aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

29. సూరా అల్ అన్ కబూత్

29:1  الم
అలిఫ్‌ - లామ్‌ - మీమ్‌.
29:2  أَحَسِبَ النَّاسُ أَن يُتْرَكُوا أَن يَقُولُوا آمَنَّا وَهُمْ لَا يُفْتَنُونَ
"మేము విశ్వసించాము" అని చెప్పినంత మాత్రాన తాము ఇట్టే వదలి వేయబడతామనీ, తాము పరీక్షింపబడమని ప్రజలు అనుకుంటున్నారా?
29:3  وَلَقَدْ فَتَنَّا الَّذِينَ مِن قَبْلِهِمْ ۖ فَلَيَعْلَمَنَّ اللَّهُ الَّذِينَ صَدَقُوا وَلَيَعْلَمَنَّ الْكَاذِبِينَ
వారి పూర్వీకులను కూడా మేము బాగా పరీక్షించాము. వీరిలో సత్యవంతులెవరో, అసత్యవాదులెవరో నిశ్చయంగా అల్లాహ్‌ తెలుసుకుంటాడు.
29:4  أَمْ حَسِبَ الَّذِينَ يَعْمَلُونَ السَّيِّئَاتِ أَن يَسْبِقُونَا ۚ سَاءَ مَا يَحْكُمُونَ
దుష్కార్యాలకు పాల్పడేవారు, మా అదుపు నుండి తప్పించుకుని పోగలమని భావిస్తున్నారా ఏమిటీ? ఎటువంటి చెడ్డ తీర్మానాలు చేసుకుంటున్నారు వారు!
29:5  مَن كَانَ يَرْجُو لِقَاءَ اللَّهِ فَإِنَّ أَجَلَ اللَّهِ لَآتٍ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ
అల్లాహ్‌ను కలుసుకోవాలని ఆశిస్తున్న వారెవరయినాసరే అల్లాహ్‌ నిర్థారించిన ఆ ఘడియ తప్పక రానున్నది (అని వారు గ్రహించాలి). ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
29:6  وَمَن جَاهَدَ فَإِنَّمَا يُجَاهِدُ لِنَفْسِهِ ۚ إِنَّ اللَّهَ لَغَنِيٌّ عَنِ الْعَالَمِينَ
సాధన చేసే ప్రతి ఒక్కడూ తన (స్వయం) కోసమే సాధన చేస్తున్నాడు. నిశ్చయంగా అల్లాహ్‌ లోకవాసుల అక్కర లేనివాడు.
29:7  وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَنُكَفِّرَنَّ عَنْهُمْ سَيِّئَاتِهِمْ وَلَنَجْزِيَنَّهُمْ أَحْسَنَ الَّذِي كَانُوا يَعْمَلُونَ
ఎవరయితే విశ్వసించి, (సున్నత్‌ ప్రకారం) మంచి పనులు చేస్తారో వారి నుంచి మేము వారి పాపాలను దూరం చేస్తాము. వారు చేసిన సత్కర్మలకుగాను వారికి అత్యుత్తమ ప్రతిఫలం ఇస్తాము.
29:8  وَوَصَّيْنَا الْإِنسَانَ بِوَالِدَيْهِ حُسْنًا ۖ وَإِن جَاهَدَاكَ لِتُشْرِكَ بِي مَا لَيْسَ لَكَ بِهِ عِلْمٌ فَلَا تُطِعْهُمَا ۚ إِلَيَّ مَرْجِعُكُمْ فَأُنَبِّئُكُم بِمَا كُنتُمْ تَعْمَلُونَ
తన తల్లిదండ్రుల యెడల ఉత్తమంగా మెలగాలని మేము మానవునికి తాకీదు చేశాము. అయితే వారు గనక నీకు తెలియని వాటిని, నాకు సాటిగా కల్పించమని నీపై ఒత్తిడి తీసుకువస్తే మటుకు, వారి మాట వినకు. మీరంతా నా వద్దకే మరలి రావలసి ఉంది. అప్పుడు నేను మీరు చేసే పనుల (వాస్తవికత)ను మీకు తెలియజేస్తాను.
29:9  وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَنُدْخِلَنَّهُمْ فِي الصَّالِحِينَ
మరెవరయితే విశ్వసించి, సత్కార్యాలు చేశారో వారిని మేము సజ్జను(లైన మా దాసు)లలో చేర్చుకుంటాము.
29:10  وَمِنَ النَّاسِ مَن يَقُولُ آمَنَّا بِاللَّهِ فَإِذَا أُوذِيَ فِي اللَّهِ جَعَلَ فِتْنَةَ النَّاسِ كَعَذَابِ اللَّهِ وَلَئِن جَاءَ نَصْرٌ مِّن رَّبِّكَ لَيَقُولُنَّ إِنَّا كُنَّا مَعَكُمْ ۚ أَوَلَيْسَ اللَّهُ بِأَعْلَمَ بِمَا فِي صُدُورِ الْعَالَمِينَ
జనులలో కొందరు, "మేము అల్లాహ్‌ను విశ్వసించాము" అని (పైకి) మాత్రం చెబుతారు. కాని అల్లాహ్‌ మార్గంలో ఏదైనా బాధ కలిగినప్పుడు, ప్రజల తరఫున పెట్టబడిన బాధను 'దైవ శిక్ష'గా తలపోస్తారు. మరి నీ ప్రభువు తరఫున తోడ్పాటు అందితే మాత్రం, "మేమూ మీతోనే ఉన్నామండీ!" అని అంటారు. లోకవాసుల ఆంతర్యాలలో ఏముందో అల్లాహ్‌కు తెలియదా ఏమిటి?
29:11  وَلَيَعْلَمَنَّ اللَّهُ الَّذِينَ آمَنُوا وَلَيَعْلَمَنَّ الْمُنَافِقِينَ
సిసలైన విశ్వాసులెవరో అల్లాహ్‌ తేల్చుతాడు, ఇంకా కపటులెవరో కూడా ఆయన తప్పకుండా తెలుసుకుంటాడు.
29:12  وَقَالَ الَّذِينَ كَفَرُوا لِلَّذِينَ آمَنُوا اتَّبِعُوا سَبِيلَنَا وَلْنَحْمِلْ خَطَايَاكُمْ وَمَا هُم بِحَامِلِينَ مِنْ خَطَايَاهُم مِّن شَيْءٍ ۖ إِنَّهُمْ لَكَاذِبُونَ
అవిశ్వాసులు విశ్వసించినవారితో, "మీరు మా మార్గాన్ని అనుసరించండి. మీ పాపాలను మేము మోస్తాం" అని అన్నారు. వాస్తవానికి వీళ్ళ పాపాలలో దేన్నీ వారు మోయరు. వారు పచ్చి అబద్ధాలకోరులు.
29:13  وَلَيَحْمِلُنَّ أَثْقَالَهُمْ وَأَثْقَالًا مَّعَ أَثْقَالِهِمْ ۖ وَلَيُسْأَلُنَّ يَوْمَ الْقِيَامَةِ عَمَّا كَانُوا يَفْتَرُونَ
కాకపోతే, వారు తమ (పాపాల) బరువును మాత్రం మోస్తారు. తమ బరువులతో పాటు మరిన్ని బరువులు కూడా మోస్తారు. ఇంకా - వారు కల్పించే అభూత కల్పనలను గురించి ప్రళయ దినాన వారిని తప్పకుండా ప్రశ్నించటం జరుగుతుంది.
29:14  وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِ فَلَبِثَ فِيهِمْ أَلْفَ سَنَةٍ إِلَّا خَمْسِينَ عَامًا فَأَخَذَهُمُ الطُّوفَانُ وَهُمْ ظَالِمُونَ
మేము నూహు (అలైహిస్సలాం)ను అతని జాతి వైపునకు పంపాము. అతను వారిమధ్య యాభై తక్కువ వెయ్యి సంవత్సరాలు ఉన్నాడు. ఆ తరువాత వారిని తుఫాను ముట్టడించింది. (ఎందుకంటే) వారు దుర్మార్గులుగా ఉన్నారు.
29:15  فَأَنجَيْنَاهُ وَأَصْحَابَ السَّفِينَةِ وَجَعَلْنَاهَا آيَةً لِّلْعَالَمِينَ
మరి మేము అతన్ని, ఓడలోని వారినీ కాపాడాము. ఇంకా ఆ సంఘటనను మేము సమస్త లోకవాసులకు (గుణపాఠం గరిపే) సూచనగా చేశాము.
29:16  وَإِبْرَاهِيمَ إِذْ قَالَ لِقَوْمِهِ اعْبُدُوا اللَّهَ وَاتَّقُوهُ ۖ ذَٰلِكُمْ خَيْرٌ لَّكُمْ إِن كُنتُمْ تَعْلَمُونَ
మరి ఇబ్రాహీం (అలైహిస్సలాం) కూడా తన జాతి వారినుద్దేశించి ఇలా అన్నాడు : "అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయనకు భయపడుతూ ఉండండి. మీరు గనక గ్రహించగలిగితే ఇదే మీ కొరకు మేలైనది.
29:17  إِنَّمَا تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ أَوْثَانًا وَتَخْلُقُونَ إِفْكًا ۚ إِنَّ الَّذِينَ تَعْبُدُونَ مِن دُونِ اللَّهِ لَا يَمْلِكُونَ لَكُمْ رِزْقًا فَابْتَغُوا عِندَ اللَّهِ الرِّزْقَ وَاعْبُدُوهُ وَاشْكُرُوا لَهُ ۖ إِلَيْهِ تُرْجَعُونَ
"మీరు అల్లాహ్‌ను వదలి ఈ విగ్రహాలను పూజిస్తున్నారే! మీ అంతట మీరు అసత్యాలను అల్లుతున్నారు. వినండి! అల్లాహ్‌ను కాదని మీరు వేటినయితే పూజిస్తున్నారో, మీకు ఉపాధిని సమకూర్చే అధికారం వాటికి లేదు. కాబట్టి జీవనోపాధి కోసం మీరు దైవసమక్షంలోనే అర్థించండి. ఆయన్ని మాత్రమే ఆరాధించండి, ఆయనకే కృతజ్ఞతలు చెల్లించండి. ఎట్టకేలకు మీరు ఆయన వద్దకే మరలించబడతారు.
29:18  وَإِن تُكَذِّبُوا فَقَدْ كَذَّبَ أُمَمٌ مِّن قَبْلِكُمْ ۖ وَمَا عَلَى الرَّسُولِ إِلَّا الْبَلَاغُ الْمُبِينُ
"ఒకవేళ మీరు ధిక్కరించే పక్షంలో మీకు పూర్వం గతించిన సమాజాలు కూడా ధిక్కరించాయి (అన్న సంగతిని మరువకండి). విషయాన్ని స్పష్టంగా అందజేయటం వరకే ప్రవక్త బాధ్యత."
29:19  أَوَلَمْ يَرَوْا كَيْفَ يُبْدِئُ اللَّهُ الْخَلْقَ ثُمَّ يُعِيدُهُ ۚ إِنَّ ذَٰلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ
అల్లాహ్‌ ఏ విధంగా సృష్టిని మొదలెడుతున్నాడో వారు చూడటం లేదా? మరి ఆయనే దాన్ని పునరావృతం చేస్తాడు. ఇలా చేయటం అల్లాహ్‌కు చాలా తేలిక.
29:20  قُلْ سِيرُوا فِي الْأَرْضِ فَانظُرُوا كَيْفَ بَدَأَ الْخَلْقَ ۚ ثُمَّ اللَّهُ يُنشِئُ النَّشْأَةَ الْآخِرَةَ ۚ إِنَّ اللَّهَ عَلَىٰ كُلِّ شَيْءٍ قَدِيرٌ
వారికి చెప్పు : "భువిలో సంచరించండి. అల్లాహ్‌ ఏ విధంగా సృష్టిని మొదలెట్టాడో కాస్త చూడండి! మరి అల్లాహ్‌యే మలిసారి పునరుజ్జీవనం కూడా ప్రసాదిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్‌ అన్నింటిపై అధికారం గలవాడు."
29:21  يُعَذِّبُ مَن يَشَاءُ وَيَرْحَمُ مَن يَشَاءُ ۖ وَإِلَيْهِ تُقْلَبُونَ
తాను కోరిన వారిని ఆయన శిక్షిస్తాడు, తాను కోరినవారిని కనికరిస్తాడు. అందరూ ఆయన వైపునకే మరలించబడతారు.
29:22  وَمَا أَنتُم بِمُعْجِزِينَ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ ۖ وَمَا لَكُم مِّن دُونِ اللَّهِ مِن وَلِيٍّ وَلَا نَصِيرٍ
మీరు భూమిలోగానీ, ఆకాశంలోగానీ అల్లాహ్‌ను అశక్తుణ్ణి చేయలేరు సుమా! అల్లాహ్‌ తప్ప మీకు మరో సంరక్షకుడు గానీ, సహాయకుడుగానీ లేడు.
29:23  وَالَّذِينَ كَفَرُوا بِآيَاتِ اللَّهِ وَلِقَائِهِ أُولَٰئِكَ يَئِسُوا مِن رَّحْمَتِي وَأُولَٰئِكَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ
ఎవరయితే అల్లాహ్‌ ఆయతులను, ఆయనను కలవటాన్ని త్రోసిపుచ్చుతారో వారే నా కారుణ్యం పట్ల ఆశ వదులుకున్న వారు. వారికోసం బాధాకరమైన శిక్ష ఉంది.
29:24  فَمَا كَانَ جَوَابَ قَوْمِهِ إِلَّا أَن قَالُوا اقْتُلُوهُ أَوْ حَرِّقُوهُ فَأَنجَاهُ اللَّهُ مِنَ النَّارِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّقَوْمٍ يُؤْمِنُونَ
మరి అతని (ఇబ్రాహీము) జాతివారు, "ఇతన్ని చంపేయండి లేదా ఇతన్ని కాల్చేయండి" అని అన్నారు. అంతకుమించి వారి దగ్గర ఏ సమాధానమూ లేకపోయింది. ఎట్టకేలకు అల్లాహ్‌ అతన్ని అగ్ని నుంచి కాపాడాడు. విశ్వసించే జనుల కోసం ఇందులో ఎన్నో సూచనలున్నాయి.
29:25  وَقَالَ إِنَّمَا اتَّخَذْتُم مِّن دُونِ اللَّهِ أَوْثَانًا مَّوَدَّةَ بَيْنِكُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا ۖ ثُمَّ يَوْمَ الْقِيَامَةِ يَكْفُرُ بَعْضُكُم بِبَعْضٍ وَيَلْعَنُ بَعْضُكُم بَعْضًا وَمَأْوَاكُمُ النَّارُ وَمَا لَكُم مِّن نَّاصِرِينَ
(ఇబ్రాహీము వారితో) ఇలా అన్నాడు: "మీరు అల్లాహ్‌ను వదలి విగ్రహాలను ఆశ్రయించారు. మీ పరస్పర ప్రాపంచిక స్నేహసంబంధాల ప్రాతిపదికపైన్నే మీరు (ఇదంతా) కల్పించుకున్నారు. కాని ప్రళయదినాన మీరంతా ఒండొకరిని తిరస్కరిస్తారు. ఒకరినొకరు శపించుకుంటారు. నరకాగ్ని మీ నివాసమవుతుంది. (అక్కడ) మిమ్మల్ని ఆదుకునే వాడెవడూ ఉండడు."
29:26  فَآمَنَ لَهُ لُوطٌ ۘ وَقَالَ إِنِّي مُهَاجِرٌ إِلَىٰ رَبِّي ۖ إِنَّهُ هُوَ الْعَزِيزُ الْحَكِيمُ
అప్పుడు లూతు (అలైహిస్సలాం) మటుకు అతన్ని విశ్వసించాడు. అతనిలా అన్నాడు: "నేను నా స్వస్థలం నుంచి నా ప్రభువు వైపునకు ప్రస్థానం చేస్తాను. ఆయన గొప్ప శక్తిమంతుడు, వివేకవంతుడు."
29:27  وَوَهَبْنَا لَهُ إِسْحَاقَ وَيَعْقُوبَ وَجَعَلْنَا فِي ذُرِّيَّتِهِ النُّبُوَّةَ وَالْكِتَابَ وَآتَيْنَاهُ أَجْرَهُ فِي الدُّنْيَا ۖ وَإِنَّهُ فِي الْآخِرَةِ لَمِنَ الصَّالِحِينَ
మరి మేము అతనికి (ఇబ్రాహీముకు) ఇస్‌హాఖ్‌, యాఖూబు (అలైహిముస్సలాం) లను ప్రసాదించాము. అతని సంతతిలో మేము ప్రవక్త పదవిని, గ్రంథాన్ని ఉంచాము. మరి మేము అతనికి ప్రపంచంలో కూడా అతని మంచి ప్రతిఫలాన్ని వొసగాము. పరలోకంలో కూడా అతడు సజ్జనులతో చేరి ఉంటాడు.
29:28  وَلُوطًا إِذْ قَالَ لِقَوْمِهِ إِنَّكُمْ لَتَأْتُونَ الْفَاحِشَةَ مَا سَبَقَكُم بِهَا مِنْ أَحَدٍ مِّنَ الْعَالَمِينَ
లూత్‌ (అలైహిస్సలాం)ను కూడా జ్ఞప్తికి తెచ్చుకోండి. అతను తన జాతి వారినుద్దేశించి ఇలా అన్నాడు : "మీకు పూర్వం లోకవాసులెవరూ చేయని నీతిమాలిన పనికి మీరు పాల్పడుతున్నారే?!
29:29  أَئِنَّكُمْ لَتَأْتُونَ الرِّجَالَ وَتَقْطَعُونَ السَّبِيلَ وَتَأْتُونَ فِي نَادِيكُمُ الْمُنكَرَ ۖ فَمَا كَانَ جَوَابَ قَوْمِهِ إِلَّا أَن قَالُوا ائْتِنَا بِعَذَابِ اللَّهِ إِن كُنتَ مِنَ الصَّادِقِينَ
"ఏమిటి? మీరు పురుషుల వద్దకు పోయి పాడుపని చేస్తారా? దారిని మూసేస్తారా? మీరు మీ సమావేశాల్లోనే (నిస్సిగ్గుగా) నీతిబాహ్యమైన పనులకు ఒడిగడతారా?" దీనికి సమాధానంగా అతని జాతి వారు, "సరే! నువ్వు సత్యవంతుడవే అయితే మాపైకి దైవశిక్షను తీసుకురా!" అని అనటం తప్ప మరేమీ చెప్పలేకపోయారు.
29:30  قَالَ رَبِّ انصُرْنِي عَلَى الْقَوْمِ الْمُفْسِدِينَ
అప్పుడు లూత్‌, "ప్రభూ! ఈ అల్లరి మూకకు వ్యతిరేకంగా నాకు సహాయపడు" అని అభ్యర్థించాడు.
29:31  وَلَمَّا جَاءَتْ رُسُلُنَا إِبْرَاهِيمَ بِالْبُشْرَىٰ قَالُوا إِنَّا مُهْلِكُو أَهْلِ هَٰذِهِ الْقَرْيَةِ ۖ إِنَّ أَهْلَهَا كَانُوا ظَالِمِينَ
మేము పంపిన దూతలు శుభవార్తను తీసుకుని ఇబ్రాహీము (అలైహిస్సలాం) వద్దకు చేరుకున్నప్పుడు, "ఈ పట్టణ వాసులను మేము నాశనం చేయనున్నాము. నిశ్చయంగా ఇక్కడి వాళ్ళు పరమ దుర్మార్గులుగా తయారయ్యారు" అని చెప్పారు.
29:32  قَالَ إِنَّ فِيهَا لُوطًا ۚ قَالُوا نَحْنُ أَعْلَمُ بِمَن فِيهَا ۖ لَنُنَجِّيَنَّهُ وَأَهْلَهُ إِلَّا امْرَأَتَهُ كَانَتْ مِنَ الْغَابِرِينَ
"కాని అక్కడ లూత్‌ ఉన్నాడు కదా!" అని (ఇబ్రాహీము) సందేహపడ్డాడు. "అక్కడ ఉన్న వారెవరో మాకు బాగా తెలుసు. మేము అతని భార్యను తప్ప- అతన్ని, అతని ఇంటివారిని కాపాడుతాము. ఆ స్త్రీ మాత్రం వెనుక ఉండిపోయే వారితో చేరుతుంది" అని దైవదూతలు చెప్పారు.
29:33  وَلَمَّا أَن جَاءَتْ رُسُلُنَا لُوطًا سِيءَ بِهِمْ وَضَاقَ بِهِمْ ذَرْعًا وَقَالُوا لَا تَخَفْ وَلَا تَحْزَنْ ۖ إِنَّا مُنَجُّوكَ وَأَهْلَكَ إِلَّا امْرَأَتَكَ كَانَتْ مِنَ الْغَابِرِينَ
మరి మా దూతలు లూత్‌ (అలైహిస్సలాం) వద్దకు చేరుకున్నప్పుడు, అతను వారిని చూసి ఆందోళన చెందాడు. లోలోపలే కుమిలిపోయాడు. అప్పుడు వారిలా అన్నారు : "నువ్వు భయపడకు. కలత చెందకు. మేము నీ భార్యను తప్ప - నిన్నూ, నీ పరివారాన్నీ కాపాడుతాము. ఎందుకంటే ఆమె (శిక్షను అనుభవించటానికి) వెనుక ఉండిపోయే వారితో చేరుతుంది."
29:34  إِنَّا مُنزِلُونَ عَلَىٰ أَهْلِ هَٰذِهِ الْقَرْيَةِ رِجْزًا مِّنَ السَّمَاءِ بِمَا كَانُوا يَفْسُقُونَ
"మేము ఈ పట్టణవాసులపై, వారి తిరుగుబాటు ధోరణి కారణంగా ఆకాశం నుంచి శిక్షను అవతరింపజేయనున్నాము."
29:35  وَلَقَد تَّرَكْنَا مِنْهَا آيَةً بَيِّنَةً لِّقَوْمٍ يَعْقِلُونَ
(ఆ విధంగా) మేము ఆ పట్టణాన్ని బుద్ధిజీవుల కోసం స్పష్టమైన గుణపాఠ సూచనగా చేశాము.
29:36  وَإِلَىٰ مَدْيَنَ أَخَاهُمْ شُعَيْبًا فَقَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ وَارْجُوا الْيَوْمَ الْآخِرَ وَلَا تَعْثَوْا فِي الْأَرْضِ مُفْسِدِينَ
ఇంకా మద్‌యన్‌ వైపునకు మేము వారి సోదరుడైన షుఐబు (అలైహిస్సలాం)ను పంపాము. అతనిలా అన్నాడు: "ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్‌ను ఆరాధించండి. అంతిమ దినాన్ని ఆశించండి. భువిలో అలజడిని సృష్టిస్తూ తిరగకండి."
29:37  فَكَذَّبُوهُ فَأَخَذَتْهُمُ الرَّجْفَةُ فَأَصْبَحُوا فِي دَارِهِمْ جَاثِمِينَ
అయినా వారు ఆయన్ని ధిక్కరించారు. ఎట్టకేలకు భూకంపం వారిని కబళించింది. వాళ్లు తమ ఇండ్లలో- కూర్చున్న వారు కూర్చున్నట్లే (చచ్చి) ఉండిపోయారు.
29:38  وَعَادًا وَثَمُودَ وَقَد تَّبَيَّنَ لَكُم مِّن مَّسَاكِنِهِمْ ۖ وَزَيَّنَ لَهُمُ الشَّيْطَانُ أَعْمَالَهُمْ فَصَدَّهُمْ عَنِ السَّبِيلِ وَكَانُوا مُسْتَبْصِرِينَ
ఆద్‌, సమూద్‌ వారిని కూడా మేము తుదముట్టించాము. వారి నివాస స్థలాల గురించి మీకు తెలిసిందే. షైతాను వారికి వారి దురాగతాలను అందమైనవిగా చేసి చూపాడు. వారు నిశిత దృష్టి గల వారైనప్పటికీ (షైతాను) వారిని సన్మార్గం నుంచి అడ్డుకున్నాడు.
29:39  وَقَارُونَ وَفِرْعَوْنَ وَهَامَانَ ۖ وَلَقَدْ جَاءَهُم مُّوسَىٰ بِالْبَيِّنَاتِ فَاسْتَكْبَرُوا فِي الْأَرْضِ وَمَا كَانُوا سَابِقِينَ
ఖారూన్‌, ఫిరౌన్‌, హామానులను కూడా (మేము నాశనం చేశాము). వారి వద్దకు మూసా స్పష్టమైన సూచనలను తీసుకువచ్చాడు. అయినాసరే వారు భువిలో అహంకారంతో విర్రవీగారు. కాని (ఎంత విర్రవీగినా) మమ్మల్ని మించిపోలేకపోయారు.
29:40  فَكُلًّا أَخَذْنَا بِذَنبِهِ ۖ فَمِنْهُم مَّنْ أَرْسَلْنَا عَلَيْهِ حَاصِبًا وَمِنْهُم مَّنْ أَخَذَتْهُ الصَّيْحَةُ وَمِنْهُم مَّنْ خَسَفْنَا بِهِ الْأَرْضَ وَمِنْهُم مَّنْ أَغْرَقْنَا ۚ وَمَا كَانَ اللَّهُ لِيَظْلِمَهُمْ وَلَٰكِن كَانُوا أَنفُسَهُمْ يَظْلِمُونَ
మరి వారిలో ప్రతి ఒక్కడినీ మేము అతని పాపాలకుగాను పట్టుకున్నాము. వారిలో కొందరిపై మేము రాళ్ళ వాన కురిపించాము. వారిలో మరి కొందరిని భయంకరమైన శబ్దం ద్వారా మట్టు పెట్టాము. వారిలో ఇంకా కొందరిని మేము భూమిలో కూర్చివేశాము. వారిలో కొందరిని మేము ముంపుకు గురిచేశాము. (అకారణంగా) అల్లాహ్‌ వారికి అన్యాయం చేసేవాడు కాడు. (నిజానికి) వాళ్ళే తమకు తాము అన్యాయం చేసుకున్నారు.
29:41  مَثَلُ الَّذِينَ اتَّخَذُوا مِن دُونِ اللَّهِ أَوْلِيَاءَ كَمَثَلِ الْعَنكَبُوتِ اتَّخَذَتْ بَيْتًا ۖ وَإِنَّ أَوْهَنَ الْبُيُوتِ لَبَيْتُ الْعَنكَبُوتِ ۖ لَوْ كَانُوا يَعْلَمُونَ
అల్లాహ్‌ను వదలి ఇతరులను సంరక్షకులుగా చేసుకున్న వారి ఉదాహరణ సాలెపురుగు లాంటిది. అది (సాలెపురుగు) కూడా తన కోసం ఓ ఇల్లు కట్టుకుంటుంది. మరి వాస్తవానికి ఇండ్లన్నింటికంటే అత్యంత బలహీనమైనది సాలె పురుగు ఇల్లే. ఈ సంగతిని వారు తెలుసుకోగలిగితే ఎంత బావుండు!
29:42  إِنَّ اللَّهَ يَعْلَمُ مَا يَدْعُونَ مِن دُونِهِ مِن شَيْءٍ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
వారు ఆయన్ని కాదని ఎవరెవరిని పిలుస్తున్నారో వాటిని గురించి అల్లాహ్‌కు బాగా తెలుసు. ఆయన అపార శక్తిమంతుడు, వివేచనాపరుడు.
29:43  وَتِلْكَ الْأَمْثَالُ نَضْرِبُهَا لِلنَّاسِ ۖ وَمَا يَعْقِلُهَا إِلَّا الْعَالِمُونَ
ప్రజలకు బోధపరచడానికి మేము ఈ ఉపమానాలను ఇస్తున్నాము. అయితే జ్ఞానం కలవారు మాత్రమే వీటిని అర్థం చేసుకోగలుగుతారు.
29:44  خَلَقَ اللَّهُ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَةً لِّلْمُؤْمِنِينَ
అల్లాహ్‌ ఆకాశాలనూ, భూమినీ సత్య బద్ధంగా (పరమార్ధం దృష్ట్యా) సృష్టించాడు. విశ్వసించే వారి కోసం ఇందులో గొప్ప నిదర్శనం ఉంది.
29:45  اتْلُ مَا أُوحِيَ إِلَيْكَ مِنَ الْكِتَابِ وَأَقِمِ الصَّلَاةَ ۖ إِنَّ الصَّلَاةَ تَنْهَىٰ عَنِ الْفَحْشَاءِ وَالْمُنكَرِ ۗ وَلَذِكْرُ اللَّهِ أَكْبَرُ ۗ وَاللَّهُ يَعْلَمُ مَا تَصْنَعُونَ
(ఓ ప్రవక్తా!) నీ వైపుకు పంపబడిన (వహీ చేయబడిన) గ్రంథాన్ని పారాయణం చేస్తూ ఉండు. నమాజును నెలకొల్పు. నిశ్చయంగా నమాజ్‌ సిగ్గుమాలినతనం నుంచి, చెడు విషయాల నుంచి ఆపుతుంది. నిశ్చయంగా అల్లాహ్‌ స్మరణ చాలా గొప్ప విషయం (అన్న సంగతిని మరువరాదు). మీరు చేసేదంతా అల్లాహ్‌కు తెలుసు.
29:46  وَلَا تُجَادِلُوا أَهْلَ الْكِتَابِ إِلَّا بِالَّتِي هِيَ أَحْسَنُ إِلَّا الَّذِينَ ظَلَمُوا مِنْهُمْ ۖ وَقُولُوا آمَنَّا بِالَّذِي أُنزِلَ إِلَيْنَا وَأُنزِلَ إِلَيْكُمْ وَإِلَٰهُنَا وَإِلَٰهُكُمْ وَاحِدٌ وَنَحْنُ لَهُ مُسْلِمُونَ
ఉత్తమ పద్ధతిలో తప్ప గ్రంథవహులతో వాదించకండి. అయితే వారిలోని దుర్మార్గులతో (వాదులాడటం సమంజసమే). "మేము మా వద్దకు పంపబడిన గ్రంథాన్నీ, మీ వద్దకు పంపబడిన గ్రంథాన్ని కూడా విశ్వసిస్తున్నాం. మా ఆరాధ్య దేవుడూ, మీ ఆరాధ్య దేవుడూ ఒక్కడే. మేము ఆయన ఆజ్ఞలకే కట్టుబడి ఉన్నాము" అని స్పష్టంగా చెప్పేయండి.
29:47  وَكَذَٰلِكَ أَنزَلْنَا إِلَيْكَ الْكِتَابَ ۚ فَالَّذِينَ آتَيْنَاهُمُ الْكِتَابَ يُؤْمِنُونَ بِهِ ۖ وَمِنْ هَٰؤُلَاءِ مَن يُؤْمِنُ بِهِ ۚ وَمَا يَجْحَدُ بِآيَاتِنَا إِلَّا الْكَافِرُونَ
మరి ఇదే విధంగా మేము నీ వైపునకు మా గ్రంథాన్ని అవతరింపజేశాము. అందువల్ల (పూర్వం) మేము గ్రంథం వొసగబడిన వారు దీనిని విశ్వసిస్తారు. వీరిలో (మక్కా ముష్రిక్కులలో) కూడా కొందరు దీనిని విశ్వసిస్తారు. అవిశ్వాసులు మాత్రమే మా ఆయతులను త్రోసి పుచ్చుతారు.
29:48  وَمَا كُنتَ تَتْلُو مِن قَبْلِهِ مِن كِتَابٍ وَلَا تَخُطُّهُ بِيَمِينِكَ ۖ إِذًا لَّارْتَابَ الْمُبْطِلُونَ
(ఓ ప్రవక్తా!) ఇంతకు ముందు నువ్వు ఏ గ్రంథాన్నీ చదివిన వాడవు కావు, ఏ గ్రంథాన్నీ నీ కుడిచేత్తో వ్రాసిన వాడవూ కావు. ఒకవేళ అదేగనక జరిగివుంటే ఈ మిథ్యావాదులు (నీ విషయంలో) సందేహానికి లోనయ్యేవారే.
29:49  بَلْ هُوَ آيَاتٌ بَيِّنَاتٌ فِي صُدُورِ الَّذِينَ أُوتُوا الْعِلْمَ ۚ وَمَا يَجْحَدُ بِآيَاتِنَا إِلَّا الظَّالِمُونَ
అసలు ఇవి (ఈ ఖుర్‌ఆన్‌ వచనాలు) జ్ఞానం వొసగబడిన వారి హృదయాలలో (పదిలమై) ఉన్న స్పష్టమైన ఆయతులు. మా ఆయతులను దుర్మార్గులు తప్ప మరెవరూ త్రోసిపుచ్చరు.
29:50  وَقَالُوا لَوْلَا أُنزِلَ عَلَيْهِ آيَاتٌ مِّن رَّبِّهِ ۖ قُلْ إِنَّمَا الْآيَاتُ عِندَ اللَّهِ وَإِنَّمَا أَنَا نَذِيرٌ مُّبِينٌ
"ఇతని ప్రభువు తరఫున ఇతనిపై కొన్ని నిదర్శనాలు (మహిమలు) ఎందుకు అవతరింపజేయబడలేదు?" అని వారు అన్నారు. "నిదర్శనాలన్నీ అల్లాహ్‌ వద్ద ఉన్నాయి. నేను స్పష్టంగా హెచ్చరించే వాణ్ణి మాత్రమే" అని వారికి చెప్పు.
29:51  أَوَلَمْ يَكْفِهِمْ أَنَّا أَنزَلْنَا عَلَيْكَ الْكِتَابَ يُتْلَىٰ عَلَيْهِمْ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَرَحْمَةً وَذِكْرَىٰ لِقَوْمٍ يُؤْمِنُونَ
మేము నీపై గ్రంథాన్ని అవతరింపజేశాము. అది వారికి చదివి వినిపించబడుతోంది. విశ్వసించేవారి కొరకు ఇందులో కారుణ్యమూ ఉంది, హితబోధ కూడా ఉంది. ఏమిటి? ఇది వారికి సరిపోదా?
29:52  قُلْ كَفَىٰ بِاللَّهِ بَيْنِي وَبَيْنَكُمْ شَهِيدًا ۖ يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَالْأَرْضِ ۗ وَالَّذِينَ آمَنُوا بِالْبَاطِلِ وَكَفَرُوا بِاللَّهِ أُولَٰئِكَ هُمُ الْخَاسِرُونَ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : "మీకూ - నాకూ మధ్య సాక్షిగా అల్లాహ్‌ చాలు. భూమ్యాకాశాలలో వున్న ప్రతిదీ ఆయనకు తెలుసు. అసత్యాన్ని నమ్మి, అల్లాహ్‌ను తిరస్కరించినవారే తీవ్రంగా నష్టపోయేవారు."
29:53  وَيَسْتَعْجِلُونَكَ بِالْعَذَابِ ۚ وَلَوْلَا أَجَلٌ مُّسَمًّى لَّجَاءَهُمُ الْعَذَابُ وَلَيَأْتِيَنَّهُم بَغْتَةً وَهُمْ لَا يَشْعُرُونَ
వాళ్లు శిక్ష కోసం నిన్ను తొందరపెడుతున్నారు. (నా తరఫునే గనక) ఒక సమయం నిర్ధారించబడకుండా ఉన్నట్లయితే ఈ పాటికి శిక్ష వీళ్ళ వద్దకు వచ్చి ఉండేదే. వారికి తెలియని స్థితిలో అది వారిపై అమాంతం వచ్చిపడటం ఖాయం.
29:54  يَسْتَعْجِلُونَكَ بِالْعَذَابِ وَإِنَّ جَهَنَّمَ لَمُحِيطَةٌ بِالْكَافِرِينَ
వారు శిక్ష కోసం హడావిడి చేస్తున్నారు కదూ! ఎట్టి పరిస్థితిలోనూ నరకం అవిశ్వాసులను ముట్టడించనున్నది.
29:55  يَوْمَ يَغْشَاهُمُ الْعَذَابُ مِن فَوْقِهِمْ وَمِن تَحْتِ أَرْجُلِهِمْ وَيَقُولُ ذُوقُوا مَا كُنتُمْ تَعْمَلُونَ
ఆ రోజు శిక్ష వారి పైనుంచి, వారి పాదాల క్రింద నుంచి వారిని ఆక్రమించుకుంటూ ఉంటుంది. అప్పుడు (అల్లాహ్‌) వారితో "మీరు చేసుకున్న కర్మల రుచి చూడండి" అని అంటాడు.
29:56  يَا عِبَادِيَ الَّذِينَ آمَنُوا إِنَّ أَرْضِي وَاسِعَةٌ فَإِيَّايَ فَاعْبُدُونِ
విశ్వసించిన ఓ నా దాసులారా! నా భూమి ఎంతో విశాలమైనది. కనుక మీరు నన్నే ఆరాధించండి.
29:57  كُلُّ نَفْسٍ ذَائِقَةُ الْمَوْتِ ۖ ثُمَّ إِلَيْنَا تُرْجَعُونَ
ప్రతి ప్రాణీ మరణం రుచి చూడవలసిందే. మరి మీరంతా నా వైపునకే మరలించబడతారు.
29:58  وَالَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ لَنُبَوِّئَنَّهُم مِّنَ الْجَنَّةِ غُرَفًا تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ نِعْمَ أَجْرُ الْعَامِلِينَ
ఎవరు విశ్వసించి మంచి పనులు చేశారో వారికి మేము స్వర్గంలోని ఎత్తయిన మేడలలో చోటు కల్పిస్తాము. వాటి క్రింద కాలువలు ప్రవహిస్తూ ఉంటాయి. వారక్కడ శాశ్వతంగా ఉంటారు. సదాచరణ చేసిన వారికి లభించిన ఈ ప్రతిఫలం ఎంత మంచిది!
29:59  الَّذِينَ صَبَرُوا وَعَلَىٰ رَبِّهِمْ يَتَوَكَّلُونَ
వారు సహనం వహించినవారు, తమ ప్రభువునే నమ్ముకున్నవారు.
29:60  وَكَأَيِّن مِّن دَابَّةٍ لَّا تَحْمِلُ رِزْقَهَا اللَّهُ يَرْزُقُهَا وَإِيَّاكُمْ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ
ఎన్నో జంతువులు తమ ఆహారాన్ని మోసుకుంటూ తిరగవు. వాటికీ, మీకు కూడా అల్లాహ్‌యే ఉపాధిని ఇస్తున్నాడు. ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
29:61  وَلَئِن سَأَلْتَهُم مَّنْ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ لَيَقُولُنَّ اللَّهُ ۖ فَأَنَّىٰ يُؤْفَكُونَ
భూమ్యాకాశాలను సృష్టించినవాడెవడు? సూర్యచంద్రులను పనిలో నిమగ్నుల్ని చేసినవాడెవడు? అని నువ్వు వారిని అడిగితే 'అల్లాహ్‌యే' అని వారు చెబుతారు. మరలాంటప్పుడు వారు (సత్యం నుంచి) ఎలా తిరిగిపోతున్నారు?
29:62  اللَّهُ يَبْسُطُ الرِّزْقَ لِمَن يَشَاءُ مِنْ عِبَادِهِ وَيَقْدِرُ لَهُ ۚ إِنَّ اللَّهَ بِكُلِّ شَيْءٍ عَلِيمٌ
అల్లాహ్‌ తన దాసులలో తాను తలచిన వారికి విస్తృతంగా ఉపాధిని ఇస్తాడు. తాను తలచిన వారికి పరిమితంగా ఇస్తాడు. నిశ్చయంగా అల్లాహ్‌ ప్రతిదీ తెలిసినవాడు.
29:63  وَلَئِن سَأَلْتَهُم مَّن نَّزَّلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَحْيَا بِهِ الْأَرْضَ مِن بَعْدِ مَوْتِهَا لَيَقُولُنَّ اللَّهُ ۚ قُلِ الْحَمْدُ لِلَّهِ ۚ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْقِلُونَ
ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి, తద్వారా భూమిని, అది చచ్చిన తరువాత బ్రతికించినదెవరు? అని నువ్వు వారిని ప్రశ్నించినట్లయితే 'అల్లాహ్‌యే' అని వారి నుంచి సమాధానం వస్తుంది. సకల స్తోత్రాలు అల్లాహ్‌కే శోభిస్తాయి అని నువ్వు చెప్పు. కాని వారిలో అనేకులు ఇంగిత జ్ఞానం లేనివారు.
29:64  وَمَا هَٰذِهِ الْحَيَاةُ الدُّنْيَا إِلَّا لَهْوٌ وَلَعِبٌ ۚ وَإِنَّ الدَّارَ الْآخِرَةَ لَهِيَ الْحَيَوَانُ ۚ لَوْ كَانُوا يَعْلَمُونَ
ఈ ప్రాపంచిక జీవితం కేవలం ఒక సయ్యాట, వినోదం తప్ప మరేమీ కాదు. అయితే పరలోక నిలయపు జీవితమే అసలు సిసలైన జీవితం. ఈ విషయాన్ని వీళ్ళు తెలుసుకోగలిగితే ఎంత బావుండు!
29:65  فَإِذَا رَكِبُوا فِي الْفُلْكِ دَعَوُا اللَّهَ مُخْلِصِينَ لَهُ الدِّينَ فَلَمَّا نَجَّاهُمْ إِلَى الْبَرِّ إِذَا هُمْ يُشْرِكُونَ
మరి వారు ఓడలో ప్రయాణమైనప్పుడు, తమ ఆరాధనను అల్లాహ్‌కే ప్రత్యేకించుకుని - కేవలం ఆయన్నే మొరపెట్టుకుంటారు. తరువాత ఆయన వారిని సురక్షితంగా తీరానికి చేర్చగానే, అప్పటికప్పుడే వారు దైవానికి సహవర్తుల్ని కల్పించటం మొదలెడతారు.
29:66  لِيَكْفُرُوا بِمَا آتَيْنَاهُمْ وَلِيَتَمَتَّعُوا ۖ فَسَوْفَ يَعْلَمُونَ
మా అనుగ్రహాల పట్ల తిరస్కార వైఖరిని అవలంబిస్తూ, సుఖసౌఖ్యాలను జుర్రుకోవటానికి (వారిలా ప్రవర్తిస్తున్నారు). మరి వారు అతి త్వరలోనే (దీని పర్యవసానం) తెలుసుకుంటారు.
29:67  أَوَلَمْ يَرَوْا أَنَّا جَعَلْنَا حَرَمًا آمِنًا وَيُتَخَطَّفُ النَّاسُ مِنْ حَوْلِهِمْ ۚ أَفَبِالْبَاطِلِ يُؤْمِنُونَ وَبِنِعْمَةِ اللَّهِ يَكْفُرُونَ
ఏమిటీ, మేము హరమ్‌ను (మక్కా పుణ్యక్షేత్రాన్ని) సురక్షితమైన క్షేత్రంగా చేయటాన్ని వారు చూడటం లేదా? మరి (చూడబోతే) వారి చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు ఎగరేసుకుపోబడుతున్నారు. ఏమిటీ, (ఇప్పటికీ) వారు అసత్యాన్నే నమ్మి, దైవానుగ్రహాల పట్ల తిరస్కార వైఖరిని అవలంబిస్తారా?
29:68  وَمَنْ أَظْلَمُ مِمَّنِ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا أَوْ كَذَّبَ بِالْحَقِّ لَمَّا جَاءَهُ ۚ أَلَيْسَ فِي جَهَنَّمَ مَثْوًى لِّلْكَافِرِينَ
అల్లాహ్‌కు అబద్ధాన్ని అంటగట్టేవానికన్నా లేదా తన వద్దకు సత్యం వచ్చినప్పుడు దాన్ని ధిక్కరించేవానికన్నా పరమ దుర్మార్గుడెవడుంటాడు? ఏమిటీ, అటువంటి తిరస్కారుల నివాస స్థలం నరకంలో ఉండదా?!
29:69  وَالَّذِينَ جَاهَدُوا فِينَا لَنَهْدِيَنَّهُمْ سُبُلَنَا ۚ وَإِنَّ اللَّهَ لَمَعَ الْمُحْسِنِينَ
ఎవరయితే మా మార్గంలో బాధలు భరిస్తారో, వారికి మేము తప్పకుండా మా 'మార్గాలు' చూపుతాము. నిశ్చయంగా అల్లాహ్‌ సద్వర్తనులకు తోడుగా ఉంటాడు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.