aip_quran
Translation

  العربية              తెలుగు  

1. సూరా అల్ ఫాతిహా
2. సూరా అల్ బఖర
3. సూరా ఆలి ఇమ్రాన్
4. సూరా అన్ నిసా
5. సూరా అల్ మాయిద
6. సూరా అల్ అన్ ఆమ్
7. సూరా అల్ ఆరాఫ్
8. సూరా అల్ అన్ ఫాల్
9. సూరా అత్ తౌబా
10. సూరా యూనుస్
11. సూరా హూద్
12. సూరా యూసుఫ్
13. సూరా ఆర్ రాద్
14. సూరా ఇబ్రహీం
15. సూరా అల్ హిజ్ర్
16. సూరా అన్ నహ్ల్
17. సూరా బనీ ఇస్రాయీల్
18. సూరా అల్ కహఫ్
19. సూరా మర్యం
20. సూరా తాహా
21. సూరా అల్ అంబియా
22. సూరా అల్ హజ్
23. సూరా అల్ మూ ‘మినూన్
24. సూరా అన్ నూర్
25. సూరా అల్ ఫుర్ఖాన్
26. సూరా ఆష్ షుఅరా
27. సూరా అన్ నమ్ల్
28. సూరా అల్ ఖసస్
29. సూరా అల్ అన్ కబూత్
30. సూరా ఆర్ రూమ్
31. సూరా లుక్మాన్
32. సూరా అస్ సజ్ ద హ్
33. సూరా అల్ ఆహ్ జాబ్
34. సూరా సబా
35. సూరా ఫాతిర్
36. సూరా యాసీన్
37. సూరా అస్ సాఫ్ఫాత్
38. సూరా సాద్
39. సూరా అజ్ జుమర్
40. సూరా అల్ మూమిన్
41. సూరా హామీమ్ అస్ సజ్ ద హ్
42. సూరా ఆష్ షూరా
43. సూరా అజ్ జుఖ్ రుఫ్
44. సూరా అద్ దుఖాన్
45. సూరా అల్ జాసియ హ్
46. సూరా అల్ ఆహ్ ఖాఫ్
47. సూరా ముహమ్మద్
48. సూరా అల్ ఫతహ్
49. సూరా అల్ హుజురాత్
50. సూరా ఖాఫ్
51. సూరా అజ్ జారియాత్
52. సూరా అత్ తూర్
53. సూరా అన్ నజ్మ్
54. సూరా అల్ ఖమర్
55. సూరా ఆర్ రహ్మాన్
56. సూరా వాఖియహ్
57. సూరా అల్ హదీద్
58. సూరా అల్ ముజాదల హ్
59. సూరా అల్ హష్ర్
60. సూరా అల్ ముమ్ తహిన హ్
61. సూరా అస్ సఫ్
62. సూరాఅల్ జుముఅ హ్
63. సూరా అల్ మునాఫిఖూన్
64. సూరా అత్ తగాబున్
65. సూరా అత్ తలాఖ్
66. సూరా అత్ తహ్రీం
67. సూరా అల్ ముల్క్
68. సూరా అల్ ఖలమ్
69. సూరా అల్ హఖ్ఖ
70. సూరా అల్ ముఆరిజ్
71. సూరా నూహ్
72. సూరా అల్ జిన్న్
73. సూరా అల్ ముజ్జమ్మిల్
74. సూరా అల్ ముద్దస్సిర్
75. సూరా అల్ ఖియామ హ్
76. సూరా అద్ దహ్ర్
77. సూరా అల్ ముర్సలాత్
78. సూరా అన్ నబా
79. సూరా అన్ నాజి ఆత్
80. సూరా అబస
81. సూరా అత్ తక్వీర్
82. సూరా అల్ ఇన్ ఫితార్
83. సూరాఅల్ ముతఫ్ఫిఫీన్
84. సూరా అల్ ఇన్ షి ఖాక్
85. సూరా అల్ బురూజ్
86. సూరా అత్ తారిఖ్
87. సూరా అల్ ఆలా
88. సూరా అల్ గాషియ హ్
89. సూరా అల్ ఫజ్ర్
90. సూరా అల్ బలద్
91. సూరా ఆష్ షమ్స్
92. సూరా అల్ లైల్
93. సూరా అజ్ జుహా
94. సూరా ఆలమ్ నష్ర్
95. సూరా అత్ తతీన్
96. సూరా అల్ అలఖ్
97. సూరా అల్ ఖద్ర్
98. సూరా అల్ బయ్యిన హ్
99. సూరా అజ్ జిలజాల్
100. సూరా అల్ ఆదియాత్
101. సూరా అల్ ఖారియ హ్
102. సూరా అత్ తకాసుర్
103. సూరా అల్ అస్ర్
104. సూరా అల్ హుమజా హ్
105. సూరా అల్ ఫీల్
106. సూరా ఖురైష్
107. సూరా అల్ మాఊ న్
108. సూరా అల్ కౌసర్
109. సూరా అల్ ఖాఫిరూన్
110. సూరా అన్ నస్ర్
111. సూరా అల్ లహబ్
112. సూరా అల్ ఇఖ్లాస్
113. సూరా అల్ ఫలఖ్
114. సూరా అన్ నాస్

14. సూరా ఇబ్రహీం

14:1  الر ۚ كِتَابٌ أَنزَلْنَاهُ إِلَيْكَ لِتُخْرِجَ النَّاسَ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ بِإِذْنِ رَبِّهِمْ إِلَىٰ صِرَاطِ الْعَزِيزِ الْحَمِيدِ
అలిఫ్‌ లామ్‌ రా. (ఓ ముహమ్మద్‌ - సఅసం!) నువ్వు ప్రజలను అంధకారాల నుంచి వెలికి తీసి కాంతి వైపుకు తీసుకురావటానికి మహోన్నతమైన ఈ గ్రంథాన్ని మేము నీ వైపు పంపాము - వారి ప్రభువు ఆజ్ఞపై. తిరుగులేనివాడు, స్తోత్రములకు అర్హుడైన వాని మార్గం వైపుకు (తీసుకురావటానికి).
14:2  اللَّهِ الَّذِي لَهُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ ۗ وَوَيْلٌ لِّلْكَافِرِينَ مِنْ عَذَابٍ شَدِيدٍ
ఆకాశాలలో, భూమిలో ఉన్న సమస్తమూ ఆ అల్లాహ్‌దే. తిరస్కారుల కొరకు కఠిన శిక్ష మూలంగా వినాశం ఉంది.
14:3  الَّذِينَ يَسْتَحِبُّونَ الْحَيَاةَ الدُّنْيَا عَلَى الْآخِرَةِ وَيَصُدُّونَ عَن سَبِيلِ اللَّهِ وَيَبْغُونَهَا عِوَجًا ۚ أُولَٰئِكَ فِي ضَلَالٍ بَعِيدٍ
వారు పరలోకానికి బదులు ప్రాపంచిక జీవితాన్నే ప్రేమిస్తున్నారు. అల్లాహ్‌ మార్గం నుంచి (ప్రజలను)ఆపుతూ అందులో వక్రతను సృజించగోర్తున్నారు. మార్గభ్రష్టతలో వారు చాలా దూరం వెళ్ళిపోయారు.
14:4  وَمَا أَرْسَلْنَا مِن رَّسُولٍ إِلَّا بِلِسَانِ قَوْمِهِ لِيُبَيِّنَ لَهُمْ ۖ فَيُضِلُّ اللَّهُ مَن يَشَاءُ وَيَهْدِي مَن يَشَاءُ ۚ وَهُوَ الْعَزِيزُ الْحَكِيمُ
మేము ఏ ప్రవక్తను పంపినా, అతడు విషయాన్ని స్పష్టంగా విడమరచి చెప్పడానికి వీలుగా తన జాతి వారి భాషలో మాట్లాడే వానిగా చేసి పంపాము. ఆపైన అల్లాహ్‌ తాను కోరినవారిని అపమార్గం పట్టిస్తాడు, తాను కోరిన వారికి సన్మార్గం చూపిస్తాడు. ఆయన సర్వాధిక్యుడు, వివేకవంతుడు.
14:5  وَلَقَدْ أَرْسَلْنَا مُوسَىٰ بِآيَاتِنَا أَنْ أَخْرِجْ قَوْمَكَ مِنَ الظُّلُمَاتِ إِلَى النُّورِ وَذَكِّرْهُم بِأَيَّامِ اللَّهِ ۚ إِنَّ فِي ذَٰلِكَ لَآيَاتٍ لِّكُلِّ صَبَّارٍ شَكُورٍ
మేము మూసాకు మా సూచనలిచ్చి పంపుతూ, "నువ్వు నీ జాతి వారిని అంధకారాల నుంచి - వెలికి తీసి - వెలుగులోకి తీసుకురా. అల్లాహ్‌ యొక్క మహోపకారాలను వారికి జ్ఞాపకం చేయి" అని చెప్పిన సందర్భాన్ని (గుర్తుకు తెచ్చుకోండి). నిశ్చయంగా ఇందులో సహనమూర్తులు, కృతజ్ఞతా మనస్కులైన ప్రతి ఒక్కరికీ సూచనలు ఉన్నాయి.
14:6  وَإِذْ قَالَ مُوسَىٰ لِقَوْمِهِ اذْكُرُوا نِعْمَةَ اللَّهِ عَلَيْكُمْ إِذْ أَنجَاكُم مِّنْ آلِ فِرْعَوْنَ يَسُومُونَكُمْ سُوءَ الْعَذَابِ وَيُذَبِّحُونَ أَبْنَاءَكُمْ وَيَسْتَحْيُونَ نِسَاءَكُمْ ۚ وَفِي ذَٰلِكُم بَلَاءٌ مِّن رَّبِّكُمْ عَظِيمٌ
మూసా తన జాతి వారితో ఇలా అన్నప్పటి విషయం కూడా గుర్తుంచుకోదగినదే: "అల్లాహ్‌ మీకు చేసిన మేళ్ళను జ్ఞాపకం చేసుకోండి - మిమ్మల్ని తీవ్రంగా వేధిస్తూ ఉన్న ఫిరౌను జనుల చెర నుండి ఆయన మీకు విముక్తిని కల్పించాడు. వారు మీ కొడుకులను చంపేసి, మీ స్త్రీలను మాత్రమే బ్రతకనిచ్చేవారు. ఇది మీకు మీ ప్రభువు తరఫున పెద్ద పరీక్షగా ఉండేది."
14:7  وَإِذْ تَأَذَّنَ رَبُّكُمْ لَئِن شَكَرْتُمْ لَأَزِيدَنَّكُمْ ۖ وَلَئِن كَفَرْتُمْ إِنَّ عَذَابِي لَشَدِيدٌ
"మీరు గనక కృతజ్ఞులుగా మెలిగితే, నేను మీకు మరింత అధికంగా అనుగ్రహిస్తాను. ఒకవేళ మీరు గనక (చేసిన) మేలును మరచిపోతే నిశ్చయంగా నా శిక్ష చాలా కఠినమైనది (అని మరువకండి)" అని మీ ప్రభువు మిమ్మల్ని సావధానపరచిన విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోండి!
14:8  وَقَالَ مُوسَىٰ إِن تَكْفُرُوا أَنتُمْ وَمَن فِي الْأَرْضِ جَمِيعًا فَإِنَّ اللَّهَ لَغَنِيٌّ حَمِيدٌ
మూసా ఇంకా ఇలా అన్నాడు: "ఒకవేళ మీరూ, భూమండలంలోని వారందరూ కూడా దేవుని పట్ల, మేలును మరచి ప్రవర్తించినా (ఆయనకు వాటిల్లే నష్టం ఏమీ లేదు) ఆయన ఏ అక్కరా లేనివాడు, ప్రశంసనీయుడు."
14:9  أَلَمْ يَأْتِكُمْ نَبَأُ الَّذِينَ مِن قَبْلِكُمْ قَوْمِ نُوحٍ وَعَادٍ وَثَمُودَ ۛ وَالَّذِينَ مِن بَعْدِهِمْ ۛ لَا يَعْلَمُهُمْ إِلَّا اللَّهُ ۚ جَاءَتْهُمْ رُسُلُهُم بِالْبَيِّنَاتِ فَرَدُّوا أَيْدِيَهُمْ فِي أَفْوَاهِهِمْ وَقَالُوا إِنَّا كَفَرْنَا بِمَا أُرْسِلْتُم بِهِ وَإِنَّا لَفِي شَكٍّ مِّمَّا تَدْعُونَنَا إِلَيْهِ مُرِيبٍ
ఏమిటీ, మీకు పూర్వం గతించిన వారి సమాచారాలు మీకు చేరలేదా? నూహ్‌ జాతి, ఆద్‌, సమూదు జాతి, ఇంకా వాటి తరువాత వచ్చిన వారి సంగతులు, వారి గురించి అల్లాహ్‌కు తప్ప ఇంకెవరికీ తెలియదు. వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలు తీసుకుని వచ్చారు. కాని వాళ్ళు తమ చేతులను తమ నోటిలో పెట్టుకున్నారు. "మీకు ఏ విషయం ఇచ్చి పంపటం జరిగిందో దాన్ని మేము తిరస్కరిస్తున్నాము. ఏ విషయం వైపుకు మీరు మమ్మల్ని పిలుస్తున్నారో దానిపై మాకు తీవ్రమైన సందేహం ఉంది" అని అన్నారు.
14:10  قَالَتْ رُسُلُهُمْ أَفِي اللَّهِ شَكٌّ فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ ۖ يَدْعُوكُمْ لِيَغْفِرَ لَكُم مِّن ذُنُوبِكُمْ وَيُؤَخِّرَكُمْ إِلَىٰ أَجَلٍ مُّسَمًّى ۚ قَالُوا إِنْ أَنتُمْ إِلَّا بَشَرٌ مِّثْلُنَا تُرِيدُونَ أَن تَصُدُّونَا عَمَّا كَانَ يَعْبُدُ آبَاؤُنَا فَأْتُونَا بِسُلْطَانٍ مُّبِينٍ
"ఏమిటీ, భూమ్యాకాశాల నిర్మాత అయిన అల్లాహ్‌పైనే మీకు అనుమానం ఉందా? మీ పాపాలన్నింటినీ క్షమించి, ఒక నిర్ణీత కాలం వరకు మీకు గడువు ఇవ్వడానికే ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు" అని వారి ప్రవక్తలు అన్నారు. దానికి వారు, "మీరూ మాలాంటి మనుషులే తప్ప మరేమీ కాదు. మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన దేవుళ్ళ ఆరాధన నుండి మమ్మల్ని ఆపాలన్నది మీ ఉద్దేశం. మరైతే స్పష్టమైన ప్రమాణాన్ని మా ముందు తీసుకురండి" అని చెప్పారు.
14:11  قَالَتْ لَهُمْ رُسُلُهُمْ إِن نَّحْنُ إِلَّا بَشَرٌ مِّثْلُكُمْ وَلَٰكِنَّ اللَّهَ يَمُنُّ عَلَىٰ مَن يَشَاءُ مِنْ عِبَادِهِ ۖ وَمَا كَانَ لَنَا أَن نَّأْتِيَكُم بِسُلْطَانٍ إِلَّا بِإِذْنِ اللَّهِ ۚ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُؤْمِنُونَ
వారి ప్రవక్తలు వారితో ఇలా అన్నారు: "అవును, మేమూ మీలాంటి మనుషులమే. అయితే అల్లాహ్‌ తన దాసులలో తాను కోరిన వారిపై ప్రత్యేకంగా దయదలుస్తాడు. అల్లాహ్‌ అనుజ్ఞ లేకుండా మేము ఏ ప్రమాణాన్ని కూడా మీ వద్దకు తేలేము. విశ్వాసులైనవారు కేవలం అల్లాహ్‌నే నమ్ముకోవాలి.
14:12  وَمَا لَنَا أَلَّا نَتَوَكَّلَ عَلَى اللَّهِ وَقَدْ هَدَانَا سُبُلَنَا ۚ وَلَنَصْبِرَنَّ عَلَىٰ مَا آذَيْتُمُونَا ۚ وَعَلَى اللَّهِ فَلْيَتَوَكَّلِ الْمُتَوَكِّلُونَ
"ఇంతకీ మనం అల్లాహ్‌ను ఎందుకు నమ్మకూడదు? మనకు మన మార్గాలను చూపింది ఆయనే కదా! దైవసాక్షి! మీ వేధింపులపై మేము ఓపిక పడతాము. నమ్ముకునే వారు అల్లాహ్‌ను మాత్రమే నమ్ముకోవాలి."
14:13  وَقَالَ الَّذِينَ كَفَرُوا لِرُسُلِهِمْ لَنُخْرِجَنَّكُم مِّنْ أَرْضِنَا أَوْ لَتَعُودُنَّ فِي مِلَّتِنَا ۖ فَأَوْحَىٰ إِلَيْهِمْ رَبُّهُمْ لَنُهْلِكَنَّ الظَّالِمِينَ
తిరస్కారులు తమ ప్రవక్తల నుద్దేశించి, "మేము మిమ్మల్ని దేశం నుంచి వెళ్ళగొడ్తాము. లేదంటారా, మీరు మా మతంలోకి తిరిగి వచ్చేయండి" అని బెదిరించారు. అప్పుడు వారి ప్రభువు వారి వద్దకు 'వహీ' (సందేశం) పంపిస్తూ, "మేము ఈ దుర్మార్గులను నాశనం చేస్తాము.
14:14  وَلَنُسْكِنَنَّكُمُ الْأَرْضَ مِن بَعْدِهِمْ ۚ ذَٰلِكَ لِمَنْ خَافَ مَقَامِي وَخَافَ وَعِيدِ
"వారి తరువాత మేము మిమ్మల్ని ఈ ధరణిపై నివసింపజేస్తాము. నా సమక్షంలో నిలబడే విషయమై భయపడేవారికి, నా హెచ్చరికపై భీతిల్లేవారికి లభించే బహుమానం ఇది" (అని అభయమిచ్చాడు).
14:15  وَاسْتَفْتَحُوا وَخَابَ كُلُّ جَبَّارٍ عَنِيدٍ
వారు తీర్పును కోరారు. (అప్పుడు) పొగరుబోతు, సత్య విరోధి అయిన ప్రతి ఒక్కడూ పరాభవం పాలయ్యాడు.
14:16  مِّن وَرَائِهِ جَهَنَّمُ وَيُسْقَىٰ مِن مَّاءٍ صَدِيدٍ
అతడి (చావు) వెనుకే నరకం ఉన్నది. అక్కడ అతడికి త్రాగటానికి చీము నెత్తురుతో కూడుకున్న నీరు ఇవ్వబడు తుంది.
14:17  يَتَجَرَّعُهُ وَلَا يَكَادُ يُسِيغُهُ وَيَأْتِيهِ الْمَوْتُ مِن كُلِّ مَكَانٍ وَمَا هُوَ بِمَيِّتٍ ۖ وَمِن وَرَائِهِ عَذَابٌ غَلِيظٌ
అతడు అతి కష్టమ్మీద ఒక్కొక్క గుక్కెడూ త్రాగుతాడు. కాని గొంతులోకి దించలేకపోతాడు. అన్నిచోట్ల నుంచీ మృత్యువు వచ్చి కబళించబోతున్నట్లు అతనికి అనిపిస్తుంది. కాని అతడు చావడు. మరి అతడి వెనుక కూడా మరో దుర్భరమైన శిక్ష ఉంటుంది.
14:18  مَّثَلُ الَّذِينَ كَفَرُوا بِرَبِّهِمْ ۖ أَعْمَالُهُمْ كَرَمَادٍ اشْتَدَّتْ بِهِ الرِّيحُ فِي يَوْمٍ عَاصِفٍ ۖ لَّا يَقْدِرُونَ مِمَّا كَسَبُوا عَلَىٰ شَيْءٍ ۚ ذَٰلِكَ هُوَ الضَّلَالُ الْبَعِيدُ
తమ పరిపోషకుని పట్ల తిరస్కార వైఖరిని అవలంబించిన వారి ఉపమానం వారి కర్మలు తుఫాను రోజున వీచే పెనుగాలి వాతన పడిన బూడిద లాంటివి. తాము చేసుకున్న కర్మలలో దేనిపైనా వారికి అధికారం ఉండదు. బహు దూరపు మార్గభ్రష్టత అంటే ఇదే.
14:19  أَلَمْ تَرَ أَنَّ اللَّهَ خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ بِالْحَقِّ ۚ إِن يَشَأْ يُذْهِبْكُمْ وَيَأْتِ بِخَلْقٍ جَدِيدٍ
ఏమిటీ, అల్లాహ్‌ భూమ్యాకాశాలను సత్యబద్ధంగా (అత్యంత యుక్తితో) సృష్టించటాన్ని నువ్వు చూడటం లేదా? ఆయన గనక తలచుకుంటే మీ అందరినీ తుద ముట్టించి, మరో సరికొత్త సృష్టిని తేగలడు.
14:20  وَمَا ذَٰلِكَ عَلَى اللَّهِ بِعَزِيزٍ
అలా చేయటం అల్లాహ్‌కు ఏమాత్రం కష్టతరం కాదు.
14:21  وَبَرَزُوا لِلَّهِ جَمِيعًا فَقَالَ الضُّعَفَاءُ لِلَّذِينَ اسْتَكْبَرُوا إِنَّا كُنَّا لَكُمْ تَبَعًا فَهَلْ أَنتُم مُّغْنُونَ عَنَّا مِنْ عَذَابِ اللَّهِ مِن شَيْءٍ ۚ قَالُوا لَوْ هَدَانَا اللَّهُ لَهَدَيْنَاكُمْ ۖ سَوَاءٌ عَلَيْنَا أَجَزِعْنَا أَمْ صَبَرْنَا مَا لَنَا مِن مَّحِيصٍ
వారంతా అల్లాహ్‌కు ఎదురుగా నిలబడతారు. అప్పుడు బలహీనులు, (ప్రపంచంలో) పెద్ద మనుషులుగా చెలామణి అయినవారిని ఉద్దేశించి, "మేము (ఒకప్పుడు) మీకు అనుయాయులుగా ఉండేవాళ్ళం. మరి మీరు ఇప్పుడు మా నుంచి దైవశిక్షలలో ఏ కొంచెమైనా శిక్షను తొలగించగలరా?" అని అడుగుతారు. దానికి వారు ఇలా సమాధానమిస్తారు : "అల్లాహ్‌ గనక మాకు సన్మార్గం చూపి ఉంటే మేము కూడా తప్పకుండా మీకు మార్గదర్శకత్వం వహించి ఉండేవాళ్ళం. ఇప్పుడు మనం అసహనాన్ని ప్రదర్శించినా, సహనం వహించినా ఒక్కటే. మనకిక తప్పించుకునే మార్గం ఏదీ లేదు."
14:22  وَقَالَ الشَّيْطَانُ لَمَّا قُضِيَ الْأَمْرُ إِنَّ اللَّهَ وَعَدَكُمْ وَعْدَ الْحَقِّ وَوَعَدتُّكُمْ فَأَخْلَفْتُكُمْ ۖ وَمَا كَانَ لِيَ عَلَيْكُم مِّن سُلْطَانٍ إِلَّا أَن دَعَوْتُكُمْ فَاسْتَجَبْتُمْ لِي ۖ فَلَا تَلُومُونِي وَلُومُوا أَنفُسَكُم ۖ مَّا أَنَا بِمُصْرِخِكُمْ وَمَا أَنتُم بِمُصْرِخِيَّ ۖ إِنِّي كَفَرْتُ بِمَا أَشْرَكْتُمُونِ مِن قَبْلُ ۗ إِنَّ الظَّالِمِينَ لَهُمْ عَذَابٌ أَلِيمٌ
సమస్త వ్యవహారంపై తీర్పు జరిగిపోయిన తరువాత షైతాన్‌ ఇలా అంటాడు: "అల్లాహ్‌ మీకు సత్యబద్ధమైన వాగ్దానం చేశాడు. నేను మాత్రం మీకు చేసిన వాగ్దానాలకు విరుద్ధంగా ప్రవర్తించాను. నాకు మీపై ఎలాంటి అధికారమూ లేదు. కాకపోతే, నేను మీకు పిలుపునిచ్చాను. మీరు నా మాటను అంగీకరించారు. కాబట్టి మీరు (ఇప్పుడు) నన్ను నిందించకండి; మిమ్మల్ని మీరే నిందించుకోండి. మీ మొరలను నేను ఆలకించ లేను. నా మొరను మీరూ ఆలకించలేరు. ఇంతకు మునుపు మీరు నన్ను దైవత్వంలో భాగస్థునిగా నిలబెట్టారన్న విషయాన్ని నేను ఎంత మాత్రం ఒప్పుకోను. నిశ్చయంగా అటువంటి దుర్మార్గుల కోసం వ్యధాభరితమైన శిక్ష ఉంది."
14:23  وَأُدْخِلَ الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا بِإِذْنِ رَبِّهِمْ ۖ تَحِيَّتُهُمْ فِيهَا سَلَامٌ
విశ్వసించి, సత్కార్యాలు చేసినవారు క్రింద సెలయేరులు ప్రవహించే స్వర్గ వనాలలో ప్రవేశింపజెయ్యబడతారు. తమ ప్రభువు అనుజ్ఞపై వారక్కడ కలకాలం ఉంటారు. 'సలామ్‌'తో సహా అక్కడ వారికి స్వాగతం లభిస్తుంది.
14:24  أَلَمْ تَرَ كَيْفَ ضَرَبَ اللَّهُ مَثَلًا كَلِمَةً طَيِّبَةً كَشَجَرَةٍ طَيِّبَةٍ أَصْلُهَا ثَابِتٌ وَفَرْعُهَا فِي السَّمَاءِ
అల్లాహ్‌ పరిశుద్ధ వచనాన్ని దేంతో పోల్చాడో మీరు గమనించలేదా? అది ఒక పరిశుద్ధ వృక్షం వంటిది. అది బాగా వ్రేళ్లూనుకుని ఉంది. దాని శాఖలు ఆకాశంలో ఉన్నాయి.
14:25  تُؤْتِي أُكُلَهَا كُلَّ حِينٍ بِإِذْنِ رَبِّهَا ۗ وَيَضْرِبُ اللَّهُ الْأَمْثَالَ لِلنَّاسِ لَعَلَّهُمْ يَتَذَكَّرُونَ
తన ప్రభువు ఆజ్ఞతో అది ఎల్లప్పుడూ పండ్లను ఇస్తోంది. ప్రజలు గుణపాఠం నేర్చుకునేందుకుగాను అల్లాహ్‌ వారి ముందు ఈ ఉపమానాలను వివరిస్తున్నాడు.
14:26  وَمَثَلُ كَلِمَةٍ خَبِيثَةٍ كَشَجَرَةٍ خَبِيثَةٍ اجْتُثَّتْ مِن فَوْقِ الْأَرْضِ مَا لَهَا مِن قَرَارٍ
(దీనికి భిన్నంగా) అశుద్ధ వచనం ఉపమానం అశుద్ధ వృక్షం వంటిది. అది నేల ఉపరితలంపై నుంచే పెకలించి వేయబడింది. దానికి స్థిరత్వం అనేదే లేదు.
14:27  يُثَبِّتُ اللَّهُ الَّذِينَ آمَنُوا بِالْقَوْلِ الثَّابِتِ فِي الْحَيَاةِ الدُّنْيَا وَفِي الْآخِرَةِ ۖ وَيُضِلُّ اللَّهُ الظَّالِمِينَ ۚ وَيَفْعَلُ اللَّهُ مَا يَشَاءُ
విశ్వసించిన వారికి అల్లాహ్‌ స్థిరమైన మాటపై ప్రాపంచిక జీవితంలోనూ, పరలోకంలోనూ నిలకడను ప్రసాదిస్తాడు. అయితే అన్యాయపరులను మాత్రం ఆయన అపమార్గానికి లోను చేస్తాడు. అల్లాహ్‌ తాను తలచుకున్నది చేసి తీరుతాడు.
14:28  أَلَمْ تَرَ إِلَى الَّذِينَ بَدَّلُوا نِعْمَتَ اللَّهِ كُفْرًا وَأَحَلُّوا قَوْمَهُمْ دَارَ الْبَوَارِ
అల్లాహ్‌ ప్రసాదించిన అనుగ్రహానికి బదులుగా కృతఘ్నతకు పాల్పడి, తమ జాతిని వినాశకర కుహరంలోనికి దించిన వారి వైపు నీవు దృష్టిని సారించలేదా?!
14:29  جَهَنَّمَ يَصْلَوْنَهَا ۖ وَبِئْسَ الْقَرَارُ
అంటే - నరకంలోనికి. వారంతా అందులోకి ప్రవేశిస్తారు. అది అత్యంత చెడ్డ నివాస స్థానం.
14:30  وَجَعَلُوا لِلَّهِ أَندَادًا لِّيُضِلُّوا عَن سَبِيلِهِ ۗ قُلْ تَمَتَّعُوا فَإِنَّ مَصِيرَكُمْ إِلَى النَّارِ
ప్రజలను అల్లాహ్‌ మార్గం నుంచి పెడత్రోవ పట్టించటానికి వారు అల్లాహ్‌కు సహవర్తుల్ని కల్పించారు. "సరే! సుఖాలను జుర్రుకోండి. చివరికి మీరు మరలిపోవలసింది నరకానికే" అని (ఓ ప్రవక్తా!) నీవు చెప్పు.
14:31  قُل لِّعِبَادِيَ الَّذِينَ آمَنُوا يُقِيمُوا الصَّلَاةَ وَيُنفِقُوا مِمَّا رَزَقْنَاهُمْ سِرًّا وَعَلَانِيَةً مِّن قَبْلِ أَن يَأْتِيَ يَوْمٌ لَّا بَيْعٌ فِيهِ وَلَا خِلَالٌ
(ఓ ప్రవక్తా!) క్రయవిక్రయాలుగానీ, స్నేహబంధాలుగానీ ఉండని రోజు రాకముందే నమాజులను నెలకొల్పమనీ, మేము ప్రసాదించిన దానిలో నుంచి గోప్యంగానూ, బహిరంగంగానూ ఖర్చు పెట్టమని విశ్వాసులైన నా దాసులకు చెప్పు.
14:32  اللَّهُ الَّذِي خَلَقَ السَّمَاوَاتِ وَالْأَرْضَ وَأَنزَلَ مِنَ السَّمَاءِ مَاءً فَأَخْرَجَ بِهِ مِنَ الثَّمَرَاتِ رِزْقًا لَّكُمْ ۖ وَسَخَّرَ لَكُمُ الْفُلْكَ لِتَجْرِيَ فِي الْبَحْرِ بِأَمْرِهِ ۖ وَسَخَّرَ لَكُمُ الْأَنْهَارَ
భూమ్యాకాశాలను సృష్టించి, ఆకాశాల నుండి వర్షాన్ని కురిపించి, తద్వారా మీ ఆహారం కోసం పండ్లు ఫలాలను ఉత్పన్నం చేసినవాడే అల్లాహ్‌. ఆయనే తన ఆజ్ఞతో సముద్రంలో నౌకలు నడవటానికి వాటిని మీకు లోబరచాడు. ఆయనే నదీ నదాలను మీ అధీనంలో ఉంచాడు.
14:33  وَسَخَّرَ لَكُمُ الشَّمْسَ وَالْقَمَرَ دَائِبَيْنِ ۖ وَسَخَّرَ لَكُمُ اللَّيْلَ وَالنَّهَارَ
ఆయనే నిరంతర ప్రయాణం చేస్తూ పోతున్న సూర్యచంద్రులను మీకు లోబరచాడు. రేయింబవళ్ళను కూడా ఆయన మీ సేవకై కట్టుబడి ఉండేలా చేశాడు.
14:34  وَآتَاكُم مِّن كُلِّ مَا سَأَلْتُمُوهُ ۚ وَإِن تَعُدُّوا نِعْمَتَ اللَّهِ لَا تُحْصُوهَا ۗ إِنَّ الْإِنسَانَ لَظَلُومٌ كَفَّارٌ
మరి ఆయనే మీరు అడిగిన దానినల్లా మీకు ఇచ్చి ఉన్నాడు. మీరు అల్లాహ్‌ చేసిన మేళ్లను లెక్కించదలిచినా లెక్కించలేరు. నిశ్చయంగా మానవుడు మహా అన్యాయపరుడు, మేలును మరిచేవాడు.
14:35  وَإِذْ قَالَ إِبْرَاهِيمُ رَبِّ اجْعَلْ هَٰذَا الْبَلَدَ آمِنًا وَاجْنُبْنِي وَبَنِيَّ أَن نَّعْبُدَ الْأَصْنَامَ
ఇబ్రాహీమ్‌ (ప్రార్థించిన ఆ సందర్భాన్ని కూడా కాస్త జ్ఞాపకం చేసుకోండి. అతను) ఇలా వేడుకున్నాడు: "నా ప్రభూ! ఈ నగరాన్ని శాంతి భద్రతల నగరంగా చేయి.నన్నూ, నా సంతానాన్నీ విగ్రహ పూజ నుంచి కాపాడు."
14:36  رَبِّ إِنَّهُنَّ أَضْلَلْنَ كَثِيرًا مِّنَ النَّاسِ ۖ فَمَن تَبِعَنِي فَإِنَّهُ مِنِّي ۖ وَمَنْ عَصَانِي فَإِنَّكَ غَفُورٌ رَّحِيمٌ
"నా ప్రభూ! అవి ఎంతో మందిని పెడదారి పట్టించాయి. కనుక నన్ను అనుసరించినవాడే నా వాడు. కాని ఎవడైనా నాకు అవిధేయత చూపితే నువ్వు అమితంగా క్షమించేవాడవు, కనికరించేవాడవు."
14:37  رَّبَّنَا إِنِّي أَسْكَنتُ مِن ذُرِّيَّتِي بِوَادٍ غَيْرِ ذِي زَرْعٍ عِندَ بَيْتِكَ الْمُحَرَّمِ رَبَّنَا لِيُقِيمُوا الصَّلَاةَ فَاجْعَلْ أَفْئِدَةً مِّنَ النَّاسِ تَهْوِي إِلَيْهِمْ وَارْزُقْهُم مِّنَ الثَّمَرَاتِ لَعَلَّهُمْ يَشْكُرُونَ
"మా ప్రభూ! నా సంతానంలో కొందరిని పంటలు పండని కటికలోయలో, నీ పవిత్రగృహం వద్ద వసింపజేశాను. మా ప్రభూ! వారు నమాజును నెలకొల్పేందుకే (ఇక్కడ వదలిపెట్టాను). కనుక ప్రజలలో కొందరి మనసులు వారి వైపుకు మొగ్గేలా చేయి. వారికి తినటానికి పండ్లు ఫలాలను ప్రసాదించు - వారు కృతజ్ఞులుగా మెలిగేందుకు.
14:38  رَبَّنَا إِنَّكَ تَعْلَمُ مَا نُخْفِي وَمَا نُعْلِنُ ۗ وَمَا يَخْفَىٰ عَلَى اللَّهِ مِن شَيْءٍ فِي الْأَرْضِ وَلَا فِي السَّمَاءِ
"ఓ మా ప్రభూ! మేము దాస్తున్నదీ, బహిర్గతం చేస్తున్నదీ అంతా నీకు తెలుసు. "భూమిలోగాని, ఆకాశాలలోగాని ఏ వస్తువూ అల్లాహ్‌ నుండి దాగి లేదు.
14:39  الْحَمْدُ لِلَّهِ الَّذِي وَهَبَ لِي عَلَى الْكِبَرِ إِسْمَاعِيلَ وَإِسْحَاقَ ۚ إِنَّ رَبِّي لَسَمِيعُ الدُّعَاءِ
"ఈ ముసలితనంలో నాకు ఇస్మాయీల్‌, ఇస్‌హాఖులను ప్రసాదించిన అల్లాహ్‌కు కృతజ్ఞతలు. నిశ్చయంగా నా ప్రభువు మొరను ఆలకించేవాడు."
14:40  رَبِّ اجْعَلْنِي مُقِيمَ الصَّلَاةِ وَمِن ذُرِّيَّتِي ۚ رَبَّنَا وَتَقَبَّلْ دُعَاءِ
"నా ప్రభూ! నన్ను నమాజును నెలకొల్పేవానిగా చెయ్యి. నా సంతతి నుండి కూడా (ఈ వ్యవస్థను నెలకొల్పే వారిని నిలబెట్టు). ప్రభూ! నా ప్రార్థనను ఆమోదించు."
14:41  رَبَّنَا اغْفِرْ لِي وَلِوَالِدَيَّ وَلِلْمُؤْمِنِينَ يَوْمَ يَقُومُ الْحِسَابُ
"మా ప్రభూ! నన్ను, నా తల్లిదండ్రులను, విశ్వాసులను లెక్క తేల్చే రోజున క్షమించు."
14:42  وَلَا تَحْسَبَنَّ اللَّهَ غَافِلًا عَمَّا يَعْمَلُ الظَّالِمُونَ ۚ إِنَّمَا يُؤَخِّرُهُمْ لِيَوْمٍ تَشْخَصُ فِيهِ الْأَبْصَارُ
దుర్మార్గుల కార్యకలాపాల పట్ల అల్లాహ్‌ అశ్రద్ధ వహిస్తున్నాడని అనుకోకు. ఆయన వారికి ఒకానొక రోజు వరకు గడువు ఇస్తున్నాడు - ఆ రోజు వారు కన్నులు తేలవేస్తారు.
14:43  مُهْطِعِينَ مُقْنِعِي رُءُوسِهِمْ لَا يَرْتَدُّ إِلَيْهِمْ طَرْفُهُمْ ۖ وَأَفْئِدَتُهُمْ هَوَاءٌ
తలలు పైకెత్తి పరుగులు తీస్తుంటారు. వారి చూపులు స్వయంగా వారి వైపుకు కూడా తిరిగిరావు. వారి హృదయాల్లో శూన్యం ఆవరిస్తుంది.
14:44  وَأَنذِرِ النَّاسَ يَوْمَ يَأْتِيهِمُ الْعَذَابُ فَيَقُولُ الَّذِينَ ظَلَمُوا رَبَّنَا أَخِّرْنَا إِلَىٰ أَجَلٍ قَرِيبٍ نُّجِبْ دَعْوَتَكَ وَنَتَّبِعِ الرُّسُلَ ۗ أَوَلَمْ تَكُونُوا أَقْسَمْتُم مِّن قَبْلُ مَا لَكُم مِّن زَوَالٍ
(ఓ ప్రవక్తా!) శిక్ష వచ్చే రోజు గురించి ప్రజలను హెచ్చరించు. ఆ సమయంలో దుర్మార్గులు, "ప్రభూ! మాకు కొద్దిపాటి వ్యవధిని ఇస్తే మేము నీ పిలుపును అందుకుని, నీ ప్రవక్తలను అనుసరిస్తాము" అని అంటారు. (అప్పుడు వారితో ఇలా అనబడుతుంది), "ఏమిటీ, ప్రపంచం నుండి నిష్క్రమించటమనేది మాకు లేనే లేదని ఇంతకు ముందు మీరు ఒట్టేసి మరీ చెప్పలేదా?"
14:45  وَسَكَنتُمْ فِي مَسَاكِنِ الَّذِينَ ظَلَمُوا أَنفُسَهُمْ وَتَبَيَّنَ لَكُمْ كَيْفَ فَعَلْنَا بِهِمْ وَضَرَبْنَا لَكُمُ الْأَمْثَالَ
"తమకు తాము అన్యాయం చేసుకున్న వారి ఇండ్లలో మీరు మీ నివాసాలను ఏర్పరచుకోలేదా? వారి పట్ల మేము ఎలా వ్యవహరించామో మీకు అవగతం కాలేదా? (మీకు బోధపడేందుకు) మేము ఎన్నో ఉదాహరణలను వివరించాము కదా!"
14:46  وَقَدْ مَكَرُوا مَكْرَهُمْ وَعِندَ اللَّهِ مَكْرُهُمْ وَإِن كَانَ مَكْرُهُمْ لِتَزُولَ مِنْهُ الْجِبَالُ
వాళ్ళు తమ ఎత్తుల్ని తాము వేసి చూసుకున్నారు. వారి ఎత్తుగడలన్నీ అల్లాహ్‌ దృష్టిలో ఉన్నాయి. వారి ఎత్తుగడలు పర్వతాలను కదిలించేటంతటి భీకరమైనవేమీ కావు.
14:47  فَلَا تَحْسَبَنَّ اللَّهَ مُخْلِفَ وَعْدِهِ رُسُلَهُ ۗ إِنَّ اللَّهَ عَزِيزٌ ذُو انتِقَامٍ
(ఓ ప్రవక్తా!) అల్లాహ్‌ తన ప్రవక్తలకు చేసిన వాగ్దానానికి విరుద్ధంగా వ్యవహరిస్తాడని అనుకోకు. నిశ్చయంగా అల్లాహ్‌ సర్వాధిక్యుడు, ప్రతీకారం చేసేవాడు.
14:48  يَوْمَ تُبَدَّلُ الْأَرْضُ غَيْرَ الْأَرْضِ وَالسَّمَاوَاتُ ۖ وَبَرَزُوا لِلَّهِ الْوَاحِدِ الْقَهَّارِ
ఏ రోజున ఈ భూమి మరో భూమిగా మార్చివేయబడుతుందో, ఆకాశం సయితం (మారిపోతుందో), అప్పుడు అందరూ సర్వశక్తిమంతుడు, ఒకే ఒక్కడైన అల్లాహ్‌ ముందుకు వస్తారు.
14:49  وَتَرَى الْمُجْرِمِينَ يَوْمَئِذٍ مُّقَرَّنِينَ فِي الْأَصْفَادِ
ఆ రోజు అపరాధులంతా ఒకచోట సంకెళ్ళతో బంధించబడి ఉండటం నువ్వు చూస్తావు.
14:50  سَرَابِيلُهُم مِّن قَطِرَانٍ وَتَغْشَىٰ وُجُوهَهُمُ النَّارُ
వారి దుస్తులు గంధకంతో చేయబడిన దుస్తులై ఉంటాయి. అగ్నిజ్వాలలు వారి ముఖాలను సయితం ఆవరించి ఉంటాయి.
14:51  لِيَجْزِيَ اللَّهُ كُلَّ نَفْسٍ مَّا كَسَبَتْ ۚ إِنَّ اللَّهَ سَرِيعُ الْحِسَابِ
అల్లాహ్‌ ప్రతి వ్యక్తికీ అతని సంపాదనకు తగిన ప్రతిఫలం ఇవ్వటానికే ఇదంతా ఏర్పరచబడింది. నిశ్చయంగా అల్లాహ్‌ చాలా వేగంగా లెక్క తీసుకుంటాడు.
14:52  هَٰذَا بَلَاغٌ لِّلنَّاسِ وَلِيُنذَرُوا بِهِ وَلِيَعْلَمُوا أَنَّمَا هُوَ إِلَٰهٌ وَاحِدٌ وَلِيَذَّكَّرَ أُولُو الْأَلْبَابِ
ఈ ఖుర్‌ఆన్‌ సమస్త మానవుల కొరకు ఒక సందేశం. తద్వారా వారిని హెచ్చరించటానికి, అల్లాహ్‌ ఒక్కడే ఆరాధ్య దైవమని వారు గ్రహించటానికి, ఇంకా విజ్ఞులు గ్రహించగలగటానికి (ఇది పంపబడింది).


ఈ తెలుగు ఖుర్ఆన్ శాంతి మార్గం పబ్లికేషన్ వారు ప్రచురించారు. వారి అనుమతితో ఈ వెబ్ పోర్టల్ పై వేయబడింది.