నీకు పూర్వం గతించిన ప్రవక్తలంతా ధిక్కరించబడినవారే. సమస్త వ్యవహారాలు (ఎట్టకేలకు) అల్లాహ్‌ వైపునకే మరలించబడతాయి.
35:5  يَا أَيُّهَا النَّاسُ إِنَّ وَعْدَ اللَّهِ حَقٌّ ۖ فَلَا تَغُرَّنَّكُمُ الْحَيَاةُ الدُّنْيَا ۖ وَلَا يَغُرَّنَّكُم بِاللَّهِ الْغَرُورُ
ఓ ప్రజలారా! నిశ్చయంగా అల్లాహ్‌ వాగ్దానం సత్యమైనది. కాబట్టి ప్రాపంచిక జీవితం ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని మోసంలో పడవేయకూడదు. ఆ మాయలమారి (షైతాను) కూడా మిమ్మల్ని మోసగించకూడదు సుమా!
35:6  إِنَّ الشَّيْطَانَ لَكُمْ عَدُوٌّ فَاتَّخِذُوهُ عَدُوًّا ۚ إِنَّمَا يَدْعُو حِزْبَهُ لِيَكُونُوا مِنْ أَصْحَابِ السَّعِيرِ
నిశ్చయంగా షైతాను మీ శత్రువు. కనుక మీరు కూడా వాణ్ణి శత్రువుగానే పరిగణించండి. వాడు తన సమూహాన్ని, వారంతా నరకవాసులలో చేరిపోవటానికే పిలుస్తున్నాడు.
35:7  الَّذِينَ كَفَرُوا لَهُمْ عَذَابٌ شَدِيدٌ ۖ وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَهُم مَّغْفِرَةٌ وَأَجْرٌ كَبِيرٌ
అవిశ్వాస వైఖరిని అవలంబించినవారి కోసం తీవ్రమైన శిక్ష ఉంది. విశ్వసించి, సత్కార్యాలు చేసిన వారి కోసం మన్నింపు ఉంది. గొప్ప పుణ్యఫలం ఉంది.
35:8  أَفَمَن زُيِّنَ لَهُ سُوءُ عَمَلِهِ فَرَآهُ حَسَنًا ۖ فَإِنَّ اللَّهَ يُضِلُّ مَن يَشَاءُ وَيَهْدِي مَن يَشَاءُ ۖ فَلَا تَذْهَبْ نَفْسُكَ عَلَيْهِمْ حَسَرَاتٍ ۚ إِنَّ اللَّهَ عَلِيمٌ بِمَا يَصْنَعُونَ
మరి ఏ వ్యక్తికయినా అతని దుష్కర్మలు అందమైనవిగా చేయబడగా, అతను వాటిని మంచి పనులుగా భావిస్తున్నట్లయితే (అతను సన్మార్గం పొందిన వానితో సరితూగుతాడా?)! అల్లాహ్‌ తాను తలచిన వారిని మార్గవిహీనతకు లోనుచేస్తున్నాడు, తాను తలచిన వారికి సన్మార్గం చూపుతున్నాడు. కనుక (ఓ ప్రవక్తా!) నువ్వు వాళ్ల గురించి అదేపనిగా బెంగ పెట్టుకుని నీ ప్రాణానికి ముప్పు తెచ్చి పెట్టుకోకూడదు. వారు చేసేదంతా అల్లాహ్‌కు పూర్తిగా తెలుసు.
35:9  وَاللَّهُ الَّذِي أَرْسَلَ الرِّيَاحَ فَتُثِيرُ سَحَابًا فَسُقْنَاهُ إِلَىٰ بَلَدٍ مَّيِّتٍ فَأَحْيَيْنَا بِهِ الْأَرْضَ بَعْدَ مَوْتِهَا ۚ كَذَٰلِكَ النُّشُورُ
అల్లాహ్‌యే గాలులను పంపిస్తున్నాడు. తరువాత అవి మేఘాలను లేపుతాయి. మరి ఆ మేఘాలను మేము ఒక మృత ప్రదేశం (భూమి) వైపుకు తీసుకుపోతాము. తద్వారా ఆ భూమిని- మృతిచెందిన మీదట - బ్రతికిస్తున్నాము. మళ్లీ తిరిగి లేపటం అనేది (కూడా) ఇలాగే జరుగుతుంది.
35:10  مَن كَانَ يُرِيدُ الْعِزَّةَ فَلِلَّهِ الْعِزَّةُ جَمِيعًا ۚ إِلَيْهِ يَصْعَدُ الْكَلِمُ الطَّيِّبُ وَالْعَمَلُ الصَّالِحُ يَرْفَعُهُ ۚ وَالَّذِينَ يَمْكُرُونَ السَّيِّئَاتِ لَهُمْ عَذَابٌ شَدِيدٌ ۖ وَمَكْرُ أُولَٰئِكَ هُوَ يَبُورُ
గౌరవాన్ని ఆశించే వారెవరయినాసరే సకల గౌరవోన్నతులు అల్లాహ్‌వే (నని తెలుసుకోవాలి). సద్వచనాలన్నీ ఆయన వైపుకే ఎగబ్రాకుతాయి. సదాచరణ వాటికి (మరింత) ఉన్నతినిస్తుంది. మరెవరయితే కుతంత్రాలలో నిమగ్నులై ఉంటారో వారి కొరకు ఘోరాతి ఘోరమైన శిక్ష ఉంది. కడకు వారి ఈ కుతంత్రం కకావికలమైపోతుంది.
35:11  وَاللَّهُ خَلَقَكُم مِّن تُرَابٍ ثُمَّ مِن نُّطْفَةٍ ثُمَّ جَعَلَكُمْ أَزْوَاجًا ۚ وَمَا تَحْمِلُ مِنْ أُنثَىٰ وَلَا تَضَعُ إِلَّا بِعِلْمِهِ ۚ وَمَا يُعَمَّرُ مِن مُّعَمَّرٍ وَلَا يُنقَصُ مِنْ عُمُرِهِ إِلَّا فِي كِتَابٍ ۚ إِنَّ ذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ
(ప్రజలారా!) అల్లాహ్‌ మిమ్మల్ని మట్టితో, ఆ తరువాత వీర్య బిందువుతో సృష్టించాడు. ఆ పైన మిమ్మల్ని జతలు (స్త్రీలు, పురుషులు)గా చేశాడు. ఆయనకు తెలియకుండా ఏ స్త్రీ కూడా గర్భవతి కావటంగానీ, బిడ్డను కనటంగానీ జరగదు. దీర్ఘాయుషు పొందినవాని ఆయుష్షు పెరగటమైనా, మరొకతని ఆయుష్షు తరగటమైనా - అంతా గ్రంథంలో లిఖితమై ఉంది. ఇదంతా అల్లాహ్‌కు చాలా తేలిక.
35:12  وَمَا يَسْتَوِي الْبَحْرَانِ هَٰذَا عَذْبٌ فُرَاتٌ سَائِغٌ شَرَابُهُ وَهَٰذَا مِلْحٌ أُجَاجٌ ۖ وَمِن كُلٍّ تَأْكُلُونَ لَحْمًا طَرِيًّا وَتَسْتَخْرِجُونَ حِلْيَةً تَلْبَسُونَهَا ۖ وَتَرَى الْفُلْكَ فِيهِ مَوَاخِرَ لِتَبْتَغُوا مِن فَضْلِهِ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ
రెండు జలధులూ సమానం కావు - వాటిలో (ఒకటి)ఇదేమో తియ్యనిది, దాహం తీర్చేది, త్రాగటానికి హాయిగా ఉండేది. మరి (రెండవది) అదేమో ఉప్పగా, చేదుగా ఉంది. అయితే మీరు ఆ రెండింటిలో నుంచీ తాజామాంసాన్ని తింటున్నారు. మీరు ధరించే నగలను వెలికి తీస్తున్నారు. జల ప్రవాహాలను చీల్చుకుంటూ పోయే పెద్దపెద్ద ఓడలను నువ్వు చూస్తున్నావు - మీరు ఆయన కృపను అన్వేషించడానికి, మీరు ఆయనకు కృతజ్ఞులై ఉండటానికిగాను (ఈ వ్యవస్థ ఏర్పరచబడింది).
35:13  يُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَيُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ كُلٌّ يَجْرِي لِأَجَلٍ مُّسَمًّى ۚ ذَٰلِكُمُ اللَّهُ رَبُّكُمْ لَهُ الْمُلْكُ ۚ وَالَّذِينَ تَدْعُونَ مِن دُونِهِ مَا يَمْلِكُونَ مِن قِطْمِيرٍ
ఆయన రాత్రిని పగటిలోనికి జొప్పిస్తున్నాడు, పగటిని రాత్రి లోనికి జొప్పిస్తున్నాడు. మరి ఆయన సూర్యచంద్రులను (తన శాసన) నిబద్ధుల్ని చేశాడు - ప్రతిదీ ఒక నిర్ధారిత కాలం ప్రకారం నడుస్తోంది. ఈ అల్లాహ్‌యే మీ ప్రభువు. విశ్వసామ్రాజ్యాధికారం ఆయనదే. ఆయన్ని వదలి మీరు ఎవరెవరిని పిలుస్తున్నారో వారు ఖర్జూరపు టెంకపై ఉండే పొరకు కూడా యజమానులు కారు.
35:14  إِن تَدْعُوهُمْ لَا يَسْمَعُوا دُعَاءَكُمْ وَلَوْ سَمِعُوا مَا اسْتَجَابُوا لَكُمْ ۖ وَيَوْمَ الْقِيَامَةِ يَكْفُرُونَ بِشِرْكِكُمْ ۚ وَلَا يُنَبِّئُكَ مِثْلُ خَبِيرٍ
ఒకవేళ మీరు వారిని మొర పెట్టుకున్నా, వారు మీ మొరను ఆలకించరు. ఒకవేళ ఆలకించినా, మీ అక్కరను తీర్చలేరు. పైపెచ్చు ప్రళయదినాన మీరు కల్పించే భాగస్వామ్యాన్ని (షిర్క్‌ను) వారు (సూటిగా) త్రోసిపుచ్చుతారు. అన్నీ తెలిసిన దేవుని మాదిరిగా (సావధానపరిచే సమాచారాన్ని) నీకు తెలిపే వాడెవడూ ఉండడు సుమా!
35:15  يَا أَيُّهَا النَّاسُ أَنتُمُ الْفُقَرَاءُ إِلَى اللَّهِ ۖ وَاللَّهُ هُوَ الْغَنِيُّ الْحَمِيدُ
ఓ ప్రజలారా! మీరంతా అల్లాహ్‌ అవసరం కలిగినవారు. అల్లాహ్‌ మాత్రం అక్కరలేనివాడు. (సర్వ విధాలా) స్తుతించదగిన వాడు.
35:16  إِن يَشَأْ يُذْهِبْكُمْ وَيَأْتِ بِخَلْقٍ جَدِيدٍ
ఆయన గనక తలిస్తే మిమ్మల్ని తుదముట్టించి, (మీ స్థానంలో) మరో నూతన సృష్టిని చేయగలడు.
35:17  وَمَا ذَٰلِكَ عَلَى اللَّهِ بِعَزِيزٍ
ఇలా చేయటం అల్లాహ్‌కు ఏమాత్రం కష్టతరం కాదు.
35:18  وَلَا تَزِرُ وَازِرَةٌ وِزْرَ أُخْرَىٰ ۚ وَإِن تَدْعُ مُثْقَلَةٌ إِلَىٰ حِمْلِهَا لَا يُحْمَلْ مِنْهُ شَيْءٌ وَلَوْ كَانَ ذَا قُرْبَىٰ ۗ إِنَّمَا تُنذِرُ الَّذِينَ يَخْشَوْنَ رَبَّهُم بِالْغَيْبِ وَأَقَامُوا الصَّلَاةَ ۚ وَمَن تَزَكَّىٰ فَإِنَّمَا يَتَزَكَّىٰ لِنَفْسِهِ ۚ وَإِلَى اللَّهِ الْمَصِيرُ
బరువును మోసేవాడెవడూ మరొకరి బరువును మోయడు. బరువు మోసేవాడు ఒకవేళ తన బరువును మోపే నిమిత్తం వేరొకరిని పిలిచినా, అతడు - సమీప బంధువు అయినాసరే - కొద్దిగా కూడా ఎత్తుకోడు. (ఓ ప్రవక్తా!) చూడకపోయినా తమ ప్రభువుకు భయపడేవారిని, నమాజులను నెలకొల్పేవారిని మాత్రమే నువ్వు సావధానపరచగలవు. ఎవడు పరిశుద్ధుడైనా తన స్వయం కోసమే పరిశుద్ధుడవుతాడు. (కడకు అందరూ) అల్లాహ్‌ వైపునకే మరలిపోవలసి ఉంది.
35:19  وَمَا يَسْتَوِي الْأَعْمَىٰ وَالْبَصِيرُ
గుడ్డివాడు - చూసేవాడూ సమానులు కారు.
35:20  وَلَا الظُّلُمَاتُ وَلَا النُّورُ
చీకట్లు - వెలుతురు ఒకటి కావు.
35:21  وَلَا الظِّلُّ وَلَا الْحَرُورُ
నీడా - ఎండా సమం కావు.
35:22  وَمَا يَسْتَوِي الْأَحْيَاءُ وَلَا الْأَمْوَاتُ ۚ إِنَّ اللَّهَ يُسْمِعُ مَن يَشَاءُ ۖ وَمَا أَنتَ بِمُسْمِعٍ مَّن فِي الْقُبُورِ
బ్రతికి ఉన్నవారూ చచ్చినవారు (ఎన్నటికీ) సమానులు కాలేరు. అల్లాహ్‌ తాను కోరిన వారికి వినిపిస్తాడు. సమాధుల్లో ఉన్నవారికి నువ్వు వినిపించలేవు.
35:23  إِنْ أَنتَ إِلَّا نَذِيرٌ
నువ్వు హెచ్చరించేవాడవు మాత్రమే.
35:24  إِنَّا أَرْسَلْنَاكَ بِالْحَقِّ بَشِيرًا وَنَذِيرًا ۚ وَإِن مِّنْ أُمَّةٍ إِلَّا خَلَا فِيهَا نَذِيرٌ
మేము నీకు సత్యాన్ని ఇచ్చి, శుభవార్తను అందజేసేవానిగా, హెచ్చరించేవానిగా చేసి పంపాము. హెచ్చరించేవాడు గడచి ఉండని సమాజం అంటూ ఏదీ లేదు.
35:25  وَإِن يُكَذِّبُوكَ فَقَدْ كَذَّبَ الَّذِينَ مِن قَبْلِهِمْ جَاءَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ وَبِالزُّبُرِ وَبِالْكِتَابِ الْمُنِيرِ
ఒకవేళ వీళ్ళు నిన్ను ధిక్కరించినట్లయితే, వీరికి మునుపు గతించిన వారు కూడా ధిక్కరించినవారే. వారి దగ్గరకు కూడా వారి ప్రవక్తలు మహిమలను, ప్రతుల (సహీఫాల)ను, ప్రకాశమానమైన గ్రంథాలను తీసుకువచ్చారు.
35:26  ثُمَّ أَخَذْتُ الَّذِينَ كَفَرُوا ۖ فَكَيْفَ كَانَ نَكِيرِ
ఆ తరువాత నేను అవిశ్వాసులను పట్టుకున్నాను. మరి నా ఝుళిపింపు ఎలా ఉందో (చూశారుగా)!
35:27  أَلَمْ تَرَ أَنَّ اللَّهَ أَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجْنَا بِهِ ثَمَرَاتٍ مُّخْتَلِفًا أَلْوَانُهَا ۚ وَمِنَ الْجِبَالِ جُدَدٌ بِيضٌ وَحُمْرٌ مُّخْتَلِفٌ أَلْوَانُهَا وَغَرَابِيبُ سُودٌ
అల్లాహ్‌ ఆకాశం నుంచి వర్షం కురిపించటాన్ని నువ్వు చూడలేదా? మరి దాని ద్వారా మేము పలు రంగుల పండ్లను ఉత్పన్నం చేశాము. మరి పర్వతాలలో కూడా పలు భాగాలు ఉన్నాయి- తెల్లనివి, ఎర్రనివి. వాటి రంగులు కూడా వేర్వేరుగా ఉన్నాయి. చాలా నల్లనివి కూడా ఉన్నాయి.
35:28  وَمِنَ النَّاسِ وَالدَّوَابِّ وَالْأَنْعَامِ مُخْتَلِفٌ أَلْوَانُهُ كَذَٰلِكَ ۗ إِنَّمَا يَخْشَى اللَّهَ مِنْ عِبَادِهِ الْعُلَمَاءُ ۗ إِنَّ اللَّهَ عَزِيزٌ غَفُورٌ
అలాగే మనుషులలో, జంతువులలో, పశువులలో కూడా పలు రంగులు గలవి ఉన్నాయి. అల్లాహ్‌ దాసులలో జ్ఞాన సంపన్నులు మాత్రమే ఆయనకు భయపడతారు. నిశ్చయంగా అల్లాహ్‌ సర్వాధిక్యుడు, క్షమాశీలి.
35:29  إِنَّ الَّذِينَ يَتْلُونَ كِتَابَ اللَّهِ وَأَقَامُوا الصَّلَاةَ وَأَنفَقُوا مِمَّا رَزَقْنَاهُمْ سِرًّا وَعَلَانِيَةً يَرْجُونَ تِجَارَةً لَّن تَبُورَ
దైవగ్రంథాన్ని పఠిస్తూ నమాజును నెలకొల్పేవారు, మేము ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగానూ, బహిరంగంగానూ ఖర్చు చేసేవారు ఎన్నటికీ నష్టం కలుగని వర్తకాన్ని ఆశిస్తున్నారు.
35:30  لِيُوَفِّيَهُمْ أُجُورَهُمْ وَيَزِيدَهُم مِّن فَضْلِهِ ۚ إِنَّهُ غَفُورٌ شَكُورٌ
వారికి వారి ప్రతిఫలాలు (అల్లాహ్‌) పూర్తిగా ఇవ్వటానికి, తన కృపతో ఆయన వారికి మరింతగా ప్రసాదించటానికిగాను (వారు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు). నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు, సన్మానించేవాడు.
35:31  وَالَّذِي أَوْحَيْنَا إِلَيْكَ مِنَ الْكِتَابِ هُوَ الْحَقُّ مُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيْهِ ۗ إِنَّ اللَّهَ بِعِبَادِهِ لَخَبِيرٌ بَصِيرٌ
(ఓ ప్రవక్తా!) మేము 'వహీ' రూపంలో నీ వద్దకు పంపిన ఈ గ్రంథం సత్యమైంది, తనకు పూర్వం వచ్చిన గ్రంథాలను ధృవపరిచేది. నిస్సందేహంగా అల్లాహ్‌ తన దాసుల స్థితిగతులన్నీ తెలిసినవాడు, అన్నీ చూసేవాడు.
35:32  ثُمَّ أَوْرَثْنَا الْكِتَابَ الَّذِينَ اصْطَفَيْنَا مِنْ عِبَادِنَا ۖ فَمِنْهُمْ ظَالِمٌ لِّنَفْسِهِ وَمِنْهُم مُّقْتَصِدٌ وَمِنْهُمْ سَابِقٌ بِالْخَيْرَاتِ بِإِذْنِ اللَّهِ ۚ ذَٰلِكَ هُوَ الْفَضْلُ الْكَبِيرُ
తరువాత మా దాసులలో మేము ఎన్నుకున్న వారిని (ఈ) గ్రంథానికి వారసులుగా చేశాము. మరి వారిలో కొందరు తమ ఆత్మలపై అన్యాయానికి ఒడిగడుతున్నారు. వారిలో మరి కొందరు మధ్య రకానికి చెందినవారు. వారిలో ఇంకొందరు అల్లాహ్‌ అనుమతితో సత్కార్యాలలో ముందంజ వేస్తున్నారు. ఇది మహదనుగ్రహం.
35:33  جَنَّاتُ عَدْنٍ يَدْخُلُونَهَا يُحَلَّوْنَ فِيهَا مِنْ أَسَاوِرَ مِن ذَهَبٍ وَلُؤْلُؤًا ۖ وَلِبَاسُهُمْ فِيهَا حَرِيرٌ
(వారి కోసం) కలకాలం నిలిచే స్వర్గ వనాలున్నాయి. వాటిలో వారు ప్రవేశిస్తారు. అక్కడ వారు స్వర్ణకంకణాలతో, ముత్యాలతో ముస్తాబు అవుతారు. వారు ధరించే వస్త్రాలు పట్టు వస్త్రాలై ఉంటాయి.
35:34  وَقَالُوا الْحَمْدُ لِلَّهِ الَّذِي أَذْهَبَ عَنَّا الْحَزَنَ ۖ إِنَّ رَبَّنَا لَغَفُورٌ شَكُورٌ
వారిలా అంటారు: 'మా నుంచి దుఃఖాన్ని దూరం చేసిన అల్లాహ్‌కు (శతకోటి) కృతజ్ఞతలు. నిశ్చయంగా మా ప్రభువు అమితంగా క్షమించేవాడు, సత్కార స్వభావుడు.
35:35  الَّذِي أَحَلَّنَا دَارَ الْمُقَامَةِ مِن فَضْلِهِ لَا يَمَسُّنَا فِيهَا نَصَبٌ وَلَا يَمَسُّنَا فِيهَا لُغُوبٌ
"ఆయన తన కృపతో నిత్యం ఉండే నెలవులో మమ్మల్ని దించాడు. అందులో మాకు బాధగానీ, అలసటగానీ ఉండట్లేదు."
35:36  وَالَّذِينَ كَفَرُوا لَهُمْ نَارُ جَهَنَّمَ لَا يُقْضَىٰ عَلَيْهِمْ فَيَمُوتُوا وَلَا يُخَفَّفُ عَنْهُم مِّنْ عَذَابِهَا ۚ كَذَٰلِكَ نَجْزِي كُلَّ كَفُورٍ
మరి తిరస్కార వైఖరికి పాల్పడిన వారికోసం నరకాగ్ని ఉన్నది. వారు చావటానికి తీర్మానించటంగానీ, వారి నరక శిక్షను తగ్గించటంగాని జరగదు. మేలును మరచిన వారందరికీ మేము ఇలాంటి ప్రతిఫలమే ఇస్తాము.
35:37  وَهُمْ يَصْطَرِخُونَ فِيهَا رَبَّنَا أَخْرِجْنَا نَعْمَلْ صَالِحًا غَيْرَ الَّذِي كُنَّا نَعْمَلُ ۚ أَوَلَمْ نُعَمِّرْكُم مَّا يَتَذَكَّرُ فِيهِ مَن تَذَكَّرَ وَجَاءَكُمُ النَّذِيرُ ۖ فَذُوقُوا فَمَا لِلظَّالِمِينَ مِن نَّصِيرٍ
అందులో వారిలా ఘోషిస్తారు: "ప్రభూ! మమ్మల్ని బయటికి తియ్యి. మేము ఇప్పటిదాకా చేసిన పనులకు భిన్నంగా మంచి పనులు చేస్తాము." (సమాధానంగా అల్లాహ్‌ ఇలా అంటాడు): "అర్థం చేసుకునేవానికి అర్థం చేసుకోగలిగేంత వయస్సును మేము మీకు ఇవ్వలేదా? హెచ్చరించేవాడు సయితం మీ వద్దకు వచ్చాడు - కనుక (శిక్షను) చవిచూడండి. (ఇలాంటి) దుర్మార్గులను ఆదుకునే వాడెవడూ లేడు."
35:38  إِنَّ اللَّهَ عَالِمُ غَيْبِ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۚ إِنَّهُ عَلِيمٌ بِذَاتِ الصُّدُورِ
నిశ్చయంగా అల్లాహ్‌ ఆకాశాలలో, భూమిలో ఉన్న రహస్యాలను ఎరిగినవాడు. నిశ్చయంగా గుండెల్లోని గుట్టును సయితం ఆయన ఎరిగినవాడు.
35:39  هُوَ الَّذِي جَعَلَكُمْ خَلَائِفَ فِي الْأَرْضِ ۚ فَمَن كَفَرَ فَعَلَيْهِ كُفْرُهُ ۖ وَلَا يَزِيدُ الْكَافِرِينَ كُفْرُهُمْ عِندَ رَبِّهِمْ إِلَّا مَقْتًا ۖ وَلَا يَزِيدُ الْكَافِرِينَ كُفْرُهُمْ إِلَّا خَسَارًا
మిమ్మల్ని భూమిలో ప్రతినిధులుగా చేసినవాడు ఆయనే. కాబట్టి ఇక ఎవరయినా తిరస్కార వైఖరికి పాల్పడితే అతని తిరస్కార పాపం అతని మీదే పడుతుంది. తిరస్కారుల తిరస్కార వైఖరి వారి ప్రభువు సన్నిధిలో అయిష్టతను (ఆగ్రహాన్ని) మాత్రమే పెంచుతుంది. ఇంకా తిరస్కారుల కొరకు వారి తిరస్కార వైఖరి నష్టాన్ని మాత్రమే వృద్ధిచేస్తుంది.
35:40  قُلْ أَرَأَيْتُمْ شُرَكَاءَكُمُ الَّذِينَ تَدْعُونَ مِن دُونِ اللَّهِ أَرُونِي مَاذَا خَلَقُوا مِنَ الْأَرْضِ أَمْ لَهُمْ شِرْكٌ فِي السَّمَاوَاتِ أَمْ آتَيْنَاهُمْ كِتَابًا فَهُمْ عَلَىٰ بَيِّنَتٍ مِّنْهُ ۚ بَلْ إِن يَعِدُ الظَّالِمُونَ بَعْضُهُم بَعْضًا إِلَّا غُرُورًا
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : అల్లాహ్‌ను వదలి మీరు మొరపెట్టుకుంటున్న మీ కల్పిత భాగస్వాముల సంగతిని కాస్త తెలియజేస్తారా?! వారు భూమిలో సృష్టించిందేమిటో నాకు చూపండి. లేక ఆకాశాలలో వారికేదైనా భాగస్వామ్యం ఉన్నదా? పోనీ వారికి మేమేదైనా పుస్తకం ఇచ్చామా, దాని ప్రమాణానికి వారు కట్టుబడి ఉన్నారనటానికి!? లేదు. వాస్తవానికి ఈ దుర్మార్గులు ఒండొకరికి మోసపూరితమైన వాగ్దానాలు చేస్తూవస్తున్నారు.
35:41  إِنَّ اللَّهَ يُمْسِكُ السَّمَاوَاتِ وَالْأَرْضَ أَن تَزُولَا ۚ وَلَئِن زَالَتَا إِنْ أَمْسَكَهُمَا مِنْ أَحَدٍ مِّن بَعْدِهِ ۚ إِنَّهُ كَانَ حَلِيمًا غَفُورًا
యదార్థానికి అల్లాహ్‌ ఆకాశాలను, భూమిని వాటి స్థానాల నుంచి తొలగిపోకుండా నిలిపి ఉంచాడు. అవి గనక తమ స్థానాల నుంచి తొలగిపోతే అల్లాహ్‌ తప్ప వాటిని నిలిపి ఉంచేవాడు కూడా ఎవడూ లేడు. నిశ్చయంగా ఆయన సహనశీలి, క్షమాశీలి.
35:42  وَأَقْسَمُوا بِاللَّهِ جَهْدَ أَيْمَانِهِمْ لَئِن جَاءَهُمْ نَذِيرٌ لَّيَكُونُنَّ أَهْدَىٰ مِنْ إِحْدَى الْأُمَمِ ۖ فَلَمَّا جَاءَهُمْ نَذِيرٌ مَّا زَادَهُمْ إِلَّا نُفُورًا
తమ వద్దకే గనక హెచ్చరించేవాడెవడయినా వస్తే, వేరితర సమాజాల కన్నా ఎక్కువగా తామే సన్మార్గాన్ని అవలంబిస్తామని ఈ అవిశ్వాసులు పెద్ద పెద్ద ప్రమాణాలు చేసి మరీ చెప్పేవారు. కాని తీరా హెచ్చరించేవాడు (ప్రవక్త) వారి వద్దకు వచ్చాక, వారిలో విద్వేషం మాత్రమే మరింత పెచ్చరిల్లింది.
35:43  اسْتِكْبَارًا فِي الْأَرْضِ وَمَكْرَ السَّيِّئِ ۚ وَلَا يَحِيقُ الْمَكْرُ السَّيِّئُ إِلَّا بِأَهْلِهِ ۚ فَهَلْ يَنظُرُونَ إِلَّا سُنَّتَ الْأَوَّلِينَ ۚ فَلَن تَجِدَ لِسُنَّتِ اللَّهِ تَبْدِيلًا ۖ وَلَن تَجِدَ لِسُنَّتِ اللَّهِ تَحْوِيلًا
లోకంలో తమంతటి వారు లేరనే గర్వాహంకారం మూలంగానూ, వారి దుష్టపన్నాగాల కారణంగానూ (వారిలో ఈ నకారాత్మక భావం జనించింది). అయితే దుష్ట పన్నాగాల కీడు ఆ పన్నాగాలను పన్నేవారి మీదే పడుతుంది. తమ పూర్వీకుల పట్ల అవలంబించబడుతూ వచ్చిన విధానమే తమపట్ల కూడా అవలంబించబడాలని వారు ఎదురు చూస్తున్నారా? మరయితే నువ్వు అల్లాహ్‌ విధానంలో ఎలాంటి మార్పునూ చూడలేవు. అల్లాహ్‌ విధానం (తన దిశ నుంచి) మరలి పోవటాన్ని కూడా నువ్వు చూడలేవు.
35:44  أَوَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِن قَبْلِهِمْ وَكَانُوا أَشَدَّ مِنْهُمْ قُوَّةً ۚ وَمَا كَانَ اللَّهُ لِيُعْجِزَهُ مِن شَيْءٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ ۚ إِنَّهُ كَانَ عَلِيمًا قَدِيرًا
ఏమిటీ, వారు భువిలో సంచరించి, తమకు పూర్వం గడచిన వారికి పట్టిన గతేమిటో చూడలేదా? మరి చూడబోతే వారు బలపరాక్రమంలో వీరికన్నా గట్టివారే. ఆకాశాలలోగానీ, భూమిలో గానీ ఉన్న ఏ వస్తువూ అల్లాహ్‌ను లొంగదీసుకోజాలదు. ఆయన ప్రతిదీ తెలిసినవాడు, ప్రతిదీ చేయగలవాడు.
35:45  وَلَوْ يُؤَاخِذُ اللَّهُ النَّاسَ بِمَا كَسَبُوا مَا تَرَكَ عَلَىٰ ظَهْرِهَا مِن دَابَّةٍ وَلَٰكِن يُؤَخِّرُهُمْ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى ۖ فَإِذَا جَاءَ أَجَلُهُمْ فَإِنَّ اللَّهَ كَانَ بِعِبَادِهِ بَصِيرًا
అల్లాహ్‌యే గనక జనుల చేష్టల ఆధారంగా వారిని పట్టుకోవటం మొదలెడితే భూమండలంపైన ఏ జీవినీ వదలిపెట్టడు. అయితే అల్లాహ్‌ వారికి ఒక నిర్ణీత గడువు వరకు విడుపును ఇస్తున్నాడు. మరి ఆ గడువు ముగియగానే అల్లాహ్‌ స్వయంగా తన దాసుల (సంగతి)ని చూసుకుంటాడు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.