aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

23. సూరా అల్ మూ ‘మినూన్

23:1  قَدْ أَفْلَحَ الْمُؤْمِنُونَ
నిశ్చయంగా విశ్వాసులు సాఫల్యం పొందారు.
23:2  الَّذِينَ هُمْ فِي صَلَاتِهِمْ خَاشِعُونَ
వారు ఎలాంటివారంటే తమ నమాజులో వారు అణకువ కలిగి ఉంటారు.
23:3  وَالَّذِينَ هُمْ عَنِ اللَّغْوِ مُعْرِضُونَ
వారు పనికిమాలిన వాటిని పట్టించుకోరు
23:4  وَالَّذِينَ هُمْ لِلزَّكَاةِ فَاعِلُونَ
వారు (తమపై విధించబడిన) జకాతు విధానాన్ని పాటిస్తారు.
23:5  وَالَّذِينَ هُمْ لِفُرُوجِهِمْ حَافِظُونَ
వారు తమ మర్మస్థానాలను కాపాడుకుంటారు.
23:6  إِلَّا عَلَىٰ أَزْوَاجِهِمْ أَوْ مَا مَلَكَتْ أَيْمَانُهُمْ فَإِنَّهُمْ غَيْرُ مَلُومِينَ
అయితే తమ భార్యల, (షరీయతు ప్రకారం) తమ యాజమాన్యంలోకి వచ్చిన బానిసరాళ్ళ విషయంలో మటుకు వారిపై ఎలాంటి నింద లేదు.
23:7  فَمَنِ ابْتَغَىٰ وَرَاءَ ذَٰلِكَ فَأُولَٰئِكَ هُمُ الْعَادُونَ
కాని ఎవరయినా దీనికి మించి మరేదైనా కోరితే వారు హద్దు మీరిన వారవుతారు.
23:8  وَالَّذِينَ هُمْ لِأَمَانَاتِهِمْ وَعَهْدِهِمْ رَاعُونَ
వారు తమ అప్పగింతల, వాగ్దానాల పట్ల కడు అప్రమత్తంగా ఉంటారు.
23:9  وَالَّذِينَ هُمْ عَلَىٰ صَلَوَاتِهِمْ يُحَافِظُونَ
వారు తమ నమాజులను పరిరక్షిస్తూ ఉంటారు.
23:10  أُولَٰئِكَ هُمُ الْوَارِثُونَ
ఇలాంటి వారే వారసులు.
23:11  الَّذِينَ يَرِثُونَ الْفِرْدَوْسَ هُمْ فِيهَا خَالِدُونَ
(స్వర్గంలోని) ఫిర్‌దౌసు ప్రదేశానికి వారు వారసులవుతారు. వారక్కడ కలకాలం ఉంటారు.
23:12  وَلَقَدْ خَلَقْنَا الْإِنسَانَ مِن سُلَالَةٍ مِّن طِينٍ
నిశ్చయంగా మేము మనిషి (ఆదం)ని మట్టిసారముతో సృజించాము.
23:13  ثُمَّ جَعَلْنَاهُ نُطْفَةً فِي قَرَارٍ مَّكِينٍ
తరువాత అతన్ని వీర్య బిందువుగా చేసి ఓ సురక్షిత చోటులో నిలిపి ఉంచాము.
23:14  ثُمَّ خَلَقْنَا النُّطْفَةَ عَلَقَةً فَخَلَقْنَا الْعَلَقَةَ مُضْغَةً فَخَلَقْنَا الْمُضْغَةَ عِظَامًا فَكَسَوْنَا الْعِظَامَ لَحْمًا ثُمَّ أَنشَأْنَاهُ خَلْقًا آخَرَ ۚ فَتَبَارَكَ اللَّهُ أَحْسَنُ الْخَالِقِينَ
మరి ఆ వీర్య బిందువును ఘనీభవించిన రక్తంగా చేశాము. మరి ఆ రక్తపు ముద్దను మాంసపు పిండంగా మార్చాము. దరిమిలా ఆ పిండాన్ని ఎముకలుగా చేశాము. పిదప ఆ ఎముకలకు మాంసం తొడిగించాము. అటుపిమ్మట దాన్ని భిన్నమైన సృష్టిగా ప్రభవింపజేశాము. అందరికన్నా ఉత్తమ సృష్టికర్త అయిన అల్లాహ్‌ శుభకరుడు.
23:15  ثُمَّ إِنَّكُم بَعْدَ ذَٰلِكَ لَمَيِّتُونَ
మరి ఆ తరువాత మీరంతా తప్పకుండా మరణిస్తారు.
23:16  ثُمَّ إِنَّكُمْ يَوْمَ الْقِيَامَةِ تُبْعَثُونَ
మరి ప్రళయ దినాన మీరంతా నిశ్చయంగా లేపబడతారు.
23:17  وَلَقَدْ خَلَقْنَا فَوْقَكُمْ سَبْعَ طَرَائِقَ وَمَا كُنَّا عَنِ الْخَلْقِ غَافِلِينَ
మేము మీపై సప్తాకాశాలను నిర్మించాము. మేము సృష్టి విషయంలో అజాగ్రత్తగా లేము.
23:18  وَأَنزَلْنَا مِنَ السَّمَاءِ مَاءً بِقَدَرٍ فَأَسْكَنَّاهُ فِي الْأَرْضِ ۖ وَإِنَّا عَلَىٰ ذَهَابٍ بِهِ لَقَادِرُونَ
మేము తగు మోతాదులో ఆకాశం నుంచి వర్షపు నీరును కురిపిస్తున్నాము. మరి దానిని భూమిలో నిలువచేస్తున్నాము. మేము దాన్ని తిరిగి తీసేసుకోగలము కూడా.
23:19  فَأَنشَأْنَا لَكُم بِهِ جَنَّاتٍ مِّن نَّخِيلٍ وَأَعْنَابٍ لَّكُمْ فِيهَا فَوَاكِهُ كَثِيرَةٌ وَمِنْهَا تَأْكُلُونَ
మరి ఆ నీటి ద్వారా మేము మీకోసం ఖర్జూరపు తోటలను, ద్రాక్షతోటలను ఉత్పన్నం చేశాము. మీ కొరకు వాటిలో ఎన్నో పండ్లు ఫలాలు ఉన్నాయి. వాటిని మీరు ఆరగిస్తారు కూడా.
23:20  وَشَجَرَةً تَخْرُجُ مِن طُورِ سَيْنَاءَ تَنبُتُ بِالدُّهْنِ وَصِبْغٍ لِّلْآكِلِينَ
ఇంకా - సినాయ్‌ పర్వత ప్రాంతంలో మొలకెత్తే వృక్షాన్ని కూడా మీకు సమకూర్చాము. అది నూనెను ఇస్తుంది. తినేవారి కోసం కూరగా కూడా ఉపయోగపడుతుంది.
23:21  وَإِنَّ لَكُمْ فِي الْأَنْعَامِ لَعِبْرَةً ۖ نُّسْقِيكُم مِّمَّا فِي بُطُونِهَا وَلَكُمْ فِيهَا مَنَافِعُ كَثِيرَةٌ وَمِنْهَا تَأْكُلُونَ
మీకు పశువుల్లో కూడా పెద్ద గుణపాఠం ఉంది. వాటి కడుపులలో నుంచి మేము మీకు ఒక పదార్థాన్ని (పాలను) త్రాపుతున్నాము. ఇంకా, వాటిలో మీకు ఇతరత్రా ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆ పశువుల్లో కొన్నింటిని మీరు తింటున్నారు కూడాను.
23:22  وَعَلَيْهَا وَعَلَى الْفُلْكِ تُحْمَلُونَ
మీరు వాటిపైనా, ఓడలపైనా ఎక్కి పోతుంటారు.
23:23  وَلَقَدْ أَرْسَلْنَا نُوحًا إِلَىٰ قَوْمِهِ فَقَالَ يَا قَوْمِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ ۖ أَفَلَا تَتَّقُونَ
మేము నూహు (అలైహిస్సలాం)ను అతని జాతి వారి వద్దకు ప్రవక్తగా చేసి పంపాము. అతను, "ఓ నా జాతి ప్రజలారా! అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యుడు లేడు. మరి మీరు (ఆయనకు) భయపడరా?" అని అన్నాడు.
23:24  فَقَالَ الْمَلَأُ الَّذِينَ كَفَرُوا مِن قَوْمِهِ مَا هَٰذَا إِلَّا بَشَرٌ مِّثْلُكُمْ يُرِيدُ أَن يَتَفَضَّلَ عَلَيْكُمْ وَلَوْ شَاءَ اللَّهُ لَأَنزَلَ مَلَائِكَةً مَّا سَمِعْنَا بِهَٰذَا فِي آبَائِنَا الْأَوَّلِينَ
దానికి అవిశ్వాసులైన అతని జాతి సర్దారులు ఇలా అన్నారు: "ఇతను కూడా మీలాంటి ఒక మానవమాత్రుడే. అయితే ఇతను మీపై పెద్దరికాన్ని కోరుకుంటున్నాడు. దేవుడే గనక తలిస్తే (తన ప్రవక్తగా) ఏ దైవదూతనో పంపి ఉండేవాడు. ఇతను చెప్పే దానిని మేము ఇదివరకెన్నడూ, మా తాత ముత్తాతల కాలంలో వినలేదు.
23:25  إِنْ هُوَ إِلَّا رَجُلٌ بِهِ جِنَّةٌ فَتَرَبَّصُوا بِهِ حَتَّىٰ حِينٍ
"నిజంగానే ఇతనికి పిచ్చిపట్టినట్లుంది. కాబట్టి ఇతని విషయంలో మరి కొంత కాలం వేచి ఉండండి."
23:26  قَالَ رَبِّ انصُرْنِي بِمَا كَذَّبُونِ
"ఓ ప్రభూ! వీళ్ల ధిక్కార వైఖరికి ప్రతిగా నాకు సహాయం చెయ్యి" అని నూహ్‌ అర్థించాడు.
23:27  فَأَوْحَيْنَا إِلَيْهِ أَنِ اصْنَعِ الْفُلْكَ بِأَعْيُنِنَا وَوَحْيِنَا فَإِذَا جَاءَ أَمْرُنَا وَفَارَ التَّنُّورُ ۙ فَاسْلُكْ فِيهَا مِن كُلٍّ زَوْجَيْنِ اثْنَيْنِ وَأَهْلَكَ إِلَّا مَن سَبَقَ عَلَيْهِ الْقَوْلُ مِنْهُمْ ۖ وَلَا تُخَاطِبْنِي فِي الَّذِينَ ظَلَمُوا ۖ إِنَّهُم مُّغْرَقُونَ
అప్పుడు మేమతనికి ఈ సందేశం పంపాము: "మా కళ్ల ఎదుటే, మేము పంపే సందేశాన్ని (వహీని) అనుసరించి ఒక ఓడను నిర్మించు. మా ఆజ్ఞ వచ్చి, నేలలో నీటి ఊటలు పెల్లుబికినపుడు అన్ని రకాలకు చెందిన ఒక్కొక్క జతను (ఒక ఆడ, ఒక మగ చొప్పున) అందులోకి ఎక్కించుకో. నీ ఇంటి వారిని కూడా తీసుకో. అయితే వారిలో ఎవరి గురించి ముందుగానే మా మాట ఖరారయిందో వారిని వెంట బెట్టుకోకు. జాగ్రత్త! అన్యాయానికి ఒడిగట్టినవారి గురించి నాతో మాట్లాడవద్దు. వారంతా ముంపుకు గురయ్యేవారే.
23:28  فَإِذَا اسْتَوَيْتَ أَنتَ وَمَن مَّعَكَ عَلَى الْفُلْكِ فَقُلِ الْحَمْدُ لِلَّهِ الَّذِي نَجَّانَا مِنَ الْقَوْمِ الظَّالِمِينَ
మరి నువ్వూ, నీ వెంటవచ్చిన వారూ ఓడలో పయన మయ్యాక, "దుర్మార్గుల బారి నుంచి మమ్మల్ని రక్షించిన అల్లాహ్‌కు కృతజ్ఞతలు" అని పలుకు.
23:29  وَقُل رَّبِّ أَنزِلْنِي مُنزَلًا مُّبَارَكًا وَأَنتَ خَيْرُ الْمُنزِلِينَ
ఇంకా ఈ విధంగా వేడుకో: "నా ప్రభూ! నన్ను శుభప్రదమైన చోట దించు. నీవు ఎంతో సురక్షితంగా (క్షేమంగా) దించేవాడవు."
23:30  إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ وَإِن كُنَّا لَمُبْتَلِينَ
నిశ్చయంగా ఇందులో గొప్ప సూచనలున్నాయి. మేము తప్పక పరీక్షిస్తాము.
23:31  ثُمَّ أَنشَأْنَا مِن بَعْدِهِمْ قَرْنًا آخَرِينَ
వారి తరువాత మేము మరో తరాన్ని ప్రభవింపజేశాము.
23:32  فَأَرْسَلْنَا فِيهِمْ رَسُولًا مِّنْهُمْ أَنِ اعْبُدُوا اللَّهَ مَا لَكُم مِّنْ إِلَٰهٍ غَيْرُهُ ۖ أَفَلَا تَتَّقُونَ
మరి వారివద్దకు వారి జాతికే చెందిన ప్రవక్తను పంపాము. (అతనిలా పిలుపు ఇచ్చాడు:) "మీరంతా అల్లాహ్‌ను ఆరాధించండి. ఆయన తప్ప మీకు మరో ఆరాధ్యుడు లేడు. మీరెందుకు భయపడరు?"
23:33  وَقَالَ الْمَلَأُ مِن قَوْمِهِ الَّذِينَ كَفَرُوا وَكَذَّبُوا بِلِقَاءِ الْآخِرَةِ وَأَتْرَفْنَاهُمْ فِي الْحَيَاةِ الدُّنْيَا مَا هَٰذَا إِلَّا بَشَرٌ مِّثْلُكُمْ يَأْكُلُ مِمَّا تَأْكُلُونَ مِنْهُ وَيَشْرَبُ مِمَّا تَشْرَبُونَ
సత్యాన్ని తిరస్కరించిన, పరలోకంలో కలవటాన్ని ధిక్కరించిన, ప్రాపంచిక జీవితంలో మేము భోగభాగ్యాలను ఇచ్చిన అతని జాతి నాయకులు ఇలా అన్నారు: "ఇతను కూడా మీలాంటి సామాన్య మానవుడే. మీరు తినేదే ఇతనూ తింటున్నాడు. మీరు త్రాగేదే ఇతనూ త్రాగుతున్నాడు."
23:34  وَلَئِنْ أَطَعْتُم بَشَرًا مِّثْلَكُمْ إِنَّكُمْ إِذًا لَّخَاسِرُونَ
"మీరు గనక మీలాంటి ఒక మానవమాత్రుణ్ణి అనుసరించారంటే తప్పక నష్టపోతారు."
23:35  أَيَعِدُكُمْ أَنَّكُمْ إِذَا مِتُّمْ وَكُنتُمْ تُرَابًا وَعِظَامًا أَنَّكُم مُّخْرَجُونَ
"ఏమిటీ, మీరు చచ్చి, మట్టిగా, ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా మీరు మళ్లీ లేపబడతారని ఇతను వాగ్దానం చేస్తున్నాడా?"
23:36  هَيْهَاتَ هَيْهَاتَ لِمَا تُوعَدُونَ
"అసంభవం, మీకు చేయబడే ఈ వాగ్దానం అసంభవం".
23:37  إِنْ هِيَ إِلَّا حَيَاتُنَا الدُّنْيَا نَمُوتُ وَنَحْيَا وَمَا نَحْنُ بِمَبْعُوثِينَ
"జీవితం అంటే అసలు ప్రాపంచిక జీవితమే. మనం ఇక్కడే చస్తూ, బతుకుతూ ఉంటాం. మళ్లీ మనం (సజీవులుగా) లేప బడటం అనేది ఉండదు."
23:38  إِنْ هُوَ إِلَّا رَجُلٌ افْتَرَىٰ عَلَى اللَّهِ كَذِبًا وَمَا نَحْنُ لَهُ بِمُؤْمِنِينَ
"ఇతనూ మనిషే. (అయినా కూడా ఇతను) అల్లాహ్‌కు అబద్ధాలు అంటగడ్తున్నాడు. మేము ఇతన్ని నమ్మేది లేదు."
23:39  قَالَ رَبِّ انصُرْنِي بِمَا كَذَّبُونِ
"ప్రభూ! వీళ్ల ధిక్కార వైఖరికి ప్రతిగా నాకు సహాయపడు" అని దైవప్రవక్త ప్రార్థించాడు.
23:40  قَالَ عَمَّا قَلِيلٍ لَّيُصْبِحُنَّ نَادِمِينَ
అప్పుడు, "వీళ్ళు (తమ స్వయం కృతంపై సిగ్గుతో) కుమిలి పోయే సమయం దగ్గరలోనే ఉంది” అని సమాధానం లభించింది.
23:41  فَأَخَذَتْهُمُ الصَّيْحَةُ بِالْحَقِّ فَجَعَلْنَاهُمْ غُثَاءً ۚ فَبُعْدًا لِّلْقَوْمِ الظَّالِمِينَ
ఎట్టకేలకు న్యాయం వాంఛించే దాని ప్రకారం ఒక పెద్ద అరుపు (అమాంతం) వారిని కబళించింది. అంతే! మేము వారిని చెత్తాచెదారంలా చేసేశాము. దుర్మార్గులు దూరమవుగాక!
23:42  ثُمَّ أَنشَأْنَا مِن بَعْدِهِمْ قُرُونًا آخَرِينَ
మేము వారి తరువాత మరెన్నో తరాలను ప్రభవింపజేశాము.
23:43  مَا تَسْبِقُ مِنْ أُمَّةٍ أَجَلَهَا وَمَا يَسْتَأْخِرُونَ
వాటిలో ఏ సమాజం కూడా నిర్థారిత గడువుకు ముందు పోవటంగానీ, వెనుక ఉండిపోవటంగానీ జరగలేదు.
23:44  ثُمَّ أَرْسَلْنَا رُسُلَنَا تَتْرَىٰ ۖ كُلَّ مَا جَاءَ أُمَّةً رَّسُولُهَا كَذَّبُوهُ ۚ فَأَتْبَعْنَا بَعْضَهُم بَعْضًا وَجَعَلْنَاهُمْ أَحَادِيثَ ۚ فَبُعْدًا لِّقَوْمٍ لَّا يُؤْمِنُونَ
తరువాత మేము మా ప్రవక్తలను ఎడతెగకుండా పంపాము. ఎప్పుడు ఏ జాతి వద్దకు వారి ప్రవక్త వచ్చినా ఆ జాతి అతనిని ధిక్కరిస్తూనే వచ్చింది. అందువల్ల మేము ఒకరి తరువాత ఒకరిని తుదముట్టించి, వారిని జరిగిన కథలుగా చేసేశాము. విశ్వసించని జాతులు దూరమవుదురు గాక!
23:45  ثُمَّ أَرْسَلْنَا مُوسَىٰ وَأَخَاهُ هَارُونَ بِآيَاتِنَا وَسُلْطَانٍ مُّبِينٍ
ఆ తరువాత మేము మూసాకు, అతని సోదరుడు హారూనుకు మా సూచనలను, స్పష్టమైన ప్రమాణాన్ని ఇచ్చి పంపాము.
23:46  إِلَىٰ فِرْعَوْنَ وَمَلَئِهِ فَاسْتَكْبَرُوا وَكَانُوا قَوْمًا عَالِينَ
ఫిరౌను వద్దకు, అతని సర్దారుల వద్దకు. కాని వారు అహం కారం ప్రదర్శించారు. అసలే వారు తలబిరుసు మనుషులు.
23:47  فَقَالُوا أَنُؤْمِنُ لِبَشَرَيْنِ مِثْلِنَا وَقَوْمُهُمَا لَنَا عَابِدُونَ
"ఏమిటీ, మనలాంటి ఇద్దరు మానవ మాత్రులను మనం విశ్వసించాలా? చూడబోతే వీళ్ల జాతి వారు స్వయంగా మనకు బానిసలుగా ఉన్నారు" అని వారన్నారు.
23:48  فَكَذَّبُوهُمَا فَكَانُوا مِنَ الْمُهْلَكِينَ
ఆ విధంగా వారిద్దరినీ ధిక్కరించి వాళ్లు కూడా నాశనమయ్యే వారిలో చేరిపోయారు.
23:49  وَلَقَدْ آتَيْنَا مُوسَى الْكِتَابَ لَعَلَّهُمْ يَهْتَدُونَ
ప్రజలు సన్మార్గం పొందటానికి మేము మూసాకు గ్రంథం ప్రసాదించాము.
23:50  وَجَعَلْنَا ابْنَ مَرْيَمَ وَأُمَّهُ آيَةً وَآوَيْنَاهُمَا إِلَىٰ رَبْوَةٍ ذَاتِ قَرَارٍ وَمَعِينٍ
మేము మర్యమ్‌ కుమారుణ్ణి, అతని తల్లిని ఒక సూచనగా చేశాము. వారిద్దరికీ ఎత్తయిన ప్రదేశంలో ఆశ్రయం కల్పించాము. అది ప్రశాంతమైన స్థలం, నీటి కాలువగల ప్రదేశం.
23:51  يَا أَيُّهَا الرُّسُلُ كُلُوا مِنَ الطَّيِّبَاتِ وَاعْمَلُوا صَالِحًا ۖ إِنِّي بِمَا تَعْمَلُونَ عَلِيمٌ
ఓ ప్రవక్తలారా! పరిశుద్ధ వస్తువులు తినండి, సదాచరణ చేయండి. మీరు చేసేదంతా నాకు తెలుసు.
23:52  وَإِنَّ هَٰذِهِ أُمَّتُكُمْ أُمَّةً وَاحِدَةً وَأَنَا رَبُّكُمْ فَاتَّقُونِ
నిశ్చయంగా మీ ఈ ధర్మం ఒకే ధర్మం. నేనే మీ అందరి ప్రభువును. కాబట్టి మీరు నాకు భయపడండి.
23:53  فَتَقَطَّعُوا أَمْرَهُم بَيْنَهُمْ زُبُرًا ۖ كُلُّ حِزْبٍ بِمَا لَدَيْهِمْ فَرِحُونَ
అయితే వారంతట వారే (విభేదించుకుని), తమ ధర్మాన్ని ముక్కచెక్కలుగా చేసుకున్నారు. ప్రతి (మత) వర్గం తన వద్దనున్న దాంతోనే సంబరపడిపోసాగింది.
23:54  فَذَرْهُمْ فِي غَمْرَتِهِمْ حَتَّىٰ حِينٍ
కనుక నువ్వు (కూడా) వాళ్ళను వాళ్ళ ఏమరుపాటులో కొంత కాలం మునిగి ఉండేలా విడిచిపెట్టు.
23:55  أَيَحْسَبُونَ أَنَّمَا نُمِدُّهُم بِهِ مِن مَّالٍ وَبَنِينَ
సంతానం మరియు సంపదల ద్వారా మేము వారికి ప్రసాదిస్తున్న సమృద్ధిని చూసి వారేమనుకుంటున్నారు?
23:56  نُسَارِعُ لَهُمْ فِي الْخَيْرَاتِ ۚ بَل لَّا يَشْعُرُونَ
తమకు మేళ్లు చేయటంలో మేము వేగిరపడ్తున్నామని వారు తలపోస్తున్నారా?! (లేదు లేదు) వారసలు (యదార్థాన్ని) గ్రహించటం లేదు.
23:57  إِنَّ الَّذِينَ هُم مِّنْ خَشْيَةِ رَبِّهِم مُّشْفِقُونَ
నిశ్చయంగా ఎవరు తమ ప్రభువు పట్ల భీతితో భయపడుతున్నారో,
23:58  وَالَّذِينَ هُم بِآيَاتِ رَبِّهِمْ يُؤْمِنُونَ
మరెవరు తమ ప్రభువు ఆయతులను విశ్వసిస్తున్నారో,
23:59  وَالَّذِينَ هُم بِرَبِّهِمْ لَا يُشْرِكُونَ
ఎవరు తమ ప్రభువుకు సహవర్తులను కల్పించకుండా ఉంటారో,
23:60  وَالَّذِينَ يُؤْتُونَ مَا آتَوا وَّقُلُوبُهُمْ وَجِلَةٌ أَنَّهُمْ إِلَىٰ رَبِّهِمْ رَاجِعُونَ
ఇంకా (దైవమార్గంలో) ఇవ్వవలసిన దాన్ని ఇస్తూ కూడా, తమ ప్రభువు వద్దకు మరలిపోవలసి ఉందనే భావనతో ఎవరి హృదయాలు వణుకుతూ ఉంటాయో,
23:61  أُولَٰئِكَ يُسَارِعُونَ فِي الْخَيْرَاتِ وَهُمْ لَهَا سَابِقُونَ
వారే త్వరత్వరగా మంచి పనులు చేసుకుంటూ పోతున్న వారు. వాటికోసం వారు పోటీపడతారు.
23:62  وَلَا نُكَلِّفُ نَفْسًا إِلَّا وُسْعَهَا ۖ وَلَدَيْنَا كِتَابٌ يَنطِقُ بِالْحَقِّ ۚ وَهُمْ لَا يُظْلَمُونَ
మేము ఏ ప్రాణిపైనా దాని శక్తికి మించిన భారం వేయము. మా వద్ద సత్యం పలికే గ్రంథం ఉంది. వారికెలాంటి అన్యాయం జరగదు.
23:63  بَلْ قُلُوبُهُمْ فِي غَمْرَةٍ مِّنْ هَٰذَا وَلَهُمْ أَعْمَالٌ مِّن دُونِ ذَٰلِكَ هُمْ لَهَا عَامِلُونَ
పైగా వారి హృదయాలే దీని విషయంలో అశ్రద్ధకు గురై ఉన్నాయి. ఇవి గాకుండా వారు చేసే మరెన్నో (చెడు) చేష్టలుకూడా ఉన్నాయి.
23:64  حَتَّىٰ إِذَا أَخَذْنَا مُتْرَفِيهِم بِالْعَذَابِ إِذَا هُمْ يَجْأَرُونَ
ఆఖరికి మేము వారిలోని భోగలాలసులను శిక్షగా పట్టుకున్నప్పుడు, వారు ఆర్తనాదాలు చేయసాగారు.
23:65  لَا تَجْأَرُوا الْيَوْمَ ۖ إِنَّكُم مِّنَّا لَا تُنصَرُونَ
ఈ రోజు అరవవలసిన అవసరం లేదు. మాకు వ్యతిరేకంగా మీరు ఎవరి సహాయమూ పొందలేరు.
23:66  قَدْ كَانَتْ آيَاتِي تُتْلَىٰ عَلَيْكُمْ فَكُنتُمْ عَلَىٰ أَعْقَابِكُمْ تَنكِصُونَ
(ఒకప్పుడు) నా ఆయతులు మీకు చదివి వినిపించబడేవి. అయినా మీరు కాలి మడమలపైన వెనుతిరిగి పోయేవారు (కదా)!
23:67  مُسْتَكْبِرِينَ بِهِ سَامِرًا تَهْجُرُونَ
గర్విష్టుల్లా ప్రవర్తించేవారు. కల్లబొల్లి కబుర్లు చెప్పుకుని, దాన్ని (ఖుర్‌ఆన్‌ను) వదిలిపోయేవారు (అని వారితో అనబడుతుంది).
23:68  أَفَلَمْ يَدَّبَّرُوا الْقَوْلَ أَمْ جَاءَهُم مَّا لَمْ يَأْتِ آبَاءَهُمُ الْأَوَّلِينَ
ఏమిటీ, వారు ఈ వాక్కు గురించి ఎన్నడూ చింతన చేయలేదా? లేక పూర్వం తమ తాతముత్తాతల వద్దకు రాని విషయం వారి వద్దకు వచ్చినందుకా? (ఈ మంకుతనం?)
23:69  أَمْ لَمْ يَعْرِفُوا رَسُولَهُمْ فَهُمْ لَهُ مُنكِرُونَ
లేక తమ సందేశహరుణ్ణి ఎరుగకపోవటం వల్ల వారు అతన్ని నిరాకరిస్తున్నారా?
23:70  أَمْ يَقُولُونَ بِهِ جِنَّةٌ ۚ بَلْ جَاءَهُم بِالْحَقِّ وَأَكْثَرُهُمْ لِلْحَقِّ كَارِهُونَ
లేక అతనికి పిచ్చిపట్టిందని వారంటున్నారా? అసలు విషయం ఏమిటంటే అతను వారి వద్దకు సత్యాన్ని తీసుకువచ్చాడు. అయితే వారిలో చాలా మందికి సత్యమంటే అసలే పడదు.
23:71  وَلَوِ اتَّبَعَ الْحَقُّ أَهْوَاءَهُمْ لَفَسَدَتِ السَّمَاوَاتُ وَالْأَرْضُ وَمَن فِيهِنَّ ۚ بَلْ أَتَيْنَاهُم بِذِكْرِهِمْ فَهُمْ عَن ذِكْرِهِم مُّعْرِضُونَ
సత్యమే గనక వారి కోర్కెల వెనుక పరుగెత్తినట్లయితే భూమ్యాకాశాలు, అందులో వున్న సమస్తం చిందరవందర అయిపోయేవి. యదార్థమేమిటంటే మేము వారికి వారి ఉపదేశాన్ని చేరవేశాము. కాని వారు మాత్రం తమ ఉపదేశం పట్ల విముఖత చూపుతున్నారు.
23:72  أَمْ تَسْأَلُهُمْ خَرْجًا فَخَرَاجُ رَبِّكَ خَيْرٌ ۖ وَهُوَ خَيْرُ الرَّازِقِينَ
పోనీ, నువ్వు వారినుంచి వేతనం ఏదన్నా అడుగుతున్నావా? నీ ప్రభువు ఇచ్చే ప్రతిఫలం చాలా మేలైనదని తెలుసుకో. ఆయన ఉపాధి ప్రదాతలలోకెల్లా శ్రేష్ఠుడు.
23:73  وَإِنَّكَ لَتَدْعُوهُمْ إِلَىٰ صِرَاطٍ مُّسْتَقِيمٍ
(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నువ్వు వారిని రుజుమార్గం వైపునకు పిలుస్తున్నావు.
23:74  وَإِنَّ الَّذِينَ لَا يُؤْمِنُونَ بِالْآخِرَةِ عَنِ الصِّرَاطِ لَنَاكِبُونَ
అయితే పరలోకంపై నమ్మకం లేనివారు నిశ్చయంగా సన్మార్గం నుంచి తప్పిపోతారు.
23:75  وَلَوْ رَحِمْنَاهُمْ وَكَشَفْنَا مَا بِهِم مِّن ضُرٍّ لَّلَجُّوا فِي طُغْيَانِهِمْ يَعْمَهُونَ
ఒకవేళ మేము వారిపై దయదలచి, వారి కష్టాలను దూరం చేస్తే వారు తమ తలబిరుసుతనంలో మరింతగా మొండికేసి, అంధులుగా ప్రవర్తిస్తారు.
23:76  وَلَقَدْ أَخَذْنَاهُم بِالْعَذَابِ فَمَا اسْتَكَانُوا لِرَبِّهِمْ وَمَا يَتَضَرَّعُونَ
మేము వారిని శిక్షలో (భాగంగా) కూడా పట్టుకున్నాము. కాని వారు తమ ప్రభువు సమక్షంలో లొంగనూ లేదు, వినమ్రతను వ్యక్తపరచనూ లేదు.
23:77  حَتَّىٰ إِذَا فَتَحْنَا عَلَيْهِم بَابًا ذَا عَذَابٍ شَدِيدٍ إِذَا هُمْ فِيهِ مُبْلِسُونَ
ఆఖరికి మేము వారిపై కఠినమైన శిక్షా ద్వారాన్ని తెరచివేసినప్పుడు, వారు వెంటనే నిరాశానిస్పృహలకు లోనయ్యారు.
23:78  وَهُوَ الَّذِي أَنشَأَ لَكُمُ السَّمْعَ وَالْأَبْصَارَ وَالْأَفْئِدَةَ ۚ قَلِيلًا مَّا تَشْكُرُونَ
ఆయనే (అల్లాహ్‌యే) మీకు చెవులను, కళ్లను, హృదయాలను చేశాడు. కాని మీరు కృతజ్ఞతలు తెలిపేది బహుతక్కువ.
23:79  وَهُوَ الَّذِي ذَرَأَكُمْ فِي الْأَرْضِ وَإِلَيْهِ تُحْشَرُونَ
మిమ్మల్ని భూమిపై వ్యాపింపజేసినవాడు కూడా ఆయనే. ఎట్టకేలకు ఆయన వద్దకే మీరు సమీకరించబడతారు.
23:80  وَهُوَ الَّذِي يُحْيِي وَيُمِيتُ وَلَهُ اخْتِلَافُ اللَّيْلِ وَالنَّهَارِ ۚ أَفَلَا تَعْقِلُونَ
జీవన్మరణాలను ఇచ్చేవాడు కూడా ఆయనే. రేయింబవళ్ళ మార్పిడి కూడా ఆయన అధీనంలోనే ఉంది. మరి మీరు ఆ మాత్రం గ్రహించలేరా?
23:81  بَلْ قَالُوا مِثْلَ مَا قَالَ الْأَوَّلُونَ
అసలు అది కాదు. తమ పూర్వీకులు చెబుతూ వచ్చిన దానినే వీళ్ళూ చెబుతున్నారు –
23:82  قَالُوا أَإِذَا مِتْنَا وَكُنَّا تُرَابًا وَعِظَامًا أَإِنَّا لَمَبْعُوثُونَ
"మేము మరణించి, మట్టిగా, ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా మళ్లీ సజీవులుగా లేపబడతామా?" అనంటారు.
23:83  لَقَدْ وُعِدْنَا نَحْنُ وَآبَاؤُنَا هَٰذَا مِن قَبْلُ إِنْ هَٰذَا إِلَّا أَسَاطِيرُ الْأَوَّلِينَ
"మాకూ, మా తాతముత్తాతలకు మునుపటి నుంచే ఇలాంటి వాగ్దానం చేయబడుతూ వస్తోంది. ఇవి పూర్వీకుల కట్టుకథలు తప్ప మరేమీ కావు" (అని చెబుతారు).
23:84  قُل لِّمَنِ الْأَرْضُ وَمَن فِيهَا إِن كُنتُمْ تَعْلَمُونَ
"భూమి మరియు అందులో ఉన్న సమస్త వస్తువులు ఎవరివో మీకే గనక తెలిసి ఉంటే చెప్పండి?" అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు.
23:85  سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ أَفَلَا تَذَكَّرُونَ
"అల్లాహ్‌వే" అని వారు వెంటనే సమాధానం ఇస్తారు. "మరయితే మీరు హితబోధను ఎందుకు గ్రహించటం లేదు?" అని అడుగు.
23:86  قُلْ مَن رَّبُّ السَّمَاوَاتِ السَّبْعِ وَرَبُّ الْعَرْشِ الْعَظِيمِ
"సప్తాకాశాలకు, మహోన్నతమైన (అర్ష్‌) పీఠానికి అధిపతి ఎవరు?" అని వారిని ప్రశ్నించు.
23:87  سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ أَفَلَا تَتَّقُونَ
"అల్లాహ్‌యే" అని వారు జవాబిస్తారు. "మరలాంటప్పుడు మీరెందుకు భయపడరు?" అని వారిని (నిలదీసి) అడుగు.
23:88  قُلْ مَن بِيَدِهِ مَلَكُوتُ كُلِّ شَيْءٍ وَهُوَ يُجِيرُ وَلَا يُجَارُ عَلَيْهِ إِن كُنتُمْ تَعْلَمُونَ
సమస్త విషయాల సార్వభౌమత్వం ఎవరి చేతుల్లో ఉందో, శరణు ఇచ్చేవాడెవడో, ఎవరికి వ్యతిరేకంగా ఏ శరణూ లభించదో- ఆయనెవరో మీకు తెలిసి ఉంటే చెప్పండి? అని (ఓ ప్రవక్తా!) వారిని అడుగు.
23:89  سَيَقُولُونَ لِلَّهِ ۚ قُلْ فَأَنَّىٰ تُسْحَرُونَ
"అల్లాహ్‌ మాత్రమే" అని వారు చెబుతారు. "మరైతే మీరు ఎలా మోసపోతున్నారు?" అని (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు.
23:90  بَلْ أَتَيْنَاهُم بِالْحَقِّ وَإِنَّهُمْ لَكَاذِبُونَ
నిజానికి మేము వారికి సత్యాన్ని అందజేశాము. వారే ముమ్మాటికీ అబద్ధాల కోరులు.
23:91  مَا اتَّخَذَ اللَّهُ مِن وَلَدٍ وَمَا كَانَ مَعَهُ مِنْ إِلَٰهٍ ۚ إِذًا لَّذَهَبَ كُلُّ إِلَٰهٍ بِمَا خَلَقَ وَلَعَلَا بَعْضُهُمْ عَلَىٰ بَعْضٍ ۚ سُبْحَانَ اللَّهِ عَمَّا يَصِفُونَ
అల్లాహ్‌ ఎవరినీ కొడుకుగా చేసుకోలేదు. ఆయనతోపాటు ఇంకొక ఆరాధ్య దేవుడు కూడా (భాగస్వామిగా) లేడు. ఒకవేళ అలాంటిదేదైనా ఉంటే ప్రతి దేవుడూ తాను సృష్టించిన సృష్టితాలను వేరుగా తీసుకుని వేరయిపోయేవాడు. ఒకడు ఇంకొకనిపై దండయాత్ర చేసేవాడు. వారు అల్లాహ్‌కు ఏ లక్షణాలను ఆపాదిస్తున్నారో వాటికి ఆయన అతీతుడు, పవిత్రుడు.
23:92  عَالِمِ الْغَيْبِ وَالشَّهَادَةِ فَتَعَالَىٰ عَمَّا يُشْرِكُونَ
గోప్యంగా ఉన్నదానినీ, బహిర్గతంగా ఉన్నదానినీ ఆయన ఎరిగినవాడు. వారు కల్పించే భాగస్వామ్యానికి (షిర్కుకు) ఆయన అతీతుడు, ఉన్నతుడు.
23:93  قُل رَّبِّ إِمَّا تُرِيَنِّي مَا يُوعَدُونَ
(ఓ ముహమ్మద్‌- (స) !) ఈ విధంగా ప్రార్థించు : "నా ప్రభూ! అవిశ్వాసులకు చేయబడుతున్న వాగ్దానాన్ని (శిక్షను) గనక నీవు నాకు చూపదలిస్తే,
23:94  رَبِّ فَلَا تَجْعَلْنِي فِي الْقَوْمِ الظَّالِمِينَ
"ప్రభూ! నీవు నన్ను ఈ దుర్మార్గుల సమూహంలో మటుకు ఉంచకు."
23:95  وَإِنَّا عَلَىٰ أَن نُّرِيَكَ مَا نَعِدُهُمْ لَقَادِرُونَ
మేము వారికి వాగ్దానం చేస్తున్నదంతా నీకు చూపగలం.
23:96  ادْفَعْ بِالَّتِي هِيَ أَحْسَنُ السَّيِّئَةَ ۚ نَحْنُ أَعْلَمُ بِمَا يَصِفُونَ
(ఓ ముహమ్మద్‌!) ఏదయితే మంచిదో దాని ద్వారానే చెడును తొలగించు. వారు కల్పించేవన్నీ మాకు బాగా తెలుసు.
23:97  وَقُل رَّبِّ أَعُوذُ بِكَ مِنْ هَمَزَاتِ الشَّيَاطِينِ
ఇంకా ఇలా ప్రార్థిస్తూ ఉండు: "ఓ నా ప్రభూ! షైతానులు కలిగించే ప్రేరణల నుంచి నేను నీ శరణుకోరుతున్నాను.
23:98  وَأَعُوذُ بِكَ رَبِّ أَن يَحْضُرُونِ
ప్రభూ! వారు నా వద్దకు రావటం నుంచి నీ శరణు వేడుతున్నాను."
23:99  حَتَّىٰ إِذَا جَاءَ أَحَدَهُمُ الْمَوْتُ قَالَ رَبِّ ارْجِعُونِ
చివరికి వారిలో ఎవరికైనా చావు వచ్చినప్పుడు," ఓ ప్రభూ! నన్ను తిరిగి వెనక్కి పంపించు.
23:100  لَعَلِّي أَعْمَلُ صَالِحًا فِيمَا تَرَكْتُ ۚ كَلَّا ۚ إِنَّهَا كَلِمَةٌ هُوَ قَائِلُهَا ۖ وَمِن وَرَائِهِم بَرْزَخٌ إِلَىٰ يَوْمِ يُبْعَثُونَ
"నేను వదలి వచ్చిన లోకంలోకే వెళ్ళి సత్కార్యం చేస్తాను" అని అంటాడు. ముమ్మాటికీ అలా జరగదు. అది అతను అంటున్న ఒక మాట మాత్రమే. వారు మళ్లీ సజీవులై లేచే రోజు వరకూ వారి వెనుక ఒక అడ్డుతెర ఉంటుంది.
23:101  فَإِذَا نُفِخَ فِي الصُّورِ فَلَا أَنسَابَ بَيْنَهُمْ يَوْمَئِذٍ وَلَا يَتَسَاءَلُونَ
మరి శంఖం పూరించబడినప్పుడు వారి మధ్యన బంధుత్వాలుగానీ, ఒండొకరిని అడిగి చూడటంగానీ ఆనాడు ఉండదు.
23:102  فَمَن ثَقُلَتْ مَوَازِينُهُ فَأُولَٰئِكَ هُمُ الْمُفْلِحُونَ
ఎవరి త్రాసు పళ్ళెం బరువుగా ఉంటుందో వారు సాఫల్యం పొందినవారవుతారు.
23:103  وَمَنْ خَفَّتْ مَوَازِينُهُ فَأُولَٰئِكَ الَّذِينَ خَسِرُوا أَنفُسَهُمْ فِي جَهَنَّمَ خَالِدُونَ
మరెవరి త్రాసుపళ్ళెం తేలికగా ఉంటుందో వారే తమకు తాము నష్టం చేకూర్చుకున్నవారు. వారు సదా నరకంలో ఉంటారు.
23:104  تَلْفَحُ وُجُوهَهُمُ النَّارُ وَهُمْ فِيهَا كَالِحُونَ
వారి ముఖాలను అగ్ని మాడ్చివేస్తూ ఉంటుంది. అందువల్ల వారు కడు అందవికారంగా మారిపోతారు.
23:105  أَلَمْ تَكُنْ آيَاتِي تُتْلَىٰ عَلَيْكُمْ فَكُنتُم بِهَا تُكَذِّبُونَ
"నా ఆయతులు మీకు చదివి వినిపించబడలేదా? అయినప్పటికీ మీరు వాటిని ధిక్కరించేవారు" (అని వారితో చెప్పినప్పుడు),
23:106  قَالُوا رَبَّنَا غَلَبَتْ عَلَيْنَا شِقْوَتُنَا وَكُنَّا قَوْمًا ضَالِّينَ
"ప్రభూ! మా దౌర్భాగ్యం మమ్మల్ని శాసించింది. (నిజంగా) మేము మార్గభ్రష్టులం" అని వారు అంటారు.
23:107  رَبَّنَا أَخْرِجْنَا مِنْهَا فَإِنْ عُدْنَا فَإِنَّا ظَالِمُونَ
"మా ప్రభూ! మాకు ఇక్కణ్ణుంచి విముక్తిని ప్రసాదించు. మేము గనక మళ్లీ ఇలాగే చేస్తే అప్పుడు నిశ్చయంగా మేము దుర్మార్గులమవుతాము" (అని విజ్ఞప్తి చేసుకుంటారు).
23:108  قَالَ اخْسَئُوا فِيهَا وَلَا تُكَلِّمُونِ
"ధూర్తులై ఇందులోనే పడి ఉండండి. నాతో మాట్లాడకండి" అని అల్లాహ్‌ అంటాడు.
23:109  إِنَّهُ كَانَ فَرِيقٌ مِّنْ عِبَادِي يَقُولُونَ رَبَّنَا آمَنَّا فَاغْفِرْ لَنَا وَارْحَمْنَا وَأَنتَ خَيْرُ الرَّاحِمِينَ
నా దాసులలోని ఒక వర్గంవారు, "ఓ మా ప్రభూ! మేము విశ్వసించాము. కనుక మమ్మల్ని క్షమించు, మాపై దయజూపు. నువ్వు దయచూపే వారందరిలోకెల్లా శ్రేష్ఠుడవు" అని వేడుకునే వారు.
23:110  فَاتَّخَذْتُمُوهُمْ سِخْرِيًّا حَتَّىٰ أَنسَوْكُمْ ذِكْرِي وَكُنتُم مِّنْهُمْ تَضْحَكُونَ
కాని మీరేమో వారిని నవ్వులాటగా తీసుకున్నారు. ఆఖరికి మీ ఈ పరాచికాలు మిమ్మల్ని నా ధ్యానం కూడా మరిపింపజేశాయి. అయినా మీరు వారిని పరిహసిస్తూనే ఉన్నారు.
23:111  إِنِّي جَزَيْتُهُمُ الْيَوْمَ بِمَا صَبَرُوا أَنَّهُمْ هُمُ الْفَائِزُونَ
నేను ఈ రోజు వారికి వారి సహనానికి తగిన ప్రతిఫలం ఇచ్చాను. వాస్తవానికి వారు (ఆశించిన మేరకు) సఫలీకృతులయ్యారు (అని అల్లాహ్‌ సెలవిస్తాడు).
23:112  قَالَ كَمْ لَبِثْتُمْ فِي الْأَرْضِ عَدَدَ سِنِينَ
"మీరు ఎన్ని సంవత్సరాల పాటు భూలోకంలో ఉండి ఉంటారు?" అని (అల్లాహ్‌) వారిని అడుగుతాడు.
23:113  قَالُوا لَبِثْنَا يَوْمًا أَوْ بَعْضَ يَوْمٍ فَاسْأَلِ الْعَادِّينَ
"ఒక రోజో లేక ఒక రోజుకన్నా తక్కువ సమయమో ఉండి ఉంటాము. కావాలంటే లెక్కించేవారిని అడగండి" అని వారంటారు.
23:114  قَالَ إِن لَّبِثْتُمْ إِلَّا قَلِيلًا ۖ لَّوْ أَنَّكُمْ كُنتُمْ تَعْلَمُونَ
అల్లాహ్‌ అంటాడు: "నిజంగానే మీరు చాలా కొద్ది సమయమే అక్కడ ఉన్నారు. ఈ సంగతిని మీరు ముందే గ్రహిస్తే ఎంత బావుండేది!
23:115  أَفَحَسِبْتُمْ أَنَّمَا خَلَقْنَاكُمْ عَبَثًا وَأَنَّكُمْ إِلَيْنَا لَا تُرْجَعُونَ
"మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా (అర్థరహితంగా) పుట్టించామనీ, మీరు మా దగ్గరకు మరలిరావటం అనేది జరగని పని అని అనుకున్నారా?"
23:116  فَتَعَالَى اللَّهُ الْمَلِكُ الْحَقُّ ۖ لَا إِلَٰهَ إِلَّا هُوَ رَبُّ الْعَرْشِ الْكَرِيمِ
అల్లాహ్‌యే నిజమైన సార్వభౌముడు. ఆయన మహోన్నతుడు. ఆయన తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు. మహోన్నత పీఠానికి ఆయనే అధిపతి.
23:117  وَمَن يَدْعُ مَعَ اللَّهِ إِلَٰهًا آخَرَ لَا بُرْهَانَ لَهُ بِهِ فَإِنَّمَا حِسَابُهُ عِندَ رَبِّهِ ۚ إِنَّهُ لَا يُفْلِحُ الْكَافِرُونَ
ఎవడైనా, తన దగ్గర ఏ ప్రమాణమూ లేకపోయినప్పటికీ- అల్లాహ్‌తో పాటు వేరొక దేవుణ్ణి మొరపెట్టుకుంటే, అటువంటి వ్యక్తి లెక్క అతని ప్రభువు వద్ద ఉన్నది. నిశ్చయంగా అవిశ్వాసులు సఫలురు కాలేరు.
23:118  وَقُل رَّبِّ اغْفِرْ وَارْحَمْ وَأَنتَ خَيْرُ الرَّاحِمِينَ
(ఓ ప్రవక్తా!) ఇలా ప్రార్థించు: "నా ప్రభూ! క్షమించు. కనికరించు. కనికరించే వారందరిలోకెల్లా నీవు ఉత్తముడవు."


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.