aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

20. సూరా తాహా

20:1  طه
తా హా.
20:2  مَا أَنزَلْنَا عَلَيْكَ الْقُرْآنَ لِتَشْقَىٰ
(ఓ ముహమ్మద్‌ - సఅసం!) మేము ఈ ఖుర్‌ఆన్‌ను నీపై అవతరింపజేసింది నువ్వు కష్టాల్లో పడడానికి కాదు-
20:3  إِلَّا تَذْكِرَةً لِّمَن يَخْشَىٰ
అల్లాహ్‌కు భయపడేవాని బోధనార్థం మాత్రమే (దీనిని అవతరింపజేశాము).
20:4  تَنزِيلًا مِّمَّنْ خَلَقَ الْأَرْضَ وَالسَّمَاوَاتِ الْعُلَى
భూమినీ, ఎత్తయిన ఆకాశాలనూ సృష్టించిన వాని తరఫున ఇది అవతరింపజేయబడింది.
20:5  الرَّحْمَٰنُ عَلَى الْعَرْشِ اسْتَوَىٰ
ఆ కరుణామయుడు అర్ష్‌ (సింహాసనము) పై ఆసీనుడై ఉన్నాడు.
20:6  لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ وَمَا بَيْنَهُمَا وَمَا تَحْتَ الثَّرَىٰ
ఆకాశాలలో, భూమిలో ఆ రెండింటి మధ్యనా, ఇంకా (నేల) అట్టడుగు భాగాన ఉన్న ప్రతిదీ ఆయనదే.
20:7  وَإِن تَجْهَرْ بِالْقَوْلِ فَإِنَّهُ يَعْلَمُ السِّرَّ وَأَخْفَى
నువ్వు మాటను బిగ్గరగా పలికినా (ఫరవాలేదు). ఆయనైతే మెల్లగా (పలికినా), అతి గోప్యంగా విన్నవించుకున్నా ప్రతిదీ తెలుసుకుంటాడు.
20:8  اللَّهُ لَا إِلَٰهَ إِلَّا هُوَ ۖ لَهُ الْأَسْمَاءُ الْحُسْنَىٰ
ఆయనే అల్లాహ్‌. ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు. సుందరమైన పేర్లన్నీ ఆయనవే.
20:9  وَهَلْ أَتَاكَ حَدِيثُ مُوسَىٰ
మూసా వృత్తాంతం నీకు చేరిందా?
20:10  إِذْ رَأَىٰ نَارًا فَقَالَ لِأَهْلِهِ امْكُثُوا إِنِّي آنَسْتُ نَارًا لَّعَلِّي آتِيكُم مِّنْهَا بِقَبَسٍ أَوْ أَجِدُ عَلَى النَّارِ هُدًى
అతను నిప్పును చూసినప్పుడు తన ఇంటివారితో, "కాస్సేపు ఆగండి. నాకు నిప్పు కనిపించింది. వీలైతే కొంత నిప్పును అందులో నుంచి మీకోసం తెస్తాను లేదా (కనీసం) ఆ మంట ఉన్న చోటునుంచి దారినయినా కనుగొంటాను" అన్నాడు.
20:11  فَلَمَّا أَتَاهَا نُودِيَ يَا مُوسَىٰ
తీరా అతను అక్కడకు చేరుకోగానే, ఈ పిలుపు వచ్చింది: "ఓ మూసా!
20:12  إِنِّي أَنَا رَبُّكَ فَاخْلَعْ نَعْلَيْكَ ۖ إِنَّكَ بِالْوَادِ الْمُقَدَّسِ طُوًى
"నేనే నీ ప్రభువును. నువ్వు నీ చెప్పులు విడువు. ఎందుకంటే (ఇప్పుడు) నువ్వు పవిత్రమైన 'తువా' లోయలో ఉన్నావు.
20:13  وَأَنَا اخْتَرْتُكَ فَاسْتَمِعْ لِمَا يُوحَىٰ
"నేను నిన్ను ఎన్నుకున్నాను. ఇప్పుడు వహీ ద్వారా అందజేయబడేదంతా శ్రద్ధగా విను –
20:14  إِنَّنِي أَنَا اللَّهُ لَا إِلَٰهَ إِلَّا أَنَا فَاعْبُدْنِي وَأَقِمِ الصَّلَاةَ لِذِكْرِي
"నిశ్చయంగా నేనే అల్లాహ్‌ను. నేను తప్ప మరో ఆరాధ్యుడు లేడు. కాబట్టి నువ్వు నన్నే ఆరాధించు. నన్ను జ్ఞాపకం చేయటానికి నమాజును నెలకొల్పు.
20:15  إِنَّ السَّاعَةَ آتِيَةٌ أَكَادُ أُخْفِيهَا لِتُجْزَىٰ كُلُّ نَفْسٍ بِمَا تَسْعَىٰ
"ప్రళయ ఘడియ రావటం తథ్యం. ప్రతి వ్యక్తి తన కృషికి తగ్గ ప్రతిఫలం పొందటానికి ఆ సమయాన్నినేను గోప్యంగా ఉంచదలిచాను.
20:16  فَلَا يَصُدَّنَّكَ عَنْهَا مَن لَّا يُؤْمِنُ بِهَا وَاتَّبَعَ هَوَاهُ فَتَرْدَىٰ
"అయితే దానిని నమ్మకుండా, తన కోర్కెల వెనుక పరుగెత్తే వాడు ఎవడయినా నిన్ను ఆ విషయంలో అడ్డు తగలకూడదు సుమా! అన్యధా నువ్వు కూడా వినాశానికి గురవుతావు (జాగ్రత్త!)"
20:17  وَمَا تِلْكَ بِيَمِينِكَ يَا مُوسَىٰ
"నీ కుడిచేతిలో ఉన్నదేమిటి ఓ మూసా?!" (అని దేవుడు ప్రశ్నించగా)
20:18  قَالَ هِيَ عَصَايَ أَتَوَكَّأُ عَلَيْهَا وَأَهُشُّ بِهَا عَلَىٰ غَنَمِي وَلِيَ فِيهَا مَآرِبُ أُخْرَىٰ
"ఇది నా చేతి కర్ర. దీన్ని ఊతగా చేసుకుంటాను. దీంతో నా మేకల కోసం ఆకులు రాలుస్తాను. దీనివల్ల నాకింకా ఎన్నో ప్రయోజనాలున్నాయి" అని (మూసా) బదులిచ్చాడు.
20:19  قَالَ أَلْقِهَا يَا مُوسَىٰ
"ఓ మూసా! దాన్ని పడవెయ్యి" అన్నాడు (అల్లాహ్‌).
20:20  فَأَلْقَاهَا فَإِذَا هِيَ حَيَّةٌ تَسْعَىٰ
అతను దాన్ని పడవెయ్యగానే, అది పాముగా మారి పరుగెత్తసాగింది.
20:21  قَالَ خُذْهَا وَلَا تَخَفْ ۖ سَنُعِيدُهَا سِيرَتَهَا الْأُولَىٰ
(అల్లాహ్‌) ఇలా సెలవిచ్చాడు :"దాన్ని పట్టుకో. భయపడకు. మేము వెంటనే దాన్ని పూర్వ స్థితిలోకి తీసుకువస్తాము."
20:22  وَاضْمُمْ يَدَكَ إِلَىٰ جَنَاحِكَ تَخْرُجْ بَيْضَاءَ مِنْ غَيْرِ سُوءٍ آيَةً أُخْرَىٰ
నీ చేతిని చంకలో నొక్కి పెట్టు. అది ఎలాంటి లోపం లేకుండా తెల్లగా (ధగ ధగా) మెరిసిపోతూ వస్తుంది. ఇది రెండవ మహిమ.
20:23  لِنُرِيَكَ مِنْ آيَاتِنَا الْكُبْرَى
"నీకు మా గొప్ప సూచనలను చూపటానికే ఇదంతా చేస్తున్నాము."
20:24  اذْهَبْ إِلَىٰ فِرْعَوْنَ إِنَّهُ طَغَىٰ
"ఇక నువ్వు ఫిరౌను వద్దకు వెళ్ళు. వాడు తలబిరుసుగా తయారయ్యాడు."
20:25  قَالَ رَبِّ اشْرَحْ لِي صَدْرِي
అప్పుడు మూసా ఇలా విన్నవించుకున్నాడు: "ఓ నా ప్రభూ! నా కోసం నా ఛాతీ (మనసు)ని విశాలమైనదిగా చేయి.
20:26  وَيَسِّرْ لِي أَمْرِي
"నా కార్యాన్ని నా కోసం సులభతరం చేయి.
20:27  وَاحْلُلْ عُقْدَةً مِّن لِّسَانِي
"నా నాలుక ముడిని విప్పు,
20:28  يَفْقَهُوا قَوْلِي
"ప్రజలు నా మాటను బాగా అర్థం చేసుకోగలిగేందుకు.
20:29  وَاجْعَل لِّي وَزِيرًا مِّنْ أَهْلِي
"నా కుటుంబంలో నుంచి ఒకతన్ని నాకు సహాయకునిగా నియమించు.
20:30  هَارُونَ أَخِي
"అంటే, నా సోదరుడైన హారూనును (నియమించు) !
20:31  اشْدُدْ بِهِ أَزْرِي
"అతని ద్వారా నా బలాన్ని పెంచు.
20:32  وَأَشْرِكْهُ فِي أَمْرِي
"నా కార్యంలో అతన్ని నా భాగస్థునిగాచేయి.
20:33  كَيْ نُسَبِّحَكَ كَثِيرًا
"తద్వారా మేమిద్దరం నీ పవిత్రతను అత్యధికంగా కొనియాడ గలగటానికి!
20:34  وَنَذْكُرَكَ كَثِيرًا
"నిన్ను అత్యధికంగా స్మరిస్తూ ఉండటానికి!!
20:35  إِنَّكَ كُنتَ بِنَا بَصِيرًا
"నిశ్చయంగా నువ్వు మమ్మల్ని బాగా కనిపెట్టుకుని ఉండే వాడవు."
20:36  قَالَ قَدْ أُوتِيتَ سُؤْلَكَ يَا مُوسَىٰ
(అల్లాహ్‌ ఈ విధంగా) సెలవిచ్చాడు: "మూసా! నువ్వు అడిగిన వన్నీ నీకు ఇవ్వబడ్డాయి.
20:37  وَلَقَدْ مَنَنَّا عَلَيْكَ مَرَّةً أُخْرَىٰ
"మేము నీకు మరో మహోపకారం కూడా చేసి ఉన్నాము.
20:38  إِذْ أَوْحَيْنَا إِلَىٰ أُمِّكَ مَا يُوحَىٰ
"అప్పట్లో మేము నీ తల్లికి పంపిన సందేశం ఇది –
20:39  أَنِ اقْذِفِيهِ فِي التَّابُوتِ فَاقْذِفِيهِ فِي الْيَمِّ فَلْيُلْقِهِ الْيَمُّ بِالسَّاحِلِ يَأْخُذْهُ عَدُوٌّ لِّي وَعَدُوٌّ لَّهُ ۚ وَأَلْقَيْتُ عَلَيْكَ مَحَبَّةً مِّنِّي وَلِتُصْنَعَ عَلَىٰ عَيْنِي
'నువ్వు అతన్ని (మూసాను) పెట్టెలో పెట్టి నదిలో వదిలిపెట్టు. ఆ తరువాత నది ఆ పెట్టెను ఒడ్డుకు చేరుస్తుంది. నాకూ, ఇతనికీ శత్రువు అయినవాడు దాన్ని తీసుకుంటాడు.' "అప్పుడు నేను నా తరఫున ఓ ప్రత్యేకమైన ప్రేమానురాగాన్ని నీపై వేశాను. నువ్వు నా కనుసన్నలలో పోషించబడేందుకే ఈ ఏర్పాటు చేశాను.
20:40  إِذْ تَمْشِي أُخْتُكَ فَتَقُولُ هَلْ أَدُلُّكُمْ عَلَىٰ مَن يَكْفُلُهُ ۖ فَرَجَعْنَاكَ إِلَىٰ أُمِّكَ كَيْ تَقَرَّ عَيْنُهَا وَلَا تَحْزَنَ ۚ وَقَتَلْتَ نَفْسًا فَنَجَّيْنَاكَ مِنَ الْغَمِّ وَفَتَنَّاكَ فُتُونًا ۚ فَلَبِثْتَ سِنِينَ فِي أَهْلِ مَدْيَنَ ثُمَّ جِئْتَ عَلَىٰ قَدَرٍ يَا مُوسَىٰ
"(జ్ఞాపకం చేసుకో) అప్పుడు నీ అక్క (పెట్టె నదిలో కొట్టుకు పోతున్న వైపుకే) నడుస్తూ వచ్చి, "మీరు గనక సెలవిస్తే ఇతన్ని చక్కగా సాకేవారిని చూపిస్తాను" అని అంటుంది.ఈ ఉపాయం ద్వారా - నీ తల్లి కంటిచలువ కోసం, ఆమె దుఃఖించకుండా ఉండటం కోసం మేము మళ్లీ నిన్ను నీ తల్లి దగ్గరకు చేర్చాము. ఆ తరువాత నువ్వు ఒక వ్యక్తిని చంపావు. ఆ గండం నుంచి కూడా మేము నిన్ను కాపాడాము. ఆ విధంగా మేము నిన్ను బాగా పరీక్షించాము. అటు పిమ్మట నువ్వు అనేక సంవత్సరాలపాటు మద్‌యను ప్రజల మధ్య గడిపావు. ఆ తరువాత (మా) నిర్ణయం ప్రకారం ఓ మూసా! ఇదిగో, ఇలా వచ్చావు.
20:41  وَاصْطَنَعْتُكَ لِنَفْسِي
"నేను ప్రత్యేకంగా నా కోసం నిన్ను ఎంపిక చేసుకున్నాను.
20:42  اذْهَبْ أَنتَ وَأَخُوكَ بِآيَاتِي وَلَا تَنِيَا فِي ذِكْرِي
"ఇప్పుడు నువ్వూ, నీ సోదరుడూ నా సూచనలను తీసుకుని వెళ్లండి. (జాగ్రత్త!) నా ధ్యానం పట్ల బద్దకం చూపకూడదు సుమా!
20:43  اذْهَبَا إِلَىٰ فِرْعَوْنَ إِنَّهُ طَغَىٰ
"మీరిద్దరూ ఫిరౌను వద్దకు వెళ్లండి. వాడు మరీ బరితెగించి పోయాడు.
20:44  فَقُولَا لَهُ قَوْلًا لَّيِّنًا لَّعَلَّهُ يَتَذَكَّرُ أَوْ يَخْشَىٰ
"వాడితో కాస్త మృదువుగా మాట్లాడండి- బహుశా వాడు అర్థం చేసుకోవచ్చు లేదా భయపడవచ్చు."
20:45  قَالَا رَبَّنَا إِنَّنَا نَخَافُ أَن يَفْرُطَ عَلَيْنَا أَوْ أَن يَطْغَىٰ
"ప్రభూ! వాడు మాపై దౌర్జన్యానికి పాల్పడతాడేమోననీ లేదా (తలబిరుసుతనంతో) హద్దుమీరి పోతాడేమోనని మాకు భయంగా ఉంది" అని వారిద్దరూ అన్నారు.
20:46  قَالَ لَا تَخَافَا ۖ إِنَّنِي مَعَكُمَا أَسْمَعُ وَأَرَىٰ
"మీరు ఏ మాత్రం భయపడకండి. నేను మీతోనే ఉన్నాను. అంతా వింటూ, చూస్తూ ఉంటాను" అని సమాధానమిచ్చాడు ఆయన.
20:47  فَأْتِيَاهُ فَقُولَا إِنَّا رَسُولَا رَبِّكَ فَأَرْسِلْ مَعَنَا بَنِي إِسْرَائِيلَ وَلَا تُعَذِّبْهُمْ ۖ قَدْ جِئْنَاكَ بِآيَةٍ مِّن رَّبِّكَ ۖ وَالسَّلَامُ عَلَىٰ مَنِ اتَّبَعَ الْهُدَىٰ
"మీరు అతని దగ్గరకు వెళ్ళి ఇలా అనండి: 'మేము నీ ప్రభువు తరఫున పంపబడిన సందేశహరులము. నువ్వు ఇస్రాయీలు సంతతి వారిని మా వెంట పంపించు. వారిని పీడించకు. మేము నీ ప్రభువు తరఫున నీవద్దకు సూచనను తెచ్చాము. సన్మార్గాన్ని అనుసరించిన వానికి మాత్రమే శాంతి ఉంది.
20:48  إِنَّا قَدْ أُوحِيَ إِلَيْنَا أَنَّ الْعَذَابَ عَلَىٰ مَن كَذَّبَ وَتَوَلَّىٰ
"ధిక్కారవైఖరికి ఒడిగట్టి, విముఖత ప్రదర్శించేవానికి శిక్ష ఉంది అని మాకు వహీ ద్వారా తెలుపబడింది."
20:49  قَالَ فَمَن رَّبُّكُمَا يَا مُوسَىٰ
"ఇంతకీ మీరిద్దరి ప్రభువు ఎవరయ్యా ఓ మూసా?" అని (ఫిరౌను) అడిగాడు.
20:50  قَالَ رَبُّنَا الَّذِي أَعْطَىٰ كُلَّ شَيْءٍ خَلْقَهُ ثُمَّ هَدَىٰ
"ప్రతి వస్తువుకూ దాని ప్రత్యేక రూపును ఇచ్చి, తర్వాత దానికి మార్గాన్ని చూపినవాడే మా ప్రభువు" అని (మూసా) చెప్పాడు.
20:51  قَالَ فَمَا بَالُ الْقُرُونِ الْأُولَىٰ
"మరైతే పూర్వం గతించిన వారి సంగతేమిటీ?" అని (ఫిరౌను) ప్రశ్నించగా,
20:52  قَالَ عِلْمُهَا عِندَ رَبِّي فِي كِتَابٍ ۖ لَّا يَضِلُّ رَبِّي وَلَا يَنسَى
"వారి సంగతి నా ప్రభువు వద్ద గ్రంథంలో ఉంది. నా ప్రభువు పొరబడటంగానీ, మరువటంగానీ జరగదు" అని (మూసా) సమాధానమిచ్చాడు.
20:53  الَّذِي جَعَلَ لَكُمُ الْأَرْضَ مَهْدًا وَسَلَكَ لَكُمْ فِيهَا سُبُلًا وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجْنَا بِهِ أَزْوَاجًا مِّن نَّبَاتٍ شَتَّىٰ
ఆయనే మీ కొరకు భూమిని పాన్పుగా చేశాడు. అందులో మీరు నడిచేందుకు మార్గాలను సుగమం చేశాడు. ఆకాశం నుంచి వర్షపు నీటిని కూడా కురిపించాడు. మరి ఆ వర్షపు నీటి ద్వారా రకరకాల పంటలను (పచ్చికలను) మేమే పండిస్తున్నాము.
20:54  كُلُوا وَارْعَوْا أَنْعَامَكُمْ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّأُولِي النُّهَىٰ
వాటిని మీరూ తినండి, మీ పశువులను కూడా మేపండి. నిశ్చయంగా బుద్ధిమంతులకోసం ఇందులో ఎన్నో సూచనలున్నాయి.
20:55  مِنْهَا خَلَقْنَاكُمْ وَفِيهَا نُعِيدُكُمْ وَمِنْهَا نُخْرِجُكُمْ تَارَةً أُخْرَىٰ
దీని (ఈ నేల)లో నుంచే మేము మిమ్మల్ని సృష్టించాము. మళ్లీ ఇందులోనికే మిమ్మల్ని చేరుస్తాము. మరి ఇందులో నుంచే మరోసారి మీ అందరినీ వెలికి తీస్తాము.
20:56  وَلَقَدْ أَرَيْنَاهُ آيَاتِنَا كُلَّهَا فَكَذَّبَ وَأَبَىٰ
మేము వాడికి (ఫిరౌనుకు) మా సూచనలన్నింటినీ చూపాము. అయినాసరే వాడు ఖండించాడు, త్రోసిపుచ్చాడు.
20:57  قَالَ أَجِئْتَنَا لِتُخْرِجَنَا مِنْ أَرْضِنَا بِسِحْرِكَ يَا مُوسَىٰ
"ఓ మూసా? నువ్వు నీ మంత్రజాలంతో మమ్మల్ని మా రాజ్యం నుంచి వెళ్లగొట్టడానికి వచ్చావా?
20:58  فَلَنَأْتِيَنَّكَ بِسِحْرٍ مِّثْلِهِ فَاجْعَلْ بَيْنَنَا وَبَيْنَكَ مَوْعِدًا لَّا نُخْلِفُهُ نَحْنُ وَلَا أَنتَ مَكَانًا سُوًى
"సరే. మేము కూడా నీకు దీటుగా అటువంటి జాలవిద్యనే తీసుకువస్తాము. కాబట్టి నువ్వు నీకూ - మాకూ మధ్య పోటీకి ఒక పోటీ సమయాన్ని నిర్ణయించు. మేముగానీ, నువ్వుగానీ మాట తప్పకూడదు. బహిరంగ స్థలంలో పోటీ జరగాలి" అని (ఫిరౌన్‌) సవాలు చేశాడు.
20:59  قَالَ مَوْعِدُكُمْ يَوْمُ الزِّينَةِ وَأَن يُحْشَرَ النَّاسُ ضُحًى
"పర్వదినాన (పోటీ) పెట్టుకుందాం. పొద్దెక్కిన తరువాత ప్రజలంతా గుమిగూడినప్పుడే" అని (మూసా) బదులిచ్చాడు.
20:60  فَتَوَلَّىٰ فِرْعَوْنُ فَجَمَعَ كَيْدَهُ ثُمَّ أَتَىٰ
అంతే! ఫిరౌను వెళ్ళి తన తాంత్రిక ఒనరులన్నింటినీ సమకూర్చుకుని (సర్వసన్నద్ధుడై) వచ్చాడు.
20:61  قَالَ لَهُم مُّوسَىٰ وَيْلَكُمْ لَا تَفْتَرُوا عَلَى اللَّهِ كَذِبًا فَيُسْحِتَكُم بِعَذَابٍ ۖ وَقَدْ خَابَ مَنِ افْتَرَىٰ
మూసా వాళ్లను ఉద్దేశించి, "మీకు మూడింది! అల్లాహ్‌కు అబద్ధాలను అంటగట్టకండి. ఆయన మిమ్మల్ని శిక్ష ద్వారా సర్వ నాశనం చేసేస్తాడు. అబద్ధాన్ని కల్పించేవాడు ఎన్నటికీ సాఫల్యం పొందలేడని తెలుసుకోండి" అని అన్నారు.
20:62  فَتَنَازَعُوا أَمْرَهُم بَيْنَهُمْ وَأَسَرُّوا النَّجْوَىٰ
అప్పుడు వారు ఈ విషయంపై పరస్పరం మల్లగుల్లాలు పడ్డారు. రహస్య సంప్రదింపులు జరుపుకున్నారు.
20:63  قَالُوا إِنْ هَٰذَانِ لَسَاحِرَانِ يُرِيدَانِ أَن يُخْرِجَاكُم مِّنْ أَرْضِكُم بِسِحْرِهِمَا وَيَذْهَبَا بِطَرِيقَتِكُمُ الْمُثْلَىٰ
వారిలా చెప్పుకున్నారు: "వీళ్ళిద్దరూ వట్టి మాంత్రికులే. తమ మంత్రశక్తితో మిమ్మల్ని మీ రాజ్యం నుంచి వెళ్లగొట్టాలనీ, మీ ఉత్తమ విధానాన్ని సర్వనాశనం చేయాలని వీళ్లు కోరుకుంటున్నారు.
20:64  فَأَجْمِعُوا كَيْدَكُمْ ثُمَّ ائْتُوا صَفًّا ۚ وَقَدْ أَفْلَحَ الْيَوْمَ مَنِ اسْتَعْلَىٰ
"కాబట్టి మీరు మీ తంత్రాలన్నింటినీ సమాయత్తం చేసుకోండి. ఆ తరువాత వరుసలు తీరి రండి. ఈ రోజు విజృంభించిన వాడే గెలుస్తాడు."
20:65  قَالُوا يَا مُوسَىٰ إِمَّا أَن تُلْقِيَ وَإِمَّا أَن نَّكُونَ أَوَّلَ مَنْ أَلْقَىٰ
"ఓ మూసా! ముందు నువ్వయినా పడ వెయ్యి లేదా ముందు మేమైనా పడవేస్తాము" అని వారు చెప్పగా,
20:66  قَالَ بَلْ أَلْقُوا ۖ فَإِذَا حِبَالُهُمْ وَعِصِيُّهُمْ يُخَيَّلُ إِلَيْهِ مِن سِحْرِهِمْ أَنَّهَا تَسْعَىٰ
"ఫరవాలేదు, ముందు మీరే పడ వెయ్యండి" అని మూసా అన్నాడు. అప్పుడు వారి త్రాళ్లు, వారి కర్రలు వారి మంత్రశక్తిచే పరుగెత్తుతున్నట్లు అనిపించింది మూసాకు.
20:67  فَأَوْجَسَ فِي نَفْسِهِ خِيفَةً مُّوسَىٰ
అందువల్ల మూసా మనసులోనే భయపడ్డాడు.
20:68  قُلْنَا لَا تَخَفْ إِنَّكَ أَنتَ الْأَعْلَىٰ
అప్పుడు మేమిలా అన్నాము: "నువ్వు ఏమాత్రం భయపడకు. నిశ్చయంగా నీదే పైచేయి అవుతుంది.
20:69  وَأَلْقِ مَا فِي يَمِينِكَ تَلْقَفْ مَا صَنَعُوا ۖ إِنَّمَا صَنَعُوا كَيْدُ سَاحِرٍ ۖ وَلَا يُفْلِحُ السَّاحِرُ حَيْثُ أَتَىٰ
"నీ కుడి చేతిలో ఉన్న దానిని పడవేయి. అది వాళ్ల మాయా జాలాన్ని ఇట్టే మింగేస్తుంది. వాళ్లు కల్పించిందంతా మాంత్రికుల జిమ్మిక్కు మాత్రమే. మాంత్రికుడు ఏ విధంగా (ఎంత అట్టహాసంగా) వచ్చినా సఫలీకృతుడు కాలేడు."
20:70  فَأُلْقِيَ السَّحَرَةُ سُجَّدًا قَالُوا آمَنَّا بِرَبِّ هَارُونَ وَمُوسَىٰ
ఎట్టకేలకు మాంత్రికులంతా సాష్టాంగపడి, "మేము హారూన్‌, మూసాల ప్రభువును విశ్వసించాము" అని ఎలుగెత్తి చాటారు.
20:71  قَالَ آمَنتُمْ لَهُ قَبْلَ أَنْ آذَنَ لَكُمْ ۖ إِنَّهُ لَكَبِيرُكُمُ الَّذِي عَلَّمَكُمُ السِّحْرَ ۖ فَلَأُقَطِّعَنَّ أَيْدِيَكُمْ وَأَرْجُلَكُم مِّنْ خِلَافٍ وَلَأُصَلِّبَنَّكُمْ فِي جُذُوعِ النَّخْلِ وَلَتَعْلَمُنَّ أَيُّنَا أَشَدُّ عَذَابًا وَأَبْقَىٰ
"ఏమిటీ, నేను అనుమతించకముందే మీరు అతన్ని విశ్వసిస్తారా? నిశ్చయంగా మీకు మంత్ర విద్యను నేర్పిన మీ పెద్ద ఇతనే (అని ఇప్పుడర్థం అయింది). నేను ఒక ప్రక్కనుంచి మీ చేతుల్ని, మరో ప్రక్కనుంచి మీ కాళ్లను నరికించి, మీ అందరినీ ఖర్జూరపు దూలాలకు ఉరి తీస్తాను. మాలో ఎవరి శిక్ష తీవ్రతరమైనదో, ఎక్కువ కాలం ఉంటుందో అప్పుడు మీకు తెలిసివస్తుంది" అని ఫిరౌన్‌ అన్నాడు.
20:72  قَالُوا لَن نُّؤْثِرَكَ عَلَىٰ مَا جَاءَنَا مِنَ الْبَيِّنَاتِ وَالَّذِي فَطَرَنَا ۖ فَاقْضِ مَا أَنتَ قَاضٍ ۖ إِنَّمَا تَقْضِي هَٰذِهِ الْحَيَاةَ الدُّنْيَا
వారు (మాంత్రికులు) ఈ విధంగా సమాధానమిచ్చారు: "మా వద్దకు వచ్చేసిన స్పష్టమైన నిదర్శనాలపై, మమ్మల్ని సృష్టించిన వానిపైనీకు ప్రాధాన్యతనివ్వటమా?!అసంభవం. ఇప్పుడు నువ్వేం చేస్తావో చేసుకో. నువ్వేం నిర్ణయం చేసినా అది ప్రాపంచిక జీవితం వరకే.
20:73  إِنَّا آمَنَّا بِرَبِّنَا لِيَغْفِرَ لَنَا خَطَايَانَا وَمَا أَكْرَهْتَنَا عَلَيْهِ مِنَ السِّحْرِ ۗ وَاللَّهُ خَيْرٌ وَأَبْقَىٰ
"మా ప్రభువు మా తప్పులను క్షమించేటందుకు,(ముఖ్యంగా) నువ్వు బలవంతంగా మాచేత చేయించిన మాయాజాలపు మహా పరాధాన్ని మన్నించేటందుకు మేము ఆయన్ని విశ్వసించాము. అల్లాహ్‌యే ఉత్తముడు, ఎప్పటికీ మిగిలి ఉండేవాడు."
20:74  إِنَّهُ مَن يَأْتِ رَبَّهُ مُجْرِمًا فَإِنَّ لَهُ جَهَنَّمَ لَا يَمُوتُ فِيهَا وَلَا يَحْيَىٰ
అసలు విషయం ఏమిటంటే,అపరాధిగా అల్లాహ్‌ సన్నిధి లోకి వచ్చేవాడి కోసం నరకం ఉన్నది. అందులో అతను చావనూ లేడు బ్రతకనూ లేడు.
20:75  وَمَن يَأْتِهِ مُؤْمِنًا قَدْ عَمِلَ الصَّالِحَاتِ فَأُولَٰئِكَ لَهُمُ الدَّرَجَاتُ الْعُلَىٰ
మరెవరు ఆయన సన్నిధికి విశ్వాసిగా వస్తాడో, సత్కార్యాలు కూడా చేసి ఉంటాడో - అలాంటి వారి కోసం ఉన్నత తరగతులున్నాయి.
20:76  جَنَّاتُ عَدْنٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ وَذَٰلِكَ جَزَاءُ مَن تَزَكَّىٰ
శాశ్వతమైన స్వర్గవనాలున్నాయి. వాటి క్రింద సెలయేళ్లు ప్రవహిస్తుంటాయి. వాటిలో వారు కలకాలం ఉంటారు. పరిశుద్ధుడైన ప్రతి వ్యక్తికీ లభించే ప్రతిఫలం ఇదే.
20:77  وَلَقَدْ أَوْحَيْنَا إِلَىٰ مُوسَىٰ أَنْ أَسْرِ بِعِبَادِي فَاضْرِبْ لَهُمْ طَرِيقًا فِي الْبَحْرِ يَبَسًا لَّا تَخَافُ دَرَكًا وَلَا تَخْشَىٰ
"నా దాసులను రాత్రికి రాత్రే తీసుకుని బయలుదేరు. వారి కోసం సముద్రంలో పొడి త్రోవను ఏర్పరచుకో. ఎవరయినా వచ్చి పట్టుకుంటారేమోనని భీతిచెందకు. (ముంపుకు గురవుతామేమోనన్న) ఆందోళన కూడా అక్కరలేదు" అని మేము మూసాకు వహీ ద్వారా తెలిపాము.
20:78  فَأَتْبَعَهُمْ فِرْعَوْنُ بِجُنُودِهِ فَغَشِيَهُم مِّنَ الْيَمِّ مَا غَشِيَهُمْ
ఆ తరువాత ఫిరౌను తన సైన్యంతో వారిని వెంబడించాడు. అయితే సముద్రం వారందరినీ ఆవరించవలసిన విధంగానే ఆవరించింది.
20:79  وَأَضَلَّ فِرْعَوْنُ قَوْمَهُ وَمَا هَدَىٰ
ఫిరౌను తన జాతివారిని అపమార్గానికి లోను చేశాడు. వారికి సన్మార్గం చూపలేదు.
20:80  يَا بَنِي إِسْرَائِيلَ قَدْ أَنجَيْنَاكُم مِّنْ عَدُوِّكُمْ وَوَاعَدْنَاكُمْ جَانِبَ الطُّورِ الْأَيْمَنَ وَنَزَّلْنَا عَلَيْكُمُ الْمَنَّ وَالسَّلْوَىٰ
ఓ ఇస్రాయీలు వంశీయులారా! చూడండి! మేము మిమ్మల్ని మీ శత్రువు చెరనుండి విడిపించాము. తూరు పర్వతం కుడివైపు గురించి మీకు వాగ్దానం చేశాము.మీపై 'మన్న్‌' మరియు 'సల్వా' లను అవతరింపజేశాము.
20:81  كُلُوا مِن طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ وَلَا تَطْغَوْا فِيهِ فَيَحِلَّ عَلَيْكُمْ غَضَبِي ۖ وَمَن يَحْلِلْ عَلَيْهِ غَضَبِي فَقَدْ هَوَىٰ
మేము ప్రసాదించిన పవిత్రమైన ఆహార పదార్థాలను తినండి. అందులో మితి మీరకండి. మితిమీరితే మీపై నా ఆగ్రహం విరుచుకుపడుతుంది. నా ఆగ్రహం ఎవరిపై విరుచుకుపడినా వాడు పతనమైనట్టే.
20:82  وَإِنِّي لَغَفَّارٌ لِّمَن تَابَ وَآمَنَ وَعَمِلَ صَالِحًا ثُمَّ اهْتَدَىٰ
అయితే పశ్చాత్తాపం చెంది, విశ్వసించి, సత్కార్యాలు చేసి, ఆపై సన్మార్గంపై స్థిరంగా ఉన్న వారిని నేను అమితంగా క్షమిస్తాను.
20:83  وَمَا أَعْجَلَكَ عَن قَوْمِكَ يَا مُوسَىٰ
"ఓ మూసా! నిన్ను నీ జాతి వారి నుంచి (ఏమార్చి) ఇంత తొందరగా రావటానికి ప్రేరేపించిన విషయం ఏదీ?" (అని అల్లాహ్‌ కారణం అడిగాడు).
20:84  قَالَ هُمْ أُولَاءِ عَلَىٰ أَثَرِي وَعَجِلْتُ إِلَيْكَ رَبِّ لِتَرْضَىٰ
"వాళ్లూ నా వెనుకే వస్తున్నారు. ఇక నా విషయానికి వస్తే ఓ ప్రభూ! నువ్వు ప్రసన్నుడవు కావాలన్న ఉద్దేశంతోనే తొందరగా వచ్చేశాను" అని అతను అన్నాడు.
20:85  قَالَ فَإِنَّا قَدْ فَتَنَّا قَوْمَكَ مِن بَعْدِكَ وَأَضَلَّهُمُ السَّامِرِيُّ
"మేము నీ జాతి వారిని నీ వెనుక పరీక్షకు గురిచేశాము. సామిరీ (అనేవాడు) వాళ్లను పెడదారి పట్టించాడు" అని అల్లాహ్‌ సెలవిచ్చాడు.
20:86  فَرَجَعَ مُوسَىٰ إِلَىٰ قَوْمِهِ غَضْبَانَ أَسِفًا ۚ قَالَ يَا قَوْمِ أَلَمْ يَعِدْكُمْ رَبُّكُمْ وَعْدًا حَسَنًا ۚ أَفَطَالَ عَلَيْكُمُ الْعَهْدُ أَمْ أَرَدتُّمْ أَن يَحِلَّ عَلَيْكُمْ غَضَبٌ مِّن رَّبِّكُمْ فَأَخْلَفْتُم مَّوْعِدِي
మూసా ఆగ్రహోదగ్రుడై, దుఃఖవదనుడై జాతివారి వైపుకు తిరిగి వచ్చాడు. "ఓ నా జాతి ప్రజలారా! మీ ప్రభువు మీకు మంచి వాగ్దానం చేయలేదా?! ఆ గడువు మీకు మరీ అంత సుదీర్ఘం అనిపించిందా?! లేక మీ ప్రభువు ఆగ్రహం మీపై విరుచుకుపడాలనే మీరు కోరుకున్నారా? అందుకే మీరు నాకు చేసిన వాగ్దానానికి విరుద్ధంగా ప్రవర్తించారా?" అని ఆవేదన చెందాడు.
20:87  قَالُوا مَا أَخْلَفْنَا مَوْعِدَكَ بِمَلْكِنَا وَلَٰكِنَّا حُمِّلْنَا أَوْزَارًا مِّن زِينَةِ الْقَوْمِ فَقَذَفْنَاهَا فَكَذَٰلِكَ أَلْقَى السَّامِرِيُّ
దానికి వారు, "మేము నీకు ఇచ్చిన మాటను మా అంతట మేముగా జవదాటలేదు. మాపై వేయబడిన (ఫిరౌను) జనుల నగల భారాన్ని మేము తీసి (అగ్నిలో) పడవేశాము. అలాగే సామిరీ కూడా పడవేశాడు" (అని చెప్పారు).
20:88  فَأَخْرَجَ لَهُمْ عِجْلًا جَسَدًا لَّهُ خُوَارٌ فَقَالُوا هَٰذَا إِلَٰهُكُمْ وَإِلَٰهُ مُوسَىٰ فَنَسِيَ
ఆ తరువాత అతను (కరిగించిన నగలతో) ప్రజలకు ఒక ఆవుదూడ విగ్రహమును చేసి పెట్టాడు. అందులో నుంచి (అంబా అనే) శబ్దం వినవచ్చేది. దాన్ని చూసి, "ఇదే మీకూ, మూసాకూ ఆరాధ్య దైవం. కాకపోతే అతను (మూసా) మరచి పోయాడు" (అని వారు చెప్పసాగారు).
20:89  أَفَلَا يَرَوْنَ أَلَّا يَرْجِعُ إِلَيْهِمْ قَوْلًا وَلَا يَمْلِكُ لَهُمْ ضَرًّا وَلَا نَفْعًا
ఏమిటీ, అది వారు అడిగిన దానికి సమాధానం ఇవ్వజాలదనీ, తమకు ఎలాంటి కీడుగానీ, మేలుగానీ చేయలేదన్నసంగతిని వాళ్లు గమనించటం లేదా?
20:90  وَلَقَدْ قَالَ لَهُمْ هَارُونُ مِن قَبْلُ يَا قَوْمِ إِنَّمَا فُتِنتُم بِهِ ۖ وَإِنَّ رَبَّكُمُ الرَّحْمَٰنُ فَاتَّبِعُونِي وَأَطِيعُوا أَمْرِي
అంతకు ముందే హారూను (అలైహిస్సలాం) వారితో, "నా జాతి జనులారా! ఈ ఆవు దూడ ద్వారా మీరు సంకటస్థితిలో పడ్డారు. యదార్థానికి మీ నిజ ప్రభువు మాత్రం కరుణామయుడైన అల్లాహ్‌యే. కాబట్టి మీరందరూ నన్ను అనుసరించండి. నేను చెప్పినట్లు నమ్మి నడవండి" అని ప్రబోధించాడు.
20:91  قَالُوا لَن نَّبْرَحَ عَلَيْهِ عَاكِفِينَ حَتَّىٰ يَرْجِعَ إِلَيْنَا مُوسَىٰ
"మూసా తిరిగి వచ్చేవరకు మేము దీన్ని సేవించుకుంటూ ఉంటాము" అని వారు సమాధానమిచ్చారు.
20:92  قَالَ يَا هَارُونُ مَا مَنَعَكَ إِذْ رَأَيْتَهُمْ ضَلُّوا
"ఓ హారూన్‌! వీళ్లు పెడదారి పట్టడం చూస్తూ కూడా (ఊరుకున్నావా?) ఏ విషయం నిన్ను అడ్డుకుంది?
20:93  أَلَّا تَتَّبِعَنِ ۖ أَفَعَصَيْتَ أَمْرِي
"నువ్వు నా వెనుక రాలేదేమి? ఏమిటీ, నువ్వు కూడా నా ఆజ్ఞను ఎదిరించావా?" అని మూసా అడిగారు.
20:94  قَالَ يَا ابْنَ أُمَّ لَا تَأْخُذْ بِلِحْيَتِي وَلَا بِرَأْسِي ۖ إِنِّي خَشِيتُ أَن تَقُولَ فَرَّقْتَ بَيْنَ بَنِي إِسْرَائِيلَ وَلَمْ تَرْقُبْ قَوْلِي
"ఓ నా మాతా పుత్రుడా! నా గడ్డాన్ని పట్టుకోకు. నా జుత్తు పట్టి లాగకు. 'నువ్వు ఇస్రాయీలు సంతతిలో చీలిక తెచ్చావు. నా ఉత్తర్వుకోసం నిరీక్షించలేదు'అని నువ్వు అంటావేమోనన్న భయంతో ఆగిపోయాను" అని హారూన్‌ వివరించాడు.
20:95  قَالَ فَمَا خَطْبُكَ يَا سَامِرِيُّ
"సామిరీ! ఇక నీ సంగతేమిటీ?" అని (మూసా) అడిగాడు.
20:96  قَالَ بَصُرْتُ بِمَا لَمْ يَبْصُرُوا بِهِ فَقَبَضْتُ قَبْضَةً مِّنْ أَثَرِ الرَّسُولِ فَنَبَذْتُهَا وَكَذَٰلِكَ سَوَّلَتْ لِي نَفْسِي
"వారు చూడని దాన్ని నేను చూశాను. నేను దైవసందేశవాహకుని పాద ముద్రలో నుంచి ఒక పిడికెడు మన్ను తీసుకుని అందులో వేశాను. నా మనసు కూడా నాకు దీనిని సరైనదిగా సూచింపజేసింది" అని అతను జవాబిచ్చాడు.
20:97  قَالَ فَاذْهَبْ فَإِنَّ لَكَ فِي الْحَيَاةِ أَن تَقُولَ لَا مِسَاسَ ۖ وَإِنَّ لَكَ مَوْعِدًا لَّن تُخْلَفَهُ ۖ وَانظُرْ إِلَىٰ إِلَٰهِكَ الَّذِي ظَلْتَ عَلَيْهِ عَاكِفًا ۖ لَّنُحَرِّقَنَّهُ ثُمَّ لَنَنسِفَنَّهُ فِي الْيَمِّ نَسْفًا
అప్పుడు మూసా,"సరే! ఇక్కణ్ణుంచి వెళ్ళిపో. నీకు శిక్ష ఏమిటంటే, నీవు జీవితాంతం 'అమ్మో నన్ను ముట్టుకోకండి' అని అంటూ ఉంటావు. నీ నుంచి ఎట్టి పరిస్థితిలోనూ తప్పిపోని వాగ్దానం మరొకటి కూడా నీ కోసం ఉంది. ఇన్నాళ్ళూ నువ్వు అంటిపెట్టుకుని ఉన్న నీ ఆరాధ్య దేవునికి పట్టే గతేమిటో కూడా చూసుకో. మేము దాన్ని కాల్చి, భస్మం చేసి సముద్రంలో విసిరేస్తాము" అన్నాడు.
20:98  إِنَّمَا إِلَٰهُكُمُ اللَّهُ الَّذِي لَا إِلَٰهَ إِلَّا هُوَ ۚ وَسِعَ كُلَّ شَيْءٍ عِلْمًا
యదార్థమేమిటంటే మీ అందరి ఆరాధ్యదైవం అల్లాహ్‌ మాత్రమే. ఆయన తప్ప వేరొక ఆరాధ్య దైవం లేనే లేడు. ఆయన జ్ఞానం అన్నింటినీ ఆవరించి ఉంది" (అని చెప్పాడు).
20:99  كَذَٰلِكَ نَقُصُّ عَلَيْكَ مِنْ أَنبَاءِ مَا قَدْ سَبَقَ ۚ وَقَدْ آتَيْنَاكَ مِن لَّدُنَّا ذِكْرًا
(ఓ ముహమ్మద్‌!) ఈ విధంగా మేము పూర్వం జరిగిన ఘటనలను నీకు వివరిస్తూ ఉన్నాము. నిశ్చయంగా మేము నీకు మా వద్ద నుండి ఒక హితోపదేశాన్ని ఇచ్చి ఉన్నాము.
20:100  مَّنْ أَعْرَضَ عَنْهُ فَإِنَّهُ يَحْمِلُ يَوْمَ الْقِيَامَةِ وِزْرًا
దీనిపట్ల విముఖత చూపినవాడు ప్రళయదినాన పెద్ద (పాప) భారం మోస్తాడు.
20:101  خَالِدِينَ فِيهِ ۖ وَسَاءَ لَهُمْ يَوْمَ الْقِيَامَةِ حِمْلًا
అందులో వాడు శాశ్వతంగా చిక్కుకుపోతాడు. అలాంటి వారి కోసం ప్రళయ దినాన మహా చెడ్డ బరువు ఉంటుంది.
20:102  يَوْمَ يُنفَخُ فِي الصُّورِ ۚ وَنَحْشُرُ الْمُجْرِمِينَ يَوْمَئِذٍ زُرْقًا
శంఖం ఊదబడే రోజు - మేము అపరాధులను ఆ రోజు (భయం మూలంగా) కళ్లు నీలి రంగులోకి మారి పోయిన స్థితిలో సమీకరిస్తాము.
20:103  يَتَخَافَتُونَ بَيْنَهُمْ إِن لَّبِثْتُمْ إِلَّا عَشْرًا
వారు పరస్పరం, "మనం (ప్రపంచంలో) పది రోజులకన్నా ఎక్కువ ఉండి ఉండం" అని గుసగుసలాడుకుంటూ ఉంటారు.
20:104  نَّحْنُ أَعْلَمُ بِمَا يَقُولُونَ إِذْ يَقُولُ أَمْثَلُهُمْ طَرِيقَةً إِن لَّبِثْتُمْ إِلَّا يَوْمًا
వారేం చెప్పుకుంటున్నారో మాకు బాగా తెలుసు. వారిలో (ధార్మికంగా) అందరికన్నా మంచి పద్ధతిపై ఉన్నవాడు, "అసలు మీరు ఒక్క రోజు మాత్రమే ఉన్నారు" అంటాడు.
20:105  وَيَسْأَلُونَكَ عَنِ الْجِبَالِ فَقُلْ يَنسِفُهَا رَبِّي نَسْفًا
వారు నిన్ను పర్వతాల పరిస్థితి గురించి అడుగుతున్నారు. వారికిలా చెప్పు: "నా ప్రభువు వాటిని తుత్తునియలుగా చేసి ఎగురవేస్తాడు.
20:106  فَيَذَرُهَا قَاعًا صَفْصَفًا
"మరి భూమిని చదునైన మైదానంగా చేసివేస్తాడు.
20:107  لَّا تَرَىٰ فِيهَا عِوَجًا وَلَا أَمْتًا
"అందులో నీకు ఎలాంటి వంకరలు గానీ, మెట్టపల్లాలు గానీ కానరావు."
20:108  يَوْمَئِذٍ يَتَّبِعُونَ الدَّاعِيَ لَا عِوَجَ لَهُ ۖ وَخَشَعَتِ الْأَصْوَاتُ لِلرَّحْمَٰنِ فَلَا تَسْمَعُ إِلَّا هَمْسًا
ఆ రోజు వారందరూ పిలిచేవాని వెనుక పడిపోతుంటారు. అందులో (ఆ అనుసరణలో) ఎలాంటి వంకరతనం ఉండదు. కరుణామయుడైన అల్లాహ్‌ సమక్షంలో అందరి కంఠస్వరాలు తగ్గిపోయి ఉంటాయి. గుసగుసలు తప్ప నీకు మరొకటి వినిపించదు.
20:109  يَوْمَئِذٍ لَّا تَنفَعُ الشَّفَاعَةُ إِلَّا مَنْ أَذِنَ لَهُ الرَّحْمَٰنُ وَرَضِيَ لَهُ قَوْلًا
ఆ రోజు కరుణామయుడు ఎవరికయినా అనుమతించి, అతని మాటను (వినడానికి) ఇష్టపడితే తప్ప - ఎవరి సిఫారసూ చెల్లనేరదు.
20:110  يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا يُحِيطُونَ بِهِ عِلْمًا
వారికి ముందూ వెనుకా ఉన్న స్థితిని గురించి అల్లాహ్‌కు మాత్రమే తెలుసు. అయితే వారికి మాత్రం ఆయన్ని గురించి పూర్తిగా తెలీదు.
20:111  وَعَنَتِ الْوُجُوهُ لِلْحَيِّ الْقَيُّومِ ۖ وَقَدْ خَابَ مَنْ حَمَلَ ظُلْمًا
(ఆనాడు) అందరి ముఖాలు సజీవుడు, నిత్యుడు అయిన అల్లాహ్‌ ఎదుట పూర్తిగా క్రిందికి వాలి ఉంటాయి. నిశ్చయంగా దుర్మార్గం (బరువు) మోసేవాడు నాశనమవుతాడు.
20:112  وَمَن يَعْمَلْ مِنَ الصَّالِحَاتِ وَهُوَ مُؤْمِنٌ فَلَا يَخَافُ ظُلْمًا وَلَا هَضْمًا
ఇక సత్కార్యాలు చేసినవాడు; అతను విశ్వాసి కూడా అయివుంటే - అతనికి అన్యాయం జరుగుతుందన్న జంకుగానీ, తన హక్కు కాజేయబడుతుందన్న భీతిగానీ ఉండదు.
20:113  وَكَذَٰلِكَ أَنزَلْنَاهُ قُرْآنًا عَرَبِيًّا وَصَرَّفْنَا فِيهِ مِنَ الْوَعِيدِ لَعَلَّهُمْ يَتَّقُونَ أَوْ يُحْدِثُ لَهُمْ ذِكْرًا
ఇదే విధంగా (ఓ ప్రవక్తా!) మేము దీనిని నీపై అరబ్బీ ఖుర్‌ఆన్‌గా అవతరింపజేశాము. ప్రజలు భయభక్తులు కలిగి ఉండగలందులకు, లేదా వారిలో ధర్మచింతన రేకెత్తేందుకుపలు విధాలుగా ఇందులో భయబోధ చేశాము.
20:114  فَتَعَالَى اللَّهُ الْمَلِكُ الْحَقُّ ۗ وَلَا تَعْجَلْ بِالْقُرْآنِ مِن قَبْلِ أَن يُقْضَىٰ إِلَيْكَ وَحْيُهُ ۖ وَقُل رَّبِّ زِدْنِي عِلْمًا
కనుక నిజ సామ్రాట్టు అయిన అల్లాహ్‌యే సర్వోన్నతుడు. నీ వద్దకు పంపబడే 'వహీ'(దైవవాణి) పూర్తి కానంత వరకూ నువ్వు ఖుర్‌ఆన్‌ పఠించటంలో తొందరపడకు. అయితే "ప్రభూ! నా జ్ఞానాన్ని పెంచు" అని మాత్రం వేడుకో.
20:115  وَلَقَدْ عَهِدْنَا إِلَىٰ آدَمَ مِن قَبْلُ فَنَسِيَ وَلَمْ نَجِدْ لَهُ عَزْمًا
మేము ఆదమ్‌కు ముందే గట్టిగా తాకీదు చేశాము. కాని అతను మరచిపోయాడు. మాకు అతనిలో సంకల్పబలం కనిపించ లేదు.
20:116  وَإِذْ قُلْنَا لِلْمَلَائِكَةِ اسْجُدُوا لِآدَمَ فَسَجَدُوا إِلَّا إِبْلِيسَ أَبَىٰ
"ఆదమ్‌కు సాష్టాంగపడండి" అని మేము దైవదూతలతో అన్నప్పుడు ఇబ్లీసు తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. వాడు మాత్రం స్పష్టంగా నిరాకరించాడు.
20:117  فَقُلْنَا يَا آدَمُ إِنَّ هَٰذَا عَدُوٌّ لَّكَ وَلِزَوْجِكَ فَلَا يُخْرِجَنَّكُمَا مِنَ الْجَنَّةِ فَتَشْقَىٰ
అప్పుడు మేము ఇలా అన్నాము: "ఓ ఆదమ్‌! వీడు నీకూ, నీ భార్యకూ బద్ధ విరోధి. (జాగ్రత్త!) వాడు మీరిద్దరినీ స్వర్గం నుంచి వెళ్లగొట్టే స్థితి రాకూడదు సుమా! ఒకవేళ అదేగనక జరిగితే నువ్వు కష్టాల్లో పడాల్సివస్తుంది.
20:118  إِنَّ لَكَ أَلَّا تَجُوعَ فِيهَا وَلَا تَعْرَىٰ
"(ఇక్కడ నువ్వు ఎంతో హాయిగా ఉన్నావు). ఇక్కడ నీకు ఆకలీ ఉండదు, నువ్వు నగ్నంగానూ ఉండవు."
20:119  وَأَنَّكَ لَا تَظْمَأُ فِيهَا وَلَا تَضْحَىٰ
"నీకు దప్పికగానీ,ఎండ బాధగానీ ఉండదు."
20:120  فَوَسْوَسَ إِلَيْهِ الشَّيْطَانُ قَالَ يَا آدَمُ هَلْ أَدُلُّكَ عَلَىٰ شَجَرَةِ الْخُلْدِ وَمُلْكٍ لَّا يَبْلَىٰ
మరి షైతాను అతన్ని కవ్వించాడు. "ఓ ఆదమ్‌! నేను నీకు శాశ్వత జీవితాన్ని ప్రసాదించే వృక్షాన్ని, ఎన్నటికీ పాతబడని సామ్రాజ్యాన్ని చూపించనా?!" అన్నాడు.
20:121  فَأَكَلَا مِنْهَا فَبَدَتْ لَهُمَا سَوْآتُهُمَا وَطَفِقَا يَخْصِفَانِ عَلَيْهِمَا مِن وَرَقِ الْجَنَّةِ ۚ وَعَصَىٰ آدَمُ رَبَّهُ فَغَوَىٰ
ఆ విధంగా వారిద్దరూ ఆ వృక్షం నుండి (ఫలం) తినగానే వారి మర్మస్థానాలు బహిర్గతమైపోయాయి. వారిద్దరూ స్వర్గంలోని ఆకులతో వాటిని కప్పుకోసాగారు. ఆదమ్‌ తన ప్రభువు మాటను జవదాటి, దారి తప్పాడు.
20:122  ثُمَّ اجْتَبَاهُ رَبُّهُ فَتَابَ عَلَيْهِ وَهَدَىٰ
దరిమిలా అతని ప్రభువు అతన్ని ఎన్నుకున్నాడు. అతని పశ్చాత్తాపాన్ని స్వీకరించాడు. అతనికి మార్గం చూపాడు.
20:123  قَالَ اهْبِطَا مِنْهَا جَمِيعًا ۖ بَعْضُكُمْ لِبَعْضٍ عَدُوٌّ ۖ فَإِمَّا يَأْتِيَنَّكُم مِّنِّي هُدًى فَمَنِ اتَّبَعَ هُدَايَ فَلَا يَضِلُّ وَلَا يَشْقَىٰ
(అల్లాహ్‌) ఇలా సెలవిచ్చాడు : "మీరిద్దరూ ఇక్కణ్ణుంచి దిగిపోండి. మీరు ఒండొకరికి శత్రువులు. ఇకమీదట మీ వద్దకు నా నుండి మార్గదర్శకత్వం గనక వస్తే, నా మార్గాన్ని అవలంబించే వాడు దారి తప్పటంగానీ, ప్రయాసకు లోనవటంగానీ జరగదు.
20:124  وَمَنْ أَعْرَضَ عَن ذِكْرِي فَإِنَّ لَهُ مَعِيشَةً ضَنكًا وَنَحْشُرُهُ يَوْمَ الْقِيَامَةِ أَعْمَىٰ
అయితే నా ధ్యానం పట్ల విముఖత చూపినవాడి బ్రతుకు దుర్భరమైపోతుంది. ప్రళయదినాన మేమతన్ని గుడ్డివానిగా చేసి లేపుతాము."
20:125  قَالَ رَبِّ لِمَ حَشَرْتَنِي أَعْمَىٰ وَقَدْ كُنتُ بَصِيرًا
"ప్రభూ! నన్ను గుడ్డివానిగా చేసి లేపారేమిటీ? నాకు చూపు ఉండేదికదా!" అని అతను అంటాడు.
20:126  قَالَ كَذَٰلِكَ أَتَتْكَ آيَاتُنَا فَنَسِيتَهَا ۖ وَكَذَٰلِكَ الْيَوْمَ تُنسَىٰ
"జరగవలసిన విధంగానే జరిగింది. (ఒకప్పుడు) నీ వద్దకు వచ్చిన మా ఆయతులను (వచనాలను, సూచనలను, మహిమలను) నువ్వు విస్మరించావు. అందుకే ఈనాడు నువ్వు కూడా విస్మరించబడుతున్నావు" అని అనబడుతుంది.
20:127  وَكَذَٰلِكَ نَجْزِي مَنْ أَسْرَفَ وَلَمْ يُؤْمِن بِآيَاتِ رَبِّهِ ۚ وَلَعَذَابُ الْآخِرَةِ أَشَدُّ وَأَبْقَىٰ
హద్దుమీరిపోయి, తన ప్రభువు ఆయతులను విశ్వసించేందుకు నిరాకరించిన ప్రతి ఒక్కరికీ మేము ఇటువంటి ప్రతిఫలాన్నే ఇస్తాము. నిశ్చయంగా పరలోక శిక్ష ఇంతకన్నా కఠినమైనది, ఎప్పటికీ ఉండేది.
20:128  أَفَلَمْ يَهْدِ لَهُمْ كَمْ أَهْلَكْنَا قَبْلَهُم مِّنَ الْقُرُونِ يَمْشُونَ فِي مَسَاكِنِهِمْ ۗ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّأُولِي النُّهَىٰ
వీరికి పూర్వం ఎన్నో సమూహాలను మేము తుదముట్టించాము. వారి నివాస స్థలాలలో (ప్రస్తుతం) వీళ్లు తిరుగుతున్నారు. ఈ విషయం కూడా వారికి సన్మార్గం చూపటం లేదా? నిశ్చయంగా ఇందులో వివేచన గల వారి కొరకు ఎన్నో సూచనలున్నాయి.
20:129  وَلَوْلَا كَلِمَةٌ سَبَقَتْ مِن رَّبِّكَ لَكَانَ لِزَامًا وَأَجَلٌ مُّسَمًّى
నీ ప్రభువు తరఫు నుంచి మాట ముందే ఖరారు కాకుండా, గడువు ముందుగానే నిర్థారించబడకుండా ఉన్నట్లయితే ఇప్పటికిప్పుడే వీళ్లకు, శిక్ష అంటుకొని ఉండేది.
20:130  فَاصْبِرْ عَلَىٰ مَا يَقُولُونَ وَسَبِّحْ بِحَمْدِ رَبِّكَ قَبْلَ طُلُوعِ الشَّمْسِ وَقَبْلَ غُرُوبِهَا ۖ وَمِنْ آنَاءِ اللَّيْلِ فَسَبِّحْ وَأَطْرَافَ النَّهَارِ لَعَلَّكَ تَرْضَىٰ
కనుక (ఓ ముహమ్మద్‌!) వారు కల్పించే మాటలపై ఓర్పు వహించు. నీ ప్రభువు స్తోత్రంతో పాటు,ఆయన పవిత్రతను కొనియాడు. సూర్యోదయం కాకముందు, సూర్యాస్తమయానికి ముందు, రాత్రివేళల్లోనూ, పగటి అంచుల్లోనూ ప్రభువును ధ్యానిస్తూ ఉండు. తద్వారా నువ్వు సంతృప్తి చెందే అవకాశం ఉంది.
20:131  وَلَا تَمُدَّنَّ عَيْنَيْكَ إِلَىٰ مَا مَتَّعْنَا بِهِ أَزْوَاجًا مِّنْهُمْ زَهْرَةَ الْحَيَاةِ الدُّنْيَا لِنَفْتِنَهُمْ فِيهِ ۚ وَرِزْقُ رَبِّكَ خَيْرٌ وَأَبْقَىٰ
వారిలోని పలు రకాల జనులకు మేము ఇచ్చిన ప్రాపంచిక జీవిత వైభవాల వైపు ఆశగా చూడకు. వాటి ద్వారా వాళ్లను పరీక్షించటానికే మేము ఆ వస్తువులను వారికి ఇచ్చాము. వాస్తవానికి నీ ప్రభువు ప్రసాదించిన ఉపాధి మాత్రమే మేలైనది, మిగిలి ఉండేదీను.
20:132  وَأْمُرْ أَهْلَكَ بِالصَّلَاةِ وَاصْطَبِرْ عَلَيْهَا ۖ لَا نَسْأَلُكَ رِزْقًا ۖ نَّحْنُ نَرْزُقُكَ ۗ وَالْعَاقِبَةُ لِلتَّقْوَىٰ
నీ కుటుంబీకులకు నమాజు గురించి తాకీదు చెయ్యి. నువ్వు సయితం దానిపై స్థిరంగా ఉండు. మేము నీ నుంచి ఉపాధిని అడగటంలేదు. పైగా మేమే నీకు ఉపాధిని ఇస్తున్నాము. చివరికి మంచి జరిగేది భయభక్తులకే.
20:133  وَقَالُوا لَوْلَا يَأْتِينَا بِآيَةٍ مِّن رَّبِّهِ ۚ أَوَلَمْ تَأْتِهِم بَيِّنَةُ مَا فِي الصُّحُفِ الْأُولَىٰ
"ఈయనగారు తన ప్రభువు తరఫు నుంచి మా దగ్గరకు ఏదన్నా నిదర్శనాన్ని ఎందుకు తీసుకురాడు?" అని వారు అంటున్నారు. ఏమిటీ, పూర్వ గ్రంథాల స్పష్టమైన నిదర్శనం వారి వద్దకు చేరలేదా?
20:134  وَلَوْ أَنَّا أَهْلَكْنَاهُم بِعَذَابٍ مِّن قَبْلِهِ لَقَالُوا رَبَّنَا لَوْلَا أَرْسَلْتَ إِلَيْنَا رَسُولًا فَنَتَّبِعَ آيَاتِكَ مِن قَبْلِ أَن نَّذِلَّ وَنَخْزَىٰ
ఒకవేళ మేము ఇతని (రాక)కి ముందే, ఏదైనా శిక్ష ద్వారా వాళ్ళను అంతమొందించి ఉంటే, "మా ప్రభూ! నువ్వు మా వద్దకు ప్రవక్తను ఎందుకు పంపలేదు? పంపి ఉంటే మేము పరాభవానికి, అవమానానికి లోనవకముందే నీ సూచనలను అనుసరించి ఉండేవాళ్ళం కదా!" అని తప్పకుండా అని ఉండేవారు.
20:135  قُلْ كُلٌّ مُّتَرَبِّصٌ فَتَرَبَّصُوا ۖ فَسَتَعْلَمُونَ مَنْ أَصْحَابُ الصِّرَاطِ السَّوِيِّ وَمَنِ اهْتَدَىٰ
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : "ప్రతి ఒక్కడూ (ఫలితం కోసం) నిరీక్షిస్తున్నాడు. కాబట్టి మీరు కూడా నిరీక్షించండి. సన్మార్గాన ఉన్నదెవరో, మార్గదర్శకత్వం ఎవరు పొందారో త్వరలోనే మీరు తెలుసుకుంటారు.


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.